Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

nirmala sitharaman presents union budget 2024-25 live updates telugu
Budget 2024-25: బడ్జెట్‌ ముఖ్యాంశాలు

Parliament Budget Session 2024 Highlights: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ దేశ చరిత్రలో ఏడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ రికార్డు నెలకొల్పారు. బడ్జెట్‌ 2024-25లో నిర్మలా సీతారామన్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు, అప్‌డేట్లు.కేంద్ర బడ్జెట్‌ 2024-25లో మొత్తం రూ.48,20,512 కోట్లు వ్యయం అంచనా వేశారు.మూలధన వ్యయం రూ.11,11,111 కోట్లు. ఇది 2023-24 అంచనాల కంటే 16.9% ఎక్కువ.ప్రభావవంతమైన మూలధన వ్యయం రూ.15,01,889 కోట్లుగా అంచనా.రెవెన్యూ వసూళ్లు రూ.31,29,200 కోట్లు.నికర పన్ను ఆదాయం రూ.25,83,499 కోట్లు.పన్నేతర ఆదాయం రూ.5,45,701 కోట్లు.మొత్తం మూలధన వసూళ్లు (రుణేతర రశీదులు, రుణ రసీదులతో కలిపి) రూ.15,50,915 కోట్లు.యువతకు నైపుణ్యాలు పెంచే బడ్జెట్‌: మోదీమహిళల స్వావలంబనకు దోహదం చేసే బడ్జెట్‌.ముద్ర రుణాల పరిమితిని రూ.20 లక్షలకు పెంచాం.ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యమిచ్చాం.భారత్‌ను గ్లోబల్‌ మ్యానుఫాక్చరింగ్‌ హబ్‌గా మారుస్తాం.పర్యాటక రంగాన్ని మరింత మెరుగుపరిచేలా చర్యలు తీసుకున్నాం.#WATCH | Post Budget 2024: Prime Minister Narendra Modi says "For MSMEs, a new scheme to increase ease of credit has been announced in the budget. Announcements have been made to take export and manufacturing ecosystem to every district in this budget...This budget will bring new… pic.twitter.com/C0615OJjdt— ANI (@ANI) July 23, 2024స్టాంప్‌ డ్యూటీ పెంచేందుకు రాష్ట్రాలకు అనుమతి.పన్ను సమస్యలకు సంబంధించిన అప్పీళ్ల ద్రవ్య పరిమితులు పెంచారు.ట్యాక్స్‌ ట్రిబ్యునల్స్, హైకోర్టులు, సుప్రీంకోర్టులో ప్రత్యక్ష పన్నులు, ఎక్సైజ్, సర్వీస్‌ ట్యాక్స్‌కు సంబంధించిన అప్పీళ్లను దాఖలు చేయడానికి ద్రవ్య పరిమితులు వరుసగా రూ.60 లక్షలు, రూ.2 కోట్లు, రూ.5 కోట్లుగా నిర్ణయించారు.గత సంవత్సరం కంటే బడ్జెట్ కేటాయింపులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు నిధులు తగ్గించారు. 2024-25 బడ్జెట్‌లో రూ.951 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ.968 కోట్లు కంటే 1.79 శాతం నిధులు తగ్గాయి.జమ్మూ కశ్మీర్‌కు బడ్జెట్‌లో రూ.42,277 కోట్లు.అండమాన్ నికోబార్ దీవులకు రూ.5,985 కోట్లు.చండీగఢ్‌కు రూ.5,862 కోట్లు.లద్దాఖ్‌కు రూ.5,958 కోట్లు.ప్రభుత్వం మూడు క్యాన్సర్ మందులను కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయించింది.విదేశీ కంపెనీలపై కార్పొరేట్ పన్ను రేటు 40% నుంచి 35%కి తగ్గించింది.క్యాపిటల్ గెయిన్‌లపై ప్రభుత్వం పన్ను పెంచిన తర్వాత రూపాయి రికార్డు స్థాయికి క్షీణించింది.యూఎస్‌ డాలర్‌తో పోలిస్తే రూపాయి 83.69కి పడిపోయింది.ఎంపిక చేసిన నగరాల్లో 100 స్ట్రీట్ ఫుడ్ హబ్‌ల అభివృద్ధి.30 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న 14 పెద్ద నగరాల కోసం రవాణా ఆధారిత అభివృద్ధి ప్రణాళికలు.ప్రధాన కేంద్ర పథకాలకు కేటాయింపులు..గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.86 వేలకోట్లు.రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లకు రూ.1,200 కోట్లు.న్యూ క్లియర్‌ ప్రాజెక్ట్‌లకు రూ.2,228 కోట్లు.ఫార్మాసూటికల్స్‌ రంగంలో పీఎల్‌ఐ పథకానికి రూ.2,143 కోట్లు.సెమికండక్టర్లు అభివృద్ధికి, తయారీ రంగానికి రూ.6,903 కోట్లు.సోలార్‌ పవర్‌(గ్రిడ్‌) రూ.10 వేలకోట్లు.ఎల్‌పీజీ డీబీటీ(రాయితీ)లకు 1,500 కోట్లు.రూపాయి రాక...ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ 19 పైసలుఎక్సైజ్‌ డ్యూటీ 5 పైసలుఅప్పులు, ఆస్తులు 27 పైసలుపన్నేతర ఆదాయం 9 పైసలుమూలధన రశీదులు 1 పైసలుకస్టమ్స్‌ ఆదాయం 4 పైసలుకార్పొరేషన్‌ ట్యాక్స్‌ 17 పైసలుజీఎస్టీ, ఇతర పన్నులు 18 పైసలురూపాయి పోక..పెన్షన్లు 4 పైసలువడ్డీ చెల్లింపులు 19 పైసలుకేంద్ర పథకాలు 16 పైసలుసబ్సిడీలు 6 పైసలుడిఫెన్స్‌ 8 పైసలురాష్ట్రాలకు తిరిగి చెల్లించే ట్యాక్స్‌లు 21 పైసలుఫైనాన్స్‌ కమిషన్‌కు చెల్లింపులు 9 పైసలుకేంద్ర ప్రాయోజిక పథకాలు 8 పైసలుఇతర ఖర్చులు 9 పైసలుకొత్త పన్ను విధానంలో మార్పులు.. రూ.3 లక్షలలోపు ఎలాంటి పన్ను లేదు. రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షలలోపు 5 శాతం, రూ.7లక్షలు-రూ.10 లక్షలలోపు 10%, రూ.10లక్షలు- రూ.12 లక్షలలోపు 15%, రూ.12 లక్షలు-రూ.15 లక్షలలోపు 20%, రూ.15 లక్షలు అంతకంటే ఎక్కువ ఉంటే 30% పన్ను చెల్లించాలి. మొత్తంగా పన్నుదారులు రూ.17,500 మిగుల్చుకునే అవకాశం.పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 నుంచి రూ.75,000కి పెంపు.ట్రేడింగ్‌ మార్కెట్‌లో ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్లపై ఎస్‌టీటీ వరుసగా 0.02%, 0.01%కి పెంపు.దీర్ఘకాలిక మూలధన లాభాలపై 12.5 శాతం పన్ను.క్యాపిటల్‌ కనిష్ఠ పరిమితి రూ.1.25 లక్షలు.స్టార్టప్‌ల కంపెనీలకు ప్రోత్సాహకం.. ఏంజెల్‌ ట్యాక్స్‌ రద్దు.బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకం 6 శాతం, ప్లాటినంపై 6.4 శాతం తగ్గింపు.మొబైల్, యాక్ససరీస్‌పై 15 శాతం దిగుమతి సుంకం తగ్గింపు.జీఎస్టీలో పన్నుల నిర్మాణాన్ని హేతుబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. సామాన్యులకు జీఎ‍స్టీ వల్ల గణనీయంగా లాభం చేకూరింది. జీఎస్టీ ప్రయోజనాలను మరింత మెరుగుపరచడానికి పన్ను నిర్మాణంపై నిర్ణయం తీసుకునేందుకు ప్రయత్నిస్తాం.ఆర్థిక ద్రవ్యలోటు జీడీపీలో 4.9%గా ఉంది.విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.కాశీ విశ్వనాథ్ ఆలయం, నలంద, విష్ణుపాద్, మహాబోధి ఆలయం వంటి ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ప్రత్యేక కారిడార్ల ఏర్పాటు.రాబోయే 10 సంవత్సరాలలో అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను ఐదు రెట్లు విస్తరిస్తాం.ఈ లక్ష్యానికి చేరుకోవడానికి రూ.1,000 కోట్ల క్యాపిటల్ ఫండ్ ఏర్పాటు చేస్తాం.ఫిబ్రవరిలో ప్రకటించిన విధంగా రూ.1 లక్ష కోట్ల ఫండ్‌తో ప్రైవేట్ ఆధారిత పరిశోధనలను ప్రోత్సహించడానికి ఒక యంత్రాంగాన్ని రూపొందిస్తాం.చిన్న, మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్‌ల అభివృద్ధి.ఇందుకు ప్రభుత్వం ప్రైవేట్ రంగంతో కలిసి పనిచేస్తుంది. న్యూక్లియర్ ఎనర్జీ కోసం కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయాల్సి ఉంది.నేపాల్‌లో వరదలను నియంత్రించేలా మరిన్ని నిర్మాణాలు చేపట్టాలి. అసోం, బీహార్‌లోనూ తరచు వరదలు సంభవిస్తాయి. వరదల వల్ల హిమాచల్ ప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుంది. కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తుల నిర్వహణకు రూ.11,500 కోట్లు ఆర్థికసాయం.ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకానికి సంబంధించి విధాన పత్రాన్ని విడుదల చేస్తాం. ఈ పథకాన్ని రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్‌లను ఏర్పాటు చేయడానికి ప్రారంభించారు. దీని ద్వారా 1 కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తారు. ఇప్పటికే 1.28 కోట్ల రిజిస్ట్రేషన్‌లు నమోదయ్యాయి. 14 లక్షల దరఖాస్తులు అందాయి.మౌలిక సదుపాయాలకు రూ.11.11 లక్షల కోట్లు.ఇది జీడీపీలో 3.4 శాతానికి సమానం.రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్‌లకు రూ.26,000 కోట్ల ప్రోత్సాహం.గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు.ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ (ఐబీసీ) పరిధిలో బ్యాంక్‌ రుణాల రికవరీని మెరుగుపరచడానికి ఇంటిగ్రేటెడ్ టెక్ ప్లాట్‌ఫామ్‌ ఏర్పాటు.ముద్ర రుణాలు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంపు.ఎంఎస్‌ఎంఈలకు క్రెడిట్‌ గ్యారెంట్‌ స్కీం.సులభంగా నిధులు అందేలా చర్యలు.గంగానదిపై మరో రెండు వంతెనల ఏర్పాటు.ఈశాన్యరాష్ట్రాల్లో ఎక్స్‌ప్రెస్‌ హైవేల నిర్మాణం.ఈశాన్యరాష్ట్రాల్లో 100 పోస్ట్‌పేమెంట్‌ బ్యాంకుల ఏర్పాటు.దేశవ్యాప్తంగా 12 ఇండస్ట్రీయల్‌ పార్క్‌ల ఏర్పాటు.బీహార్‌లో ఎక్స్‌ప్రెస్‌ హైవేలు నిర్మాణం.బీహార్‌, ఏపీలోనూ పూర్వోదయ పథకం అమలు.ఏపీకి అండగా ఉంటాం..ఏపీ రాజధాని నిర్మాణానికి నిధులు.వాటర్‌, పవర్‌, రైల్లే, రోడ్లు రంగాల్లో ఏపీకి అండగా ఉంటాం.పోలవరం ప్రాజెక్ట్‌కు పూర్తి సాయం అందించేలా చర్యలు.అమరావతి అభివృద్ధికి రూ.15 వేలకోట్లు.ఈ ఏడాదిలోనే ఆర్థిక సాయం.అవసరమైతే మరిన్ని నిధులు.విభజన చట్టం కింద పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు.ఏటా 10 లక్షల మందికి విద్యారుణం.విద్యా, నైపుణ్యాభివృద్ధికి రూ.1.48 లక్షల కోట్లు.వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు.మహిళల నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు.కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి ఈపీఎఫ్‌ఓ పథకం.ఈపీఎఫ్‌ఓ ద్వారా నగదు బదిలీ.వర్కింగ్‌ ఉమెన్‌ హాస్టళ్ల ఏర్పాటు.నాలుగు కోట్ల మందికి స్కిల్‌ పాలసీ.ఈ బడ్జెట్‌లో వికసిత్‌ భారత్‌కు రోడ్‌మ్యాప్‌.సమ్మిళిత అభివృద్ధికి పెద్దపేట.యువతకు ఐదు ఉద్యోగ పథకాలు.నాలుగు కోట్ల యువతకు ఉపాధి కల్పించేలా కృషి.వ్యవసాయం డిజిటలైజేషన్‌ కోసం ప్రత్యేక కార్యక్రమం.ఉద్యోగాల కల్పన, నైపుణ్యాల సృష్టి, సంస్థల ఏర్పాటుకు బడ్జెట్‌లో నిర్ణయాలు.కూరగాయల ఉత్పత్తి, సరఫరాలకు ప్రత్యేక చర్యలు.ప్రధానమంత్రి అన్నయోజన పథకాన్ని ఐదేళ్లు పొడిగించాం.ప్రధానిగా నరేంద్రమోదీ మూడోసారి చరిత్రాత్మక విజయం సాధించారు.ప్రజల ఆంకాక్షలు నెరవేర్చడంలో ఈ విజయం సాధ్యమైంది.దేశవ్యాప్తంగా మద్దతు ధరలు పెంచాం.అంతర్జాతీయ అనిశ్చితుల వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతున్నా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల స్థిరాభివృద్ధి సాధ్యమవుతుంది: నిర్మలా సీతారామన్‌పార్లమెంట్‌లో బడ్జెట్‌ 2024-25ను విడుదల చేయనున్న నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్రమోదీ లోక్‌సభకు చేరుకున్నారు.#WATCH | PM Modi in Parliament, ahead of the presentation of Union budget by Finance Minister Nirmala Sitharaman(Video source: DD News) pic.twitter.com/T0RD4hBO2z— ANI (@ANI) July 23, 2024బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌ చేరుకున్నారు.#WATCH | Congress MP and LoP in Lok Sabha, Rahul Gandhi reaches Parliament ahead of Union Budget presentation by Finance Minister Nirmala Sitharaman in Lok Sabha. pic.twitter.com/zNcijSYS4e— ANI (@ANI) July 23, 2024బడ్జెట్ 2024-25 పత్రాలను ‘యూనియన్ బడ్జెట్’ మొబైల్ యాప్ ఉపయోగించి పొందవచ్చు. ఈ యాప్‌ను ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ప్లాట్‌ఫామ్‌ల్లో లేదా యూనియన్ బడ్జెట్ వెబ్ పోర్టల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పత్రాలు ఇంగ్లీష్, హిందీలో అందుబాటులో ఉంటాయి.బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తేదీ నుంచి దాన్ని అమలు చేయాలంటే 1-2 నెలల సమయం పడుతుంది. గతంలో మార్చి చివరి నాటికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారు. దాంతో అది జూన్‌ వరకు అమలు అయ్యేది. కానీ ప్రస్తుతం ఫిబ్రవరిలో బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నారు. దాంతో ఏప్రిల్‌-మే వరకు అమలు అవుతుంది.ఫిబ్రవరి 1, 2020లో జరిగిన బడ్జెట్‌ సమావేశాల్లో రెండు గంటల నలభై నిమిషాలపాటు ప్రసంగించి సీతారామన్ రికార్డు నెలకొల్పారు.మోడీ 3.0 మొదటి బడ్జెట్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి మండలిలో ఆమోదం లభించింది.సీతారామన్ ఈరోజు పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ 2024ను సమర్పించనున్నారు. ఆమె వరుసగా ఏడో బడ్జెట్‌ను విడుదల చేస్తూ రికార్డు సృష్టించనున్నారు.మరికాసేపట్లో కేంద్ర బడ్జెట్‌మరో గంటలో పార్లమెంట్‌లో బడ్జెట్‌స్వల్ప నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు మరికాసేపట్లో కేంద్ర కేబినెట్‌ భేటీబడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న కేబినెట్‌ఎనిమిది నెలల కాలానికి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా బడ్జెట్‌ ఉంటుదన్న ప్రధాని మోదీఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటుకు చేరుకున్నారు. పార్లమెంటు భవనంలోని ప్రవేశిస్తూ బడ్జెట్‌ ట్యాబ్‌ను ఆమె ప్రదర్శించారు. కొత్తగా ఏర్పడిన మోదీ ప్రభుత్వంలో తొలి బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్నారు.#WATCH | Finance Minister Nirmala Sitharaman carrying the Budget tablet arrives at Parliament, to present the first Budget in the third term of Modi Government. pic.twitter.com/0tWut8mhEu— ANI (@ANI) July 23, 2024 పార్లమెంటులో ఈరోజు ఉదయం 11 గంటలకు బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో రాష్ట్రపతి భవన్‌లో సమావేశమయ్యారు. తిరిగి పార్లమెంట్‌కు వెళ్లారు.#WATCH | Finance Minister Nirmala Sitharaman meets President Droupadi Murmu at Rashtrapati Bhavan, ahead of the Budget presentation at 11am in Parliament.(Source: DD News) pic.twitter.com/VdsKg5bSLG— ANI (@ANI) July 23, 2024జమ్మూకశ్మీర్‌ బడ్జెట్ కాపీలు పార్లమెంటుకు చేరుకున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ జమ్మూకశ్మీర్ బడ్జెట్‌ 2024-25 అంచనా రశీదులను సమర్పిస్తారు.#WATCH | Delhi | J&K budget copies arrive in Parliament; Union Finance Minister Nirmala Sitharaman will present the estimated receipts and expenditure (2024-25) of the Union Territory of Jammu and Kashmir (with legislature) in Parliament today. pic.twitter.com/gMIf8y31bU— ANI (@ANI) July 23, 2024నిర్మలా సీతారామన్ తన ‘బహి-ఖాతా’తో రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. గతంలో మాదిరిగానే ఆర్థిక మంత్రి సంప్రదాయ ‘బహి-ఖాతా’ రూపంలో ఉన్న టాబ్‌తోనే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.నిర్మలమ్మ ఈసారి మెజెంటా పట్టు బోర్డర్ ఉన్న తెల్లటి చీరను ధరించారు.కొవిడ్‌ పరిణామాల తర్వాత స్టాక్ మార్కెట్‌లోని డెరివేటివ్స్ ట్రేడింగ్ భారీగా పెరిగింది. ప్రభుత్వం, రెగ్యులేటర్‌లు దీన్ని ప్రమాదకరంగా భావిస్తున్నాయి. ఈసారి బడ్జెట్‌లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం.బడ్జెట్ 2024-25 ప్రకటన సందర్భంగా ఈరోజు స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి.దేశంలో అతిపెద్ద సిగరెట్ తయారీదారు ఐటీసీ కంపెనీపై 5–7 శాతం కంటే తక్కువ పన్ను విధించే అవకాశం ఉందని ‘జెఫ్రీస్’ అభిప్రాయపడుతుంది.ఎలక్ట్రిక్ కార్ల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఐదు సంవత్సరాల కాలంలో మొత్తం రూ.1.08 లక్షల కోట్ల సబ్సిడీలను ప్రభుత్వం పంపిణీ చేసింది. వీటిని మరింత పెంచే అవకాశం ఉంది.లోక్‌సభలో ఈరోజు ఉదయం 11 గంటలకు బడ్జెట్ సమర్పించనున్న నిర్మలా సీతారామన్‌ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలవడానికి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. రాష్ట్రపతి అనుమతి పొందిన తర్వాత తిరిగి పార్లమెంట్‌ను చేరుకుంటారు.బడ్జెట్‌ను ఆవిష్కరించిన నిర్మలా సీతారామన్‌ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బృందంతో కలిసి నార్త్ బ్లాక్‌లోని మంత్రిత్వ శాఖ వెలుపల బడ్జెట్‌ టాబ్‌ను ఆవిష్కరించారు. #WATCH | Finance Minister Nirmala Sitharaman heads to Rashtrapati Bhavan to call on President Murmu, ahead of Budget presentation at 11am in Parliament pic.twitter.com/V4premP8lL— ANI (@ANI) July 23, 2024ఏడోసారి బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌. బడ్జెట్‌లో కీలక ప్రకటనలు వచ్చే అవకాశం. నిర్మలా సీతారామన్‌ ఉదయం 11 గంటల సమయంలో నూతన పార్లమెంట్‌ భవనంలోని లోక్‌సభలో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకున్నారు.Finance Minister Nirmala Sitharaman reaches Ministry ahead of Union Budget presentationRead @ANI Story | https://t.co/2pLE5R08Yh#Budget2024 #BudgetDay #NirmalaSitharaman pic.twitter.com/Vu9E7tqsio— ANI Digital (@ani_digital) July 23, 2024ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి చేరుకున్న ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్.#WATCH | Chief Economic Advisor V Anantha Nageswaran arrives at Ministry of Finance, ahead of Union Budget presentation pic.twitter.com/vWrU3LbcLz— ANI (@ANI) July 23, 2024ఈజ్‌ మై ట్రిప్ సహ వ్యవస్థాపకుడు రికాంత్ పిట్టి మాట్లాడుతూ..‘గత సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు దాదాపు 6.5% ఉంది. ఈసారి కూడా ఆర్థిక సర్వే 7% వృద్ధి రేటును సూచిస్తుంది. పర్యాటక రంగంలో చాలామంది ఉపాధి పొందుతున్నారు. ప్రజల సంప్రదాయాల విస్తరణకు ఈ రంగం వారధిగా ఉంటుంది. బడ్జెట్‌ 2024-25లో పర్యాటక రంగానికి ప్రోత్సాహకాలుంటాయని ఆశిస్తున్నాం’ అని తెలిపారు.#WATCH | Union Budget 2024 | Rikant Pitti, co-founder of EaseMy Trip says, "... Last year our GDP growth rate was around 6.5%, and this time as well, the economic survey suggests around 7% growth rate... In the coming time, our GDP growth rate will become even better... Tourism… pic.twitter.com/vZgPne4vyd— ANI (@ANI) July 23, 2024ఈరోజు బడ్జెట్‌ సమావేశాల్లో జమ్ము కశ్వీర్‌ బడ్జెట్‌ను కూడా ప్రవేశపెడుతారు.వ్యవసాయం రంగం వృద్ధికి నిర్ణయాలు..?ఆర్థికసర్వేలోని వివరాల ప్రకారం దేశాభివృద్ధికి తోడ్పడే వ్యవసాయం మరింత పుంజుకోవాలంటే వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచాలని నిపుణులు చెబుతున్నారు. ఈమేరకు బడ్జెట్‌లో నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నారు.వ్యవసాయ పద్ధతుల్లో ఆధునిక నైపుణ్యాలను తీసుకురావాలని కోరుతున్నారు.వ్యవసాయ మార్కెటింగ్ మార్గాలను మెరుగుపరచాలంటున్నారు.పంట ఉత్పత్తుల ధరను స్థిరీకరించాలని చెబుతున్నారు.వ్యవసాయంలో ఆవిష్కరణలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.ఎరువులు, నీటి వాడకంలో మార్పులు రావాలంటున్నారు.వ్యవసాయ-పరిశ్రమ సంబంధాలను మెరుగుపరిచేలా నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు.ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ ప్రకటన2024–25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్‌ను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ఈరోజు ఉదయం 11 గంటలకు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గత ఫిబ్రవరిలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టడం తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలకు ఇది రికార్డు స్థాయిలో వరుసగా ఏడో బడ్జెట్‌ కావడం విశేషం. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరించాలన్న ప్రధాని మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ రంగాలకు ప్రాధాన్యతల మేరకు నిధులు కేటాయింపులు చేయనున్నారు. సోమవారం విడుదల చేసిన ఎకనామిక్‌సర్వేలో ‘వికసిత్‌ భారత్‌’ కోసం ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలు కలిసి పనిచేస్తే జీడీపీ వృద్ధి చెందుతుందన్నారు.ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్లో నిర్మల ఎలాంటి కీలక నిర్ణయాలు ఏవీ చేయలేదు. ఈసారి నూతన పన్ను విధానంలో పన్ను మినహాయింపును ప్రస్తుత రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడంతో పాటు పాత విధానంలో మినహాయింపులను కూడా పెంచుతారని అంచనాలున్నాయి.పాత పన్ను విధానానికే చాలామంది మొగ్గు చూపుతున్నందున వారిని కొత్త విధానానికి మారేలా ప్రోత్సహించేందుకు మరిన్ని పన్ను మినహాయింపులు వస్తాయని అంచనా. 80సీ కింద మినహాయింపు మొత్తం రూ.1.5 లక్షలను 2014 నుంచీ పెంచలేదు. ఈపీఎఫ్, పీపీఎఫ్, ఇంటి రుణాలు, జీవిత బీమా, ఈక్విటీ ఆధారిత సేవింగ్‌ పథకాల వంటివన్నీ దీని పరిధిలోకే వస్తాయి.

Union Budget 2024: Jagan Behind Koparthy Orvakal Node AP Allocations
ఇదేం సాయం?.. చంద్రబాబు అట్టర్ ఫ్లాప్‌

ఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి మరోసారి మొండిచేయి ఎదురైంది. ఎన్డీఏ కూటమిలో ప్రధాన మిత్రపక్షంగా ఉన్న చంద్రబాబు.. ప్రత్యేక హోదా అంశంలో కేంద్రాన్ని ఒప్పించడంలో విఫలమయ్యారు. అలాగే భారీగా నిధులు రాబట్టలేకపోయారు. సరికదా.. రాష్ట్ర అభివృద్ధి కోసం కనీసం స్పష్టమైన హామీ ప్రకటనలు కూడా చేయించులేకపోయారు. సుమారు పదేళ్ల తర్వాత తెరపైకి ఏపీ విభజన అంశం వచ్చింది. అయితే ప్రత్యేక హోదా అనే పదాన్ని ప్రస్తావించకుండానే ప్రత్యేక సాయం ప్రకటన చేసింది కేంద్రం. ఈ క్రమంలో విభజన చట్టానికి కేంద్రం కట్టుబడి ఉందని చెబుతూ.. ఏపీ రాజధాని నిర్మాణానికి రూ.15వేల కోట్ల సాయం అందిస్తామని, అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు ఇస్తామని.. అది వివిధ ఏజెన్సీల ద్వారా అప్పుల రూపేణా అని ఒక విడ్డూరమైన ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. అలాగే.. కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు అందించే సాయం మీదా ఆమె స్పష్టత ప్రకటన చేయలేదు. ఇక.. ప్రత్యేక ప్యాకేజీ అంశం తెర మీదకు తెచ్చిన కేంద్రం.. ఈసారి రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు అంటూ కొత్త రాగం అందుకుంది. అదే సమయంలో టీడీపీ తర్వాత కూటమిలో ప్రాధాన్యత ఉన్న బీహార్‌ మాత్రం భారీగా నిధులు సాధించుకుంది. మొత్తంగా కేంద్రంలో చక్రం తిప్పేలా ఏపీ ప్రజలు చంద్రబాబుకి మెజారిటీ ఇచ్చినప్పటికీ.. కేంద్రం కంటి తుడుపు ప్రకటన ద్వారా నిధులు రాబట్టడంలో అట్టర్‌ప్లాఫ్‌ అయ్యారు. మరోవైపు.. జగన్‌ చొరవతోనే.. కేంద్రం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పథకాలను ఆదర్శంగా తీసుకుందా? అనే చర్చ మొదలైంది. జగన్‌ మానసపుత్రికలైన డీబీటీ పథకాల ప్రస్తావనే అందుకు కారణం. ఉన్నత విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు రూ.10 లక్షల విద్యారుణాలు ఇస్తామని బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించింది. దేశీయంగా చదువుకునే లక్ష మందికి ఏటా రుణ సదుపాయం కల్పిస్తామని తెలిపింది. ఇక.. వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తి నోడ్‌.. విశాఖపట్నం, చెన్నై ఇండస్ట్రీయల్‌ కారిడార్‌, కర్నూల్‌ జిల్లా ఓర్వకల్లు నోడ్‌ హైదరాబాద్‌-బెంగళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్‌లకు బడ్జెట్‌ ద్వారా ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. ఈ కారిడార్‌ పనులు వైఎస్‌ జగన్‌ హయాంలోనే ఈ కారిడార్‌ పనులు మొదలైన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: జగన్‌ పాలనలో పారిశ్రామిక దూకుడు!

Union budget 2024 What will be come cheaper and costlier
Union budget 2024 : తగ్గేవి, పెరిగేవి ఇవే..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌ పేదలు, మహిళలు, యువత, రైతులపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని వెల్లడించారు. అయితే మహిళలు, బాలికల కోసం ప్రత్యేక పథకాలను, ఉద్యోగుల కోసం ఒక కొత్త పథకాన్ని ప్రకటించిన ఆర్థిక మంత్రి ప్రస్తుత పన్నుల విధానం, పన్ను మినహాయింపులను కూడా ప్రతిపాదించారు. మొబైల్ ఫోన్ ధరలు, బంగారం, వెండి , రాగి ధరలు తగ్గింపునకు దారితీసే చర్యలను ఆర్థిక మంత్రి ప్రకటించారు. మొబైల్ ఫోన్లు, మొబైల్ ఛార్జర్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 15 శాతానికి తగ్గించారు. బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీని 6 శాతానికి, ప్లాటినంపై 6.4 శాతానికి తగ్గించారు. మూడు కేన్సర్ చికిత్స మందులు ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుంచి మినహాయింపు నిచ్చారు. దీంతో కేన్సర్‌ బాధితులకు భారీ ఊరట లభించనుంది. బంగారం, వెండిపై సుంకాలు 6 శాతం తగ్గింపు రిటైల్ డిమాండ్‌ను గణనీయంగా పెంచు తుందన్నారు. ప్లాటినంపై కస్టమ్స్ డ్యూటీలను 6.5 శాతం తగ్గించాలని, రొయ్యలు, చేపల మేతతో కూడిన సీఫుడ్‌పై 5 శాతం తగ్గింపును ఆర్థికమంత్రి ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో ధరలు పెరిగేవి, తరిగేవి జాబితాను ఒకసారి చూద్దాం!ధరలు పెరిగేవి:ప్లాటినం వస్తువులుబంగారు కడ్డీలుకృత్రిమ ఆభరణాలుసిగరెట్వంటగది చిమ్నీలుకాంపౌండ్ రబ్బరుకాపర్ స్క్రాప్దిగుమతి చేసుకున్న టెలికాం పరికరాలుధరలు తగ్గేవి:కొన్ని రకాల కేన్సర్‌ మందులుమెడికల్ ఎక్స్-రే యంత్రాలుమొబైల్ ఫోన్లు, ఛార్జర్లుచేపలు, రొయ్యల మేతతోలు వస్తువులుపాదరక్షలువస్త్రాలుబంగారం, వెండి, ప్లాటినం తయారీ ఛార్జీలు

KSR Comments On YS Jagan Mohan Reddy's Responds To Stop TDP Violence
రంగంలోకి వైఎస్‌ జగన్‌.. ఇక బాబు అండ్‌ కోకు చుక్కలే!

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కసారి రోడ్డు మీదకు రావడం ఆరంభం అయితే ఎలా ఉంటుందో చూశారుగా. దెబ్బకు దెయ్యం దిగివచ్చినట్లు ప్రభుత్వంలో కూడా కాస్త చలనం వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించక తప్పలేదు. తెలుగుదేశంవారు హింసకు పాల్పడినా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన కోరారు. ఇన్నాళ్లు ఆయన ఏమి వ్యాఖ్యానించేవారు. వైఎస్సార్‌సీపీవారు దాడులు చేసినా ప్రతిదారులు చేయవద్దని చెప్పారే తప్ప టీడీపీవారు హింసాకాండకు దిగవద్దని ఒక్క మాట కూడా అనలేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ అసలు నోరే విప్పలేదు. హోం మంత్రి అనిత ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలపై, ఇతర నేరాలపై మాట్లాడుతూ తాను లాఠీ తీసుకుని వెళ్లాలా అని ప్రశ్నించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ రకంగా ఒక బాధ్యత లేకుండా సాగుతున్న పాలనకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెక్ పెట్టారని అనుకోవాలి.వినుకొండ వద్ద జరిగిన రషీద్ దారుణ హత్య తర్వాత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అతని కుటుంబాన్ని పరామర్శించడానికి స్వయంగా అక్కడకు వెళ్లడంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఒక నైతిక స్థైర్యాన్ని ఇచ్చింది. నెలనర్నరకు పైగా టీడీపీ కార్యకర్తలు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయినా, వందలాది మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తీవ్ర కష్టాలపాలవుతున్నా, పార్టీపరంగా గట్టిగా సమాధానం ఇవ్వడం లేదనే అభిప్రాయం ఉండేది. జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే రంగంలో దిగాలని పలువురు కోరుకునే వారు. కానీ జగన్‌మోహన్‌రెడ్డి తొందరపడకుండా ఉండాలని భావించినట్లు ఉన్నారు. అవసరమైనప్పుడు స్టేట్‌మెంట్‌లు ఇస్తూ వచ్చారు.ప్రభుత్వం వచ్చి నెల రోజుల కాకముందే జనంలోకి వెళితే భిన్నమైన సంకేతం వెళుతుందని అనుకుని ఉండవచ్చు. కానీ పరిస్థితి రోజు, రోజుకు దిగజారి, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పూర్తిగా భయాందోళనకు గురి అయ్యారు. 36 మంది హత్యలకు గురి అయ్యారు. వందల మందిపై హత్యాయత్నాలు జరిగాయి. వందల కొద్ది ఆస్తుల విధ్వంసాలు సాగాయి. రెండువేలమందికి పైగా ఇళ్ళు వదిలి వేరే ప్రాంతాలలో తలదాచుకోవలసి వచ్చింది. చివరికి మూడుసార్లు ఎంపీగా గెలిచిన మిథున్ రెడ్డిపై దాడి జరిగిన తీరు, మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటివద్ద కార్యకర్తలతో సమావేశం అయినప్పుడు టీడీపీ గూండాలు రాళ్లతో దాడి చేసిన వైనం దారుణంగా ఉన్నాయి. వారిద్దరి కార్లను ధ్వంసం చేయడం, రెడ్డప్ప వాహనాన్ని దగ్ధం చేయడం, అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, పైగా వీరిపైనే హత్యాయత్నం కేసు పెట్టడం శోచనీయంగా ఉంది.మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక ఆటవిక రోజులలో ఉన్నామా? అన్న అనుమానం వస్తుంది. దానికి తగ్గట్లుగా చంద్రబాబు, లోకేష్ వంటివారు హింసను ప్రోత్సహించే విధంగా వ్యాఖ్యానాలు చేశారు. దీంతో ఏపీలో వ్రజలకు రక్షణలేకుండా పోయింది. ప్రతిపక్షం లేకుండా చేయాలని గత టరమ్‌లో 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే, ఈసారి కార్యకర్తలను భయపెట్టి వైఎస్సార్‌సీపీని దెబ్బతీయాలన్న ఆలోచనగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ యువ నేత రషీద్ జరిగిన హత్య సమాచారం తెలిసిన వెంటనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెంగుళూరు నుంచి హుటాహుటిన తాడేపల్లి చేరుకుని మరుసటి రోజు వినుకొండకు వెళ్లారు. ఆ క్రమంలో ఆయనకు పలు ఆటంకాలు ఎదురయ్యాయి. పదిహేను చోట్ల ఏదో కారణం చెప్పి ఆయన కాన్వాయిని పోలీసులు నిలువరించే యత్నం చేశారట. ఆయన వెంట పార్టీ ఇతర నేతలు ఎవరూ రాకూడదని ఆంక్షలు పెట్టారట. చివరికి ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా పాతది, సరిగా పనిచేయనిది అని వైఎస్సార్‌సీపీ వర్గాలు చెప్పాయి. తత్పలితంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వేరొక వాహనం మారి ప్రయాణించవలసి వచ్చింది.సాధారణంగా తాడేపల్లి నుంచి వినుకొండకు గంటన్నరలో చేరుకోవచ్చు. కానీ వైఎస్సార్‌సీపీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయా చోట్ల గుమికూడి సాదరంగా స్వాగతం చెబుతుండడంతో కాన్వాయి బాగా ఆలస్యం అయింది. వినుకొండ జనసంద్రమే అయింది. వంద కిలోమీటర్ల దూరం కూడా లేని వినుకొండకు చేరుకోవడానికి ఏడుగంటలకుపైగా పట్టింది. దీనితో వైఎస్సార్‌సీపీలో ఒక విశ్వాసం ఏర్పడింది. కష్టకాలంలో తమకు పార్టీ అండదండగా ఉంటుందన్న ధీమా వచ్చింది. అధికార తెలుగుదేశం కూటమికి చెందినవారు చేసే దౌర్జన్యాలను ఎదుర్కోవడానికి వారు సిద్ధమవడానికి అవకాశం ఏర్పడింది.రషీద్ కుటుంబాన్ని ఓదార్చిన తర్వాత జగన్ మీడియాతో మాట్లాడి రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఎండగట్టారు. రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. నిజానికి కొత్త ప్రభుత్వం వచ్చిన నెలన్నరకే ఎవరూ ఈ డిమాండ్ చేయరు. కానీ 36 మంది హత్యలకు గురి కావడం, వందలమందిపై హత్యాయత్నం చేయడం, వందల ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయడం వంటి చర్యలకు తెలుగుదేశం పార్టీ నాయకులు, క్యాడర్ తెగబడడంలతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ డిమాండ్ చేశారు. చంద్రబాబుకు ఒక హెచ్చరిక పంపడానికి ఈ డిమాండ్ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. డిల్లీలో ధర్నా చేయాలని తలపెట్టారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోం మంత్రిలకు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ సంధర్భంలో ఒక కీలకమైన సంగతి ఏమిటంటే తమతో కలిసివచ్చే ఇతర రాజకీయ పక్షాలను కూడా ధర్నాకు ఆహ్వానించాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించడం.ఇంతకాలం వైఎస్సార్‌సీపీ ఒంటరియానం సాగించింది. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్‌డీఏకి సహకరించినా, అందులో భాగం కాలేదు. అలాగే కొన్ని వివాదాస్పద బిల్లుల విషయంలో ఎన్‌డీఏని వ్యతిరేకించినా కాంగ్రెస్ కూటమిలో భాగం కాలేదు. బీజేపీనేమో తమ సొంత రాజకీయం కోసం తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడంతో ఆ పార్టీతో సంబంధాలకు విఘాతం ఏర్పడింది. ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలలో ఏవైనా ఈ ధర్నాకు వస్తే విశేషమే అవుతుంది.అలాగే వైఎస్సార్‌సీపీని దగ్గర చేసుకుంటే ఉపయోగం ఉంటుందని భావించి కాంగ్రెస్ కూటమిలోని పార్టీలు ఏవైనా డిల్లీలో జరిగే దర్నాకు హాజరైతే ప్రధాన వార్తే అవుతుంది. ఈ రెండు కూటమిలలో లేని పార్టీలవారు ఎందరు వస్తారో చూడాలి. ఎవరు వచ్చినా, రాకపోయినా ఈ ధర్నా జాతీయ దృష్టిని ఆకర్షిస్తుంది. భవిష్యత్ రాజకీయ పరిణామాలకు ఒక సూచన అవుతుంది. ధర్నాలు, నిరసనలు ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు అనుసరించవలసిన ప్రక్రియలే. దీనివల్ల దేశ వ్యాప్తంగా ఏపీలో జరుగుతున్న హింసాకాండ గురించి ప్రజలకు, రాజకీయవర్గాలకు తెలుస్తుంది. ఎంత మిత్రపక్షమైనా బీజేపీ కూడా టీడీపీకి హెచ్చరికలు పంపించే అవకాశం ఉంటుంది.శాసనసభలో సైతం గవర్నర్ ప్రసంగ టైమ్‌లో కానీ, ఇతర సంధర్భాలలో కానీ ఈ అంశాన్ని లేవనెత్తుతామని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని ప్రజలలోకి ప్రభుత్వ పార్టీ హింసాకాండను ఎండగడితేనే టీడీపీలో కాస్త అయినా జంకు వస్తుంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రోడ్డుమీదకు రావడం వల్లే, ఆయనకు జనంలో ఉన్న విశేష ఆదరణ కనిపించడం వల్లే చంద్రబాబు సైతం కాస్త వెనక్కి తగ్గి మాట్లాడారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను ఎన్ని విమర్శించినా, రషీద్ హత్య గురించి ఆయన మాట్లాడక తప్పలేదు. శాంతిభద్రతల సమస్యపై వివరణ ఇవ్వక తప్పలేదు. ఎవరు శాంతి భద్రతల సమస్య సృష్టించినా చర్యలు తీసుకోవాలని పోలీసులను మాటవరసకైనా కోరక తప్పలేదు. అది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పవర్! గెలిచినా, ఓడినా.. సింహం, సింహమే!– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులుఇదీ చదవండి: అరాచక పాలనపై రేపు వైఎస్సార్‌సీపీ ధర్నా.. ఢిల్లీకి చేరుకున్న వైఎస్‌ జగన్‌

 Ashwin Opens Up On Kohli-Dravid Moment That Nearly Moved Him To Tears
'T20 వరల్డ్‌కప్‌లో అదే నా ఫేవరేట్‌ మూమెంట్‌.. నా కళ్లలో నీళ్లు తిరిగాయి'

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024 విజేత‌గా నిలిచి భార‌త్‌ త‌మ 13 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌దించిన సంగ‌తి తెలిసిందే. ఈ విజ‌యంతో స‌గర్వంగా భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, స్టార్ ప్లేయ‌ర్లు విరాట్ కోహ్లి, ర‌వీంద్ర జ‌డేజా అంత‌ర్జాతీయ టీ20ల‌కు విడ్కోలు ప‌లికారు. వీరిముగ్గురు మాత్ర‌మే కాకుండా రాహుల్ ద్రవిడ్ సైతం భార‌త హెడ్‌కోచ్‌గా త‌న ప్ర‌స్ధానాన్ని ముగించాడు. గ‌తేడాది వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఆఖరి మెట్టుపై బోల్తా పడిన టీమిండియాకు.. 7 నెలల తిరిగకముందే పొట్టి ప్రపంచకప్ రూపంలో ఐసీసీ టైటిల్‌ను ది గ్రేట్ వాల్ అందించాడు. విజయనంతరం భారత ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కొంతమంది ఆటగాళ్లు అయితే కన్నీటి పర్యంతమయ్యారు. ఈ భావోద్వేగ క్షణాలను యావత్తు ప్రపంచం వీక్షించింది. ఇక తాజాగా టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ టీ20 వరల్డ్‌కప్ విన్నింగ్ సెలబ్రేషన్స్‌లో తన ఫేవరేట్ మూమెంట్‌ను ఎంచుకున్నాడు. సెలబ్రేషన్స్ సమయంలో విరాట్ కోహ్లి ట్రోఫీని రాహుల్ ద్రవిడ్‌కు అందజేసినప్పుడు తన కళ్లలో నీళ్లు తిరిగినట్లు అశ్విన్ చెప్పుకొచ్చాడు."నిజంగా ఇది యావత్తు భారత్ గర్వించదగ్గ విజయం. మా 13 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. అయితే ఈ టోర్నీలో విజయం సాధించిన తర్వాత ఓ మూమెంట్ నా మనసును హత్తుకుంది. విరాట్ కోహ్లి.. రాహుల్ ద్రవిడ్‌కు పిలిచి ట్రోఫీని అందిండచడం నన్ను ఎంతగానే ఆకట్టుకుంది.ఇదే నా ఫేవరేట్ మూమెంట్‌. ద్రవిడ్ వెంటనే కప్‌ను అందుకుని గట్టిగా కేకలు వేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ క్షణం నా కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. ద్రవిడ్ నుంచి ఇటువంటి సెలబ్రేషన్స్ ఇప్పటివరకు నేను చూడలేదు. అయితే అందుకు ఓ కారణముంది.2007లో కరేబియన్ దీవుల వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ద్రవిడ్ సారథ్యంలోని భారత జట్టు గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది. ఆ తర్వాత ద్రవిడ్ తన కెప్టెన్సీ నుంచి వైదొలగాడు. అప్పటి నుంచి జట్టులో కేవలం ఆటగాడిగా కొనసాగాడు. కెప్టెన్సీ నుంచి తప్పకున్నప్పటకి ద్రవిడ్ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ఒకవేళ భారత జట్టు మ్యాచ్ ఓడిపోయినా అందరూ ద్రవిడ్‌నే టార్గెట్ చేసేవారు. అప్పుడు తను కెప్టెన్‌గా సాధించలేకపోయింది.. ఇప్పుడు కోచ్‌గా సాధించి చూపించాడని" తన యూట్యూబ్ ఛానల్‌లో అశ్విన్ పేర్కొన్నాడు.

AP High Court Hearing On Anticipatory Bail Petition Of YSRCP Leaders
వైఎస్సార్‌సీపీ నేతలపై అప్పటివరకు చర్యలొద్దు: ఏపీ హైకోర్టు

సాక్షి, విజయవాడ: తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి జోగి రమేష్, మాజీ ఎంపీ నందిగం సురేష్, వైఎస్సార్‌సీపీ నేత దేవినేని అవినాష్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది.సజ్జల రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డిలను కేసుల్లో ముద్దాయిలుగా లేరని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ ముద్దాయిలుగా చేర్చితే అరెస్ట్ చేసే అవకాశం ఉందని పిటిషనర్ తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. సజ్జల, ఆర్కేలను ముద్దాయిలుగా చేర్చితే నోటీసులు ఇవ్వాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నోటీసులు ఇచ్చిన 5 రోజులు వరకు అరెస్ట్ చేయవద్దని హై కోర్టు స్పష్టం చేసింది.ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాష్, నందిగాం సురేష్‌కు సంబంధించిన విచారణను ఆగస్టు 2వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. అప్పటివరకు చర్యలు ఏమీ తీసుకోవద్దని హైకోర్టు తెలిపింది. మాజీ మంత్రి జోగి రమేష్ పిటిషన్‌పై 14వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసిన హైకోర్టు.. అప్పటివరకు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

Telangana Assembly Budget Sessions Day 1 Updates
TG: ఈ నెల 31 వరకు అసెంబ్లీ సమావేశాలు, 25న బడ్జెట్

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర శాసనసభ మూడో విడత సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ అధ్యక్షతన సభ ప్రారంభమైన వెంటనే ఈ ఏడాది ఫిబ్రవరి 23న రోడ్డు ప్రమాదంలో మరణించిన దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత మరణం పట్ల సభ సంతాపం ప్రకటించింది. ఈ సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టారు. లాస్య నందిత మరణం పట్ల రెండు నిమిషాలు సభ మౌనం పాటించింది. అనంతరం సభ రేపటి వాయిదా పడింది. అనంతరం స్పీకర్‌ ఛాంబర్‌లో బీఏసీ సమావేశం నిర్వహించారు.ఈ నెల 31 వరకు అసెంబ్లీ సమావేశాలుబీఏసీ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు.. బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, బీఆర్‌ఎస్‌ నుంచి హరీష్‌రావు, సీపీఐ నుంచి కునంనేని హాజరయ్యారు. ఈ నెల 31వ తేది వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. మధ్యలో ఆదివారం 28వ తేదీన సెలవు ప్రకటించింది. 25వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 31వ తేదీన ద్రవ్యవినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలుపనుంది. బీఏసీ సమావేశానికి ప్రోటోకాల్ పాటించకపోవడంపై హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.కలలో కూడా ఊహించలేదు: కేటీఆర్‌లాస్య నందితకు సంతాపం తెలిపే పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదంటూ మాజీ మంత్రి కేటీఆర్‌ భావోద్వేగానికి గురైయ్యారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే దివంగత సాయన్న నిబద్ధతతో కలిసి పనిచేశారు. సాయన్న కోరినట్టు కవాడిగూడ నుంచి లాస్యను గెలిపించుకున్నము. సాయన్న మరణం నుంచి అప్పడప్పుడే కోలుకుంటున్న ఆ కుటుంబం మరోసారి విషాదకరమైన వార్త వినాల్సి వచ్చింది. సాయన్న కుమార్తె లాస్య నందిత కూడా యాక్సిండెంట్‌కు గురై మృతిచెందడం అత్యంత ఆవేదన కలిగించిన అంశ. ఏడాదిలోపే తండ్రి, కూతురు మరణించటమంటే ఆ వార్త వినటానికే ఎంతో ఆవేదనగా ఉంటుంది. అలాంటిది ఆ కుటుంబం. పరిస్థితిని ఎలా ఎదుర్కొందో తలచుకుంటేనే బాధగా ఉంది’’ అని కేటీఆర్‌ చెప్పారు.‘‘సాయన్న కుటుంబానికి అండగా ఉంటామని కేసీఆర్ ఇదే శాసనసభలో హామీ ఇచ్చారు. లాస్య నందిత చాలా చురుకైన అమ్మాయి సాయన్న సేవలు పార్టీ అండతో లాస్య గెలిచి అసెంబ్లీలోకి వచ్చింది. సాయన్న మాదిరిగానే ప్రజా సేవ చేయాలనుకున్న లాస్య నందితకు మంచి అవకాశం వచ్చింది. లాస్య కారు ప్రమాదానికి వారం ముందు కూడా నల్గొండ బహిరంగ సభలోనూ యాక్సిడెంట్ జరిగింది. తండ్రి మరణం, ఆ తర్వాత నల్గొండ సభలో జరిగిన యాక్సిడెంట్ ఇలా విధి పగబట్టింది. కానీ తన సంతాపం తెలిపే పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదు.ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ కుటుంబానికి పార్టీ పరంగా అన్ని విధాలుగా అండగా నిలవాలన్న కేసీఆర్ ఆదేశాల మేరకు ఆ కుటుంబానికి పార్టీ అండగా నిలిచింది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనూ మళ్లీ ఆ కుటుంబంలోనే సాయన్న మరో కూతురు నివేదితకు పార్టీ సీటును కేటాయించింది. అయితే దురదృష్టవశాత్తు తన ఓడిపోవటం జరిగింది. తండ్రి, కూతురును కోల్పోయిన ఆ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుంది’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.లాస్య మరణించడం బాధాకరం: సీఎం రేవంత్‌లాస్య మృతి బాధాకరమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సాయన్న అత్యంత సామాన్య కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగారు. ఎమ్మెల్యేగా ప్రజలకు ఎన్నో సేవలు చేసిన ఆయన ప్రజా జీవితంలోనే మరణించారు. సాయన్న వారసురాలిగా కుమారి లాస్య నందితను ప్రజలు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. కానీ ప్రమాదవశాత్తు లాస్య మరణించడం బాధాకరం. సాయన్న మృదుస్వభావి.. రాజకీయాలకు అతీతంగా అందరితో కలిసి ఉండేవారు.‘‘కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో కలపాలన్న సాయన్న కోరిక. దురదృష్టవశాత్తు అది నెరవేరే సమయానికి ఆయన మన మధ్య లేరు లాస్య బతికి ఉన్నా ఆయన సంతోషించి ఉండేవారు. కీలకమైన సమయంలో వారు మన మధ్య లేకపోవడం బాధాకరం. వారు మన మధ్య లేకపోయినా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. వారి ఆశయాలను, వారు చేయాలనుకున్న పనులను మా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నా’’ అని రేవంత్‌ చెప్పారు. కేసీఆర్‌కు కేటాయించిన ఛాంబర్‌పై కేటీఆర్‌ అసంతృప్తిఅసెంబ్లీలో ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు కేటాయించిన ఛాంబర్‌పై కేటీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు రూమ్‌లు కలిపి ఒకే రూమ్‌గా అసెంబ్లీ సిబ్బంది మార్పు చేశారు. రూం మధ్యలో వాష్ రూం పెట్టీ వాడుకోవడానికి అనుకూలంగా లేకుండా చేశారని కేటీఆర్‌ మండిపడ్డారు. ఈ అంశాన్ని బీఏసీలో లేవనెత్తాలని హరీష్‌రావుకు కేటీఆర్‌ సూచించారు. తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులతో అసెంబ్లీకి వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీసులు, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది.గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నివాళులుగన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్యేలు కోవా లక్ష్మీ, సునితా లక్ష్మారెడ్డి, అనిల్ జాదవ్, కాలేరు వెంకటేష్, పల్లా రాజేశ్వర్ రెడ్డి,పాడి కౌశిక్ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.అందుకే కేంద్రం నిధులు ఆపింది: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గన్‌ పార్క్‌ వద్ద ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీకి నిధులు 800 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకపోవడంతో ఉపాధి హామీలో పని చేసే వారు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడం వలన కేంద్రం నిధులు ఆపిందని సునీత లక్ష్మారెడ్డి అన్నారు.ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ సర్పంచ్‌ల పదవీకాలం ముగిసినా వారికి బిల్లులు రాలేదు. మన ఊరు మన బడి ద్వారా చేసిన పనులకు బిల్లులు ఆపారు. చిన్న కాంట్రాక్టర్లు, సర్పంచ్‌లు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామ పంచాయతీల పట్ల చిత్తశుద్ధి లేకుండా పోయింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అనే పరిస్థితి నెలకొంది. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం లోపించింది.

Dubbing Other For NTR Ram Charan Prabhas In Rajamouli Documentary
పాపం టాలీవుడ్ స్టార్ హీరోలు.. కలలో కూడా ఊహించి ఉండరు

కొన్నింటి గురించి మనం కలలో కూడా ఊహించం. అలాంటివి రియాలిటీలో జరిగినప్పుడు ఇదెక్కడి దరిద్రం బాబోయే అని మనలో మనమే తిట్టుకుంటాం. ఇప్పుడేం జరిగిందని అనుకుంటున్నారా! ప్రముఖ దర్శకుడు రాజమౌళి జీవితంపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తీసింది. 'మోడ్రన్ మాస్టర్స్' పేరిట ఆగస్టు 2 న దీన్ని రిలీజ్ చేయనుంది. తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: రెమ్యునరేషన్ తగ్గించుకున్న ప్రభాస్.. ఎందుకో తెలుసా?)ఇక్కడివరకు బాగానే ఉంది. సోమవారం ఉదయం రిలీజ్ చేసిన ట్రైలర్‌కి పర్లేదనిపించే రెస్పాన్స్ వచ్చింది. రాజమౌళి జీవితంలోని ఎవరికీ తెలియని విషయాల్ని ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, జేమ్స్ కామెరూన్ లాంటి సెలబ్రిటీలు షేర్ చేసుకోవడం బాగానే ఉంది. అయితే మెయిన్ ట్రైలర్ రిలీజ్ చేసిన కాసేపటి తర్వాత ప్రాంతీయ భాషల ట్రైలర్స్ కూడా రిలీజ్ చేశారు.తెలుగు ట్రైలర్ విషయానికొచ్చేసరికి ప్రధాన పాత్రధారి రాజమౌళి సహా డాక్యుమెంటరీలో కనిపించిన ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు వేరే వాళ్లు ఎవరో డబ్బింగ్ చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. దీనిపై విమర్శలు వస్తున్నాయి. ఇన్నికోట్లు ఖర్చు పెట్టి తీశారు. ఇంకాస్త ఎఫర్ట్ పెట్టి, తెలుగు వరకైనా సరే హీరోలతో డబ్బింగ్ చెప్పించి ఉంటే సరిపోయేది! పైపెచ్చు ఈ ట్రైలర్ చూస్తుంటే డిస్కవరీ ఛానెల్‌లోని డబ్బింగ్‌లా అనిపించింది.(ఇదీ చదవండి: 'ఆర్ఆర్ఆర్' రికార్డ్ కూడా బ్రేక్ చేసిన 'కల్కి')

Union Budget 2024 Hostels skilling among initiatives for women in workforce
కేంద్ర బడ్జెట్ 2024-25 : మహిళలు, బాలికలకు గుడ్‌ న్యూస్‌

కేంద్ర బడ్జెట్ 2024-25లో కేంద్ర మహిళలు, బాలికలకు ప్రయోజనం చేకూర్చేలా కొత్త పథకాలను ప్రకటించింది. మధ్యంతర బడ్జెట్‌లో మాదిరిగానే పేదలు, మహిళలు, యువత, రైతులపై కేంద్రం దృష్టి సారిస్తుందని అన్ని తెలిపిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ మహిళల కోసం ప్రత్యేకంగా, మహిళలు ,బాలికలకు ప్రయోజనం చేకూర్చే పథకాల కోసం సీతారామన్ రూ. 3 లక్షల కోట్లను కేటాయిస్తున్నట్టు మంగళవారం ప్రకటించారు. శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, శ్రామిక మహిళల కోసం వర్కింగ్‌ విమెన్‌ హాస్ట్సల్‌ను ఏర్పాటు చేయనుందని వెల్లడించారు.కేంద్ర బడ్జెట్ 2024ను సమర్పిస్తూ వర్క్‌ఫోర్స్‌లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లను ఏర్పాటు చేస్తుందని ఆర్థికమంత్రి తెలిపరారు పరిశ్రమల సహకారంతో వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లను ఏర్పాటు చేయడం , క్రెచ్‌ల స్థాపన ద్వారా వర్క్‌ఫోర్స్‌లో మహిళల అధిక భాగస్వామ్యాన్ని సులభతరం చేస్తామన్నారు. అలాగే మహిళలకు నిర్దిష్ట నైపుణ్య కార్యక్రమాలు,మహిళా ఎస్‌హెచ్‌జి సంస్థలకు మార్కెట్ యాక్సెస్‌ను ప్రోత్సహించడానికి ఇది ప్రయత్నిస్తుందని కూడా చెప్పారు.ఈ ఏడాది విద్య, ఉపాధి, నైపుణ్యాల కోసం రూ.1.48 లక్షల కోట్లు కేటాయించామన్నారు నిర్మలా సీతారామన్. 'ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్' కోసం మూడు పథకాలను కూడా ప్రకటించారు. ఉపాధి మరియు నైపుణ్యం కోసం ప్రధానమంత్రి ప్యాకేజీ తొలి స్కీమ్ ‘ఎ’ ‘ఫస్ట్ టైమర్స్’ కోసం, ‘తయారీ రంగంలో ఉద్యోగాల కల్పన’ కోసం స్కీమ్ ‘బి’ , యజమానులకు మద్దతిచ్చేందుకు స్కీమ్ ‘సి’ని కేంద్రం ప్రకటించింది. ఈ మూడు స్కీంల ద్వారా ఉద్యోగాలను కల్పించనున్నారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారి కోసం ఈపీఎఫ్‌వో పథకం, 20 లక్షల మంది యువత శిక్షణకు సరికొత్త కార్యక్రమం లాంటివి ఇందులో ఉన్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద మూడు కోట్ల అదనపు ఇళ్లు నిర్మించనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.

Telangana Minister Seethakka Fires On IAS Officer Smita Sabharwal
బుద్ధి వైకల్యం ప్రమాదకరం.. స్మితా సబర్వాల్‌పై మంత్రి సీతక్క ఆగ్రహం

హైదరాబాద్‌, సాక్షి: అంగవైకల్యం కంటే బుద్ధి వైకల్యం చాలా ‍ప్రమాదకరమని అంటున్నారు తెలంగాణ మంత్రి సీతక్క. ఐఏఎస్‌ అధికారిణి స్మితా సబర్వాల్‌ దివ్యాంగుల కోటా కామెంట్లపై నెలకొన్న వివాదంపై మీడియాతో చిట్‌చాట్‌ సందర్భంగా సీతక్క తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘అంగవైకల్యం కంటే బుద్ధి వైకల్యం ప్రమాదకరం. అంతా అవగాహన ఉందని మాట్లాడే వాళ్లు.. ఇతరుల అభిప్రాయలు గుర్తించకపోవడం కరెక్ట్‌ కాదు. అది వాళ్ల మానసిక వైకల్యం. ఐపీఎస్‌కు ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ అవసరం. పోలీసులకు కలెక్టర్లకు తేడా తెలియదా?.... ఒక అధికారిగా ఉండి ఆమె అలా మాట్లాడడం తప్పు. ఆమె అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఆమె వ్యాఖ్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా’’.. అని మంత్రి సీతక్క అన్నారు.సాక్షితో స్మితా సబర్వాల్‌ఇదిలా ఉంటే.. తన ఎక్స్‌ పోస్ట్‌ వివాదం కావడంతో ఆమె నిన్న దానికి వివరణ ఇచ్చారు. ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని, తాను తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని అన్నారామె. ఆపై వివాదం మరింత ముదిరింది. ఆమెపై ఇటు తెలంగాణలో, అటు ఏపీలోనూ పీఎస్‌లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. తాజాగా ఆమె సాక్షి టీవీ తో ఫోన్ లైన్‌లోనూ మాట్లాడారు. ‘‘నేను ఎవరినో కించపరచడానికో లేదంటే కాంట్రవర్సీ కోసమో ఆ వ్యాఖ్యలు చెయ్యలేదు. యూపీఎస్సీలో సంస్కరణలు తీసుకురావడానికి కేంద్రం నుంచి సీనియర్, ఫీల్డ్ వర్క్ చేసిన అధికారుల అభిప్రాయం తీసుకుంటుంది. రిజర్వేషన్ల అంశంలో నేను నా అభిప్రాయాన్ని మాత్రమే తెలియజేశాను.. అని అంటున్నారామె.

Advertisement
Advertisement
Advertisement
NRI View all
title
TCSS ఆధ్వర్యంలో ఘనంగా సింగపూర్ బోనాల జాతర

‘తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)’ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండగ వేడుకలు ఆదివారం (21 జూలై 2024) మధ్యాహ్నం అత్యంత వై

title
కమలా దేవి హారిస్‌ గెలవాలని తమిళనాడులో పూజలు

చెన్నై:  అమెరికా అధ్యక్ష  ఎన్నికల రేసు నుంచి ప్రస్

title
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెనాలి హారిక మృతి

వాషింగ్టన్‌: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన వెటర్నరీ డాక్

title
అమెరికాలో దారుణం.. భారత సంతతి నవ వరుడు హత్య

వాషింగ్టన్‌: ఇటీవల కాలంలో అమెరికాలో భారత సంతతి వ్యక్తులపై వర

title
అమెరికాలో తెనాలి యువకుడి దుర్మరణం

ఆస్టిన్‌: ప్రమాదవశాత్తూ మరో భారతీయుడు అమెరికాలో ప్రాణాలు పొగొట్టుకున్నాడు.

International View all
title
కమలా దేవి హారిస్‌ గెలవాలని తమిళనాడులో పూజలు

చెన్నై:  అమెరికా అధ్యక్ష  ఎన్నికల రేసు నుంచి ప్రస్

title
Canada: హిందూ ఆలయంపై భారత వ్యతిరేక నినాదాలు

కెనడాలో మరోమారు హిందూ దేవాలయంపై దాడి జరిగింది.

title
కమలా హారిస్‌కు మద్దతుగా ట్రంప్‌ విరాళం!.. జోరుగా సెటైర్లు

అమెరికా అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్‌ తప్పుకోవడం, డెమోక్రటిక్‌ అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ప

title
UAE: బంగ్లాదేశీయుల నిరసనలు.. 53 మందికి జైలుశిక్ష

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌(యూఏఈ)లో బంగ్లాదేశ్‌ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఆం

title
Nepal: చారిత్రక ఆధారాలతో సరిహద్దు సమస్యకు పరిష్కారం: పీఎం ఓలి

నేపాల్‌ నూతన ప్రధానిగా ఎన్నికైన కేపీ శర్మ ఓలి భారత్‌తో సరిహద్దు సమస్య పరిష్

Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all