హిమేష్ రేష్మియా, ఆండీ సింగ్ (ఇన్ సెట్లో)
ముంబై: బాలీవుడ్ గాయకుడు, హీరో హిమేష్ రేష్మియా మ్యూజిక్ కంపెనీ సీఈవో ఆండీ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఒషివారా ప్రాంతంలోని తన నివాసంలో ఫ్యాన్ కు ఉరేసుకుని అతడు ప్రాణాలు తీసుకున్నాడు. తన తల్లి చీరతో అతడు ఉరేసుకున్నాడు. ఆండీ సింగ్ ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో అతడి తల్లి, ప్రియురాలు ఇంట్లోనే మరో గదిలో ఉన్నారు.
ఆదివారం తెల్లవారుజామున అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని, సూసైడ్ నోట్ ఏమీ కనబడలేదని పోలీసులు తెలిపారు. ఆండీ సింగ్ గదిలో కుర్చీ పడిపోయిన శబ్దం రావడంతో అతడి తల్లి, ప్రియురాలు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి చూసేసరికే అతడు చనిపోయాడు. అతడి ఆత్మహత్యకు కారణాలు వెల్లడికాలేదు. ఆరేళ్లుగా హిమేష్ రేష్మియా మ్యూజిక్ కంపెనీలో ఆండీ సింగ్ పనిచేస్తున్నాడు.