హీరో, దర్శకుడిపై ఎఫ్ఐఆర్ | fir rolled on bajirao masthani Hero and director | Sakshi
Sakshi News home page

హీరో, దర్శకుడిపై ఎఫ్ఐఆర్

Published Tue, Oct 20 2015 10:20 AM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM

హీరో, దర్శకుడిపై ఎఫ్ఐఆర్ - Sakshi

హీరో, దర్శకుడిపై ఎఫ్ఐఆర్

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బాలీవుడ్ భారీ సినిమా బాజీరావ్ మస్థానీ హీరో, దర్శకులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన ఓ చిన్న వివాదంతో హీరో, దర్శకుడిపై కేసు నమోదు చేశారు. పూణెకు చెందిన ఓ న్యాయవాది... అక్టోబర్ 16 వీరిపై కేసు వేశాడు.

అనుమతి లేకుండా చేస్తున్న షూటింగ్ను అడ్డుకున్న తనపై బౌన్సర్స్తో దాడి చేయించారంటూ అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న బాజీరావ్ మస్థానీ సినిమాలో రణ్వీర్ సింగ్ సరసన దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిసెంబర్లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement