ఇట్స్‌ షో టైమ్‌ | Prabhas to fly to London with Anushka | Sakshi
Sakshi News home page

ఇట్స్‌ షో టైమ్‌

Published Thu, Jul 25 2019 12:50 AM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

Prabhas to fly to London with Anushka - Sakshi

‘బాహుబలి 2’ పోస్టర్‌

డైరెక్టర్‌ రాజమౌళి, హీరో హీరోయిన్లు ప్రభాస్, రానా, అనుష్క మరోసారి ఒకే వేదికపైకి రాబోతున్నారు. ఈ ‘బాహుబలి’ టీమ్‌ రీ యూనియన్‌ ‘బాహుబలి –3’ కోసమా? అని మాత్రం అడక్కండి. ఈ విషయానికి రాజమౌళీయే సమాధానం చెప్పాలి. ఇప్పుడు మాత్రం వీరందరూ ఒకే వేదికను పంచుకోబోతున్నది లండన్‌లోని రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో ప్రదర్శించబోయే ‘బాహుబలి: ది బిగినింగ్‌’ షో కోసం. ‘‘ఈ ఏడాది అక్టోబర్‌ 19న సాయంత్రం ఏడు గంటలకు ‘బాహుబలి’ సినిమా ప్రదర్శించబడుతుంది.

సినిమాలో నటించిన ప్రభాస్, అనుష్క, రానా వస్తారు. షో తర్వాత రాజమౌళితో ప్రశ్నోత్త్తరాల సమయం ఉంటుంది’’ అని ఈ విషయాన్ని రాయల్‌ ఆల్బర్ట్‌ హల్‌ ప్రతినిధులు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఇక ప్రపంచవ్యాప్త గుర్తింపుతో ‘బాహుబలి’ సినిమా ఇండస్ట్రీలో కొత్త రికార్డులను సృష్టించిన సంగతి తెలిసిందే. రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌ విషయానికి వస్తే....1871లో క్వీన్‌ విక్టోరియా ఈ హాల్‌ను స్టార్ట్‌ చేశారు. బ్రిటన్‌కు చెందిన ముఖ్య సాంస్కృతిక కార్యక్రమాలకు ఈ వేదికనే ఎక్కువగా ఉపయోగిస్తారట. వివిధ రంగాలకు చెందిన ఎంతోమంది అంతర్జాతీయ ప్రముఖులు ఈ వేదికపై తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ హాల్‌ సీటింగ్‌ సామర్థ్యం ఎంతో తెలుసా.... 5,267.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement