తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సినిమా 'బాహుబలి'. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండియన్ సినిమా రికార్డులను బద్దలు కొట్టింది. ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఇప్పటికే రెండు భాగాలుగా తెరకెక్కిన బాహుబలి సినిమాపై తాజాగా ఓక్రేజీ రూమర్ చక్కర్లు కొడుతుంది.
త్వరలోనే బాహుబలి పార్ట్-3 రానుందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ ఈ వార్తలపై స్పందిస్తూ.. పార్ట్-3 గురించి నాకు కూడా తెలియదు. సమయం వచ్చినప్పుడు ఏదైనా జరగొచ్చు అని హింట్ ఇచ్చేశారు. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ ప్రమోషన్స్‌లో పాల్గొన్న రాజమౌళి దీనిపై క్లారిటీ ఇచ్చారు.
'బాహుబలి-3 రానుందని భావించవచ్చా అని అడగ్గా.. తప్పకుండా భావించవచ్చు. బాహుబలి చుట్టూ జరిగే ఎన్నో సంఘటనల్ని చూపించనున్నాం. దానిపై వర్క్ చేస్తున్నాం. నిర్మాత శోభు యార్లగడ్డ కూడా సుముఖంగా ఉన్నారు. దాన్ని తీయడానికి కాస్త టైం పట్టొచ్చు..కానీ బాహుబలి రాజ్యం నుంచి ఆసక్తికర వార్త రానుంది' అని వివరించారు. దీంతో త్వరలోనే బాహుబలి-3పై అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment