Watch: Alia Bhatt Spotted Runs With Luggage Trolley At Airport In Viral Video - Sakshi
Sakshi News home page

Alia Bhatt Airport Video: ఎయిర్‌పోర్ట్‌లో పరుగెత్తుతూ కనిపించిన ఆలియా..

Published Wed, May 4 2022 12:10 PM | Last Updated on Wed, May 4 2022 12:58 PM

Alia Bhatt Runs With Luggage Trolley At Airport In Viral Video - Sakshi

Alia Bhatt Spotted Run At Airport: బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వైరల్‌ వీడియోలో ఆలియా తన లగేజ్‌తో ఎయిర్‌పోర్టులో పరుగెత్తుతూ కనిపించింది. దీంతో ఇది చూసి అంతా షాక్‌ అవుతున్నారు. పెళ్లి అనంతరం ఆమె ఇలా కనిపించడంతో తన ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది షూటింగ్‌లో భాగంగా జరిగినట్లు తెలుస్తోంది. ఆమె తాజా చిత్రం ‘రాఖీ జౌర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’ సినిమా షూటింగ్‌ ఇటీవల ఇందీరా గాంధీ ఎయిర్‌పోర్టులో జరిగింది.

చదవండి: విశ్వక్‌ సేన్‌ అసలు హీరోనే కాదు: ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఫైర్‌

ఈ నేపథ్యంలో ఆలియా తన లగేజ్‌ ట్రాలీని తోసుకుంటూ పరుగెత్తుతుండగా.. మూవీ క్రూడ్‌ కెమెరాలతో ఆమె ముందు పరుగెత్తారు. అక్కడే ఉన్న కొంతమంది స్థానికులు ఈ సన్నివేశాన్ని తమ కెమెరాల్లో బంధించి సోషల్‌ మీడియాల్లో షేర్‌ చేస్తున్నారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరో వీడియోలో ఆలియాతో పాటు ప్రముఖ డైరెక్టర్‌ కరణ్‌ జోహార్‌ కూడా కనిపించాడు. కాగా కరణ్‌ జోహార్‌ చాలా కాలం తర్వాత డైరెక్ట్‌ చేస్తున్న సినిమా ఇది. రణ్‌వీర్‌ సింగ్‌, ఆలియా భట్‌లు హీరోహీరోయిన్లుగా చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది 2023 ఫిబ్రవరి 10న విడుదల చేయబోతున్నట్టు ఇటీవల చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.

చదవండి: హిందీ భాష వివాదంపై సుహాసిని స్పందన, ట్రోల్స్‌ చేస్తున్న నెటిజన్లు

ధర్మ ప్రొడక్షన్స్‌, వయోకామ్‌ 18 సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా గత నెల ఏప్రిల్‌ 14న రణ్‌బీర్‌, అలియా వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. పెళ్లైనా వెంటనే ఆలియా-రణ్‌బీర్‌లు తమ షూటింగ్‌లతో బిజీ అయిపోయారు. ఆలియా రాఖీ జౌర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీతో షూటింగ్‌లో పాల్గొనగా, రణ్‌బీర్‌ సందీప్‌ వంగ దర్శకత్వంతో రాబోయే ఎనిమల్‌ మూవీ షూటింగ్‌ను ప్రారంభించాడు. ఇటీవల మనాలిలో ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకుని తిరిగి ముంబై వచ్చాడు రణ్‌బీర్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement