డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న పద్మావతి సినిమాపై ఇంకా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పద్మావతి, అల్లావుద్ధీన్ ఖిల్జీ మధ్య చరిత్రను వక్రీకరిస్తూ కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారని పలు రాజ్‌పుత్ సంఘాలు ఈ చిత్రయూనిట్‌పై ఆరోపణలు చేస్తున్నాయి. దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ.., అలాంటి సన్నివేశాలేవి లేవని, చరిత్రను ఏమాత్రం వక్రీకరించలేదని చెపుతున్నా నిరసనలు మాత్రం సద్దుమనగటం లేదు.
తాజాగా ఈ వివాదంపై పద్మావతి పాత్రలోనటించిన దీపిక పదుకొణే స్పందించారు. ‘ఒక స్త్రీగా ఈ సినిమాలో భాగమైనందుకు, ఈ చరిత్రను చెప్పే అవకాశం వచ్చినందుకు నేను గర్వపడుతున్నా. మేము కేవలం సెన్సార్‌బోర్డ్‌కు మాత్రమే సమాధానం చెప్పుకోవాలి.. అంతేకాదు ఏదీ పద్మావతి సినిమా రిలీజ్ ను అడ్డుకోలేదని నేను నమ్ముతున్నా’ నన్నారు. గతంలో ఇదే వివాదం పై స్పందించిన హీరో షాహిద్ కపూర్, తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని.. సినిమా చూసిన తరువాత తమకు అభ్యంతరాలు ఉంటే తెలపాలిగానీ ముందుగానే ఊహగానాలతో సినిమాను అడ్డుకోవటం సరికాదని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment