'పద్మావతి' రిలీజ్‌పై క్లారిటీ | Shahid Kapoor reveals ‘Padmavati’ will get a new release date by year end | Sakshi
Sakshi News home page

'పద్మావతి' రిలీజ్‌పై క్లారిటీ

Published Thu, Dec 21 2017 4:11 PM | Last Updated on Thu, Dec 21 2017 5:37 PM

 Shahid Kapoor reveals ‘Padmavati’ will get a new release date by year end - Sakshi

వివాదాలు చుట్టుముట్టి వాయిదా పడిన సంజయ్‌ లీలా భన్సాలి చారిత్రక దృశ్యకావ్యం పద్మావతి విడుదలపై షాహిద్ క‌పూర్ క్లారిటీ ఇచ్చాడు. దీపికా పదుకోన్‌, రణ్‌వీర్‌సింగ్‌, షాహిద్‌ కపూర్‌లు నటించిన పద్మావతి డిసెంబర్‌ 1న విడుదల కావాల్సి ఉన్నా నిరసనకారుల ఆందోళనల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఈ సినిమా ఎపుడు రిలీజ్‌ అవుతుందో క్లారిటీ లేదు.

తాజాగా షాహిద్‌ కపూర్‌ ఈ విషయంపై స్పందించాడు. 'పద్మావతి కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తెలుసు. ఈ సినిమా విడుదలపై డిసెంబర్‌ నెలాఖరులో తప్పకుండా క్లారిటీ వస్తుంది. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు ప్రయత్రిస్తున్నాం' అని తెలిపారు. కాగా, ప‌ద్మావ‌తి చిత్రంలో దీపిక రాణి ప‌ద్మావ‌తిగా, రావల్‌ రతన్‌ సింగ్‌గా షాహిద్‌ కపూర్‌ పాత్రలు పోషించగా, అల్లావుద్దీ ఖిల్జీగా రణ్‌వీర్‌ సింగ్‌ నటిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement