
సాక్షి, మర్పల్లి(వికారాబాద్): గూడ్స్‌రైలు ఢీకొని బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని కొత్లాపూర్‌లో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. మండల పరిధిలోని కొత్లాపూర్‌కు చెందిన శానికే రాజిరెడ్డి కుమారుడు వసంత్‌రెడ్డి (16) మోమిన్‌పేట్ మండల కేంద్రంలోని ప్రైవేట్ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్ద నూర్పిడి చేసి కుప్పగా పోసిన మొక్కజొన్నలపై కప్పి ఉన్న ప్లాస్టిక్ కవర్‌ను తీసేందుకు బైక్‌పై వెళ్లాడు. పొలం రైలు పట్టాల పక్కన ఉంది.
వసంత్‌రెడ్డి పట్టాల పక్కన తన బైక్‌ను ఆపి చెవిలో హియర్ ఫోన్స్ పెట్టుకుని ఫోన్‌లో మాట్లాడుతూ పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. బీదర్ నుంచి మర్పల్లి మీదుగా వికారాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు ఢీకొంది. దీంతో వసంత్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మర్పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులు అందజేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వికారాబాద్ రైల్వే పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment