రైల్వే స్టేషన్‌లో పాటలు పాడుతూ దీన స్థితిలో కాలం వెళ్లదీసిన రణు మండల్ ఒక్కసారిగా ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన సంగతి తెలిసిందే. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ పాడిన ఏక్ ప్యార్ కా నగ్మా హై పాటను ఆలపించి తన గాన మాధుర్యంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులన్ని చేసింది. దీంతో ఆమెకు బాలీవుడ్ నుంచి వరుస అవకాశాలు వచ్చిపడుతున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేశ్ రేష్మియా తన సినిమాలో పాట పాడే అవకాశాన్ని కల్పించాడు. తేరీ మేరీ కహానీ.. అంటూ తొలి పాటను ఆలపించగా అది బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక తను వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అసరం లేకుండా పోయింది. పలు ఆఫర్లు ఆమె ఇంటి ముందు క్యూ కడుతున్నాయి. మరోవైపు తన టాలెంట్ చూసి అబ్బురపడిపోయిన హీరో సల్మాన్‌ఖాన్ కళ్లు చెదిరే గిఫ్ట్ ఇచ్చాడని జోరుగా ప్రచారం సాగుతోంది.
తాజాగా హిమేశ్ రేష్మియా ఆమెతో మరో పాట పాడించాడు. ఈ పాటకు ఆదాత్ అని టైటిల్ కూడా ఇచ్చేశారు. ఇందులో రణు ఆలపిస్తుండగా హిమేశ్ వాయిస్‌ఓవర్‌తో పాట కొనసాగుతుంటుంది. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆమె గంధర్వ గాత్రానికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కాగా తను ఒక్కసారిగా క్లిక్ అవటం వెనుక అతీంద్ర చక్రవర్తి అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కారణమని చెప్పవచ్చు. అతను రైల్వేస్టేషన్‌లో రణు పాటను వీడియో తీసి ఆమెకు ప్రత్యేక గుర్తింపుకు తెచ్చిపెట్టాడు. అక్కడితో వదిలేయకుండా ఆమె పాడే పాటలన్నింటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రణు మండల్ ఎదుగుదలకి బాటలు వేశాడు. అతని సహాయం, అంతకు మించిన ఆమె టాలెంట్.. వెరసి ఒక సామాన్యురాలిని సెలబ్రిటీగా నిలబెట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment