
దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి సృష్టించిన కళాఖండం ‘బాహుబలి’. తెలుగు చిత్ర పరిశ్రమ ఔన్నత్యాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన సినిమా. భారతీయ చిత్ర పరిశ్రమలోనే బాహుబలి ఒక సంచలనాన్ని క్రియేట్ చేసింది. భారీ బడ్జెత్‌తో రెండు భాగాలుగా తెరకెక్కించిన ఈ సినిమా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేగాక ఎన్నో రికార్డులు, అవార్డులు అందుకొని బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లో ఉత్తమ సినిమాగా నిలిచింది. అనుష్క, తమన్నా, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఈ రోజుతో ప్రత్యేక అనుబంధం ఉంది. (‘రాజ్ కపూర్ తర్వాత ప్రభాస్‌కే’)
బాహుబలి షూటింగ్ ప్రారంభమయ్యి నేటికి ఏడేళ్లు పూర్తవుతోంది. ఈ విషయాన్ని బాహుబలి టీమ్ తన ట్విటర్‌లో ఖాతాలో పేర్కొంది. బాహుబలి షూటింగ్ 2013 జూలై 6న ప్రారంభమైంది. ఈ సినిమా ఫస్ట్ డే షూటింగ్‌ను కర్నూలులోని రాక్ గార్డెన్స్ వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్, అభిమానులు ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. (మాహిష్మతీ రాజ్యమైనా అవి తప్పవు..)
July 6, 2013. The moment when it all began!
— Baahubali (@BaahubaliMovie) July 6, 2020
We started the shoot of #Baahubali on this day 7 years ago... ✊🏻 pic.twitter.com/JQmbRuplki