Prabhas's Radhe Shyam Movie New Update: Rana Played Guest Role in Prabhas Upcoming Movie - Sakshi Telugu
Sakshi News home page

ప్రభాస్‌ సినిమాలో కనిపించనున్న రానా!

Published Tue, Jun 30 2020 1:53 PM | Last Updated on Tue, Jun 30 2020 2:53 PM

Rana Special Guest Role In Prabas New Movie - Sakshi

రానా, ప్రభాస్‌ కలిసి నటించిన బాహుబాలి ఎంత సూపర్‌ డూపర్‌ హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్‌ తాజాగా ఒక పీరియాడిక్‌ లవ్‌ స్టోరీలో నటించబోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు ‘రాధే శ్యామ్‌’ అనే టైటిల్‌ పెట్టే యోచనలో చిత్ర యూనిట్‌ ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్‌ను జూలై రెండో వారం నుంచి రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. (ప్రేక్షకులు ఆమోదిస్తేనే స్టార్స్‌ అవుతారు)

ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం టాలీవుడ్‌ సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది. బాహుబలిలో భల్లాల దేవగా ప్రభాస్‌తో కలిసి నటించి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రానా ఇప్పుడు రాధేశ్యామ్‌ సినిమాలో గెస్ట్‌రోల్‌ చేయబోతున్నట్లు ఫిల్మ్‌నగర్‌ టాక్‌. అయితే కేవలం రెండు నిమిషాల పాటు మాత్రమే రానా ఈ సినిమాలో కనిపించనున్నాడట. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన పూజా హెగ్డె నటించనున్నారు. యువీ క్రియేషన్స్‌, గోపి కృష్ణ మూవీస్‌ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి. ఈ సినిమా కూడా వివిధ భాషల్లో రిలీజ్‌ కాబోతుంది. (రానా, రవితేజలను డైరెక్ట్‌ చేయబోయేది అతడే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement