ఆ ఉంగరం కహానీ అదేనా? | Kahaani something that ring? | Sakshi
Sakshi News home page

ఆ ఉంగరం కహానీ అదేనా?

Published Sat, Nov 26 2016 10:57 PM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM

ఆ ఉంగరం   కహానీ అదేనా?

ఆ ఉంగరం కహానీ అదేనా?

 గాసిప్

పెళ్లి కాని అమ్మాయిల వేలికి హఠాత్తుగా ఓ ఉంగరం ప్రత్యక్షమైతే.. ఆ ఉంగరం వెనక ఉన్న కథ తెలుసుకోవాలని చాలామంది ఆరాటపడతారు. లవ్‌లో ఉంటే బాయ్‌ఫ్రెండ్ ఇచ్చాడా? లవర్‌తో ప్రేమ... పెళ్లి వరకూ వచ్చి, నిశ్చితార్థం జరిగిందా? ఇలాంటి చర్చలు జోరుగా సాగుతాయి. ప్రస్తుతం బాలీవుడ్‌లో రణవీర్ సింగ్-దీపికా పదుకొనేల గురించి అలాంటి చర్చే జరుగుతోంది. ఈ ఇద్దరూ కొంత కాలంగా ప్రేమలో ఉన్నారనే వార్తలు షికారు చేసిన విషయం తెలిసిందే.

ఈ ప్రేమ షికారుకు బ్రేక్ పడిందన్నది తాజా సమాచారం. బాలీవుడ్‌లో బ్రేకప్స్ కామన్ కాబట్టి, ఈ జంటను కూడా ఆ లిస్ట్‌లో వేసేశారు. అలాంటి వాళ్లందర్నీ షాక్‌కి గురి చేస్తూ... ఈ ఇద్దరూ చేతిలో చెయ్యేసుకుని జాయింట్‌గా ఓ వేడుకకు హాజరయ్యారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చూస్తుంటే, బంధం మరింత బలపడిందనీ, బ్రేకప్‌కి సమస్యే లేదనీ చెప్పుకుంటున్నారు. పైగా దీపికా పదుకొనే వేలికి తళుకులీనే ఉంగరం కనిపించ డంతో రహస్యంగా నిశ్చితార్థం జరిగి ఉంటుందని కొందరు ఊహించుకుంటున్నారు. ఆ ఉంగరం కహానీ అదేనా? అని ఆరా తీసే పనిలో కొంతమంది పడ్డారు. మొత్తానికి పనిలేని వాళ్ల పాలిట సెలబ్రిటీలు ఓ వరం అనే చెప్పాలి. ఏదో ఒక న్యూస్ ఇస్తూ.. పుణ్యం కట్టుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement