ranavir Singh
-
మంటలు చల్లారడం లేదు!
ఏ ముహూర్తాన ‘రాణీ పద్మావతి’ సినిమాని ప్రారంభించారో గానీ... ఎక్కడికక్కడ ఏవో చిక్కులు తప్పడం లేదు. చిత్రీకరణ సజావుగా సాగడం లేదు. పద్మావతిపై చెలరేగిన మంటలు ఇప్పట్లో చల్లారేట్లు కనిపించడం లేదు. పద్మావతి చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ... జైపూర్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీపై కొందరు దాడి చేశారు. అప్పుడు హిందీ ప్రముఖులందరూ ముక్త కంఠంతో సంజయ్‌పై దాడిని ఖండించారు. ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఆ మంటలు చల్లారకముందే ‘రాణీ పద్మావతి’ సెట్లో మరో ఘటన చోటు చేసుకుంది. ఈసారి కొల్హాపూర్‌లోని షూటింగ్ సెట్లో చొరబడిన కొందరు వ్యక్తులు కాస్ట్యూమ్స్‌ను తగలబెట్టేశారు. తెల్లవారుజామున ఈ ఘటన జరగడంతో సెట్లో మంటలు చెలరేగే వరకూ ఎవరూ గమనించలేదట! అదృష్టవశాత్తూ... ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగలేదు. కానీ, జూనియర్ ఆర్టిస్టుల కాస్ట్యూమ్స్ మాత్రం పూర్తిగా నాశనమయ్యాయి. ఘటన జరిగిన సమయంలో పద్మావతిగా నటిస్తున్న దీపికా పదుకొనే గానీ... హీరోలు షాహిద్ కపూర్, రణవీర్ సింగ్‌లు గానీ సెట్లో లేరు. ఈ ఘటనపై భన్సాలీ ప్రొడక్షన్స్ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సినిమా పూర్తయ్యేలోపు ఇంకెన్ని ఘటనలు చోటు చేసుకుంటాయో! -
ముద్దూ ముచ్చటా లేదు!
లేదంటే లేదంతే... రాణీ పద్మావతి, అల్లావుద్దీన్ ఖిల్జీ మధ్య ఒక్కటంటే ఒక్క సీన్ కూడా లేదు. సీనేంటి? పాటేసుకునే ప్లేస్ గానీ, డ్రీమ్స్‌లో రొమాన్స్ చేసే స్కోప్గానీ మా సినిమాలో లేవంటే లేవని ‘పద్మావతి’ చిత్రబృందం స్పష్టం చేసింది. ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ‘పద్మావతి’ సినిమాలో చరిత్రను వక్రీకరిస్తున్నాంటూ ఆయనపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ‘స్వాభిమానాన్ని కాపాడుకోవడానికి ఖిల్జీకి దక్కకుండా పద్మావతి ఆత్మహత్య చేసుకున్నారు’ అని మాలిక్ మహ్మద్ జయసీ అనే కవి చరిత్రలో పేర్కొంటే... ఖిల్జీతో పద్మావతి ప్రేమలో పడినట్టు భన్సాలీ చూపించబోతున్నారని ఆయనపై దాడి చేసిన రాజస్థాన్ హిందూసేనలు ఆరోపించాయి. ఈ దాడి తర్వాత ‘పద్మావతి’ షూటింగ్‌కి బ్రేక్ పడింది. త్వరలో మొదలు పెట్టాలనుకుంటున్నారు. మళ్లీ ఎవరైనా దాడి చేస్తే? భన్సాలీ చిత్ర బృందానికి ఇదే సందేహం వచ్చినట్టుంది. అందుకే ‘‘చాలామంది ఊహిస్తున్నట్లు పద్మావతి, అల్లావుద్దీన్ ఖిల్జీ మధ్య ముద్దు సీన్లు లేవు. అసలు వాళ్ల మధ్య సీన్సే ఉండవు. రాజ్‌పుత్‌ల మనోభావాల్ని కించపరిచేలా భన్సాలీ ఎప్పుడూ ప్రవర్తించరు’’ అని యూనిట్ సభ్యులు స్పష్టం చేశారు. పద్మావతిగా దీపికా పదుకొనె, ఆమె భర్త రావల్‌రతన్ సింగ్‌గా షాహిద్ కపూర్, అల్లావుద్దీన్ ఖిల్జీగా రణవీర్ సింగ్ నటిస్తున్నారు. -
ఆ ఉంగరం కహానీ అదేనా?
గాసిప్ పెళ్లి కాని అమ్మాయిల వేలికి హఠాత్తుగా ఓ ఉంగరం ప్రత్యక్షమైతే.. ఆ ఉంగరం వెనక ఉన్న కథ తెలుసుకోవాలని చాలామంది ఆరాటపడతారు. లవ్‌లో ఉంటే బాయ్‌ఫ్రెండ్ ఇచ్చాడా? లవర్‌తో ప్రేమ... పెళ్లి వరకూ వచ్చి, నిశ్చితార్థం జరిగిందా? ఇలాంటి చర్చలు జోరుగా సాగుతాయి. ప్రస్తుతం బాలీవుడ్లో రణవీర్ సింగ్-దీపికా పదుకొనేల గురించి అలాంటి చర్చే జరుగుతోంది. ఈ ఇద్దరూ కొంత కాలంగా ప్రేమలో ఉన్నారనే వార్తలు షికారు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రేమ షికారుకు బ్రేక్ పడిందన్నది తాజా సమాచారం. బాలీవుడ్లో బ్రేకప్స్ కామన్ కాబట్టి, ఈ జంటను కూడా ఆ లిస్ట్‌లో వేసేశారు. అలాంటి వాళ్లందర్నీ షాక్‌కి గురి చేస్తూ... ఈ ఇద్దరూ చేతిలో చెయ్యేసుకుని జాయింట్‌గా ఓ వేడుకకు హాజరయ్యారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చూస్తుంటే, బంధం మరింత బలపడిందనీ, బ్రేకప్‌కి సమస్యే లేదనీ చెప్పుకుంటున్నారు. పైగా దీపికా పదుకొనే వేలికి తళుకులీనే ఉంగరం కనిపించ డంతో రహస్యంగా నిశ్చితార్థం జరిగి ఉంటుందని కొందరు ఊహించుకుంటున్నారు. ఆ ఉంగరం కహానీ అదేనా? అని ఆరా తీసే పనిలో కొంతమంది పడ్డారు. మొత్తానికి పనిలేని వాళ్ల పాలిట సెలబ్రిటీలు ఓ వరం అనే చెప్పాలి. ఏదో ఒక న్యూస్ ఇస్తూ.. పుణ్యం కట్టుకుంటున్నారు. -
ముచ్చటగా మూడోసారి కలిసి నటిస్తున్నారు
ప్రస్తుతం బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హాట్ పెయిర్ రణవీర్ సింగ్, దీపిక పదుకోణేలు. రామ్‌లీలా, బాజీరావ్ మస్తానీ లాంటి వరుస బ్లాక్ బస్టర్లతో ఆకట్టుకున్న ఈ పెయిర్, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కలిసి నటించడానికి రెడీ అవుతోంది. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతోనే కాదు, ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీతో కూడా ఆకట్టుకుంటున్న ఈ జోడి తమ సినిమాలో నటిస్తే ప్రమోషన్ పరంగా కూడా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు బాలీవుడ్ దర్శకనిర్మాతలు. బాజీరావ్ మస్తానీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఈ జంటను మూడోసారి తెర మీదకు తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్. తను వెడ్స్ మను సీరీస్‌తో పాటు రాంజానా సినిమాతో స్టార్ స్టేటస్ అందుకున్న ఆనంద్, తన నెక్ట్స్ సినిమా హ్యాపి భాగ్ జాయేగి కోసం రణవీర్, దీపికాల జోడిని సంప్రదించాడు. కథతో పాటు పారితోషికం కూడా నచ్చేయటంతో ఆ సినిమాకు ఒకే చెప్పేశారు హాట్ పెయిర్. త్వరలోనే ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
బర్త్‌డే గిఫ్ట్...
బాలీవుడ్లో లేటెస్ట్ హాట్ జంట దీపికా పడుకొనే, రణవీర్‌సింగ్. ఎక్కడ చూసినా ఇద్దరూ జంటగానే కనిపిస్తున్నారు. న్యూ ఇయర్‌తో అయిపోయిందనుకున్న ఎంజాయ్మెంట్.. జనవరి 5 దీపిక 29వ పుట్టిన రోజు వరకు కంటిన్యూ అయింది. సొంతూరు బెంగళూరులో ఫ్యామిలీతో ఉన్న సొట్ట బుగ్గల చిన్నదాన్ని రణవీర్ వదలనే వదలలేదట. ఆమెను ఓ విలాసవంతమైన షాపింగ్ మాల్‌కు తీసుకెళ్లి... ‘విలువైన’ ఐటెమ్స్ ఎన్నో కొనిపెట్టాడనేది ఓ వెబ్సైట్ కథనం. అంతే ఇదిగా దీపిక కూడా జతగాడిని తన ఊరంతా తిప్పేసింది. పనిలో పనిగా తన కోసం కూడా కొన్ని ఐటెమ్స్ కొనుక్కున్నాడు. మొత్తానికి ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ల్లో ఇరువురూ ఒకరి కంపెనీని ఒకరు ఆసాంతం ఆస్వాదించేస్తున్నారు.