Ramleela
-
నిండు పున్నమిలోనూ బాలరాముని దర్శనం
అయోధ్యలో సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకూ బాలరాముని దర్శనం చేసుకునే అవకాశం ఉన్న భక్తులు.. ఇకపై చంద్రుని చల్లని వెన్నెలలోనూ స్వామివారిని దర్శించుకునే అవకాశం కలగనుంది. అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభమై, బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగిన అనంతరం స్వామివారి దర్శన వ్యవధిని పొడిగించనున్నట్లు రామాలయ ట్రస్ట్ తెలిపింది. అలాగే మంగళ, శయన హారతులను కూడా ప్రారంభించనున్నారు. రానున్న కాలంలో అయోధ్యలోని నూతన రామాలయ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య మరింతగా పెరగనున్న దృష్ట్యా పూజల ప్రక్రియను విస్తృతం చేసేందుకు ట్రస్ట్ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఆలయంలో శ్రీరాముని దర్శనం ఉదయం 7 గంటల నుంచి 11 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 వరకు ఉంటోంది. రాత్రివేళ ఈ సమయాన్ని మరింత పొడిగించాలని ట్రస్టు యోచిస్తోంది. దీంతో భక్తులు చల్లని వెన్నెలలోనూ బాలరాముడిని దర్శించుకోగలుగుతారు. సాధారణ రోజుల్లో రోజుకు 20 వేల మంది భక్తులు శ్రీరాముని దర్శించుకుంటున్నారు. ఏకాదశితో పాటు పండుగ రోజులలో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య మరింతగా పెరుగనుంది. ప్రాణ ప్రతిష్ఠ అనంతరం రోజుకు లక్షన్నర మంది భక్తులు దర్శనానికి వస్తారనే అంచనాలున్నాయి. -
నూతన రామాలయ ప్రారంభోత్సవంలో పాక్ కళాకారుల ప్రదర్శనలు
యూపీలోని అయోధ్యలో నిర్మితమవుతున్న నూతన రామాలయం వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా రామలీల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనిలో సినిమా ఆర్టిస్టులు ప్రత్యేక ఆకర్షణగా కనిపించనున్నారు. అలాగే పాకిస్తాన్‌తో సహా 14 దేశాలకు చెందిన కళాకారులు కూడా దీనిలో భాగస్వాములు కానున్నారు. రాముని కథను సజీవంగా ప్రదర్శించేందుకు వీరంతా ఇప్పటి నుంచే సాధన చేస్తున్నారు. రామమందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఈసారి జనవరిలో అత్యంత వైభవంగా రామలీలను ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సాధారణంగా రామలీల కార్యక్రమం ప్రతి సంవత్సరం దసరా రోజున జరుగుతుంది. అయితే ఇప్పుడు 2024 జనవరి 17 నుంచి 22 వరకు సరయూ తీరంలో ఉన్న రామకథా పార్క్‌లో రామలీలను ప్రదర్శించనున్నారు. రాబోయే జనవరిలో జరిగే రామలీలలో తొలిసారిగా సినీ కళాకారులతో పాటు విదేశీ కళాకారులు కూడా కనిపించనున్నారని రామలీల కమిటీ చైర్మన్ సుభాష్ మాలిక్ తెలిపారు. రష్యా, మలేషియా, అమెరికా, లండన్, దుబాయ్, ఇజ్రాయెల్, ఆఫ్ఘనిస్తాన్, జపాన్, చైనా, జర్మనీ, అమెరికా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్లకు చెందిన కళాకారులు అయోధ్యలో జరిగే రామలీలలో కనిపించనున్నారని పేర్కొన్నారు. అనేక దేశాల కళాకారులు, సినీ కళాకారులతో సంయుక్తంగా రామలీలను ప్రదర్శించడం ఇదే తొలిసారి. అది కూడా శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో నిర్వహించడం ఇదే మొదటిసారి అవుతుంది. రామ్‌లీల కార్యక్రమాన్ని పర్యాటక శాఖ మంత్రి జైవీర్ సింగ్ ప్రారంభిస్తారని కమిటీ ప్రధాన కార్యదర్శి శుభమ్ మాలిక్ తెలిపారు. కాగా ఈ ఏడాది దసరా సందర్భంగా జరిగిన రామలీల కార్యక్రమాన్ని ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో 32 కోట్ల మంది వీక్షించారు. ఇది కూడా చదవండి: అమెరికా మాజీ మంత్రి హెన్రీ కిస్సింజర్ కన్నుమూత! -
అయ్యో ! రణ్వీర్ ఎంత పని జరిగే..
-
అయ్యో ! రణ్వీర్ ఎంత పని జరిగే..
బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ ఎంత మంచి డ్యాన్సరనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డ్యాన్స్ చేయడంలో అతని టైమింగ్, స్టైల్ మిగతా వారి కన్నా కాస్త డిఫరెంట్‌గా అనిపిస్తాయి. ఒక అవార్డ్సు ఫంక్షన్ లో రణ్వీర్ సింగ్ రామ్ లీలా చిత్రంలోని నగడా సాంగ్ డోల్ బాజేకు డ్యాన్స్ చేశాడు.రణ్వీర్ సూపర్‌గా డ్యాన్స్ చేస్తూ షోలో ఉన్నవారిని అలరిస్తున్నాడు. ఇంతలో చిన్న అపశృతి చోటుచేసుకుంది. అప్పటికే పాట కోసం స్టేజీపై పెద్ద డోల్స్ ఏర్పాటు చేశారు. రణ్వీర్ పాటకు స్టెప్పులేస్తూ డోల్స్ వాయిస్తుండగా..ఓ డోల్ పై ఉన్న క్లాత్ చిరిగిపోయింది. దీంతో రణ్వీర్ ఒక్కసారిగా అందులో పడిపోయాడు. అప్పటివరకు పాటను ఎంజాయ్ చేస్తోన్న ప్రేక్షకులంతా అనుకోని ఘటన జరిగే సరికి షాక్ కు లోనయ్యారు. వెంటనే స్టేజీపై ఉన్న డ్యాన్సర్లు, సహాయకులు రణ్ వీర్ ను డోల్ లోపలి నుంచి బయటకు తీశారు. రణ్ వీర్ కు ఊపిరి పీల్చుకున్నంత పనైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రణ్వీర్ నువ్వు మంచి డ్యాన్సర్ అని ఒప్పుకుంటాము.. కానీ ఓవర్ స్మార్ట్ తగ్గించుకుంటే మంచిది.. అయ్యో! పాపం రణవీర్.. తొందరగా పైకి లేపండి.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
ఐదేళ్లకు ఏడడుగులు
సరిగ్గా ఐదేళ్ల క్రితం దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్ మొదటిసారి కలసి నటించిన ‘రామ్‌లీల’ (2013) రిలీజై నిన్నటితో ఐదేళ్లయింది. ఆ సినిమా స్టార్ట్ అయిన (2012) ఆరేడు నెలలకు వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అది జరిగిన ఐదేళ్లకు దీపికా, రణ్వీర్ ఏడడుగులు వేశారు. నవంబర్ 14, 15తేదీల్లో ఇటలీలోని లేక్ కోమో వద్ద వీరి వివాహ వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. 14న కొంకిణీ పద్ధతిలో వివాహం చేసుకున్న ఈ ఇద్దరూ, 15న ఆనంద్ కరాజ్ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. కొంకణి వేడుక కామ్‌గా, కూల్‌గా జరిగితే మరుసటి రోజు రణ్వీర్ వాళ్ల సంప్రదాయం ప్రకారం రణ్వీర్ ఎనర్జీ లెవల్స్ మ్యాచ్ అయ్యేలా మస్త్ హుషారుగా జరిగిందట. ఈ గ్రాండ్ వెడ్డింగ్ విశేషాలేంటంటే... పెళ్లి వేడుకకు హాజరైన అతిథులందరికీ సౌత్ స్టైల్లో ఫిల్టర్ కాఫీతో ఆహ్వానం పలికారట. ఈ పెళ్లి పనుల్లో ఇటలీ స్టాఫ్ అందరూ సౌత్ ఇండియన్ దుస్తులు ధరించారు. అతిథులకు విస్తరిలో వడ్డించారట. వంటలు రుచికరంగా ఉండాలని ఇండియా నుంచి చేయి తిరిగిన వంటగాళ్లను ఇటలీకి తీసుకువెళ్లారట. ఇక దీపికా, రణ్‌వీర్‌ల కొంకణి సంప్రదాయ వివాహం నాలుగు గంటలు సాగిందట. ఈ వేడుకలకు బలమైన సెక్యూరిటీని ఏర్పాటు చేశారట. పెళ్లి వేడుకలకు సంబంధించిన ఒక్క ఫొటో కూడా అధికారికంగా విడుదల చేసేవరకూ బయటకు రాలేదంటే ఎంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేశారో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే... దీప్‌వీర్ ఈ 21న బెంగళూరులో, 28న ముంబైలో వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఇంకా ఈ జంట హనీమూన్ వివరాలేవీ బయటకు రాలేదు. -
నాటకం వేసిన కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ : పట్టు వస్త్రాలు, ఆభరణాలు, కిరీటం, పెద్ద మీసం, రాజులాగా మేకప్.. హిందీలో ఏకధాటిగా డైలాగ్‌లు చెబుతూ ప్రేక్షకులను ఆలరించారు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్ష వర్ధన్. శుక్రవారం ఎర్రకోటలో నిర్వహించిన ‘రామ్‌లీలా’ నాటకంలో, హర్షవర్ధన్ మిథిల రాజు జనకుడి వేషం వేశారు. మీసం, మేకప్‌తో డ్రామా ఆర్టిస్ట్‌లాగానే తయారయ్యి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ కార్యక్రమంలో జనక మహారాజు వేషంలో పరిశుభ్రమైన పర్యావరణాన్ని ఏర్పరుచుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజెప్పారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛమైన వాతావరణంలో జీవించాలని కోరుకుంటారు.. గాలి స్వచ్ఛంగా మారితే అది ఆరోగ్యకరమైన జీవనానికి దారితీస్తుందని అన్నారు. కార్యక్రమం ప్రారంభానికే ముందే హర్షవర్ధన్ తాను రామ్‌లీలాలో నాటకంలో సీతా దేవి తండ్రి అయిన జనక మహారాజు పాత్ర వేస్తున్నట్లు ట్విటర్ ద్వారా వెల్లడించారు. హర్షవర్ధన్ గతంలో భోజ్‌పురి నటుడు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. #राजा_जनक के रूप में अपना किरदार देखकर मुझे आश्चर्य हुआ। यह शायद #मर्यादापुरुषोतमश्रीराम और माता #सीता के आर्शीवाद का ही परिणाम है कि मैं इस भूमिका को लोगों की आकांक्षाओं के मुताबिक निभा पाया। #RamLeela #रामलीला @BJP4India pic.twitter.com/JKjOgQZVzT — Dr. Harsh Vardhan (@drharshvardhan) October 12, 2018 -
అతను ది బెస్ట్ కిస్సర్
...అంటూ బోల్డ్‌గా సమాధానం చెప్పేశారు దీపికా పదుకొన్. ‘ఓగ్ బీఎఫ్ఎఫ్’ షోలో భాగంగా నేహా ధూపియా ‘ఇండస్ట్రీలో ది బెస్ట్ కిస్సర్ ఎవరు’ అని అడిగితే సూటిగా సుత్తి లేకుండా ‘రణ్వీర్ సింగ్ ఈజ్ ది బెస్ట్ కిస్సర్ ఇన్ బిజినెస్ (సినిమాలు)’ అని సమాధానం ఇచ్చారు దీపికా పదుకోన్. విశేషం ఏంటంటే... ఇదివరకు ఓసారి ఇదే ప్రశ్నను రణ్వీర్ సింగ్ ముందుంచితే ‘దీపిక పదుకోన్’ పేరే చెప్పారు. పేరు మాత్రమే చెప్పి ఊరుకోకుండా ‘‘కావాలంటే ‘రామ్‌లీల’ సినిమాలో ‘అంగ్ లగాదే..’ పాటలో మా కెమిస్ట్రీ చూడండి’’ అని ఓ ఎగ్జాంపుల్ కూడా చెప్పారు రణ్వీర్. ‘‘మీకు రణ్‌వీర్‌కు ఎంగేజ్మెంట్ అయిందట. నిజమేనా?’’ అని దీపికాను నేహా అడగ్గా.. ‘ఇంకా ఎంగేజ్ అవ్వలే దు’ అని తడుముకోకుండా అన్నారు. మేం నమ్మం.. ఏదీ.. మీ వేలు ఇలా చూపించండి’ అంటూ దీపిక చేతులను చెక్ చేశారు నేహా. ‘ఉంగరం వేలికి టాన్ లైన్ (ఉంగరం పెట్టుకున్న ఆనవాళ్లు) ఉందని తమాషా చేశారు నేహా ధూపియా. ఇదే షోలో దీపికాతో పాటు ఆమె సోదరి అనీషా పదుకోన్ కూడా పాల్గొన్నారు. ‘‘తను ఇప్పుడు కాదు.. నాలుగేళ్లుగా సక్సెస్‌ఫుల్‌గా ఎంగేజ్ అయ్యే ఉంది’’ అన్నారు అనీషా నవ్వేస్తూ. రణ్వీర్తో దీపిక ప్రేమలో పడి దాదాపు నాలుగేళ్లు అయ్యుంటుంది. ఆ విషయాన్నే ఈ విధంగా అనీషా చెప్పి ఉంటారని ఊహించవచ్చు. దీపికా ముక్కు, చెవికి కోటి! ఈ విషయం ఇలా ఉంచితే అన్ని అడ్డంకులు దాటుకొని ‘పద్మావత్’ సినిమా నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలంటూ కొందరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లు పై దాడులు చేస్తున్నారు. దీపికా పదుకోన్ ముక్కు,^ ð వి కోసి ఇస్తే కోటి రూపాయిలు నజరానా అని సంచలన వ్యాఖ్యలు చేశారు క్షత్రియ కమ్యూనిటీ ప్రెసిడెంట్ గజేంద్ర సింగ్. -
రాముడికి చలిగా ఉంది.. దుప్పట్లు ఇవ్వాలి
లక్నో: శీతాకాలంలో అయోధ్యలో బాల రాముడి (రామ్‌లల్లా)కి చలిపెడుతోందనీ, ఉన్ని దుస్తులు, దుప్పట్లు, రూమ్ హీటర్ కూడా ఇవ్వాలని విశ్వహిందూ పరిషత్ మంగళవారం డిమాండ్ చేసింది. చలి వాతావరణం నుంచి రక్షణ పొందేందుకు ఆయనకు ఇవి అవసరమని వీహెచ్‌పీ ప్రాంతీయ మీడియా ఇన్చార్జ్ శరద్ శర్మ అన్నారు. రాముడంటే కోట్లాది ప్రజల నమ్మకం, భక్తి అనీ, అలాంటి రాముణ్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత భక్తులందరిదీ అని ఆయన అన్నారు. రాముడి బాగోగులు చూసుకోడానికి అనేక హిందూ సంస్థలు, సాధువులు సిద్ధంగా ఉన్నారన్నారు. -
జైలుకెళ్లిన దిలీప్‌కు డబుల్ బొనాంజ
తిరువనంతపురం : ఎట్టకేలకు బెయిల్ లభించడంతో కాస్త ఉపశమనం పొందిన మళయాల నటుడు దిలీప్‌కు మరింత ఊరట లభించింది. ఆయన నటించిన చిత్రం రామలీలా చిత్రం విజయవంతంగా దూసుకెళుతోంది. ప్రేక్షకుల మదిని కొల్లగొడుతోంది. బెంగళూరు, చెన్నైతోసహా దక్షిణాదిన విడుదలైన ఈ చిత్రం రెండు రోజుల్లో రూ.4.61కోట్ల వసూళ్లు రాబట్టింది. రామలీలా చిత్రం పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఈ సినిమాకు అరుణ్ గోపి దర్శకత్వం వహించాడు. వాస్తవానికి ఈ చిత్రం ఎప్పుడో విడుదలవ్వాల్సి ఉన్నప్పటికీ దిలీప్ జైలుకు వెళ్లిన కారణంగా రెండుసార్లు వాయిదా పడింది. అయితే, అతడు విడుదలయ్యాకే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు. అయితే, దాదాపు నాలుగుసార్లు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ కూడా కోర్టు రద్దు చేయడంతో ఇక సినిమాపై ప్రభావం చూపించకుండా ఈ నెల సెప్టెంబర్ 28న విడుదల చేశారు. తాజాగా దిలీప్‌కు కూడా మంగళవారం బెయిల్ రావడంతో అతడికి రెండు శుభవార్తలు విన్నట్లయింది. -
ముచ్చటగా మూడోసారి కలిసి నటిస్తున్నారు
ప్రస్తుతం బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హాట్ పెయిర్ రణవీర్ సింగ్, దీపిక పదుకోణేలు. రామ్‌లీలా, బాజీరావ్ మస్తానీ లాంటి వరుస బ్లాక్ బస్టర్లతో ఆకట్టుకున్న ఈ పెయిర్, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కలిసి నటించడానికి రెడీ అవుతోంది. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతోనే కాదు, ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీతో కూడా ఆకట్టుకుంటున్న ఈ జోడి తమ సినిమాలో నటిస్తే ప్రమోషన్ పరంగా కూడా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు బాలీవుడ్ దర్శకనిర్మాతలు. బాజీరావ్ మస్తానీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఈ జంటను మూడోసారి తెర మీదకు తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్. తను వెడ్స్ మను సీరీస్‌తో పాటు రాంజానా సినిమాతో స్టార్ స్టేటస్ అందుకున్న ఆనంద్, తన నెక్ట్స్ సినిమా హ్యాపి భాగ్ జాయేగి కోసం రణవీర్, దీపికాల జోడిని సంప్రదించాడు. కథతో పాటు పారితోషికం కూడా నచ్చేయటంతో ఆ సినిమాకు ఒకే చెప్పేశారు హాట్ పెయిర్. త్వరలోనే ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
ఆ నిరసనలతో ఆడియెన్స్ పెరిగారు!
న్యూఢిల్లీ: టీవీ నటుడు గజేంద్రసింగ్ చౌహాన్ గుర్తుఉన్నారు కదా! పుణెలోని ప్రతిష్ఠాత్మక ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా ఆయనను ప్రకటించింది మొదలు నిరసనలు, ధర్నాలు హోరెత్తాయి. విద్యార్థులు పెద్దసంఖ్యలో తరగతులు బహిష్కరించి.. ధర్నాలు చేశారు. ఆయన నియామకంపై దేశవ్యాప్తంగా టీవీల్లో చర్చలు కూడా జరిగాయి. ఈ వివాదం ఆయనను బాగానే వెలుగులోకి తీసుకొచ్చినట్టు కనిపిస్తున్నది. ఢిల్లీలో ఆయన శివుడి పాత్ర వేస్తున్న నాటకానికి ప్రేక్షకులు భారీగా వస్తున్నారు. దసరా సందర్భంగా ఎర్రకోట సమీపంలో రామ్‌లీలా నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇందులో గజేంద్రసింగ్ చౌహాన్ శివుడుగా నటిస్తున్నారు. ఆయన పార్వతీదేవికి రాముడి ఇతివృత్తాన్ని వివరిస్తారు. ఈ నాటకంలో ఆయన పాత్రను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. "35 ఏండ్ల కెరీర్లో చాలా డైలాగులను నేను గుర్తుంచుకున్నాను. కానీ తొలిసారి రంగస్థలం మీద నటిస్తున్నాను. ఇక్కడ ప్రత్యక్షంగా నటించడం మినహా ఎలాంటి రీటేక్ లకు అవకాశం ఉండదు' అని గజేంద్ర చౌహాన్ ఈ సందర్భంగా చెప్పారు. ఆయన "మహాభారత్' సీరియల్లో ధర్మరాజు పాత్ర పోషించి టీవీ ప్రేక్షకులను అలరించారు. -
రామ్‌లీల ఆడియో హైలైట్స్
-
దండియా మస్తీ
శరద్కాంతులు రాకముందే సిటీలో నవరాత్రి సంబురాలు మొదలయ్యాయి. దాండియా ఆటలతో పడుచుల పాటలు పోటీపడ్డాయి. గార్బాడ్యాన్స్తో ఘాగ్రా, చోలీ డిజైనింగ్స్‌లో మెరిసిన మగువలు సందడి చేశారు. ‘ప్రీ నవరాత్రి వార్మప్’ సందర్భంగా శుక్రవారం ఎ లా లిబర్టీ బంకెట్ హాల్లో కళ్లు చెదిరే నృత్యంతో అదరహో అనిపించారు. సంజయ్‌లీలా భన్సాలీ రామ్‌లీలా మూవీలోని ఓ పాటకు బొమ్మ తుపాకులు చేతపట్టి యువతులు డ్యాన్స్ చేశారు. కొరియోగ్రాఫర్ మీనా మెహతా, శశి నహతా నిర్వహించిన ఈ కార్యక్రమం ఫ్యాషన్ రంగులద్దుకున్న సంప్రదాయ హంగులను ఏకకాలంలో కళ్లముందుంచింది. -
నా భర్తను సీఐ హత్య చేయించాడు
ఎస్ఐ సురేష్‌కుమార్‌రెడ్డి సతీమణి రామలీల ఆరోపణ సీఐ సస్పెన్షన్ ఓబులవారిపల్లె, అక్రమార్జనకు సహకరించక పోవడం వల్లే సీఐ రమాకాంత్ ఇద్దరు కానిస్టేబుళ్లతో కలసి తన భర్తను హత్య చేయించారని ఓబుల వారిపల్లె ఎస్ఐ నంద్యాల సురేష్ కుమార్‌రెడ్డి(27) భార్య రామలీల ఆరోపించారు. ప్రతినెలా ముడుపులు ముట్టజెప్పాలని సీఐ కోరేవాడని, ఇందుకు ఆయన నిరాకరించడంతో వేధించేవారని ఆమె తెలిపారు. వైఎస్సార్‌జిల్లా ఓబులవారిపల్లె ఎస్ఐ సురేష్‌కుమార్‌రెడ్డి సోమవారం సాయంత్రం తన గదిలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం విదితమే. మంగళవారం ఉదయం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించాలనే ప్రయత్నాలను మృతుడి బంధువులు అడ్డుకున్నారు. తన కింద పనిచేసే ఎస్ఐ మరణిస్తే కనీసం చూసేందుకు కూడా సీఐ రాలేదని, అతనే ఈ హత్య చేయించాడని వారు ఆరోపించారు. తమకు న్యాయం చేసే వరకు మృతదేహాన్ని తరలించేదిలేదని అడ్డుకున్నారు. ఈ మేరకు వారు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. డీఐజీ మురళీకృష్ణ, ఎస్పీ అశోక్‌కుమార్ మృతుడి బంధువులకు సర్దిచెప్పేందుకు యత్నించారు. ఈ విషయాన్ని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ దృష్టికి తీసుకెళ్లామని ఆయన ఆదేశాల మేరకు సీఐని సస్పెండ్ చేసినట్లు చెప్పడంతో వారు శాంతించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతామని జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. -
రామ్‌లీలాకు సర్టిఫికెట్ ఇవ్వడానికి బుర్రలేదా: బాంబే హైకోర్టు
సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన ప్రణయ దృశ్య కావ్యం 'రామ్‌లీలా'కు సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు అసలు సీబీఎఫ్సీ బుర్రపెట్టి ఆలోచించిందో లేదో చూసుకోవాలని బాబే హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆ చిత్రానికి అసలు యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వచ్చా లేదా అనే విషయాన్ని పునఃపరిశీలించాలని ఆదేశించింది. దీపికా పదుకొనే, రణ్‌బీర్ సింగ్‌ల మధ్య హాట్ హాట్ సన్నివేశాలు, ముద్దు సీన్లు నిండా ఉన్న ఈ చిత్రంపై హైకోర్టు డివిజన్ బెంచి న్యాయమూర్తులు జస్టిస్ వీఎం కనడే, జస్టిస్ ఎంఎస్ సోనక్ తీవ్రంగా స్పందించారు. సినిమాటోగ్రఫీ చట్టంలోని నిబంధనలను ఓసారి మళ్లీ చూసి, ఆ సినిమాలకు సర్టిఫికెట్ ఇవ్వచ్చో లేదో చెప్పాలన్నారు. నిబంధనలకు అనుగుణంగానే తాము సర్టిఫికెట్ ఇచ్చినట్లు సీబీఎఫ్సీ చెప్పినా, బుర్రపెట్టి ఆలోచించినట్లు లేదని కోర్టు వ్యాఖ్యానించింది. శ్రీ మహారాష్ట్ర రామ్‌లాలా మండల్ ఉపాధ్యక్షుడు సందీప్ శుక్లా దాఖలుచేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ సంస్థ ప్రతియేటా ఆజాద్ మైదాన్‌లో నవరాత్రుల సందర్భంగా రామ్‌లాలా ఉత్సవం చేపడుతుంది. అసలా చిత్రం పేరే తప్పుదోవ పట్టించేలా ఉందని శుక్లా తన పిటిషన్లో పేర్కొన్నారు. -
ఐటమ్ సాంగ్‌లో హాట్ హాట్‌గా...
షేక్స్పియర్ రచించిన అద్భుత నాటకాల్లో ‘రోమియో జూలియట్’కి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నాటకం ఆధారంగా సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రామ్‌లీలా’. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన రణవీర్, దీపికాల రొమాంటిక్ పోస్టర్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో ఉన్న ఓ ఐటమ్ సాంగ్‌కు ప్రియాంక చోప్రా కాలు కదిపారు. ముంబయ్‌లోని ఫిల్మ్ సిటీ స్టూడియోస్‌లో రూపొందించిన ఓ భారీ సెట్లో ఈ పాటను చిత్రీకరించారు. విష్ణు దేవా నృత్యదర్శకత్వంలో రూపొందిన ఈ పాటలో ప్రియాంక అదిరిపోయే స్టెప్స్ వేశారట. ఆమె చాలా హాట్‌గా కనిపించనుందని సమాచారం. ఈ ఐటమ్ సాంగ్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని యూనిట్ సభ్యులు అంటున్నారు. నవంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
దీపికా పదుకోనె, రణ్ వీర్ సింగ్ కెమిస్ట్రీ అదుర్స్!
సంజయ్ లీలా భన్సాలీ రూపొందిస్తున్న రాంలీలా చిత్ర ట్రైలర్స్ ను ఇటీవల ఆవిష్కరించారు. ట్రైలర్ ఆవిష్కరణ సందర్భంగా దీపికా, రణ్ వీర్ లో హడావిడి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. వేదికపై వారిద్దరి మధ్య కెమిస్ట్రీ గురించి బాలీవుడ్ తోపాటు మీడియా కూడా పలు రకాలుగా మాట్లాడుకుంటోంది. -
'రాంలీలా'లో దీపికా, రణ్ వీర్ ల శృంగార లీలలు!
బాలీవుడ్ లో బెంగళూరు భామ దీపికా పదుకోనె, రాణ్ వీర్ సింగ్ ల మధ్య తెరమీదే కాకుండా బయటకూడా ప్రేమాయణం జోరుగానే సాగుతోందని ముంబై సినీ బజార్ లో రూమర్లు ఇటీవల కాలంలో జోరుగా షికారు చేస్తున్నాయి. బాలీవుడ్ లో ఏ నోట విన్నా దీపికా, రణ్ వీర్ ల హల్ చల్ గురించేనని మీడియా కోడైకూస్తోంది. వీరిద్దరూ కలిసి సంజయ్ లీలా భన్సాలీ రూపొందిస్తున్న రామ్ లీలా చిత్రంలో నటిస్తున్నారు.ఇటీవల దీపికా, రణ్ వీర్ లపై హాట్ హాట్ గా లవ్ సీన్లను షూటింగ్ చేశారన్న వార్త బాలీవుడ్ లో సెన్సెషనల్ టాపిక్ గా మారింది. ఓ అందమైన చారిత్రాత్మక ప్రేమకథా చిత్రంగా రూపొందిస్తున్న రామ్ లీలా చిత్రంలో రామ్ పాత్రలో రణ్ వీర్, గుజరాతీ అమ్మాయి లీలాగా దీపికా నటిస్తోంది. భారీ అంచనాలు ఈ చిత్రం నవంబర్ లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా ఓ ఐటమ్ సాంగ్ లో నర్తించింది.