Ranvir Singh
-
అత్యంత విలువైన సెలబ్రిటీగా విరాట్ కోహ్లి.. రణ్వీర్, షారుఖ్‌లకు వెనక్కు నెట్టి..!
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి భారత దేశపు అత్యంత విలువైన సెలబ్రిటీల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. సెలబ్రిటి బ్రాండ్ వాల్యుయేషన్ నివేదిక (KROLL) ప్రకారం కోహ్లి బ్రాండ్ వాల్యూ 2023 సంవత్సరంలో రూ. 1901 కోట్లకు చేరింది. 2022తో పోలిస్తే గతేడాది కోహ్లి ఓవరాల్ బ్రాండ్ వాల్యూ 29 శాతం మేర పెరిగింది. 2022లో రెండో స్థానంలో నిలిచిన కోహ్లి.. గతేడాది బాలీవుడ్ స్టార్లు రణ్వీర్ సింగ్ (రూ. 1693 కోట్లు), షారుఖ్ ఖాన్‌లను (రూ. 1001 కోట్లు) అధిగమించి భారత దేశంలో అత్యంత విలువైన సెలబ్రిటీగా అవతరించాడు. కోహ్లి 2017 నుంచి వరుసగా (మధ్యలో 2022లో రెండో స్థానం) ఆరు సార్లు భారత దేశంలో అత్యంత విలువైన సెలబ్రిటీల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.క్రికెట్‌కు సంబంధించి భారత దేశంలో అత్యంత విలువైన సెలబ్రిటీల జాబితాలో కోహ్లి తర్వాతి స్థానంలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఉన్నారు.ప్రస్తుతం టీ20 వరల్డ్‌కప్ 2024తో బిజీగా ఉన్న కోహ్లి గతేడాది వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలువడంతో పాటు ఆ ఏడాదంతా పలు బ్యాటింగ్ రికార్డులు కొల్లగొట్టాడు. 35 ఏళ్ల కోహ్లి ఈ ఏడాది ఐపీఎల్‌లోనూ అదరగొట్టాడు. ఈ పరుగుల యంత్రం 2024 ఐపీఎల్ సీజన్లో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. కోహ్లి 2023 ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకోవడంతో పాటు ఐసీసీ పురుషుల వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికయ్యాడు.ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో విరాట్ ఆశించిన మేర రాణించనప్పటికీ టీమిండియా సూపర్-8కు చేరింది. సూపర్-8లో భారత్.. ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌లతో తలపడనుంది. -
సందీప్ వంగాకు ఒకలా భన్సాలీకి మరోలా ఇదేనా బాలీవుడ్ నీతి
-
IND VS WI 1st Test: బాలీవుడ్ సినిమాలో ప్రస్తుత వెస్టిండీస్ క్రికెటర్.. ఎవరంటే..?
ప్రస్తుతం భారత్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న విండీస్ క్రికెట్ జట్టులోని ఓ సభ్యుడు ఓ ప్రముఖ బాలీవుడ్ సినిమాలో నటించాడన్న విషయం మనలో చాలామందికి తెలీకపోవచ్చు. 1983లో లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ నేతృత్వంలో భారత్ వరల్డ్‌కప్ సాధించిన ఇతివృత్తం ఆధారంగా రూపొందించబడిన 83 సినిమాలో విండీస్ లెజండరీ క్రికెటర్ శివ్‌నరైన్ చంద్రపాల్ తనయుడు, ప్రస్తుత విండీస్ ఓపెనర్ తేజ్‌నరైన్ చంద్రపాల్ అతిధిపాత్రలో నటించాడు. ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్రలో రణ్వీర్ సింగ్, అతని భార్య పాత్రలో దీపికా పదుకోన్ నటించారు. కబీర్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఆ సినిమాలో తేజ్‌నరైన్ అప్పటి విండీస్ ప్లేయర్ లారీ గోమ్స్ పాత్రలో నటించాడు. లండన్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు రణ్వీర్, దీపికాలతో తేజ్‌నరైన్ తీసుకున్న ఓ సెల్ఫీ ప్రస్తుతం నెటింట్ట వైరలవుతుంది. I think he’s the first actor with a professional movie experience to play test cricket for Windies 😂😂 Tagenarine played Larry Gomes in 83. https://t.co/jiV1esjaj8 pic.twitter.com/6nQiBKIX5T — Gaurav Nandan Tripathi 🜃 (@Cric_Beyond_Ent) November 30, 2022 ఇదిలా ఉంటే, ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా పైచేయి సాధించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్.. 162 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ సేన 2 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. యశస్వి జైస్వాల్ (143), విరాట్ కోహ్లి (36) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 150 పరుగులకే ఆలౌటైంది. అశ్విన్ (5/60), జడేజా (3/26) విండీస్ పతనాన్ని శాసించారు. విండీస్ ఇన్నింగ్స్‌లో అలిక్ అథనాజే (47) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తేజ్‌నరైన్ చంద్రపాల్ 12 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. -
కోహ్లి పరిస్థితి ఇంతలా దిగజారుతుందని ఊహించలేదు.. రణ్వీర్ సింగ్ ఆవేదన
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రదర్శన రోజురోజుకు తీసికట్టుగా మారుతుందన్నది బహిరంగ రహస్యం. ఈ పరుగుల యంత్రం అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ సాధించి దాదాపు మూడు సంవత్సరాలు గడుస్తుండటం ఇందుకో నిదర్శనం. అంతర్జాతీయ కెరీర్‌తో పోలిస్తే ఐపీఎల్లో కోహ్లి మెరుపులు అడపాదడపా కనిపించేవి. ఇప్పుడవి కూడా దాదాపుగా కనుమరుగయ్యాయి. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అయితే కోహ్లి ప్రదర్శన పాతాళానికి పడిపోయింది. View this post on Instagram A post shared by ESPNcricinfo (@espncricinfo) సన్‌రైజర్స్‌తో నిన్న (మే 8) జరిగిన మ్యాచ్‌లో తొలి బంతికే డకౌటైన కోహ్లి ఈ సీజన్లో ఇలా (గోల్డన్ డకౌట్) మూడు సార్లు ఔటయ్యాడు. ఇది అతనితోపాటు అతని అభిమానులను తీవ్రంగా కలచి వేస్తుంది. కోహ్లి తన ఐపీఎల్ కెరీర్ మొత్తంలో ఆరు సార్లు గోల్డన్ డకౌట్ కాగా, ప్రస్తుత సీజన్లోనే మూడు సార్లు ఆ అప్రతిష్టను మూటగట్టుకోవడాన్ని అతని హార్డ్ కోర్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. కోహ్లి ఫామ్ ఇంతలా దిగజారుతున్నప్పటికీ అభిమానులు అతనికి అండగా నిలుస్తుండటం విశేషం. ఫామ్ విషయంలో కోహ్లి ఇంత కంటే హీన స్థితికి దిగజారినప్పటికీ తాము అండగా ఉంటామంటూ వారు సోషల్‌మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కోహ్లి తన కెరీర్లో ఎదుర్కొంటున్న హీన దశపై బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ సైతం స్పందించాడు. కోహ్లి ఇలా తొలి బంతికే ఔటవ్వడం చూస్తుంటే బాధగా ఉందని, కోహ్లి పరిస్థితి ఇంతలా దిగజారుతుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే, ఈ వైఫల్యాలు కోహ్లిని ఏమీ చేయలేవని, అతను తిరిగి తప్పక పుంజుకుంటాడని ధీమా వ్యక్తం చేశాడు. కోహ్లి ఎప్పటికీ గొప్ప క్రికెటరేనని, అతని స్థాయి ఎప్పటికీ పడిపోదని, రన్ మెషీన్ త్వరగా ఈ చెడు దశ నుంచి బయటపడాలని కోరుకుంటున్నానని ఆకాంక్షించాడు. త్వరలో జరగుబోయే టీ20 ప్రపంచకప్‌లో కోహ్లి దెబ్బ తిన్న పులిలా విరుచుకుపడటం ఖాయమని విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. ఐపీఎల్లో కూడా కోహ్లి త్వరలోనే ఫామ్‌లోకి వస్తాడని, అంతేకాకుండా తన జట్టును ఛాంపియన్‌గా నిలబెడతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. చదవండి: IPL 2022: డెవాన్ కాన్వేను దిగ్గజ ఆటగాడితో పోలుస్తున్న నెటిజన్లు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వైరల్: ఎయిర్‌పోర్ట్‌లో పరుగెత్తుతూ కనిపించిన ఆలియా..
Alia Bhatt Spotted Run At Airport: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వైరల్ వీడియోలో ఆలియా తన లగేజ్‌తో ఎయిర్‌పోర్టులో పరుగెత్తుతూ కనిపించింది. దీంతో ఇది చూసి అంతా షాక్ అవుతున్నారు. పెళ్లి అనంతరం ఆమె ఇలా కనిపించడంతో తన ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది షూటింగ్లో భాగంగా జరిగినట్లు తెలుస్తోంది. ఆమె తాజా చిత్రం ‘రాఖీ జౌర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ సినిమా షూటింగ్ ఇటీవల ఇందీరా గాంధీ ఎయిర్‌పోర్టులో జరిగింది. చదవండి: విశ్వక్ సేన్ అసలు హీరోనే కాదు: ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ ఈ నేపథ్యంలో ఆలియా తన లగేజ్ ట్రాలీని తోసుకుంటూ పరుగెత్తుతుండగా.. మూవీ క్రూడ్ కెమెరాలతో ఆమె ముందు పరుగెత్తారు. అక్కడే ఉన్న కొంతమంది స్థానికులు ఈ సన్నివేశాన్ని తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాల్లో షేర్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరో వీడియోలో ఆలియాతో పాటు ప్రముఖ డైరెక్టర్ కరణ్ జోహార్ కూడా కనిపించాడు. కాగా కరణ్ జోహార్ చాలా కాలం తర్వాత డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. రణ్వీర్ సింగ్, ఆలియా భట్లు హీరోహీరోయిన్లుగా చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది 2023 ఫిబ్రవరి 10న విడుదల చేయబోతున్నట్టు ఇటీవల చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: హిందీ భాష వివాదంపై సుహాసిని స్పందన, ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు ధర్మ ప్రొడక్షన్స్, వయోకామ్ 18 సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా గత నెల ఏప్రిల్ 14న రణ్‌బీర్, అలియా వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. పెళ్లైనా వెంటనే ఆలియా-రణ్‌బీర్‌లు తమ షూటింగ్‌లతో బిజీ అయిపోయారు. ఆలియా రాఖీ జౌర్ రాణీ కీ ప్రేమ్ కహానీతో షూటింగ్లో పాల్గొనగా, రణ్‌బీర్ సందీప్ వంగ దర్శకత్వంతో రాబోయే ఎనిమల్ మూవీ షూటింగ్‌ను ప్రారంభించాడు. ఇటీవల మనాలిలో ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకుని తిరిగి ముంబై వచ్చాడు రణ్‌బీర్. Alia Bhatt spotted at IGI Airport while shooting for a film 🎥 @aliaa08 pic.twitter.com/SFk29ZX3Ox — Team Alia Bhatt (@TeamOfAliaBhatt) May 1, 2022 -
ఆ చూపులకు అర్థం నాకు తెలుసు: రణ్వీర్
భార్య ఏం చేసినా భర్తకు ముద్దుగానే కనిపిస్తుంది. ఈ పదం ప్రస్తుతం బాలీవుడ్లో రొమాంటిక్ కపుల్‌గా పేరు పొందిన రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్‌కు చక్కగా సరిపోతుంది. వీరిద్దరూ తమకు చెందిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఆక్టీవ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. అదే విధంగా ఒకరు పోస్ట్ చేసిన ఫోటోలపై మరోకరు కామెంట్లు చేస్తూ తన అభిమానులను అలరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే దీపికా ఓ అంతర్జాతీయ పత్రికకు ఇచ్చిన ఫోటోషూట్‌లో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇక ఈ ఫోటోపై భర్త రణ్వీర్ స్పందించారు. ‘ఆ చూపులకు అర్థం నాకు తెలుసు. ఇప్పటికైనా ఇంటికి వస్తారా’ అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు. అయితే రణ్వీర్ ఇలా కామెంట్ పెట్టడానికి కారణం ఇందులో దీపికా కెమెరావైపు కాస్తా కోపంగా ఉన్నట్లు ఫోజ్ ఇయడమే. అంతేగాక ఇలా దీపికా ఫోటోలపై స్పందించడం రణ్‌వీర్‌కు కొత్తేమీ కాదు. ఇంతకు ముందు కూడా దీపికా పెట్టిన అనేక పోస్ట్‌లకు సరదాగా కామెంట్ పెడుతూ వచ్చాడు. కాగా పెళ్లికి ముందు మూడు సినిమాలలో కలిసి నటించిన దీప్‌వీర్ వివాహానంతరం కబీర్‌ఖాన్ దర్శకత్వంలో రూపోందుతున్న ‘83’ సినిమాలో భార్యభర్తలుగా తెరమీద కనిపించనున్నారు. 1983లో భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ విజయం సాధించడం వెనక కృషి చేసిన లెంజడరీ క్రికెటర్ కపిల్‌దేవ్ జీవితం ఆధారంగా ఈ సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. . View this post on Instagram @harpersbazaarus Photographer: @david_roemer Fashion Editor/Stylist: @carrielauren Hair: @earlsimms2 Makeup: @naokoscintu Nails: @robbietomkins Author: @whatisnojan A post shared by Deepika Padukone (@deepikapadukone) on Oct 16, 2019 at 12:12am PDT -
తండ్రీ కూతుళ్లుగా...
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ ఫస్ట్ సినిమా రిలీజ్ కాకముందే వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నారు. ఫస్ట్ సినిమా ‘కేధార్నాద్’ చిత్రం షూటింగ్ కంప్లీట్ అవ్వగానే డైరెక్ట్‌గా ‘టెంపర్’ హిందీ రీమేక్ ‘సింబా’లో జాయిన్ అయ్యారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ హీరో. ఈ సినిమా తర్వాత తండ్రి సైఫ్ అలీఖాన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారట సారా అలీఖాన్. నితిన్ కక్కర్ తెరకెక్కించనున్న ఫ్యామిలీ డ్రామాలో సైఫ్, సారా ఆన్‌స్క్రీన్ కూడా తండ్రీ కూతుళ్ల పాత్రల్లోనే యాక్ట్ చేయనున్నారు. ఈ సినిమా కథ తండ్రీ కూతుళ్ల రిలేషన్షిప్ మీద ఎక్కువగా ఉండబోతోందని సమాచారం. -
వాచ్ వచ్చె
అందరికీ బర్త్‌డేకి అడ్వాన్స్ విషెస్ లభిస్తాయి. కానీ బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్‌కి అడ్వాన్స్ బర్త్‌డే గిఫ్ట్స్ లభిస్తున్నాయి. రణ్వీర్ బర్త్ డే ఈనెల 6న. వారం ముందే ఓ మంచి వాచ్ గిఫ్ట్‌గా బçహూకరించారట దర్శకుడు రోహిత్ శెట్టి. తెలుగు హిట్ మూవీ ‘టెంపర్’ హిందీ రీమేక్ ‘సింబా’లో రణ్వీర్ సింగ్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ షూటింగ్లో రణ్‌వీర్‌కు రోహిత్ శెట్టి వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారట. ‘‘బాస్ (రోహిత్ శెట్టి) ఓ వారం ముందే బర్త్‌డే ప్రజెంట్ ఇచ్చేశారు. ఇప్పటివరకు నేను చూసినవాటిలో ఇదే సూపర్ వాచ్. థ్యాంక్యూ సార్’’ అంటూ ఈ విషయాన్ని ట్వీటర్లో తెలిపారు రణ్వీర్ సింగ్. ‘సింబా’ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 28న రిలీజ్ కానుంది. -
నో మోర్ డౌట్స్
నో డౌట్స్. ‘పద్మావత్’ సినిమా గురించి ఇక నో మోర్ డౌట్స్. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకోన్, రణ్‌వీర్‌సింగ్, షాహిద్‌కపూర్ ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘పద్మావత్’. ఈ సినిమాను ఈ నెల 25న రిలీజ్ చేయనున్నారు. ‘‘ఈ నెల 25న 3డీ, ఐ–మ్యాక్స్ 3డీ వెర్షన్లతో పాటుగా తమిళ, తెలుగు భాషల్లో ‘పద్మావత్’ సినిమాను రిలీజ్ చేయబోతున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇదే రోజున అక్షయ్‌కుమార్ నటించిన ‘ప్యాడ్‌మ్యాన్’ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. -
పద్మావత్ ఎఫెక్ట్ ఎవరిపై?
పద్మావతి... కాదు.. కాదు.. ఇప్పుడు ‘పద్మావత్’. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ నటించిన చిత్రం ‘పద్మావత్’. సెన్సార్ కంప్లీట్ అయిన ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రజెంట్ బాలీవుడ్లో హాట్ టాపిక్. ఈ నెల 25 లేదా 26న రిలీజ్ అవుతుందని కొందరు, ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతుందని మరికొందరి వాదన. ఒకవేళ ‘పద్మావత్’ ఈ నెల 25 లేదా 26న అని చిత్రబృందం రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తే.. ఆల్రెడీ ఈ డేట్స్‌ను బుక్ చేసుకున్న ‘ప్యాడ్‌మ్యాన్’, ‘అయ్యారీ’ వాయిదా పడతాయా? అనే చర్చ జరుగుతోంది. ఆర్. బాల్కీ దర్శకత్వంలో అక్షయ్‌కుమార్, రాధికా ఆప్టే, సోనమ్‌కపూర్ నటించిన చిత్రం ‘ప్యాడ్‌మ్యాన్’. నీరజ్ పాండే దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అయ్యారీ’. ఒకవేళ ‘పద్మావత్’ని 25 లేక 26న కాకుండా వార్తల్లో ఉన్నట్లు ఫిబ్రవరి 9న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తే ఆల్రెడీ అదే తేదీన రిలీజ్ కానున్న అనుష్కా శర్మ ‘పరీ’ రిలీజ్ డేట్ భవితవ్యం ఏంటి? అనే చర్చ కూడా జరుగుతోంది. ‘ప్యాడ్‌మ్యాన్’, ‘అయ్యారీ’, ‘పరీ’.. ఈ మూడు చిత్రాల విడుదల విషయంలో క్లారిటీ రావాలంటే ‘పద్మావత్’ బృందం అధికారికంగా రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేయాల్సిందే. ఇంతకు ముందు ‘పద్మావత్’ సినిమాను గతేడాది డిసెంబర్ 1న రిలీజ్ చేయాలనుకున్నప్పుడు ‘102 నాటౌట్, తుమ్హారీ సులు, తేరా ఇంతిజార్, ఫిరంగీ, ఫక్రీ రిటర్న్స్’ చిత్రాల రిలీజ్ డేట్స్ విషయంలో మార్పులు జరిగాయి. మరి.. ఈసారి ‘పద్మావత్’ ఎఫెక్ట్ ఏయే సినిమాల మీద పడుతుందో చూడాలి. -
మస్తానీ
నా దారి ఇది కాదు.. దీపికా పదుకొనె తండ్రి ప్రకాశ్ పదుకొనె పెద్ద బ్యాడ్మింటన్ ప్లేయర్. దీపికా కూడా తనదీ అదే దారి అయి ఉంటుంది అనుకుంది. చదువుకునే రోజుల్లో బ్యాడ్మింటన్, చదువు తప్ప ఇంకేదీ తన ప్రపంచం కాదనుకుంది. నేషనల్ చాంపియన్ కూడా అయింది. కానీ దీపికా పదుకొనె దారి వేరు. ఆ విషయం 18వ ఏట అర్థం చేసుకుందామె. మోడలింగ్ ఎంచుకుంది. ఆ తర్వాత 2006లో సినిమాల్లోకి వచ్చేసింది.పీకూ, మస్తానీ, వెరోనికా, శాంతిప్రియ, తార..ఈ పేర్లలో ఏది గుర్తొచ్చినా ఒక స్టార్ గుర్తొస్తుంది.అది ఆ పాత్రల గొప్పదనమే కావొచ్చు. ఆ పాత్రల్లో కనిపించిన నటి గొప్పదనం కూడా కావొచ్చు.దీపికా పదుకొనె.. అలాంటి గొప్ప పాత్రలకు మరింత గౌరవం తెచ్చిన స్టార్..ఆ స్టార్ గురించిన విశేషాలు కొన్ని.. డిప్రెషన్లో.. 2014లో దీపికా తీవ్రమైన డిప్రెషన్‌కు వెళ్లిపోయింది. మామూలుగా ఇలాంటి విషయాలు చెప్పుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడరు. కానీ దీపికా అన్నీ చెప్పుకుంది. లేవగానే విచిత్రంగా ఉండేదని, ఏ పని చేసినా ఏదో లాగుతున్నట్లు ఉండేదని, నిద్ర పట్టకపోయేదని, ఉన్నట్టుండి ఏడ్చేసేదాన్ననీ.. అన్నీ.. అన్నీ చెప్పుకుంది. జనాల్లో కలిసిపోవడం, మనుషులతో మాట్లాడటం అవసరమని చెప్తుంది దీపికా. అది తాను ప్రపంచానికిచ్చే సందేశం అంటారామె! బాయ్‌ఫ్రెండ్స్.. దీపికా పదుకొనె బాయ్‌ఫ్రెండ్స్ లిస్ట్ పెద్దదే! ఈ విషయాన్ని ఆమె డైరెక్ట్‌గానే చెప్పేస్తుంది. రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమ వ్యవహారం గురించి, ‘‘అదేంటో మా ఇద్దరి మధ్య రిలేషన్షిప్ వర్కవుట్ అవ్వదనుకున్నాం. విడిపోయాం.’’ అంటుంది. ఇప్పుడు రణ్వీర్ సింగ్‌తో దీపికా పీకల్లోతు ప్రేమలో ఉంది.ఈ ఇద్దరికీ బాలీవుడ్లో ‘హాట్ కపుల్’ అన్న పేరుంది. పారిపోదామనుకొని.. దీపికా బాలీవుడ్లో అడుగుపెట్టడమే బ్లాక్‌బస్టర్. కాకపోతే ఆ సినిమా తర్వాత అన్నీ ఫ్లాపులే! ఎలాంటి ఫ్లాపులంటే ఒక దశలో ఇండస్ట్రీని వదిలిపెట్టి పారిపోదామనుకుంది. కానీ ధైర్యంగా నిలబడింది. 2012లో ‘కాక్టెయిల్’ సినిమాతో దీపికా పదుకొనె సక్సెస్ఫుల్ కెరీర్ మళ్లీ కొత్తగా మొదలైంది. ఈ ఐదేళ్లలో హాలీవుడ్ సినిమా (ట్రిపుల్ ఎక్స్)లో నటించే స్థాయికి చేరుకుందామె. నో అంటే నో.. దీపికా ఆడవాళ్ల కోసం పోరాడుతుంది. వారిని సమాజం ఇలా చూస్తుందంటూ గట్టిగా వాదించి చెబుతుంది. ఒకసారి ఏదో పేపర్లో ‘దీపికా క్లీవేజ్ షో’ అన్న కామెంట్ వస్తే, వారికి దిమ్మతిరిగే సమాధానమే ఇచ్చింది. ‘ఆడవాళ్లకు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. ఒకమ్మాయి నో అందంటే అది నో.. సెక్స్ విషయమైనా.. ఇంకేదైనా..’ ఇది దీపికా ఎప్పుడూ గట్టిగా చెప్పే ఓ మాట. -
కపిల్‌దేవ్ ఎవరు?
కపిల్ దేవ్ ఎవరు? ఇప్పుడు బాలీవుడ్లో జరుగుతోన్న చర్చ ఇది. ఏంటీ? స్టార్ క్రికెటర్ కపిల్ దేవ్ గురించి తెలియదా? అనుకుంటున్నారా? అస లు విషయం ఏంటంటే కపిల్ దేవ్ జీవితం ఆధారంగా ఓ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. కబీర్ ఖాన్ దర్శకత్వంలో అనురాగ్ కశ్యప్ ఈ బయోపిక్‌ను నిర్మించనున్నారు. ఇందులో కపిల్ పూర్తి జీవిత విశేషాలతో పాటు 1983లో కపిల్ ఇండియా క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నప్పుడు ప్రపంచ కప్ సాధించడంలో కీలకపాత్ర వహించిన ఘట్టాన్ని తెరపై ఆవిష్కరించనున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా కపిల్ పాత్రలో ఎవరు కనిపిస్తారన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. నిన్న మొన్నటి వరకూ అర్జున్‌కపూర్, సల్మాన్‌ఖాన్, రణ్వీర్ సింగ్‌తో పాటు మరికొందరి పేర్లు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు సీనియర్ హీరో సల్మాన్‌ని వద్దనుకుంటున్నారట. అర్జున్ కపూర్, రణ్వీర్ సింగ్ రేసులో ఉన్నారట. మరి ఈ ఇద్దరిలో కపిల్‌దేవ్ ఎవరు? అనేది వేచి చూడాల్సిందే. ఏదేమైనా ఈ మధ్య బాలీవుడ్లో బయోపిక్‌లు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా క్రికెట్ ప్లేయర్స్‌లో ఇప్పటికే ధోని, సచిన్ టెండూల్కర్ల జీవితాల ఆధారంగా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు కపిల్ దేవ్. భవిష్యత్తులో ఎంతమంది క్రికెట్ ప్లేయర్ల జీవితాలు తెరపైకి వస్తాయో చూడాలి. -
ఇప్పట్లో ఒకడున్నాడు
♦ రణ్వీర్ సింగ్ ‘బావి తవ్వకుండా నీళ్లు వస్తాయా?’ ‘రావు’ ‘కష్టపడకుండా ఫలితం మాత్రం ఎలా వస్తుంది?’ ‘రబ్బిష్. ఇండస్ట్రీలో పైకి రావాలంటే సపోర్టు కావాలి’ ‘చిరంజీవి ఎవరి సపోర్ట్‌తో మెగాస్టార్ అయ్యాడు!’ ‘పాత ఎగ్జాంపుల్. కొత్తది చెప్పు’ ‘రణ్వీర్ సింగ్... బాలీవుడ్ సూపర్‌స్టార్’ ‘...’‘టాలీవుడ్, బాలీవుడ్ ఏదైనా ఒకటే. నీ దగ్గర టాలెంట్ ఉంటే స్టార్ అవుతావు. కష్టపడే గుణం ఉంటే సూపర్ స్టార్ అవుతావు’ ‘అంతేనా?’ ‘బాక్సాఫీస్ మీద ఒట్టు’. నిన్ను నువ్వు నిరూపించుకోవాలంటే నీ దగ్గర ఒకటి ఉండాలి. ఏంటది? నీపై నీకు ఆత్మవిశ్వాసమే! కొందరు దుంపలు తవ్వుతారు. కొందరు పిందెలు వెతుకుతారు. కొందరు ఉడతలు, ఊరపిచుకలు అయినా తిని బతుకుదాం అనుకుంటారు. కాని కొందరు మాత్రం ఇవన్నీ కళ్ల ముందు ఉన్నా వదిలిపెట్టి కేవలం ఏనుగు కుంభస్థలం మాత్రమే కొడతారు. రణ్వీర్ సింగ్... రెండో టైపు. ‘బ్యాండ్ బాజా బారాత్’... కొత్త కుర్రాడు చేసిన మొదటి సినిమా. హిట్. ‘లేడీస్ వెర్సస్ రికీ భల్’. కొత్త కుర్రాడు చేసిన రెండో సినిమా యావరేజ్. ‘లుటేరా’. కొత్త కుర్రాడు చేసిన మూడో సినిమా. ఫ్లాప్. చాలు... అయిపోయినట్టే. వచ్చాడు. చేశాడు. పోబోతూ ఉన్నాడు. నిజానికి రణ్వీర్ సింగ్ కథ ఇంతటితో ముగియాల్సిందే. కాని పట్టుదల ఉన్నవాడికి కష్టాన్ని నమ్ముకున్నవాడికి కాలం కరవాలం చేతికి అందిస్తూనే ఉంటుంది. అందరూ రజనీకాంత్ ‘బాషా’ సినిమాను చెప్పుకుంటారు. దాన్ని చూసి పదహారు సినిమాలు తీస్తారు. కాని దానికి మూలం ఒకటి ఉంది– ‘హమ్’ (1991). అమితాబ్ బచ్చన్, రజనీ కాంత్, గోవిందా నటించిన ఆ సినిమా ‘జుమ్మా చుమ్మా దేదే...’ వంటి పాటలతో గొప్ప కథతో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అందులో అమితాబ్ మాజీ డాన్. తన పాత జీవితాన్ని పూర్తిగా మర్చిపోయి, ఒక సాదాసీదా మనిషిగా తన ఇద్దరు తమ్ముళ్లతో బతుకుతూ ఉంటాడు. కాని సెకండ్‌హాఫ్‌లో విలన్ డిస్ట్రబ్ చేసే సరికి తిరిగి నరసింహావతారం ఎత్తు తాడు. అందులో ఒక సీన్ ఉంది. అమితాబ్ తమ్ముడైన గోవిందాకు కాలేజీలో సీట్ రాదు. అప్పుడు అమితాబ్ ఆ కాలేజీకి వెళ్లి ‘అయ్యా! నా పేరు ఫలానా... కాని నాకు ఇంకో పేరు ఉంది’ అని చెప్పేసరికి కాలేజీ యజమాని హడలిపోయి సీటు ఇచ్చేస్తాడు. ఈ సీన్‌ను కాలక్షేపంగా దర్శకుడు ముకుల్ ఎస్. ఆనంద్ రజనీ కాంత్‌తో చర్చించాడు. ఆ సీన్ రజనీ కాంత్‌కు చాలా నచ్చింది. కాని సినిమాలో ఆ సీన్ లేదు. అసలు ఈ సీన్‌ను తీయలేదు కూడా! ఈ సీన్ నుంచి ఒక సినిమా తీయొచ్చు అని రజనీ కాంత్ ఆ తర్వాత ‘బాషా’ (1995) తీసి తన కెరీర్లోనే పెద్ద హిట్ సాధించాడు. ‘హమ్’ నుంచి ‘బాషా’ పుట్టింది నిజమే. ‘హమ్’ నుంచే రణ్వీర్ సింగ్ కూడా పుట్టాడు. ఇదీ నిజమే. ‘హమ్’ వచ్చిన నాటికి రణ్వీర్ సింగ్ వయసు ఆరేడేళ్లు. అతడి నానమ్మ అమితాబ్ బచ్చన్‌కి ఇఎన్‌టి ఫ్యాన్. అంటే చెవి, ముక్కు, గొంతు కూడా కోసుకునేంత ఫ్యాన్ అన్నమాట. వీడియో క్యాసెట్ల జమానాలో చీటికి మాటికి అమితాబ్ సినిమాలు వేసుకొని చూస్తూ ఉండేది. మనవడికి అర్థమైనా కాకపోయినా చూపించి డాన్సులు చేయించేది. ‘జుమ్మా చుమ్మా దేదే’... రణ్వీర్ రక్తంలోకి మొదట సినిమాను ఎక్కించిన పాట. ‘అరే కన్నా! నువ్వు పెద్దయ్యి సినిమా స్టార్‌వి కావాలిరా’ అనేది నానమ్మ. ఆ సంగతి తనకు తెలియదు. తనకు తెలిసిందల్లా చిన్నప్పటి నుంచి అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకోవడమే. ఎందుకో ఇష్టం. ఆ అద్దంలో ముఖాలు మార్చి చూసుకునేవాడు. అల్లరి చేసి చూసుకునేవాడు. తల అటూ ఇటూ దువ్వి చూసుకునేవాడు. వెర్రి మొర్రి వేషాలు వేసేవాడు.ఒక యాక్టర్ కావాలనుకునేవాడికి కావలసిన మొదటి అర్హత అదే. అద్దంతో మోహం! రణ్వీర్ సింగ్ తండ్రి జగ్జీత్ సింగ్ ఒక మోస్తరు ఆటోమొబైల్ వ్యాపారి. కొడుకును బాగా చదివించగలిగే స్తోమత ఉన్నవాడే తప్ప అనిశ్చితి నిండిన సినిమా రంగంలో ప్రయత్నిస్తానంటే భరించేంత శక్తి ఉన్నవాడు కాదు. కాని ఏమిటి చేయడం? ఒక కూతురు. ఒక కొడుకు. కూతురికి ఇలాంటి ఆకాంక్షలు పెద్దగా లేనప్పుడు ఉన్నవాణ్ణే ఎంకరేజ్ చేయాలని అనుకున్నాడు. రణ్వీర్ సింగ్‌ను అమెరికా వెళ్లి చదువుకొని రమ్మంటే అతడక్కడ యాక్టింగ్ క్లాసులు చేసొచ్చి, 2007లో ఉత్త చేతులతో నిలబడ్డాడు. ఒకరు పైకి రావాలంటే కుటుంబమే అండగా నిలవాలని అంటారు. రణ్‌వీర్‌కు కుటుంబం అండగా నిలబడింది. పెద్ద ఇంటి నుంచి చిన్న ఇంటికి పెద్ద కారు నుంచి చిన్న కారుకి మారింది. ఒక దశలో పోర్ట్‌ఫోలియో తయారు చేసుకోవడానికి కూడా రణ్వీర్ దగ్గర డబ్బులు లేవు. అయినా సరే అప్పో సప్పో చేసి దానిని తయారు చేసుకున్నాడు. ప్రతి స్టూడియో తిరిగాడు. ప్రతి కాస్టింగ్ ఇన్చార్జ్నీ బతిమాలి భంగపడ్డాడు. ఎవరో ఉండి... ‘ఈ విదేశీ చదువు పనికి రాదు యాక్టింగ్ స్కూల్లో చేరు’ అనంటే – ‘తల్లి చనిపోతే ఎలా ఏడ్వాలో’ నేర్పించే దిగువ శ్రేణి యాక్టింగ్ స్కూల్లో చేరి ఆ పాఠాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత వేరెవరో ఉండి.. ‘థియేటర్ చెయ్. ఆ అనుభవం మంచిది’ అన్నప్పుడు ప్రఖ్యాత పృథ్వి థియేటర్లో ఉదయం 8 నుంచి రాత్రి 11 దాకా నాటకాల మధ్య గడిపాడు. ఒక పని నాకు అన్నివిధాలా వచ్చి తీరాలి అని సంకల్పించుకున్నవాడు అది వచ్చే వరకూ ఏ పనినీ తక్కువ పని అనుకోడు. నటులకు ఛాయ్‌లు మోయడం, స్టేజ్ మీద బ్యానర్లు కట్టడం, సెట్లో అట్టలకు మేకులు కొట్టడం... ఇలా అన్ని పనులూ చేశాడు.అన్నింటి లక్ష్యం ఒక్కటే – తను హీరో కావాలి! దానికి తన దగ్గర ఉన్న ఒక అర్హత – గొడ్డుచాకిరీ!! చిన్న చిన్నగా వేషాలు రావడం మొదలయ్యాయి. కాని అవేవీ రణ్వీర్ తీసుకోలేదు. అలా చేయడం నిజంగా సాహసమే. పెద్ద అవకాశం కోసం ఎదురుచూస్తూ కూచుంటే ఈ అవకాశాలు కూడా పోతాయి. అయినా సరే. కొడితే పెద్ద దెబ్బ కొట్టాలి అని వెయిట్ చేస్తున్నాడు. ఈ లోపు ఒక కాస్టింగ్ డైరెక్టర్ ఒకరోజు తన ఇంటికి పిలిచి ‘మరేంటి సంగతి’ అని మోకాలి మీద నిమరడం మొదలుపెట్టాడు. ఇలాంటి మనుషులు ఇలా‘గే’ బిహేవ్ చేస్తారని తెలుసుకొని, అక్కడి నుంచి తెలివిగా బయటపడ్డాడు. మొత్తానికి ఒకరోజు అదృష్టం భళ్లున తెరుచుకుంది. అవకాశం తలుపు తట్టింది. అలాంటి ఇలాంటి అవకాశం కాదు– యశ్‌రాజ్ ఫిల్మ్స్ అవకాశం. నేరుగా ఆదిత్యా చోప్రా నుంచే పిలుపు. ‘రబ్ నే బనాదీ జోడీ’లో నటించిన అనుష్క శర్మ పక్కన కొత్త కుర్రాణ్ణి పెట్టి ‘బ్యాండ్ బాజా బారాత్’ తీయాలని ఆ సంస్థ అనుకుంటోంది. పెద్ద సంస్థ మొదటిసారి చిన్న సినిమాల్లోకి దిగుతోంది. దానికి హీరో కావాలి. రణ్వీర్ సింగ్ వెళ్లి ఆడిషన్ ఇచ్చాడు. సెలెక్ట్ అయ్యాడు. అయితే ఆ తర్వాత హఠాత్తుగా కన్ఫ్యూజ్ అయిపోయాడు. ‘ఇంత పెద్ద సంస్థ నుంచి నన్ను సెలెక్ట్ చేశారు. సరిగ్గా చేయగలనా లేదా’ అనే ఆందోళనలో చిన్న చిన్న టెస్ట్ సీన్లు కూడా తప్పు తప్పుగా చేస్తున్నాడు. ఇతన్ని నమ్ముకుని సినిమా మొదలెట్టొచ్చా అనే డౌట్ వరకూ తీసుకెళ్లాడు. చూడండి... సమస్యలు ఎలా వస్తాయో! దీన్ని ఆదిత్యా చోప్రా గమనించాడు. ఒకరోజు పిలిచి ‘చూడూ! నువ్వు ఆడిషన్లో బాగా చేశావ్. ఆ తర్వాత చేయలేకపోతున్నావు. నీకు లాస్ట్ చాన్స్ ఇస్తున్నాను. రేపు కెమెరా టెస్ట్ పెడతాను. వరల్డ్ కప్‌లో పెనాల్టీ గోల్ లాంటి చాన్స్ ఇది. బాగా చేశావా ఉంటావ్. లేదంటే... అంతే’ అన్నాడు. దైవం రణ్వీర్ పక్షాన ఉంది. ఆ టెస్ట్ పాసయ్యాడు. ‘బ్యాండ్ బాజా బారాత్’ కూడా ప్రేక్షకుల టెస్ట్ పాసయ్యింది. హిందీ సినిమాల్లో ఒక తారక పుట్టింది. ఆ తారక పేరు రణ్వీర్ అని అందరూ తెలుసుకున్నారు. ‘బ్యాండ్ బాజా బారాత్’, ‘లేడీస్ వర్సస్ విక్కి భల్’, ‘లుటేరా’... ఈ మూడు సినిమాల తర్వాత ముఖ్యంగా ‘లుటేరా’ తర్వాత రణ్వీర్ సింగ్ మీటర్ కిందకు దిగాల్సింది. కాని ఆ సమయంలోనే అతడి కెరీర్ సంజయ్ లీలా బన్సాలీ చేతిలో పడింది. ఈ కొత్త కుర్రాణ్ణి ముందు నుంచీ గమనిస్తూ వస్తున్న బన్సాలీ వెంటనే అతణ్ణి, దీపికా పదుకొనె పక్కన తను తీయబోతున్న ‘రామ్‌లీలా’లో బుక్ చేసుకున్నాడు. ఇది పెద్ద మలుపు. ఆ సినిమా షారుఖ్ నటించిన ‘దిల్ వాలే’తో పాటుగా విడుదలైంది. రణ్వీర్ ఊపుకు అంత పెద్ద హీరో కూడా కొంచెం తొట్రు పడాల్సి వచ్చింది. ‘రామ్‌లీలా’ కలెక్షన్లు కాసులు కురిపించడంతో పాటు రణ్‌వీర్‌కు అవకాశాలు కూడా కురిపించాయి. ‘గూండే’, ‘కిల్ దిల్’, ‘దిల్ ధడక్నే దో’ – ఈ సినిమాలన్నీ రణ్వీర్ను నిలబెట్టాయి. ముఖ్యంగా ‘దిల్ ధడక్నే దో’లో దివాలా తీయడానికి సిద్ధంగా ఉన్న శ్రీమంతుడు (అనిల్ కపూర్)కి చేతగాని కొడుకుగా రణ్వీర్ చాలా ప్రతిభావంతమైన నటన ప్రదర్శించాడు. మొత్తానికి అన్నీ సెట్ అయ్యాయి. ఇక కావలసిందల్లా ఒక బ్లాక్ బస్టరే.ఆ పుణ్యం కూడా బన్సాలీయే చేసిపెట్టాడు. సినిమా– ‘బాజీరావ్ మస్తానీ’. ‘బాజీరావ్ మస్తానీ’ తర్వాత రణ్వీర్ సింగ్ మరో 20 ఏళ్లు... కనీసం పదేళ్లు ఎటువంటి ఒడుదొడుకులు వచ్చినా నటుడుగా కొనసాగే స్థిరత్వాన్ని బాలీవుడ్లో పొందాడు. ఎవరిని చూస్తే తన జన్మ ధన్యం అనుకుంటూ వచ్చాడో... అలాంటి పెద్ద పెద్ద స్టార్ల పక్కన తను అవార్డ్ ఫంక్షన్స్‌లో పాల్గొంటున్నాడు. యాడ్స్ చేస్తున్నాడు. పెద్ద పెద్ద పార్టీల్లో ఆడపిల్లలకు భారీ ఆకర్షణగా నిలుస్తున్నాడు. తాజాగా బన్సాలీ తీస్తున్న ‘పద్మావతి’ సినిమాలో ‘అల్లావుద్దీన్ ఖిల్జీ’ పాత్రను పోషించే అదృష్టవంతుడయ్యాడు.అదృష్టాన్ని హార్డ్‌వర్క్ ఫాలో కాకపోవచ్చు. కాని హార్డ్‌వర్క్‌ను అదృష్టం ఫాలో అయ్యే తీరాలి. సినిమా పెద్దల ఆశీస్సులు, డబ్బు, గాడ్ఫాదర్లు ఇవేవీ లేకపోయినా ఒక సాదాసీదా కుర్రాడు తనను తాను నమ్ముకుని పైకి రాగలడు అనడానికి ఇటీవలి ఒక ఉదాహరణ – ఇప్పట్లోనూ ఒకడున్నాడు అని చెప్పడానికి నిలిచిన తార్కాణం రణ్వీర్. సో... కలలు కనండి. నిజం చేసుకోండి. డీలా పడినప్పుడల్లా సెల్‌ఫోన్ స్క్రీన్ మీద ఇతడి ఫోటోను లాక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్! – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
మేం హీరోలం కాదు!
రణ్వీర్ సింగ్.. షాహిద్ కపూర్.. హిందీలో ఈ యంగ్ హీరోలిద్దరికీ మంచి పేరు, ఫాలోయింగ్ ఉన్నాయి. కానీ, మేము హీరోలు కాదంటున్నారు షాహిద్. హీరోలు కాకపోతే ఎవరంటారా? ముఖ్య తారలు మాత్రమేనట. చారిత్రక కథతో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తీయనున్న ‘పద్మావతి’ సినిమాలో దీపికా పదుకొనే టైటిల్ రోల్లో.. పద్మావతి భర్తగా షాహిద్, విలన్‌గా రణ్వీర్ నటించనున్నారు. ఎవరి పాత్రకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారనే విషయంలో ఈ హీరోలిద్దరూ దర్శకుడిపై అలిగారని వచ్చిన వార్తలను షాహిద్ ఖండించారు. ‘‘ఇది ఇద్దరు హీరోల కథ కాదు, మూడు పాత్రల చుట్టూ నడిచే సినిమా. అందుకే ఈ సినిమాకి సంబంధించినంత వరకూ నేను, రణ్వీర్ హీరోలం కాదు. ఐదేళ్ల క్రితమే నా దగ్గరకు ఈ కథ వస్తే బాగుండేది. భన్సాలీ సినిమాలో నటించడం నా అదృష్టం’’ అని షాహిద్ చెప్పారు. -
వీళ్లు చాలా హాట్!
బాలీవుడ్లో దీపికా పదుకొనే ఏ హీరో సరసన నాయికగా బాగుంటారు? అనే ప్రశ్న వేస్తే.. షారుఖ్‌ఖాన్, రణబీర్ కపూర్, రణ్వీర్ సింగ్ లాంటి హీరోల పేర్లను చెప్చొచ్చు. వీళ్లతో దీపిక కెమిస్ట్రీ బాగుంటుంది. హాలీవుడ్లో మాత్రం దీపికాకు బెస్ట్ జోడీ విన్ డీజిల్ అని సోషల్ మీడియా కోడై కూస్తోంది. తొలిసారిగా దీపికా పదుకొనే నటిస్తున్న హాలీవుడ్ చిత్రం ‘ఏజెంట్ త్రిబులెక్స్: రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్’. ‘ఏజెంట్ త్రిబులెక్స్’ అనే హాలీవుడ్ సిరీస్‌లో మూడో సినిమాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో హీరో ఏజెంట్ త్రిబులెక్స్ పాత్రధారి విన్ డీజిల్ ప్రేయసిగా సెరీనా పాత్రలో దీపిక చేస్తున్నారు. ఇప్పటి వరకూ విడుదలైన ఈ చిత్రం స్టిల్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. సోమవారం విడుదలైన కొత్త స్టిల్‌లో దీపిక, విన్ డీజిల్‌ని చూసి ‘వీళ్లు హాట్ గురూ’ అనకుండా ఉండలేకపోతున్నారు. -
ఆ సినిమా చూసి... మా నాన్న మారారు!
‘‘ఆమిర్ ఖాన్ ఆదర్శంగా తీసుకోదగ్గ వ్యక్తి. నటుడిగా, వ్యక్తిగా ఆయన సూపర్. ప్రస్తుతం చేస్తున్న ‘దంగల్’ కోసం ఆయన మారిన విధానం చూస్తోంటే ఆశ్చర్యం వేస్తోంది’’ అని హీరో రణ్వీర్ సింగ్ అన్నారు. ఆమిర్ నటించి, దర్శకత్వం వహించిన ‘తారే జమీన్ పర్’ అంటే ఇష్టమంటూ - ‘‘ఈ సినిమాలో పిల్లాడికి పెయింటింగ్ ఇష్టం. కానీ, తల్లితండ్రులు చదవమని బలవంతపెడతారు. ఇలాంటి పరిస్థితే నాకు ఎదురైంది. నాకేమో సినిమాల్లోకి వెళ్లాలని కోరిక. కానీ, నాన్నగారేమో ఆయన వ్యాపారం కొనసాగించాలనుకున్నారు. అలాంటి పరిస్థితిలో నేనూ, మా నాన్న ‘తారే జమీన్ పర్’ చూశాం. ఆ సినిమా నా జీవితాన్ని మార్చేసింది. అది చూశాక మా అనుబంధంలో మార్పొచ్చింది’’ అన్నారు. -
బ్రిటన్ కుటుంబంతో విందుకు నో..!
బ్రిటన్ కుటుంబీకులతో డిన్నర్ చేసే అవకాశం వస్తే ఎవరైనా కాదంటారా?.. దాదాపు కాదనలేరు. కానీ, కరీనా కపూర్ మాత్రం కాదనేశారు. అసలు విషయంలోకి వెళితే... బ్రిటన్ యువరాజు విలియమ్, ఆయన సతీమణి కేట్ మిడిల్టన్తో కలిసి విహార యాత్ర ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే, ఈ దంపతులిద్దరూ ఈ నెల 10న భారత్‌కు రానున్నారు. 2008లో ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించనున్నారు. అలాగే ఓ చారిటీ విందులో కూడా పాల్గొనున్నారు. ఆ చారిటీ ట్రస్ట్‌కు సంబంధించిన నిర్వాహకులు ఈ విందుకు బాలీవుడ్ కపుల్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్లను ఆహ్వానించారట. కరీనా వెళ్లాలనుకుప్పటికీ సైఫ్ కారణంగా ఈ ఆహ్వానాన్ని తిరస్కరించారట. ప్రస్తుతం సైఫ్ షూటింగ్స్‌తో బిజీగా ఉన్నందున ఈ విందుకు హాజరయ్యే వీలు చిక్కదట. ఇదే కారణం చెప్పి, ఒక్కదాన్నే విందుకు హాజరు కాలేనని కరీనా పేర్కొన్నారట. ఇదిలా ఉంటే బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, యువహీరోలు అర్జున్ కపూర్, రణ్వీర్ సింగ్, హీరోయిన్ సోనమ్ కపూర్ తదితరులను కూడా ఈ విందుకు ఆహ్వానించారట. వీళ్లు విందుకు వెళ్లడానికి సుముఖంగా ఉన్నట్లు వినికిడి. -
అతను టోటల్‌గా ‘నా వాడు’ అయిపోవాలి!
ప్రేమ గురించి చెప్పమంటే ఎంతసేపైనా ఓపికగా చెప్పేట్లు ఉన్నారు దీపికా పదుకొనె. రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమలో పడి, అతన్నుంచి విడిపోయాక రణ్వీర్ సింగ్‌తో ప్రేమలో పడ్డారీ బ్యూటీ. సో.. ప్రేమకు సంబంధించి రెండు అనుభవాలు ఉన్నాయి ఆమెకు. ప్రేమ-పెళ్లి గురించి దీపికాకు కొన్ని అభిప్రాయలున్నాయి. వాటి గురించి ఈ బ్యూటీ ఏమంటున్నారో తెలుసుకుందాం... 1. చాలామంది ప్రేమకు డెఫినిషన్ చెప్పవా? అని నన్ను పలు సందర్భాల్లో అడిగారు. అసలు లవ్‌కి డెఫినిషన్ ఉంటుందా? ఒకవేళ ఉంటే దానికి కూడా ప్రేమంటే ఏంటో తెలీదని నా అభిప్రాయం. ఎందుకంటే ప్రేమ ఇలా ఉంటుంది అని విశ్లేషించలేం. ఒక్క మాటలో, ఒక్క పదంలో ప్రేమను నిర్వచించడం చాలా కష్టం. ప్రేమ అంటే ఓ ఫీలింగ్ కాదు. ఒక ఎమోషన్. ఎవరి మీదా ఇష్టం ఒక్కసారిగా పుట్టదు. ఏ ఇద్దరి మధ్య అయినా రోజులు గడిచే కొద్దీ ప్రేమ బలపడుతుంది. ఏ బంధం అయినా నిలబడాలంటే నిజాయతీ, నమ్మకం, ఒకరి మీద ఒకరికి కేరింగ్ ఇవన్నీ కచ్చితంగా ఉండాలి. 2. ఇప్పటివరకూ జీవితంలో పలు విషయాల్లో కొన్ని ఎదురుదెబ్బలు తిన్నాను. అలాంటివి మళ్లీ రిపీట్ కాకూడదన్నదే నా ప్రయత్నం. ప్రేమలో ఎదురైన చేదు అనుభవం ఇక ఎప్పటికీ ఎదురు కాకూడదని కోరుకుంటున్నా. ఒకసారి తప్పు జరిగిపోయింది. 3. ఒక వేళ నన్ను ప్రేమిస్తూ ఇంకో అమ్మాయిని కూడా ప్రేమించాడంటే నేను సహించలేను. ఒక వ్యక్తి మనతో జీవితాన్ని పంచుకుంటున్నాడంటే అతని ప్రేమ పూర్తిగా మనకే సొంతం కావాలి. టోటల్‌గా ‘నా వాడు’ అయిపోవాలి. అతని సర్వస్వం నే నే కావాలి. ఏదైనా తేడా వస్తే ఫైట్ చేయడానికైనా రెడీ. అంతే గానీ చూస్తూ మాత్రం ఊరుకోను. 4. నేను సహజీవనం చేస్తానని, నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చాలా మంది వార్తలు పుట్టిస్తున్నారు. అసలు అలాంటివి ఎందుకొస్తున్నాయో నాకైతే అర్థం కావడం లేదు. నాకు నచ్చితే పెళ్లి చే సుకుంటానే గానీ సహజీవనం మాత్రం చేయను. ఇలా అంటున్నానని నేను సహజీవనానికి వ్యతిరేకిని అనుకోవద్దు. అన్ని రకాల బంధాలను గౌరవిస్తాను. ఎందుకంటే ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి జడ్జ్ చేయడానికి మనం ఎవరం? అని నేననుకుంటాను. నేను సామాజికంగా ఎంత ఉన్నత స్థాయికి వెళ్లినా నా మూలాలను మర్చిపోలేను. అందుకే సహజీవనం చేయకూడదని నేను అనుకుంటున్నా. 5. లవ్ మ్యారేజ్, ఎరేంజ్డ్ ఏదైనా కావచ్చు... జీవితాంతం ఆ బంధం నిలబడాలంటే భార్యాభర్తల మధ్య ప్రేమ, అవగాహన ముఖ్యం. నా వైవాహిక జీవితం మాత్రం చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. పెళ్లప్పుడు జీవితాంతం ఒకరికి ఒకరు తోడుగా ఉంటామని ప్రామిస్ చేసుకుంటాం. ఆ ప్రామిస్‌ని కాపాడుకుంటాను. అవసరమైతే నటనకు గుడ్‌బై చెప్పేసి మరీ నా పర్శనల్ లైఫ్‌ను ఆస్వాదిస్తాను. -
ముచ్చటగా మూడోసారి?
ఒక జోడీ సూపర్హిట్టయిందంటే ఇక బాక్సాఫీస్ సక్సెస్ కోసం ఆ జంటను పదే పదే తెరపై నటింపజేయడం అన్ని భాషల సినిమాల్లోనూ ఉన్నదే! పెపైచ్చు, ఆ హీరో హీరోయిన్లు గనక నిజజీవితంలోనూ ప్రేమికులైతే...? అంతకన్నా మహాభాగ్యమా అంటారు సినీ నిర్మాతలు. దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్‌ల గురించి ఇప్పుడు అందరూ ఆ మాటే అంటున్నారు. సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన ‘గోలియోం కీ రాస్లీలా... రామ్‌లీలా’ చిత్రంలో, తాజాగా ఆయనే తీసిన ‘బాజీరావ్ మస్తానీ’లో వీళ్ళిద్దరూ మంచి హాట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురవడానికి కీలకమయ్యారు. నిజజీవితంలోనూ వీళ్ళిద్దరూ ప్రస్తుతం బాగా సన్నిహితంగా ఉంటున్నారు. అందుకే, ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాలో వీళ్ళ కాంబినేషన్ రిపీట్ కానుంది. ఆనంద్ ఎల్. రాయ్ రూపొందిస్తున్న ‘హ్యాపీ భాగ్ జాయేగీ’ చిత్రంలో వీళ్ళే కొత్త జంట అని ముంబయ్‌లో చెప్పుకొంటున్నారు. ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ ఫేమ్ ఆనంద్ రాయ్ ప్రస్తుతం ఈ ప్రతిపాదనతో దీపికను కలిశారట. అయితే, ప్రస్తుతానికి వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఉన్న ఇతర పనుల్ని దీపిక పూర్తి చేసుకోవాల్సి ఉండడంతో ఆలస్యం అయ్యేలా ఉందట! ఏమైతేనేం, అన్నీ అనుకున్నట్లు జరిగితే రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనేల జంట మరోసారి తెరపై కనువిందు చేస్తుందన్న మాట! -
ఆహా! ఏమి ఛాన్సు!!
గాసిప్ ఆదిత్య చోప్రా దర్శకత్వంలో రానున్న ‘బేఫికర్’ సినిమాలో హీరో రణ్వీర్ సింగ్ అనేది సినీప్రియులకు తెలిసిన విషయమే! మరి తెలియని విషయం, కాస్త కన్ఫ్యూజ్కు గురిచేస్తున్న విషయం... ఇంతకీ ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది! మొదట్లో అనుష్కశర్మను హీరోయిన్గా అనుకున్నారు. ఆదిత్య చోప్రాకి ముక్కు మీదే కోపం. ఆయనతో ఎక్కువ మాట్లాడినా సమస్యే, తక్కువ మాట్లాడినా సమస్యే, అసలు మాట్లాడక పోయినా సమస్యే అంటుంటారు. మరి అనుష్క తక్కువే మాట్లాడిందో, ఎక్కువే మాట్లాడిందో తెలియదుగానీ... మొత్తానికైతే ‘బేఫికర్’లో రణ్వీర్తో కలిసి నటించే అవకాశం ఆమెకు రాలేదు.ఆ తరువాత పరిణితి చోప్రా పేరు తెర మీదికి వచ్చింది. ‘అబ్బే... ఆమె కాదు’ అన్నాయి విశ్వసనీయవర్గాలు. ఇప్పుడు మాత్రం బలంగా వినిపిస్తున్న పేరు ‘వాణీ కపూర్’. ఎక్కడో విన్నట్లుందే పేరు అనుకుంటున్నారా? అవును పాపం... 2013లో ‘శుద్ధ్ దేసి రొమాన్స్’ సినిమాలో తార పాత్రలో మెరిసింది. ఆ తరువాత మన తెలుగులో నాని సరసన ‘ఆహా కళ్యాణం’ సినిమాలో నటించిందిగానీ ఆ సినిమా హిట్ కాలేదు. ఇక అప్పటి నుంచి ఆమెకు సినిమాలు లేవు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ‘బేఫికర్’ సినిమాలో హీరోయిన్గా బంపర్ ఆఫర్‌ను ఆదిత్య ఇచ్చినట్లు వినికిడి. నేడో రేపో ఆమె పేరును బహిరంగంగా ప్రకటించడం కూడా ఖాయం అంటున్నారు. చూద్దాం మరి ఆమె అదృష్టబలం ఎంత బలంగా ఉందో! -
బాజీరావ్ ఎలా ఉంటాడు?
బాజీరావ్ ఎలా ఉంటాడు? ఆయన మొదటి భార్య కాశీభాయ్ ఎలా ఉంటుంది? రెండో భార్య మస్తానీ ఎలా ఉంటుంది? కొన్ని రోజులుగా హిందీ రంగంలో సాగిన ఈ ప్రశ్నలకు బుధవారం సమాధానం లభించింది. మరాఠా పెషావర్ బాజీరావ్, ఆయన భార్యలిద్దరి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చారిత్రక చిత్రం - ‘బాజీరావ్ మస్తానీ’. స్వీయ దర్శకత్వంలో సంజయ్ లీలా భన్సాలీ రూపొందిస్తున్న ఈ చిత్రంలో బాజీరావ్‌గా రణ్వీర్ సింగ్ నటిస్తుంటే, మొదటి భార్య పాత్రను ప్రియాంకా చోప్రా, రెండో భార్య పాత్రను దీపికా పదుకొనే పోషిస్తున్నారు. ఈ చిత్రంలో వీరి గెటప్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఆసక్తి చాలామందికి ఉంది. బుధవారం విడుదల చేసిన రణ్వీర్, ప్రియాంక, దీపికల లుక్ చూసి, ‘ముగ్గురూ ముచ్చటగా ఉన్నారు’ అని అందరూ కితాబిచ్చారు. ఈ సినిమా కోసం రణ్వీర్ జుత్తు త్యాగం చేసిన వైనం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రియాంక, దీపికలు కొన్ని యుద్ధ విద్యలు నేర్చుకున్నారట. మొత్తం మీద చరిత్ర నేపథ్యంలో తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా చరిత్ర సృష్టిస్తుందనే అంచనాలు ఉన్నాయి. దాదాపు రూ. 120 కోట్ల నిర్మాణ వ్యయంతో రూపొందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్లో రిలీజ్ కానుంది. -
ఒకరికి ఒకరు!
హిందీ జంట దీపికా పడుకొనే, రణవీర్‌సింగ్‌ల మధ్య రోజురోజుకూ వ్యవహారం ముదురుతున్నట్టుంది. ఒకరిని వదిలి ఒకరు ఉండలేనంతగా కలసి తెగ తిరిగేస్తున్నారు. ఎక్కడ చూసినా వారే. రీసెంట్గా ఢిల్లీలో రణవీర్ స్నేహితుడు కరణ్ కపాడియా మ్యారేజ్ నిత్యా మెహ్రాతో జరిగింది. దీనికి ప్రేయసి దీపికతో సహా అటెండయ్యాడట. ‘తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ’ అంటూ పెళ్లివారంతా ఇద్దరినీ చుట్టుముట్టేశారట! ఇక రణవీర్ చెల్లి రితిక అయితే దీపికను అతుక్కుపోయింది. ఆ ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో క్రీజీగా మారాయి. రణవీర్ మాత్రం చెయ్యికి, మెడకు కలిపి కట్టు కట్టుకుని కాస్త డిఫరెంట్‌గా దర్శనమిచ్చాడు. ఏంటని ఆరా తీస్తే... జైపూర్‌లో షూటింగ్ సందర్భంగా హార్స్ రైడింగ్ చేస్తూ పట్టు తప్పి కింద పడ్డాడట మనోడు. భుజం విరిగి ఇప్పుడిలా అవస్థలు పడుతున్నాడు. పెళ్లి తరువాత కూడా ఈ ప్రేమ పావురాలు ఒక్కటిగా ఎగిరిపోయాయట!