ముచ్చటగా మూడోసారి కలిసి నటిస్తున్నారు | deepika padukone, ranavir singh to come together for happy bhag jayegi | Sakshi
Sakshi News home page

ముచ్చటగా మూడోసారి కలిసి నటిస్తున్నారు

Published Sun, Jan 10 2016 10:10 AM | Last Updated on Sun, Sep 3 2017 3:26 PM

ముచ్చటగా మూడోసారి కలిసి నటిస్తున్నారు

ముచ్చటగా మూడోసారి కలిసి నటిస్తున్నారు

ప్రస్తుతం బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హాట్ పెయిర్ రణవీర్ సింగ్, దీపిక పదుకోణేలు. రామ్లీలా, బాజీరావ్ మస్తానీ లాంటి వరుస బ్లాక్ బస్టర్లతో ఆకట్టుకున్న ఈ పెయిర్, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కలిసి నటించడానికి రెడీ అవుతోంది. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతోనే కాదు, ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీతో కూడా ఆకట్టుకుంటున్న ఈ జోడి తమ సినిమాలో నటిస్తే ప్రమోషన్ పరంగా కూడా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు బాలీవుడ్ దర్శకనిర్మాతలు.

బాజీరావ్ మస్తానీ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న ఈ జంటను మూడోసారి తెర మీదకు తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్. తను వెడ్స్ మను సీరీస్తో పాటు రాంజానా సినిమాతో స్టార్ స్టేటస్ అందుకున్న ఆనంద్, తన నెక్ట్స్ సినిమా హ్యాపి భాగ్ జాయేగి కోసం రణవీర్, దీపికాల జోడిని సంప్రదించాడు. కథతో పాటు పారితోషికం కూడా నచ్చేయటంతో ఆ సినిమాకు ఒకే చెప్పేశారు హాట్ పెయిర్. త్వరలోనే ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement