bajirao masthani
-
శాతకర్ణి విజువల్స్ కాపీనా..?
నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అతి తక్కువ సమయంలో షూటింగ్ పూర్తి చేసుకుంది. చారిత్రక కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా.. భారీ యుద్ధ సన్నివేశాలతో కలిపి మొత్తం షూటింగ్‌ను నాలుగు నెలల లోపే పూర్తి చేశారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుండటంతో.. ఇంత తక్కువ సమయంలో ఇంత గ్రాండ్ విజువల్స్ ఎలా సాధ్యమయ్యాయన్న అనుమానం వ్యక్తమవుతోంది. అంతేకాదు గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా కోసం బాజీరావ్ మస్తానీ సినిమాలోని విజువల్స్‌ను, గ్రాఫిక్స్‌ను వాడుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. బాజీరావ్ మస్తానీ సినిమాలోని విజువల్స్ వాడుకునేందుకు ఆ సినిమా దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ నుంచి క్రిష్ ముందుగానే పర్మిషన్ కూడా తీసుకున్నాడట. గతంలో సంజయ్ నిర్మాతగా తెరకెక్కించిన గబ్బర్ ఈజ్ బ్యాక్ సినిమాతో క్రిష్ బాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ అనుబంధం తోనే గ్రాఫిక్స్ విషయంలో సంజయ్ సాయం చేశాడన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ప్రచారాన్ని గౌతమీపుత్ర శాతకర్ణి యూనిట్ కొట్టి పారేస్తోంది. ట్రైలర్లో కనిపించిన విజువల్స్ అన్ని ఈ సినిమా కోసం స్పెషల్‌గా క్రియేట్ చేసినవే గాని.., కాపీ చేసినవి కాదని తేల్చి చెపుతోంది. బాలయ్య సరసన శ్రియ హీరోయిన్గా నటిస్తున్న., ఈ సినిమాలో బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలిని కీలక పాత్రలో నటిస్తోంది. -
ఉంగరాలు మార్చుకున్న హీరో, హీరోయిన్?
-
ఉంగరాలు మార్చుకున్న దీపికా, రణవీర్..?
బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న హాట్ బ్యూటి, దీపిక పదుకొనె. ప్రస్తుతం ఈ భామకు సంబంధించిన ఓ వార్త సినీ అభిమానులకు షాక్ ఇస్తోంది. చాలా రోజులుగా బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్‌తో సన్నిహితంగా ఉంటున్న దీపికకు ఇప్పుడు నిశ్చితార్థం జరిగిందన్న వార్త నార్త్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు తమ ప్రేమ విషయంపై ఎలాంటి కామెంట్ చేయని ఈ జంట.. తాజాగా అత్యంత సన్నిహితుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారట. ప్రస్తుతం ఇద్దరి కెరీర్లు మంచి ఫాంలో ఉండటంతో ఇప్పుడే పెళ్లి చేసుకోవటం కరెక్ట్ కాదని భావిస్తున్న ఈ జంట.., నిశ్చితార్ధం విషయాన్ని కూడా రహస్యంగా ఉంచాలని నిర్ణయించుకుందట. మరి ఈ ఎంగేజ్ మెంట్ వార్తలపై అయినా బాజీరావ్ మస్థానీలు స్పందిస్తారో.. లేదో..? -
బన్సాలీ సినిమాగా మరో చారిత్రక ప్రేమకథ
రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాకు దూరంగా విషాదాంత ప్రేమకథలను భారీగా తెరకెక్కించే దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ. దేవదాస్, రామ్ లీలా లాంటి ప్రేమకథలను తెరకెక్కించిన బన్సాలీ తన తాజా చిత్రం బాజీరావ్ మస్థానీతో జాతీయ అవార్డును సైతం సాధించాడు. తన ప్రతీ సినిమాను భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించే బన్సాలీ మరో చారిత్రక ప్రేమకథకు వెండితెర రూపం ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ జీవితం ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నాడు బన్సాలీ. 1296 నుంచి 1316 మధ్య కాలంలో ఢిల్లీని పరిపాలించిన అల్లావుద్దీన్ ఖిల్జీ, మేవార్ రాణి పద్మావతిని ప్రేమించాడు. ఈ ప్రేమకథనే నెక్ట్స్ సినిమాకు కథగా తీసుకున్నాడు బన్సాలీ. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. 2017 డిసెంబర్ 15న ఈ సినిమాను రిలీజ్ చేయడనికి ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే నటీనటుల ఎంపిక జరగనుంది. -
ముచ్చటగా మూడోసారి కలిసి నటిస్తున్నారు
ప్రస్తుతం బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హాట్ పెయిర్ రణవీర్ సింగ్, దీపిక పదుకోణేలు. రామ్‌లీలా, బాజీరావ్ మస్తానీ లాంటి వరుస బ్లాక్ బస్టర్లతో ఆకట్టుకున్న ఈ పెయిర్, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కలిసి నటించడానికి రెడీ అవుతోంది. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతోనే కాదు, ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీతో కూడా ఆకట్టుకుంటున్న ఈ జోడి తమ సినిమాలో నటిస్తే ప్రమోషన్ పరంగా కూడా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు బాలీవుడ్ దర్శకనిర్మాతలు. బాజీరావ్ మస్తానీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఈ జంటను మూడోసారి తెర మీదకు తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్. తను వెడ్స్ మను సీరీస్‌తో పాటు రాంజానా సినిమాతో స్టార్ స్టేటస్ అందుకున్న ఆనంద్, తన నెక్ట్స్ సినిమా హ్యాపి భాగ్ జాయేగి కోసం రణవీర్, దీపికాల జోడిని సంప్రదించాడు. కథతో పాటు పారితోషికం కూడా నచ్చేయటంతో ఆ సినిమాకు ఒకే చెప్పేశారు హాట్ పెయిర్. త్వరలోనే ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
'బాహుబలి 2 ఫస్ట్ డే చూస్తా..!'
రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి పార్ట్ 2, బాలీవుడ్ లో కూడా ఆసక్తిరేకెత్తిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విషయాన్ని యంగ్ హీరో రణ్వీర్ సింగ్ స్వయంగా వెల్లడించారు. ఇటీవల పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన బాజీరావ్ మస్తానీ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన రణ్వీర్ ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. బాజీరావ్ మస్తానీ సినిమా చూసిన టాలీవుడ్ మ్యాన్లీ హీరో రానా.. ఇన్నాళ్లు స్టార్ గా ఉన్న రణ్వీర్ ఇక సూపర్ స్టార్ అవుతాడు అంటూ ట్వీట్ చేశాడు. రానా ట్వీట్ కు కృతజ్ఞతలు తెలియజేసిన రణ్వీర్, బాహుబలి పార్ట్ షూటింగ్ మొదలైందనుకుంటాను.. ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్న తొలిరోజే బాహుబలి 2 చూస్తాను అంటూ రిప్లై ఇచ్చాడు. ఇలా అన్ని ఇండస్ట్రీల జనాలు ఆసక్తిగా ఎదరుచూస్తున్న బాహుబలి ప్రేక్షకుల ముందుకు రావాలంటే మాత్రం మరో ఏడాదిన్నర కాలం ఆగాల్సిందే. Star then and now a SUPERSTAR!! Great going!! Part 2 Coming soon. Good luck with your next @RanveerOfficial https://t.co/kmzcvpUE1D — Rana Daggubati (@RanaDaggubati) December 25, 2015 -
'బాజీరావ్ మస్తానీ' మూవీ రివ్యూ
టైటిల్: బాజీరావ్ మస్తానీ జానర్: హిస్టారికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తారాగణం: రణవీర్ సింగ్, దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా, మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం, నిర్మాత, సంగీతం: సంజయ్ లీలా బన్సాలీ తన ప్రతీ సినిమా ఓ పెయింటింగ్‌లా ఉండాలని కష్టపడే సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన మరో భారీ సినిమా బాజీరావ్ మస్తానీ. రామ్‌లీలా లాంటి రొమాంటిక్ ఎంటర్ టైనర్ తరువాత తన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చారిత్రక నేపథ్యాన్ని ఎంచుకున్నాడు సంజయ్. తన మార్క్ పొయెటిక్ నేరేషన్‌తో పాటు, గ్రాండ్‌గా తెరకెక్కించిన బాజీరావ్ మస్తానీ అభిమానులను ఆకట్టుకుందా...? కథ : పీష్వా బాజీరావ్‌గా ప్రసిద్ధి పొందిన బాజీరావ్ బల్లాల భట్ ఓటమే ఎరుగని యుద్ధవీరుడు. దాదాపు 40 యుద్ధాలలో అప్రతిహతంగా విజయాలు సాధించిన ఘనత ఆయనది. ఢిల్లీ సింహాసనం నుంచి మొఘల్ రాజులను దించేశాక.. అఖండ భారతాన్ని పరిపాలించాలని నిశ్చయించుకుంటాడు బాజీరావ్. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే సమయంలో తన కుటుంబసభ్యులతో కూడా పోరాడాల్సి వస్తుంది. సంప్రదాయ కుటుంబంలో పుట్టిన బాజీరావ్.. మస్తానీ అనే ముస్లిం యువతితో ప్రేమలో పడతాడు. బాజీరావ్కు అప్పటికే కాశీబాయ్తో పెళ్లవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బాజీరావ్ యుద్ధంతో పాటు తన ప్రేమలోనూ ఎలా విజయం సాధించాడన్నదే మిగతా కథ. విశ్లేషణ : రామ్‌లీలా సినిమాలో సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకున్న రణవీర్, దీపికాల జంట మరోసారి ఆకట్టుకుంది. బాజీరావ్‌గా రణవీర్ అద్భుతమైన నటన కనబరిచాడు. హావభావాలతో పాటు మరాఠీ యాసలో డైలాగ్‌లను చెప్పి మెప్పించాడు. తొలిసారిగా మేకప్ లేకుండా నటించిన దీపికా కూడా నటనపరంగా మంచి మార్కులే కొట్టేసింది. గ్లామరస్‌గా కనిపిస్తూనే నటనతోనూ ఆకట్టుకుంది. పాత్రపరంగా పెద్దగా అవకాశం లేకపోవటంతో ప్రియాంక చోప్రా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తన ప్రతి సినిమాలో చూపించినట్టే గ్రాండ్ విజువల్స్‌తో కనికట్టు చేసే ప్రయత్నం చేశాడు సంజయ్ లీలా బన్సాలీ. విజువల్‌గా ఆకట్టుకున్నా.. కథా కథనాల పరంగా మాత్రం ఆశించిన స్థాయి అందుకోలేకపోయాడు. హిస్టారికల్ వార్ డ్రామాకు కావాల్సిన వేగం ఈ సినిమాలో కనిపించలేదు. ఇలాంటి చిత్రాలకు ప్రాణం పోయాల్సిన మ్యూజిక్ విషయంలో కూడా బాజీరావ్ మస్తానీ తీవ్రంగా నిరాశపరిచింది. ప్లస్ యింట్స్ : రణవీర్ సింగ్, దీపికా పదుకొనే భారీ సెట్టింగులు సినిమాటోగ్రఫి మైనస్ పాయింట్స్ : క్లారిటీ లేని కథనం స్లో నేరేషన్ ఓవరాల్‌గా 'బాజీరావ్ మస్తానీ' విజువల్ ట్రీట్ తప్ప విషయం లేని హిస్టారికల్ ప్రేమకథ -
హీరో, దర్శకుడిపై ఎఫ్ఐఆర్
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బాలీవుడ్ భారీ సినిమా బాజీరావ్ మస్థానీ హీరో, దర్శకులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన ఓ చిన్న వివాదంతో హీరో, దర్శకుడిపై కేసు నమోదు చేశారు. పూణెకు చెందిన ఓ న్యాయవాది... అక్టోబర్ 16 వీరిపై కేసు వేశాడు. అనుమతి లేకుండా చేస్తున్న షూటింగ్‌ను అడ్డుకున్న తనపై బౌన్సర్స్‌తో దాడి చేయించారంటూ అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న బాజీరావ్ మస్థానీ సినిమాలో రణ్వీర్ సింగ్ సరసన దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిసెంబర్లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది.