ముద్దూ ముచ్చటా లేదు! | Ranveer Singh and Deepika Padukone won’t have any scenes in the Sanjay Leela Bhansali film? | Sakshi
Sakshi News home page

ముద్దూ ముచ్చటా లేదు!

Published Sat, Feb 11 2017 11:19 PM | Last Updated on Tue, Sep 5 2017 3:28 AM

ముద్దూ ముచ్చటా లేదు!

ముద్దూ ముచ్చటా లేదు!

లేదంటే లేదంతే... రాణీ పద్మావతి, అల్లావుద్దీన్‌ ఖిల్జీ మధ్య ఒక్కటంటే ఒక్క సీన్‌ కూడా లేదు. సీనేంటి? పాటేసుకునే ప్లేస్‌ గానీ, డ్రీమ్స్‌లో రొమాన్స్‌ చేసే స్కోప్‌గానీ మా సినిమాలో లేవంటే లేవని ‘పద్మావతి’ చిత్రబృందం స్పష్టం చేసింది. ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ‘పద్మావతి’ సినిమాలో చరిత్రను వక్రీకరిస్తున్నాంటూ ఆయనపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ‘స్వాభిమానాన్ని కాపాడుకోవడానికి ఖిల్జీకి దక్కకుండా పద్మావతి ఆత్మహత్య చేసుకున్నారు’ అని మాలిక్‌ మహ్మద్‌ జయసీ అనే కవి చరిత్రలో పేర్కొంటే... ఖిల్జీతో పద్మావతి ప్రేమలో పడినట్టు భన్సాలీ చూపించబోతున్నారని ఆయనపై దాడి చేసిన రాజస్థాన్‌ హిందూసేనలు ఆరోపించాయి.

ఈ దాడి తర్వాత ‘పద్మావతి’ షూటింగ్‌కి బ్రేక్‌ పడింది. త్వరలో మొదలు పెట్టాలనుకుంటున్నారు. మళ్లీ ఎవరైనా దాడి చేస్తే? భన్సాలీ చిత్ర బృందానికి ఇదే సందేహం వచ్చినట్టుంది. అందుకే  ‘‘చాలామంది ఊహిస్తున్నట్లు పద్మావతి, అల్లావుద్దీన్‌ ఖిల్జీ మధ్య ముద్దు సీన్లు లేవు. అసలు వాళ్ల మధ్య సీన్సే ఉండవు. రాజ్‌పుత్‌ల మనోభావాల్ని కించపరిచేలా భన్సాలీ ఎప్పుడూ ప్రవర్తించరు’’ అని యూనిట్‌ సభ్యులు స్పష్టం చేశారు. పద్మావతిగా దీపికా పదుకొనె, ఆమె భర్త రావల్‌రతన్‌ సింగ్‌గా షాహిద్‌ కపూర్, అల్లావుద్దీన్‌ ఖిల్జీగా రణవీర్‌ సింగ్‌ నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement