మేం హీరోలం కాదు! | Shahid Kapoor is why Ranveer Singh and Deepika Padukone's relationship has hit a rough patch? | Sakshi
Sakshi News home page

మేం హీరోలం కాదు!

Published Tue, Oct 25 2016 10:45 PM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM

మేం హీరోలం కాదు!

మేం హీరోలం కాదు!

రణ్‌వీర్ సింగ్.. షాహిద్ కపూర్.. హిందీలో ఈ యంగ్ హీరోలిద్దరికీ మంచి పేరు, ఫాలోయింగ్ ఉన్నాయి. కానీ, మేము హీరోలు కాదంటున్నారు షాహిద్. హీరోలు కాకపోతే ఎవరంటారా? ముఖ్య తారలు మాత్రమేనట. చారిత్రక కథతో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తీయనున్న ‘పద్మావతి’ సినిమాలో దీపికా పదుకొనే టైటిల్ రోల్‌లో.. పద్మావతి భర్తగా షాహిద్, విలన్‌గా రణ్‌వీర్ నటించనున్నారు.

ఎవరి పాత్రకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారనే విషయంలో ఈ హీరోలిద్దరూ దర్శకుడిపై అలిగారని వచ్చిన వార్తలను షాహిద్ ఖండించారు. ‘‘ఇది ఇద్దరు హీరోల కథ కాదు, మూడు పాత్రల చుట్టూ నడిచే సినిమా. అందుకే ఈ సినిమాకి సంబంధించినంత వరకూ నేను, రణ్‌వీర్ హీరోలం కాదు. ఐదేళ్ల క్రితమే నా దగ్గరకు ఈ కథ వస్తే బాగుండేది. భన్సాలీ సినిమాలో నటించడం నా అదృష్టం’’ అని షాహిద్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement