'పద్మావతి'లో వాళ్లిద్దరూ.. | Shahid Kapoor as Padmavathi's husband Raja Rawal Ratan Singh | Sakshi
Sakshi News home page

'పద్మావతి'లో వాళ్లిద్దరూ..

Published Wed, Aug 24 2016 8:33 PM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM

'పద్మావతి'లో వాళ్లిద్దరూ..

'పద్మావతి'లో వాళ్లిద్దరూ..

సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించనున్న తాజా చిత్రం 'పద్మావతి'లో ముఖ్య పాత్రల ఎంపిక పూర్తయినట్లు సమాచారం. మేవాడ రాణి పద్మావతి జీవితకథ ఆధారంగా చారిత్రక ఇతివృత్తంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. పద్మావతి పాత్రకు దీపిక న్యాయం చేయనుండగా.. ఆమె భర్తగా అలరించే నటుడు ఎవరనేదానిపైన చాలా కసరత్తే జరిగింది.

ఎంతోమంది పేర్లు పరిశీలించిన తరువాత ఆ పాత్ర 'ఉడ్తా పంజాబ్' స్టార్ షాహిద్ కపూర్ను వరించినట్లు బీ టౌన్ టాక్. తొలిసారి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో నటించే అవకాశం రావడంతో షాహిద్ వెంటనే ఒప్పేసుకున్నాడట. ధైర్య సాహసాలను ప్రదర్శించే పద్మావతి భర్త రాజా రావల్ రతన్‌సింగ్‌ పాత్రలో షాహిద్ కనిపించనున్నాడు.

రామ్ లీలా, బాజీరావు మస్తానీలలో దీపికకు జంటగా నటించిన రణ్ వీర్ సింగ్ కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సుల్తాన్ అల్లా ఉద్దీన్ ఖిల్జీగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రణ్ వీర్ తొలిసారి కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివరలో ప్రారంభం కానుంది.  షాహిద్, రణ్ వీర్లిద్దరూ 13 వ శతాబ్ధానికి చెందిన రాజపుత్రులుగా కనిపించనున్నారు. ప్రస్తుతం ఆ పాత్రలకు తగ్గట్టు తమ ఆహార్యాన్ని మలచుకునే పనిలో ఉన్నారట ఈ యువ హీరోలు. భన్సాలీ ముందు సినిమాల మాదిరిగానే పద్మావతి సెన్సేషన్ సృష్టించడం ఖాయం అంటున్నారు అభిమానులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement