'బాహుబలి 2 ఫస్ట్ డే చూస్తా..!' | i will watch bahubali 2 on first day : ranveer | Sakshi
Sakshi News home page

'బాహుబలి 2 ఫస్ట్ డే చూస్తా..!'

Published Sun, Dec 27 2015 6:08 PM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

'బాహుబలి 2 ఫస్ట్ డే చూస్తా..!' - Sakshi

'బాహుబలి 2 ఫస్ట్ డే చూస్తా..!'

రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి పార్ట్ 2, బాలీవుడ్ లో కూడా ఆసక్తిరేకెత్తిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విషయాన్ని యంగ్ హీరో రణ్వీర్ సింగ్ స్వయంగా వెల్లడించారు. ఇటీవల పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన బాజీరావ్ మస్తానీ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన రణ్వీర్ ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.

బాజీరావ్ మస్తానీ సినిమా చూసిన టాలీవుడ్ మ్యాన్లీ హీరో రానా.. ఇన్నాళ్లు స్టార్ గా ఉన్న రణ్వీర్ ఇక సూపర్ స్టార్ అవుతాడు అంటూ ట్వీట్ చేశాడు. రానా ట్వీట్ కు కృతజ్ఞతలు తెలియజేసిన రణ్వీర్, బాహుబలి పార్ట్ షూటింగ్ మొదలైందనుకుంటాను.. ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్న తొలిరోజే బాహుబలి 2 చూస్తాను అంటూ రిప్లై ఇచ్చాడు. ఇలా అన్ని ఇండస్ట్రీల జనాలు ఆసక్తిగా ఎదరుచూస్తున్న బాహుబలి ప్రేక్షకుల ముందుకు రావాలంటే మాత్రం మరో ఏడాదిన్నర కాలం ఆగాల్సిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement