బాలీవుడ్ నటి కరిష్మా తన్నా వ్యాపారవేత్త వరుణ్ బంగేరాను ఫిబ్రవరి 5న వివాహమాడింది. ముంబైలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబాలు సహా అత్యంత దగ్గరి బంధువులు, ప్రముఖ సెలబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు. గ్రాండ్ దుస్తుల్లో పెళ్లి జరుపుకున్న వారి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే శనివారం సాయంత్రం వారి రిసెప్షన్ జరిగింది. ఈ పార్టీలో కరిష్మా పుష్ప సినిమాలోని ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా.. సాంగ్ హిందీ వర్షన్‌కు స్టెప్పులేసింది. ఈ నవ వధువు చేసిన డ్యాన్స్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
సీరియల్ నటిగా కెరీర్ ఆరంభించిన కరీష్మా తర్వాత సినిమాల్లోనూ ఎంట్రీ ఇచ్చింది. 'దోస్తీ: ఫ్రెండ్స్ ఫరెవర్', 'గ్రాండ్ మస్తీ', 'సంజు' వంటి చిత్రాల్లో నటించింది. ఖత్రోన్ కే ఖిలాడీ 10వ సీజన్ విన్నర్‌గానూ నిలిచింది. బిగ్‌బాస్ 8లోనూ పాల్గొన్న ఈ బ్యూటీకి ఆ సమయంలో ఉపెన్ పటేల్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. వీరి నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ ఆ తర్వాత తమ రిలేషన్‌కు బ్రేకప్ చెప్పుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment