బాలీవుడ్ సింగర్, నటుడు హిమేశ్ రష్మియా భార్య సోనియా కపూర్‌తో ఫొటోలు దిగడానికి నానా తంటాలు పడ్డారు. అదేంటి? భార్యతో ఫొటో దిగడానికి ఇబ్బందేంటి అంటారా? అక్కడికే వస్తున్నాం. భార్యతో కలిసి ఎయిర్‌పోర్టుకు వచ్చిన హిమేశ్‌ను చూసిన మీడియా ఆ జంటను కెమెరాల్లో బంధించింది. క్లిక్ క్లిక్‌మంటూ ఫొటోలు తీసింది. దీంతో సదరు జంట కూడా కెమెరామన్లకు బాగానే సహకరిస్తూ స్టిల్స్ ఇచ్చింది. అయితే భార్య కంటే పొట్టిగా ఉన్న హిమేశ్ ఇద్దరూ సమానంగా కనిపించడానికి కాలి వేళ్లపైన నిలబడుతూ ఫొటోలు దిగాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
'ఓ మై గాడ్, అతడు కాళ్లు పైకి లేపుతున్నాడు చూడండి..', 'ఎందుకంత ఫీల్ అవుతున్నావ్? భార్య పక్కన అలా నిల్చున్నావేంటి?', 'భర్త కంటే భార్య పొడుగ్గా ఉంటే ఈ తిప్పలు తప్పవు మరి!', 'జో జోనస్ కంటే సోఫీ, టామ్ హాలండ్ కంటే జెండయా పొడువుగా ఉంటారు. అందులో తప్పేముంది?', 'హిమేశ్ అభద్రతాభావానికి లోనవుతున్నాడంటూ కామెంట్లు చేయడం నిజంగా బాధాకరం. ఆడవాళ్ల కంటే వారిని పెళ్లాడే మగవాళ్లే ఎక్కువ హైట్‌తో ఉండాలని కోరుకుంటున్న ఈ సమాజం సిగ్గుపడాలి' అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
When your wife/Partner is Taller than you. 😂🤣👍🏽https://t.co/1Qr4Yd3Gzx pic.twitter.com/n4KFYmI709
— Raman (@Dhuandhaar) March 11, 2022
చదవండి: రోబో బ్యూటీతో బ్రేకప్ తర్వాత నాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది
Comments
Please login to add a commentAdd a comment