Himesh Reshammiya
-
తండ్రి కన్నుమూత, కన్నీరుమున్నీరైన గాయకుడు (ఫోటోలు)
-
ఒక్క రొమాంటిక్ పాటతో ఫేమస్.. 90స్ కిడ్స్ ఫేవరెట్ సింగర్‌ని గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
ఓవర్‌నైట్ సెలబ్రిటీగా మారాడు.. వైరల్‌గా మారిన బీహార్ యువకుడి పాట!
పట్నా: గతంలో యువత తమ టాలెంట్ ప్రదర్శించేందుకు సరైన వేదిక చాలా ఇబ్బందిపడేవాళ్లు. అయితే సోషల్ మీడియా వాడకం పెరిగే కొద్దీ ఈ సమస్యకు చెక్ పడిందనే చెప్పాలి. ఇంట్లో కూర్చుని నెట్టింట తమ నైపుణ్యాలను వీడియోల రూపంలో షేర్ చేస్తూ రాత్రి రాత్రి సెలబ్రిటీలుగా మారిన సామాన్యులు ఎందరో ఉన్నారో. ఈ తరహాలోనే ఇటీవల తన శ్రావ్యమైన గాత్రంతో నెటిజన్లను ఆకట్టుకుంటూ ఆన్లైన్ సెన్సేషన్‌గా మారాడు ఓ బీహార్ యువకుడు అమర్జీత్ జైకర్. తాజాగా అతడు హిమేష్ రేషమ్మియ కంపోజ్ చేసిన న్యూ ట్రాక్‌ను ఆలపించాడు. ప్రస్తుతం ఈ పాట నెట్టింట వైరల్‌గా మారింది. ‘దిల్ దే దియా హై’ పాట పాడిన జైకర్ వీడియో నెట్టింట వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ వీడియో సోనూసూద్‌తో సహా పలువురు బాలీవుడ్ ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. దీంతో అతను జైకర్‌కి తన రాబోయే చిత్రం ఫతేలో పాడే అవకాశం కూడా ఇచ్చాడు. తాజాగా హిమేష్ రేషమ్మియ రాసి, కంపోజ్ చేసిన లేటెస్ట్ ట్రాక్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ బీహారీ బాలుడు హిమేష్ రేషమియా వ్రాసిన తన కొత్త పాట వీడియోను పంచుకున్నాడు. “#DilKiiDeewaaronPe2.0ని హిమేష్ రేషమియా కంపోజ్ చేసి రాశారు.. అమర్జీత్ జైకర్ పాడారు, ఇప్పుడే విడుదలైంది” అని క్యాప్షన్‌తో పోస్ట్ చేశారు. ఈ పాట విన్న నెటిజన్లు అమర్జీత్ జైకర్ సింగింగ్ ట్యాలెంట్‌పై ప్రశంసలు గుప్పిస్తున్నారు. #DilKiiDeewaaronPe2.0 composed and written by Himesh Reshammiya and sung by Amarjeet Jaikar out now❤️#HimeshReshammiya #AmarjeetJaikar #HimeshKeDilSe #HimeshReshammiyaMelodies pic.twitter.com/hZI9j9LB8E — Amarjeet Jaikar (@AmarjeetJaikar3) April 12, 2023 -
ఎందుకంత ఫీల్ అవుతున్నావ్? భార్య పక్కన అలా నిల్చున్నావేంటి?
బాలీవుడ్ సింగర్, నటుడు హిమేశ్ రష్మియా భార్య సోనియా కపూర్‌తో ఫొటోలు దిగడానికి నానా తంటాలు పడ్డారు. అదేంటి? భార్యతో ఫొటో దిగడానికి ఇబ్బందేంటి అంటారా? అక్కడికే వస్తున్నాం. భార్యతో కలిసి ఎయిర్‌పోర్టుకు వచ్చిన హిమేశ్‌ను చూసిన మీడియా ఆ జంటను కెమెరాల్లో బంధించింది. క్లిక్ క్లిక్‌మంటూ ఫొటోలు తీసింది. దీంతో సదరు జంట కూడా కెమెరామన్‌లకు బాగానే సహకరిస్తూ స్టిల్స్ ఇచ్చింది. అయితే భార్య కంటే పొట్టిగా ఉన్న హిమేశ్ ఇద్దరూ సమానంగా కనిపించడానికి కాలి వేళ్లపైన నిలబడుతూ ఫొటోలు దిగాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 'ఓ మై గాడ్, అతడు కాళ్లు పైకి లేపుతున్నాడు చూడండి..', 'ఎందుకంత ఫీల్ అవుతున్నావ్? భార్య పక్కన అలా నిల్చున్నావేంటి?', 'భర్త కంటే భార్య పొడుగ్గా ఉంటే ఈ తిప్పలు తప్పవు మరి!', 'జో జోనస్ కంటే సోఫీ, టామ్ హాలండ్ కంటే జెండయా పొడువుగా ఉంటారు. అందులో తప్పేముంది?', 'హిమేశ్ అభద్రతాభావానికి లోనవుతున్నాడంటూ కామెంట్లు చేయడం నిజంగా బాధాకరం. ఆడవాళ్ల కంటే వారిని పెళ్లాడే మగవాళ్లే ఎక్కువ హైట్‌తో ఉండాలని కోరుకుంటున్న ఈ సమాజం సిగ్గుపడాలి' అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. When your wife/Partner is Taller than you. 😂🤣👍🏽https://t.co/1Qr4Yd3Gzx pic.twitter.com/n4KFYmI709 — Raman (@Dhuandhaar) March 11, 2022 చదవండి: రోబో బ్యూటీతో బ్రేకప్ తర్వాత నాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది -
ఇండియన్ ఐడల్ 12: పిజ్జా పార్టీ ఇచ్చిన జడ్జి
ముంబై: సోనీ టీవీ నిర్వహిస్తున్న ప్రముఖ రియాల్టీ మ్యూజిక్ షో ‘ఇండియన్ ఐడల్ 12’ గురించి సంగీత ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జూలైలో ప్రారంభమైన ఈ మ్యూజిక్ షో గ్రాండ్ ప్రీమియర్‌కు చేరుకుంది. డిసెంబర్ 19, 20వ తేదీలో సోని టీవీలో రాత్రి 8 గంటలకు ప్రసారం కానున్న ఈ గ్రాండ్ ప్రిమియర్ షో సందడిగా జరగనుంది. ఇందులోని టాప్ 15 కంటెస్టెంట్స్ ట్రోఫీ కోసం ఒకరితో ఒకరూ పోటీ పడుతూ తమ గాత్రంతో సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేయనున్నారు. వారాంతంలో జరిగే ఈ షోలో టాప్ 15 ఫైనలిస్టులు అద్భుతమైన ప్రదర్శను ఇవ్వనుండగా.. షో జడ్జిలైన విశాల్ దాద్లానీ, నేహా కక్కర్, హిమేష్ రేష్మియాలు పోటీదారుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జడ్జిలంతా వారికి సంబంధించిన కొన్ని సరద క్షణాలను కంటెస్టెంట్స్‌తో పంచుకొనున్నారు. ఆ తర్వాత సంగీత దర్శకుడు హిమేష్ రేష్మియా గ్రాండ్ ప్రీమియర్ సందర్భంగా షోలోని అందరికి పిజ్జా పార్టీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో షో హోస్ట్ అదిత్య నారాయణ్, జడ్జి నేహా కక్కర్లు కంటెస్టెంట్స్ తల్లిదండ్రులతో కలిసి సరదాగా స్టెప్పులేశారు. (చదవండి: జాతీయ స్థాయిలో షణ్ముఖ స్వరం) The Grand Premiere of #IndianIdol2020 unfolds this weekend!@SonyTV #IndianIdol #SonyTV #Tellychakkar https://t.co/RtlXEHHRRV — princess Arisham khan (@p_Arisham_khan) December 16, 2020 ఇండియల్ ఐడిల్ సీజన్ 12 టాప్ 15 కంటెస్టెంట్స్‌లో ఏపీ నుంచి ముగ్గురు ఈ సీజన్లో మొదటి 12 మంది కంటెస్టెంట్స్ వరుసగా.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మొహద్ డానిష్, ఆంధ్రప్రదేశ్‌కు నుంచి.. శిరీష భగవతుల, అంజలి; మహారాష్ట్రకు చెందిన సాయిలీ కిషోర్ కాంబ్లే; న్యూఢిల్లీకి చెందిన సమ్యాక్ ప్రసానా; కేరళకు చెందిన వైష్ణవ్ గిరీశ్; పశ్చిమ బెంగాల్‌కు చెందిన అరుణీతా కంజీలాల్, అనుష్క బెనర్జీ; కర్ణాటకకు చెందిన నిహాల్ టౌరో; హర్యానాకు చెందిన సాహైల్ సోలంకి; ఉత్తరాఖండ్‌కు చెందిన పవన్‌దీప్ రాజన్; రాజస్థాన్‌కు చెందిన సవాయి భట్; ఆంధ్రప్రదేశ్‌కు చెందిన షణ్ముఖ ప్రియా; ముంబైకి చెందిన నాచీకెట్ లేలే; పూణేకు చెందిన ఆశీస్ కులకర్ణిలు. (చదవండి: షణ్ముఖప్రియ పాటకు న్యాయనిర్ణేతలు ఫిదా) View this post on Instagram A post shared by Indian idol 2020 (@indian__idol12) -
‘దీపిక జాతీయ అవార్డు అందుకోవడం ఖాయం’
బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకునే తాజాగా నటిస్తున్న చిత్రం ఛపాక్. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకున్నాయి. అందులో భాగంగా దీపిక ఓ ప్రఖ్యాత టీవీ షోకు హాజరయ్యారు. ఆ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న సింగర్ హిమేశ్ రష్మియాతో కలిసి దీపిక సందడి చేశారు. దీపిక తొలిసారిగా హిమేశ్ రష్మియాతో కలిసి నామ్ హై తేరా అనే మ్యూజిక్ ఆల్బమ్‌లో కనిపించిన సంగతి తెలిసిందే. అందులో హిమేశ్ పాడుతూ ఉంటే దీపిక వెనకాల డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంటుంది. సరిగ్గా పదమూడేళ్ల తర్వాత తిరిగి స్టేజీపై హిమేశ్ మళ్లీ ఆ పాటను ఆలపించగా దీపిక కాళ్లు కదిపారు. అనంతరం దీపికతో కలిసి దిగిన ఫొటోను హిమేశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘ఛపాక్ సినిమాతో దీపిక జాతీయ అవార్డు అందుకోవడం ఖాయం. ఆమె ఎంతో తెలివైనది, నామ్ హై తేరా నుంచి ఛపాక్ వరకు ఎంతో కష్టపడింది. ఆమెను చూసి గర్వపడుతున్నాను. దర్శకురాలు మేఘనా గుల్జార్‌కు హ్యాట్సాఫ్. ట్రైలర్ ఎంతో బాగుంది. సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నాను’ అని పేర్కొన్నాడు. కాగా ‘ఛపాక్’ జనవరి 10న విడుదల కానుంది. ఇటీవలే ఈ సినిమా ఎలాంటి కోతలు లేకుండా యు సర్టిఫికెట్ అందుకుంది. భయంకరమైన యాసిడ్ దాడికి గురైన లక్ష్మీ అగర్వాల్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చదవండి: ఛపాక్: ధైర్య ప్రదాతలు View this post on Instagram Deepika is going to take the national award and every award of the country for chhapaak , she is historic , from naam hai tera to chapaak , so proud of her , super talent she is , truely blessed , Hats of to Meghna Gulzar , loved the trailer , looking forward to the film , Watch Indian idol sat sunday , amazing talent , amazing show , cheers A post shared by Himesh Reshammiya (@realhimesh) on Dec 29, 2019 at 11:06pm PST -
మా అమ్మకు అటిట్యూట్ ప్రాబ్లం.. అందుకే..
తన తల్లి సింగర్ మాత్రమే అని, మోడల్ కాదని సోషల్ మీడియా సెన్సేషన్ రణు మొండాల్ కూతురు ఎలిజబెత్ సతీరాయ్ అన్నారు. కొంతమంది వ్యక్తులు అత్యుత్సాహం ప్రదర్శించి.. రణు చేత ర్యాంప్ వాక్ చేయిస్తూ ఆమెను నవ్వులపాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రణు మొండాల్ తన అద్భుత గాత్రంతో దిగ్గజ గాయని లతా మంగేష్కర్ పాటలను ఆలపిస్తూ ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె మధురమైన గానానికి ముగ్ధుడైన బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేశ్ రేష్మియా రణు చేత ఓ పాటను రికార్డు చేయించాడు. ఇక అప్పటి నుంచి రణుకు సెలబ్రిటీ హోదా దక్కింది. ఈ క్రమంలో పలు హిందీ టీవీ చానెళ్లు తమ కార్యాక్రమాలకు రణును ఆహ్వానించడంతో ఆమె జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ఓ బ్యూటీ పార్లర్ నిర్వాహకులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి రణును అతిథిగా ఆహ్వానించారు. తమ పార్లర్ ప్రచారం కోసమని రణుకు రిచ్‌గా మేకోవర్ చేశారు. అయితే ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. కొంతమంది నెటిజన్లు వాటిని మార్ఫింగ్ చేశారు. ముఖం నిండా ఫౌండేషన్ ఉన్నట్లుగా ఫొటోలు సృష్టించి విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ విషయాలపై స్పందించిన రణు కూతురు ఎలిజబెత్ మాట్లాడుతూ... ఎంతో కష్టపడి ఒక స్థాయికి వచ్చిన తన తల్లిని హేళన చేయడం సరికాదని హితవు పలికారు. ’ట్రోలింగ్ గురించి తెలిసి చాలా బాధ పడ్డాను. మా అమ్మకు నిజంగానే అటిట్యూట్ ప్రాబ్లం ఉంది. అందుకే ఇబ్బందులపాలవుతుంది. అయితే ఎన్నో కష్టనష్టాలకోర్చి ప్రస్తుతం విజయం రుచి చూసింది. అలాంటి వ్యక్తిని కించపరచడం భావ్యంకాదు. అయినా నాకు కొంతమంది చేసే పనులు అస్సలు నచ్చడం లేదు. మా అమ్మ ఓ గాయని మాత్రమే. కానీ కొంతమంది ఆమె చేత ర్యాంప్ వాక్ చేయిస్తూ.. దిగజారి ప్రవర్తిస్తున్నారు. జనాలు తనను చూసి నవ్వుతున్నారు. మా అమ్మ ఉన్నత కుటుంబానికి చెందినది కాదు. అట్టడుగు ఆర్థిక పరిస్థితి నుంచి బాలీవుడ్‌కు వచ్చింది. వీధుల్లో పాటలు పాడుకునే తనకు ఒక్కసారిగా పేరు వచ్చింది. అందుకే ఎలా తయారు కావాలో తనకు తెలియదు. అయితే ఈ ఒక్క విషయానికే నెటిజన్లు మా అమ్మను ట్రోల్ చేయడం లేదు. ఎవరో సెల్ఫీ అడిగితే ఇవ్వకుండా అమ్మ దురుసుగా ప్రవర్తించింది. తనను ఫేమస్ చేసిన సామాన్యుల పట్ల అమ్మ అలా చేయకుండా ఉండాల్సింది. అందుకే మీమ్స్ సృష్టించి తనను ట్రోల్ చేస్తున్నారనుకుంటా’ అని చెప్పుకొచ్చారు. (చదవండి : ‘నా కాళ్లు విరగ్గొడతామని బెదిరించారు’) కాగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన రణు రైల్వే స్టేషనులో పాట పాడుతుండగా గమనించిన అతీంద్ర చక్రవర్తి అనే ఓ యువ ఇంజనీర్ ఆమె పాటను రికార్డు చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో ఆమె వెలుగులోకి వచ్చారు. ఈ క్రమంలో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. అయితే రణుకు ఆశ్రయం కల్పించిన రణఘాట్ ఆమ్రా శోభై షోతాన్ క్లబ్ నిర్వాహకులపై ఆమె కూతురు ఎలిజబెత్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘ అతీంద్ర చక్రవర్తి, తపన్ దాస్(క్లబ్ సభ్యులు) నిజంగా మా అమ్మ సొంత కుమారులు అయి ఉంటే ఆమెను బాగా చూసుకునేవారు. కానీ మా అమ్మ వాళ్ల దగ్గర ఉన్నట్లు నాకు సమాచారం ఇవ్వలేదు. తన గురించి తెలుసుకుని అక్కడికి వెళ్లాలని ప్రయత్నించగా నా కాళ్లు విరగ్గొట్టి బయటకు విసిరి వేస్తామని బెదిరించారు. నాకు వ్యతిరేకంగా మా అమ్మ మనసు మార్చారు. తన సంపాదనను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు’ అంటూ వ్యాఖ్యానించారు. -
మితిమీరిన మేకప్: అది ఫేక్ ఫొటో..!
సోషల్ మీడియా సెన్సేషన్, సింగర్ రణు మొండాల్‌కు సంబంధించిన ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. రణు ముఖానికి మితిమీరిన మేకప్ చేసినట్లుగా ఉన్న ఫొటోను చూసి నెటిజన్లు ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. రైల్వే స్టేషన్లలో పాటలు పాడే వారిని అందలం ఎక్కిస్తే ఇలాగే ఉంటుందంటూ సంస్కారహీనంగా మాట్లాడుతూ రణు వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారు. మరికొందరు ఓ అభిమాని సెల్ఫీ అడిగితే ఆమెను నెట్టేసిన రణుకు ఈ మాత్రం మేకప్ ఉండాలిలే అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే అది నిజమైన ఫొటో కాదని తేలడంతో ప్రస్తుతం నాలుక కరుచుకుంటున్నారు. కోల్‌కతాలోని రైల్వే స్టేషనులో లతా మంగేష్కర్ పాటలను ఆలపిస్తున్న రణు మొండాల్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె రాత్రికి రాత్రే స్టార్‌గా మారిన సంగతి తెలిసిందే. రణు గాత్రానికి ముగ్ధుడైన బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేశ్ రేష్మియా ఆమెకు రెండు పాటలు పాడే అవకాశం కల్పించాడు. దీంతో రణు పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని ఒక బ్యూటీ పార్లర్ ప్రారంభోత్సవానికి నిర్వాహకులు రణును అతిథిగా ఆహ్వానించారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె రిచ్ మేకోవర్‌తో కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటో బయటకు రావడంతో కొంతమంది ఆకతాయిలు.. ఫొటోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. లేయర్లు లేయర్లుగా మేకప్ ఉన్నట్లుగా కనిపిస్తున్న ఫొటోనే రణు ట్రోల్స్ బారిన పడటానికి కారణమైంది. కాగా రణు గురించిన విమర్శలపై... ఆమెకు మేకప్ చేసిన ఆర్టిస్టు ఇన్స్టాగ్రాం వేదికగా స్పందించారు. ‘ ఇది నిజమైన కళకు, ఫేక్ ఫొటోకు మధ్య ఉన్న తేడా. ఎడిట్ చేసిన ఫొటోను చూసి చాలా మంది జోకులు వేసుకున్నారు. మరికొంత మంది బాగా నవ్వుకున్నారు. ఇదంతా బాగానే ఉంది. అయితే మీ చర్యలు, కామెంట్లు ఎదుటి వారి మనోభావాలను గాయపరుస్తాయి కూడా. అందుకే అసలుకు, నకిలీకి తేడా తెలుసుకోవాలని విఙ్ఞప్తి చేస్తున్నా’ అని రెండు ఫొటోలను షేర్ చేశారు. అయినా సెల్ఫీ అడిగితే దురుసుగా ప్రవర్తించందంటూ రణును నిందించారే తప్ప.. సెలబ్రిటీ లైఫ్నకు ఆమె అలవాటు పడలేదన్న విషయాన్ని గుర్తించని వ్యక్తులు.. ఇప్పుడు మాత్రం ఆమెకు మద్దతుగా నిలుస్తారని ఆశించడం మూర్ఖత్వమే అవుతుందన్న విషయాన్ని తాజా కామెంట్లు స్పష్టం చేస్తున్నాయి. View this post on Instagram As you can see, this is the difference between the work that we have done and the 'Fake' picture that has been edited to an extent. All the jokes and trolls are fine and they make us laugh too but to hurt someone sentiments, that's not a very good thing to do. We truly hope that you all will understand the truth and realise the difference between the fake one and the one that is genuine. That's all we ask for. A post shared by sandhyasmakeover (@sandhyasmakeover) on Nov 19, 2019 at 1:09am PST -
‘నా కాళ్లు విరగ్గొడతామని బెదిరించారు’
కోల్‌కతా : తమతో పాటు ఉండమని ఎన్నిసార్లు చెప్పినా తన తల్లి వినలేదని సోషల్ మీడియా సెన్సేషన్ రణు మొండాల్ కూతురు ఎలిజబెత్ సతీ రాయ్ అన్నారు. తన జీవితం గురించి పూర్తిగా తెలుసుకోకుండా నెటిజన్లు తనను విమర్శించడం బాధ కలిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే స్టేషనులో లతా మంగేష్కర్ పాటలను ఆలపిస్తున్న రణు మొండాల్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె రాత్రికి రాత్రే స్టార్‌గా మారిన సంగతి తెలిసిందే. రణు గాత్రానికి ముగ్ధుడైన బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేశ్ రేష్మియా ఆమెకు రెండు పాటలు పాడే అవకాశం కల్పించాడు. ఈ క్రమంలో తల్లిని అనాథలా వదిలేసిన రణు కూతురు..సెలబ్రిటీ హోదా దక్కిన తర్వాత తిరిగి తల్లి చెంతకు చేరిందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై స్పందించిన రణు కూతురు ఎలిజబెత్ సతీ రాయ్ మాట్లాడుతూ..‘ మా అమ్మ రైల్వే స్టేషనులో పాటలు పాడుతోందని నాకు తెలియదు. నేను ఆమె మొదటి భర్త కూతురిని. మేము ముంబైలో ఉండేవాళ్లం. నాకు ఓ అన్నయ్య ఉన్నాడు. మా నాన్న చనిపోయిన తర్వాత అమ్మ రెండో పెళ్లి చేసుకుంది. రెండో భర్త ద్వారా తనకు ఓ కూతురు, కొడుకు ఉన్నారు. వాళ్లంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. అమ్మ ఇప్పుడు కోల్‌కతాలోనే ఉంటుంది. నేను కూడా ఇక్కడే ధర్మటాలలో ఉంటాను. నాకు ఉన్న బాధ్యతల కారణంగా నేను తరచుగా తనను కలిసే వీలు ఉండేది కాదు. నాకు నలుగురు పిల్లలు. భర్త వదిలేశాడు. చిన్న కూరగాయల షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్నా. రెండు నెలల క్రితం బస్టాండులో తనను చూసినపుడు ఇంటికి నాతో పాటు ఇంటికి రమ్మని చెప్పాను. తను ఒప్పుకోలేదు. సరేనని 200 రూపాయలు చేతిలో పెట్టి ఇంటికి వెళ్లిపోయాను. అంతేకాదు నెలనెలా తనకు 5 వందల రూపాయలు పంపేదాన్ని. నా కొడుకు చాలా చిన్నవాడు. పిల్లలను చూసుకోవడంతో పాటు వ్యాపారం చేయడంతో నాకు కనీసం సరిగా తిండి తినే సమయం కూడా దొరకడం లేదు. ఇదంతా తెలియకుండా తల్లిని వదిలేశానంటూ జనాలు నన్ను ఇష్టం వచ్చినట్లుగా తిట్టుకుంటున్నారు. మిగతా వాళ్లైనా(సోదరులు) అమ్మను పట్టించుకోవచ్చు కదా. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి’ అని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి : రైల్వే స్టేషన్లో పాట ఆమెను సెలబ్రిటీ చేసింది..! అదే విధంగా రణు మొండాల్‌కు ఆశ్రయం కల్పించిన రణఘాట్ ఆమ్రా శోభై షోతాన్ క్లబ్ నిర్వాహకులపై ఎలిజబెత్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘ అతీంద్ర చక్రవర్తి, తపన్ దాస్(క్లబ్ సభ్యులు) నిజంగా మా అమ్మ సొంత కుమారులు అయి ఉంటే ఆమెను బాగా చూసుకునేవారు. కానీ మా అమ్మ వాళ్ల దగ్గర ఉన్నట్లు నాకు సమాచారం ఇవ్వలేదు. తన గురించి తెలుసుకుని అక్కడికి వెళ్లాలని ప్రయత్నించగా నా కాళ్లు విరగ్గొట్టి బయటకు విసిరి వేస్తామని బెదిరించారు. నాకు వ్యతిరేకంగా మా అమ్మ మనసు మార్చారు. ఆమె దగ్గర నుంచి 10 వేల రూపాయలు తీసుకుని ఓ సూట్‌కేసు, రెండు నైటీలు మాత్రమే కొనిచ్చారు. వాళ్లను నమ్మడానికి వీల్లేదు అని విమర్శించారు. ఏదేమైనప్పటికీ అమ్మకు గుర్తింపు రావడం సంతోషంగా ఉందని... ఆమె కూతురిగా పుట్టినందుకు గర్వపడుతున్నానని పేర్కొన్నారు. -
ఆమె గాత్రానికి నెటిజన్లు మరోసారి ఫిదా..
రైల్వే స్టేషన్లో పాటలు పాడుతూ దీన స్థితిలో కాలం వెళ్లదీసిన రణు మండల్ ఒక్కసారిగా ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన సంగతి తెలిసిందే. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ పాడిన ఏక్ ప్యార్ కా నగ్మా హై పాటను ఆలపించి తన గాన మాధుర్యంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులన్ని చేసింది. దీంతో ఆమెకు బాలీవుడ్ నుంచి వరుస అవకాశాలు వచ్చిపడుతున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేశ్ రేష్మియా తన సినిమాలో పాట పాడే అవకాశాన్ని కల్పించాడు. తేరీ మేరీ కహానీ.. అంటూ తొలి పాటను ఆలపించగా అది బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక తను వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అసరం లేకుండా పోయింది. పలు ఆఫర్లు ఆమె ఇంటి ముందు క్యూ కడుతున్నాయి. మరోవైపు తన టాలెంట్ చూసి అబ్బురపడిపోయిన హీరో సల్మాన్‌ఖాన్ కళ్లు చెదిరే గిఫ్ట్ ఇచ్చాడని జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా హిమేశ్ రేష్మియా ఆమెతో మరో పాట పాడించాడు. ఈ పాటకు ఆదాత్ అని టైటిల్ కూడా ఇచ్చేశారు. ఇందులో రణు ఆలపిస్తుండగా హిమేశ్ వాయిస్‌ఓవర్‌తో పాట కొనసాగుతుంటుంది. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆమె గంధర్వ గాత్రానికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కాగా తను ఒక్కసారిగా క్లిక్ అవటం వెనుక అతీంద్ర చక్రవర్తి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కారణమని చెప్పవచ్చు. అతను రైల్వేస్టేషన్లో రణు పాటను వీడియో తీసి ఆమెకు ప్రత్యేక గుర్తింపుకు తెచ్చిపెట్టాడు. అక్కడితో వదిలేయకుండా ఆమె పాడే పాటలన్నింటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రణు మండల్ ఎదుగుదలకి బాటలు వేశాడు. అతని సహాయం, అంతకు మించిన ఆమె టాలెంట్.. వెరసి ఒక సామాన్యురాలిని సెలబ్రిటీగా నిలబెట్టాయి. View this post on Instagram After the epic blockbuster track teri meri kahani , Recorded another track Aadat from happy hardy and heer in the divine voice of Ranu mandol , here’s the glimpse of the song , the alaap and voice over is the theme of happy hardy and heer , thanks for all your love and support A post shared by Himesh Reshammiya (@realhimesh) on Aug 29, 2019 at 11:19pm PDT -
సల్మాన్ భారీ గిఫ్ట్; అదంతా ఫేక్
కోల్‌కత : రణాఘాట్ రైల్వేస్టేషన్లో పాటపాడిన రణు మొండాల్ సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యారు. దిగ్గజ గాయకురాలు లతా మంగేష్కర్ పాటల్ని పాడుతూ ఆమె అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ఇక ఆమె గాత్రానికి ముగ్ధుడైన బాలీవుడ్ నటుడు, సంగీత దర్శకుడు హిమేష్ రేష్మియా తన తదుపరి చిత్రం ‘హ్యాపీ హార్డీ అండ్ హీర్’లో ఆమెకు పాట పాడే అవకాశం ఇచ్చాడు. ఇదిలాఉండగా.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ రణు మొండాల్‌కు ఏకంగా రూ.55 లక్షల విలువైన ఇంటిని కానుకగా ఇచ్చాడని వార్తలు వచ్చాయి. (ఇంటర్నెట్ సెన్సేషన్‌కు సల్మాన్ భారీ గిఫ్ట్!) అయితే, సల్మాన్ గిఫ్ట్ ఇచ్చాడనే వార్తలు అవాస్తవమని రణు మొండాల్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసిన విక్కీ బిశ్వాస్ వెల్లడించారు. ఇదంతా సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారం మాత్రమేనని అన్నారు. సల్మాన్ ఎలాంటి బహుమతులు, సినిమాలో పాట పాడే అవకాశమిస్తున్నట్టు చెప్పలేదని పేర్కొన్నారు. అయితే, రేష్మియా పాటపాడే అవకాశం ఇవ్వడం, దానికి రెమ్యునరేషన్ ఇవ్వడం మాత్రం నిజమేనన్నారు. ఇక సెన్సేషన్ సింగర్ రణు మొండాల్‌ను ‘రణాఘాట్ లత’అని నెటిజన్లు పిలుచుకుంటున్నారు. (చదవండి : ‘తోటి ఆర్టిస్టును కించపరిచావు..పిచ్చి పట్టిందా’) -
‘పిచ్చి పట్టిందా..డాక్టర్‌కు చూపించుకో’
నేటి డిజిటల్ యుగంలో చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రస్తుతం అందరూ టిక్‌టాక్ యాప్‌లో మునిగితేలుతున్నారు. ఎంతో మంది తమ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తూ సెలబ్రిటీలుగా మారుతుంటే.. కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న ఓ ఒడిశా నటుడు మాత్రం తన అత్యుత్సాహం, బిత్తిరితనంతో విమర్శల పాలవుతున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. రణు మొండల్ అనే ఓ సామాన్యురాలు తన అద్భుత గాత్రంతో దిగ్గజ గాయని లతా మంగేష్కర్ పాటలను ఆలపిస్తూ ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె మధురమైన గానానికి ముగ్ధుడైన బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేశ్ రేష్మియా రణు చేత ఓ పాటను రికార్డు చేయించాడు. ‘తేరీ మేరీ కహానీ’ అంటూ సాగే పాటను ఆలపిస్తున్న రణు పక్కనే ఉండి ఆమెను ఉత్సాహపరుస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ నేపథ్యంలో ఒడిశా కమెడియన్, పప్పు పామ్ పామ్‌గా ఫేమస్ అయిన తత్వా ప్రకాశ్ సతపతి ఈ వీడియోపై టిక్‌టాక్‌లో తన ‘సృజనాత్మకత’ ప్రదర్శించాడు. పాట రికార్డింగ్ సమయంలో రణు కట్టుకున్న రంగు చీరను కట్టుకుని, ఆమెలా హావభావాలు పలికిస్తూ మైక్ ముందు నిల్చుని రణును అనుకరించాడు. ఇక అదే సమయంలో మరో వ్యక్తి హిమేశ్ రేష్మియాలా పప్పును ఉత్సాహపరిచాడు. ఈ క్రమంలో రణును కించపరిచేలా ఉన్న ఈ టిక్‌టాక్ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘పప్పూకి పిచ్చెక్కిందేమో. మతిస్థిమితం తప్పినట్లుంది. ఒకసారి ఆయనను సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్లాలి. తోటి కళాకారిణిని అవమానించే ముందు ఒక్కసారైనా ఆలోచించవచ్చు కదా’ అంటూ ప్రకాశ్ సతపతిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. కాగా ఈ విషయంపై స్పందించిన ప్రకాశ్ అసిస్టెంట్ ఆయన సరదా కోసం మాత్రమే వీడియో చేశారని చెప్పుకొచ్చాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రణు రైల్వే స్టేషనులో పాట పాడుతుండగా గమనించిన అతీంద్ర చక్రవర్తి అనే ఓ యువ ఇంజనీర్ ఆమె పాటను రికార్డు చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. దీంతో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిన రణుకు హిందీ చానెల్ అవకాశమిచ్చింది. ఆమె లుక్‌ను పూర్తిగా మార్చివేసి సెలబ్రిటీగా ప్రేక్షకుల ముందు నిలబెట్టింది. ఇక ఆమెకు నేపథ్య గాయనిగా అవకాశం ఇచ్చిన హిమేశ్ మరో పాట కోసం కూడా రణునే ఎంచుకున్నాడు. -
ఇంటర్నెట్ సెన్సేషన్‌కు సల్మాన్ భారీ గిఫ్ట్!
సోషల్ మీడియా అభివృద్ధి చెందుతుండటంతో గుర్తింపుకు నోచుకోని ఎంతో మంది కళాకారులు వెలుగులోకి వస్తున్నారు. ఇటీవల తెలుగులో బేబీ అనే గాయని సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ లోనూ ఇలాగే ఓ గాయని తెర మీదకు వచ్చారు. రణు మొండాల్ అనే మహిళ రైల్వే స్టేషన్లో పాటలు పాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె గాత్రం లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్‌ను పోలి ఉండటంతో పలువురు ప్రముఖులు ఆ వీడియోపై స్పందించారు. అంతేకాదు నటుడు, సంగీత దర్శకుడు హిమేష్ రేష్మియా తన తదుపరి సినిమా ‘హ్యాపీ హార్డీ అండ్ హీర్’లో ఆమెకు పాట పాడే అవకాశం ఇచ్చాడు. నిన్నటి వరకు ఎలాంటి గుర్తింపు లేకుండా రైల్వే స్టేషన్లో గడిపిన ఆమె ఇప్పుడు ఒక్కసారి బాలీవుడ్ సెలబ్రిటీగా మారిపోయారు. ఈ విషయం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వరకు చేరటంతో ఆయన స్పందించారు. తనకు నచ్చిన వారికి విలువైన బహుమతులు ఇవ్వటంలో సల్మాన్‌కు ఎవరూ పోటీరారు. ఇదే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు సల్లూ భాయ్. రణు మొండాల్ గాత్రాన్ని మెచ్చి ఆమెకు ఏకంగా 55 లక్షల విలువైన ఇంటిని కానుకగా ఇచ్చాడట. అంతేకాదు తన తాజా చిత్రం దబాంగ్ 3లో పాట పాడే అవకాశం కూడా ఇస్తున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై సల్మాన్ గానీ అతని పీఆర్ టీం గానీ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. -
రైల్వే స్టేషన్లో పాట ఆమెను సెలబ్రిటీ చేసింది..!
న్యూఢిల్లీ : ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పాడిన అలనాటి క్లాసిక్ పాటలను తన గళంతో సుతిమెత్తగా ఆలాపిస్తూ.. సంగీత ప్రియుల హృదయాల్ని గెలుచుకున్న రణు మొండాల్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. తన గాన మాధుర్యంతో రాత్రికి రాత్రే పాపులరైన పశ్చిమ బెంగాల్‌కు చెందిన రణు మొండాల్‌ను బాలీవుడ్ నటుడు, గాయకుడు, సంగీత దర్శకుడు హిమేష్ రేష్మియా ప్రోత్సహించాడు. తన తదుపరి సినిమా ‘హ్యాపీ హార్డీ అండ్ హీర్’లో ఆమెకు పాట పాడే అవకాశం ఇచ్చాడు. ఈ క్రమంలో రణు మొండాల్ పాట పాడుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ‘తేరీ మేరీ కహానీ’ అనే పాటను ఆమె అద్భుతంగా ఆలపించారని చెప్పాడు. ‘మనం కన్న కలలు నిజమయ్యే రోజు తప్పక వస్తుంది. లక్ష్య సాధన కోసం కృషి చేయడం మాత్రం మరువొద్దు. ఎప్పుడూ పాజిటివ్ దృక్పథంతో ఆలోచిస్తేనే అది సాధ్యం. నన్ను అభిమానించే వారందరికీ ధన్యవాదాలు’అని హిమేష్ ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టాడు. హిమేష్ మంచి మనసును చాటుకున్నాడని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. (చదవండి : అద్భుతమైన గానం.. నెటిజన్ల ఆనంద పారవశ్యం!) ‘. ఈ నేపథ్యంలో ‘నిన్న రైల్వే స్టేషన్లో ఉన్న రణు మొండాల్‌ను నేడు ప్లేబ్యాక్ సింగర్‌ను చేశావ్. నీది చాలా గొప్ప మనసు’ అని కొందరు.. రణు మొండాల్ కలను నిజం చేశావ్ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇక బెంగాల్‌లోని రణఘాట్ రైల్వేస్టేషన్లో రణ మొండాల్ పాడిన పాటల్ని ‘బర్పెటా టౌన్ ద ప్లేస్ ఆఫ్ పీస్’ అనే ఫేస్బుక్ పేజీ నెటిజన్లకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ‘లతా మంగేష్కర్‌లా తీయగా పాడుతోంది..‘రణాఘాట్ లత’ అని నెటిజన్లు కామెంట్లు చేశారు. -
సోనియాను పెళ్లాడిన హిమేష్
బాలీవుడ్ తారాల సీక్రెట్ పెళ్లిళ్ల జాబితా పెరుగుతోంది. ఎలాంటి హడావిడి లేకుండా పెళ్లిపీటలెక్కేస్తున్నారు బాలీవుడ్ స్టార్స్. ఇటీవల నేహాధూపియా ఎలాంటి ప్రకటన లేకుండా పెళ్లి చేసేసుకుంది. పెళ్లి రోజున తన భర్తను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు పరిచయం చేసింది. తాజాగా మరో బాలీవుడ్ నటుడు ఈ లిస్ట్ లో చేరిపోయాడు. బాలీవుడ్ నటుడు, సంగీత దర్శకుడు హిమేష్ రేష్మియా టీవీ నటి సోనియా కపూర్‌ను వివాహం చేసుకున్నారు. హిమేష్‌కు ఇది రెండో వివాహం. గతంలో కోమల్‌ను పెళ్లి చేసుకున్న హిమేష్ ఇటీవల ఆమె నుంచి విడాకులు తీసుకున్నారు. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల మధ్య హిమేష్, సోనియాల వివాహం జరిగింది. -
హిమేష్ రేష్మియా మళ్లీ పెళ్లి
ముంబై : బాలీవుడ్లో పెళ్లిల సీజన్ నడుస్తోంది. మొన్న సోనం కపూర్, నిన్న నేహా ధూపియాల పెళ్లిళ్లు జరిగిపోగా.. తాజాగా ఈ జాబితాలో బాలీవుడ్ నటుడు, సంగీత దర్శకుడు హిమేష్ రేష్మియా వచ్చి చేరారు. అయితే, హిమేష్‌కు ఇది రెండో వివాహం. 21 ఏళ్ల ప్రాయంలోనే కోమల్‌తో హిమేష్‌కు వివాహం జరిగింది. 22 ఏళ్ల వైవాహిక జీవితాన్ని తెరదించుతూ.. గత ఏడాది జూన్‌లో కోమల్ నుంచి విడాకులు తీసుకున్నారు. వీరికి కుమారుడు స్వయమ్ ఉన్నాడు. ప్రస్తుతం అతని బాధ్యతను ఇరువురూ పంచుకుంటున్నారు. అయితే హిమేష్ దంపతులు విడాకులు తీసుకోవడానికి అతనికి టీవీ నటి సోనియా కపూర్‌తో ఉన్న సంబంధమే కారణమని వార్తలు వచ్చాయి. అయితే తాము విడిపోవడానికి సోనియా కపూర్ కారణం కాదని, హిమేష్, కోమల్‌లు వివరణ ఇచ్చారు. విడాకులకు ముందు నుంచే సోనియా కపూర్‌తో ప్రేమ బంధాన్ని కొనసాగిస్తున్న హిమేష్, ఆమెని పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకున్నాడని అతని సన్నిహితులు వెల్లడించారు. శుక్రవారం రాత్రి హిమేష్ ఇంట్లోనే సన్నిహితుల నడుమ పెళ్లి వేడుక జరగనుందని వారు తెలిపారు. -
అఫీషియల్‌గా విడిపోయిన సెలబ్రిటీ జంట
ముంబై: కొంతకాలంగా టీవీ నటి సోనియా కపూర్‌తో రిలేషన్లో ఉన్న ప్రముఖ సంగీత దర్శకుడు హిమేష్ రేషమ్మియా అధికారికంగా భార్య నుంచి విడిపోయారు. ముంబై హైకోర్టు విడాకులు మంజూరు చేయడంతో హిమేష్- కోమల్ దంపతుల 22ఏళ్ల వైవాహిక బంధం ముగిసింది. గత డిసెంబర్లో ఈ జంట చేసుకున్న అభ్యర్థనను పరిశీలించిన కోర్టు.. మంగళవారం విడాకులు మంజూరుచేసింది. విచారణ చివరిరోజున స్వయంగా కోర్టుకు హాజరైన హిమేష్, కోమల్‌లు.. తాము పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లు న్యాయమూర్తికి వివరించారు. విడాకుల అనంతరం కోర్టు ఆవరణలో హిమేష్ రేషమ్మియా మీడియాతో మాట్లాడారు. వైవాహిక బంధంలో పరస్పర గౌరవానికి ప్రాధాన్యం ఉంటుందని, దానిని కొనసాగించేందుకే తామిద్దరం విడిపోయామని హిమేష్ చెప్పారు. ‘కోమల్‌తో నాది 22 ఏళ్ల ప్రయాణం. విడాకులు తీసుకోవాలనే మా నిర్ణయాన్ని ఇరు కుటుంబాలూ అంగీకరించాయి. అధికారికంగా విడిపోయినా కోమల్‌కు, ఆమె కుటుంబానికి నేనెప్పుడూ మంచి మిత్రుడిగానే ఉంటా’అని హిమేష్ పేర్కొన్నారు. సోనియా కారణం కాదు తాము విడిపోవడానికి సోనియా కపూర్ కారణం కాదని హిమేష్ మాజీ భార్య కోమల్ తెలిపారు. విడాకుల అనంతరం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ‘సోనియా వల్లో ఇంకొకరివల్లో నేను నా భర్త(హిమేష్) విడిపోలేదు. ఇక ముందు కూడా ఒకరినొకరు గౌరవించుకోవాలనుకునే విడిపోయాం. హిమేష్ ఎప్పటికీ మా కుటుంబ సభ్యుడే’ అని కోమల్ లేఖలో తెలిపారు. విడాకుల అనంతరం హిమేష్‌తో కలిసి ఉన్నప్పటి ఇంట్లోనే కోమల్ ఉండనున్నారు. కొడుకు(స్వయమ్) బాధ్యతను ఇరువురూ పంచుకుంటారు. -
చీరతో ఉరేసుకున్న సీఈవో
ముంబై: బాలీవుడ్ గాయకుడు, హీరో హిమేష్ రేష్మియా మ్యూజిక్ కంపెనీ సీఈవో ఆండీ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఒషివారా ప్రాంతంలోని తన నివాసంలో ఫ్యాన్ కు ఉరేసుకుని అతడు ప్రాణాలు తీసుకున్నాడు. తన తల్లి చీరతో అతడు ఉరేసుకున్నాడు. ఆండీ సింగ్ ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో అతడి తల్లి, ప్రియురాలు ఇంట్లోనే మరో గదిలో ఉన్నారు. ఆదివారం తెల్లవారుజామున అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని, సూసైడ్ నోట్ ఏమీ కనబడలేదని పోలీసులు తెలిపారు. ఆండీ సింగ్ గదిలో కుర్చీ పడిపోయిన శబ్దం రావడంతో అతడి తల్లి, ప్రియురాలు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి చూసేసరికే అతడు చనిపోయాడు. అతడి ఆత్మహత్యకు కారణాలు వెల్లడికాలేదు. ఆరేళ్లుగా హిమేష్ రేష్మియా మ్యూజిక్ కంపెనీలో ఆండీ సింగ్ పనిచేస్తున్నాడు.