Viral: Bihar Boy Amarjeet Jaikar Sings New Song Composed By Himesh Reshammiya - Sakshi
Sakshi News home page

ఓవర్‌నైట్‌ సెలబ్రిటీగా మారాడు.. వైరల్‌గా మారిన బీహార్‌ యువకుడి పాట!

Published Thu, Apr 13 2023 11:10 AM | Last Updated on Thu, Apr 13 2023 11:43 AM

Bihar Boy Amarjeet Jaikar Sings New Song Composed By Himesh Reshammiya - Sakshi

పట్నా: గతంలో యువత తమ టాలెంట్‌ ప్రదర్శించేందుకు సరైన వేదిక చాలా ఇబ్బందిపడేవాళ్లు. అయితే సోషల్‌ మీడియా వాడకం పెరిగే కొద్దీ ఈ సమస్యకు చెక్‌ పడిందనే చెప్పాలి. ఇంట్లో కూర్చుని నెట్టింట తమ నైపుణ్యాలను వీడియోల రూపంలో షేర్‌ చేస్తూ రాత్రి రాత్రి సెలబ్రిటీలుగా మారిన సామాన్యులు ఎందరో ఉన్నారో. ఈ తరహాలోనే ఇటీవల తన శ్రావ్య‌మైన గాత్రంతో నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటూ ఆన్‌లైన్ సెన్సేష‌న్‌గా మారాడు ఓ బీహార్‌ యువకుడు అమ‌ర్జీత్ జైక‌ర్. తాజాగా అతడు హిమేష్ రేష‌మ్మియ కంపోజ్ చేసిన న్యూ ట్రాక్‌ను ఆల‌పించాడు. ప్రస్తుతం ఈ పాట నెట్టింట వైరల్‌గా మారింది.

‘దిల్ దే దియా హై’ పాట పాడిన జైక‌ర్ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారిన విష‌యం తెలిసిందే. ఈ వీడియో సోనూసూద్‌తో సహా పలువురు బాలీవుడ్ ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. దీంతో అతను జైకర్‌కి తన రాబోయే చిత్రం ఫతేలో పాడే అవకాశం కూడా ఇచ్చాడు. తాజాగా హిమేష్ రేష‌మ్మియ రాసి, కంపోజ్ చేసిన‌ లేటెస్ట్ ట్రాక్ వీడియో ప్ర‌స్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

తాజాగా ఈ బీహారీ బాలుడు హిమేష్ రేషమియా వ్రాసిన తన కొత్త పాట వీడియోను పంచుకున్నాడు. “#DilKiiDeewaaronPe2.0ని హిమేష్ రేషమియా కంపోజ్ చేసి రాశారు.. అమర్జీత్ జైకర్ పాడారు, ఇప్పుడే విడుదలైంది” అని క్యాప్షన్‌తో పోస్ట్‌ చేశారు. ఈ పాట విన్న నెటిజ‌న్లు అమ‌ర్జీత్ జైక‌ర్ సింగింగ్ ట్యాలెంట్‌పై ప్ర‌శంస‌లు గుప్పిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement