
ఉంగరాలు మార్చుకున్న దీపికా, రణవీర్..?
బాలీవుడ్తో పాటు హాలీవుడ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న హాట్ బ్యూటి, దీపిక పదుకొనె. ప్రస్తుతం ఈ భామకు సంబంధించిన ఓ వార్త సినీ అభిమానులకు షాక్ ఇస్తోంది. చాలా రోజులుగా బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్తో సన్నిహితంగా ఉంటున్న దీపికకు ఇప్పుడు నిశ్చితార్థం జరిగిందన్న వార్త నార్త్లో హాట్ టాపిక్గా మారింది.
ఇప్పటి వరకు తమ ప్రేమ విషయంపై ఎలాంటి కామెంట్ చేయని ఈ జంట.. తాజాగా అత్యంత సన్నిహితుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారట. ప్రస్తుతం ఇద్దరి కెరీర్లు మంచి ఫాంలో ఉండటంతో ఇప్పుడే పెళ్లి చేసుకోవటం కరెక్ట్ కాదని భావిస్తున్న ఈ జంట.., నిశ్చితార్ధం విషయాన్ని కూడా రహస్యంగా ఉంచాలని నిర్ణయించుకుందట. మరి ఈ ఎంగేజ్ మెంట్ వార్తలపై అయినా బాజీరావ్ మస్థానీలు స్పందిస్తారో.. లేదో..?