కోల్‌కత : రణాఘాట్ రైల్వేస్టేషన్‌లో పాటపాడిన రణు మొండాల్ సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యారు. దిగ్గజ గాయకురాలు లతా మంగేష్కర్ పాటల్ని పాడుతూ ఆమె అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ఇక ఆమె గాత్రానికి ముగ్ధుడైన బాలీవుడ్ నటుడు, సంగీత దర్శకుడు హిమేష్ రేష్మియా తన తదుపరి చిత్రం ‘హ్యాపీ హార్డీ అండ్ హీర్’లో ఆమెకు పాట పాడే అవకాశం ఇచ్చాడు. ఇదిలాఉండగా.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ రణు మొండాల్‌కు ఏకంగా రూ.55 లక్షల విలువైన ఇంటిని కానుకగా ఇచ్చాడని వార్తలు వచ్చాయి.
(ఇంటర్‌నెట్ సెన్సేషన్‌కు సల్మాన్ భారీ గిఫ్ట్!)
అయితే, సల్మాన్ గిఫ్ట్ ఇచ్చాడనే వార్తలు అవాస్తవమని రణు మొండాల్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసిన విక్కీ బిశ్వాస్ వెల్లడించారు. ఇదంతా సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారం మాత్రమేనని అన్నారు. సల్మాన్ ఎలాంటి బహుమతులు, సినిమాలో పాట పాడే అవకాశమిస్తున్నట్టు చెప్పలేదని పేర్కొన్నారు. అయితే, రేష్మియా పాటపాడే అవకాశం ఇవ్వడం, దానికి రెమ్యునరేషన్ ఇవ్వడం మాత్రం నిజమేనన్నారు. ఇక సెన్సేషన్ సింగర్ రణు మొండాల్‌ను ‘రణాఘాట్ లత’అని నెటిజన్లు పిలుచుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment