పాట్నా:సెల్‌ఫోన్‌లో గేమ్స్ ఆడుతూ ప్రపంచాన్ని మర్చిపోయి ప్రమాదానికి గురైన వాళ్లను చూశాం.. కానీ బీహార్‌లో ఏకంగా రైలు పట్టాలపైనే కూర్చొని ముగ్గురు యువకులు పబ్జీ ఆడారు. చెవుల్లో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని మరీ గేమ్ ఆడారు. ఇంకేముంది పట్టాలపై దూసుకువస్తున్న రైలు శబ్దాన్ని ఆ యువకులు వినలేకపోయారు.
వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టి ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.ఈ ఘటన బీహార్‌లోని వెస్ట్ చంపారన్ జిల్లాలో జరిగింది.జిల్లాకు చెందిన ముగ్గురు యువకులు నార్కటియాగంజ్-ముజఫర్‌పుర్ రైలు పట్టాలపై కూర్చొని పబ్జీ ఆడుతుండగా అదే మార్గంలో వచ్చిన రైలు వారిపై నుంచి వెళ్లింది.దీంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మృతులను ఫర్కాన్ ఆలం,సమీర్ ఆలం, హబీబుల్లా అన్సారీగా గుర్తించామని పోలీసులు తెలిపారు. వారి మృతదేహాలను పోస్ట్‌మార్టంనకు తరలించామని దర్యాప్తు కొనసాగుతోందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి భీకర ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండడంపై తల్లిదండ్రులు పిల్లలకు అవగాహన కల్పించాలని పోలీసులు సూచించారు.
ఇదీ చదవండి: స్పీడ్ బ్రేకర్ ప్రాణం పోసింది
Comments
Please login to add a commentAdd a comment