ఐదేళ్లకు ఏడడుగులు | Deepika Padukone, Ranveer Singh's Ram Leela movie continue | Sakshi
Sakshi News home page

ఐదేళ్లకు ఏడడుగులు

Published Fri, Nov 16 2018 5:33 AM | Last Updated on Fri, Nov 16 2018 5:33 AM

Deepika Padukone, Ranveer Singh's Ram Leela movie continue - Sakshi

స్వీట్‌ స్మైల్స్, స్వీట్‌ నథింగ్స్‌ పంచుకుంటూ దీప్‌వీర్‌

సరిగ్గా ఐదేళ్ల క్రితం దీపికా పదుకోన్, రణ్‌వీర్‌ సింగ్‌ మొదటిసారి కలసి నటించిన ‘రామ్‌లీల’ (2013) రిలీజై  నిన్నటితో ఐదేళ్లయింది. ఆ సినిమా స్టార్ట్‌ అయిన (2012) ఆరేడు నెలలకు వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అది జరిగిన ఐదేళ్లకు దీపికా, రణ్‌వీర్‌ ఏడడుగులు వేశారు. నవంబర్‌ 14, 15తేదీల్లో  ఇటలీలోని లేక్‌ కోమో వద్ద వీరి వివాహ వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. 14న కొంకిణీ పద్ధతిలో వివాహం చేసుకున్న ఈ ఇద్దరూ, 15న ఆనంద్‌ కరాజ్‌ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. కొంకణి వేడుక కామ్‌గా, కూల్‌గా జరిగితే మరుసటి రోజు రణ్‌వీర్‌ వాళ్ల సంప్రదాయం ప్రకారం రణ్‌వీర్‌ ఎనర్జీ లెవల్స్‌ మ్యాచ్‌ అయ్యేలా మస్త్‌ హుషారుగా జరిగిందట.

ఈ గ్రాండ్‌ వెడ్డింగ్‌ విశేషాలేంటంటే... పెళ్లి వేడుకకు హాజరైన అతిథులందరికీ సౌత్‌ స్టైల్‌లో ఫిల్టర్‌ కాఫీతో ఆహ్వానం పలికారట. ఈ పెళ్లి పనుల్లో ఇటలీ స్టాఫ్‌ అందరూ సౌత్‌ ఇండియన్‌ దుస్తులు ధరించారు. అతిథులకు విస్తరిలో వడ్డించారట. వంటలు రుచికరంగా ఉండాలని ఇండియా నుంచి చేయి తిరిగిన వంటగాళ్లను ఇటలీకి తీసుకువెళ్లారట. ఇక దీపికా, రణ్‌వీర్‌ల కొంకణి సంప్రదాయ వివాహం నాలుగు గంటలు సాగిందట. ఈ వేడుకలకు బలమైన  సెక్యూరిటీని ఏర్పాటు చేశారట. పెళ్లి వేడుకలకు సంబంధించిన ఒక్క ఫొటో కూడా అధికారికంగా విడుదల చేసేవరకూ బయటకు రాలేదంటే ఎంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేశారో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే... దీప్‌వీర్‌ ఈ 21న బెంగళూరులో, 28న ముంబైలో వివాహ రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. ఇంకా ఈ జంట హనీమూన్‌ వివరాలేవీ బయటకు రాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement