
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి
సాక్షి, జమ్మికుంటరూరల్: తీవ్రగాయాలతో రైలు పట్టాల మధ్య పడి ఉన్న ఓ గుర్తు తెలియని యువతిని గమనించిన రైలు గార్డు సమయస్పూర్తితో వ్యవహరించి రైల్వే అధికారులకు అప్పగించిన సంఘటన ఆదివారం జమ్మికుంట పట్టణంలో జరిగింది. పట్టణ సమీపంలోని మడిపల్లి రైల్వే గేటు వద్ద తీవ్రగాయాలతో ఓ యువతి పట్టాల మధ్య పడి ఉంది. ఈ క్రమంలో కాజీపేట నుంచి బల్లార్ష వైపు వెళ్తున్న గూడ్స్ రైలు గార్డు సదరు యువతిని గమనించి, డ్రైవర్‌కు సమాచారం అందించటంతో యువతిని రైల్వేస్టేషన్ రైల్వే అప్పగించారు. దీంతో అధికారులు 108కు సమాచారం అందించి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment