జైలుకెళ్లిన దిలీప్‌కు డబుల్‌ బొనాంజ | Dileep's Ramaleela is a hit, some relief for the jailed actor | Sakshi
Sakshi News home page

జైలుకెళ్లిన దిలీప్‌కు డబుల్‌ బొనాంజ

Published Tue, Oct 3 2017 3:12 PM | Last Updated on Fri, Sep 28 2018 4:15 PM

Dileep's Ramaleela is a hit, some relief for the jailed actor - Sakshi

తిరువనంతపురం : ఎట్టకేలకు బెయిల్‌ లభించడంతో కాస్త ఉపశమనం పొందిన మళయాల నటుడు దిలీప్‌కు మరింత ఊరట లభించింది. ఆయన నటించిన చిత్రం రామలీలా చిత్రం విజయవంతంగా దూసుకెళుతోంది. ప్రేక్షకుల మదిని కొల్లగొడుతోంది. బెంగళూరు, చెన్నైతోసహా దక్షిణాదిన విడుదలైన ఈ చిత్రం రెండు రోజుల్లో రూ.4.61కోట్ల వసూళ్లు రాబట్టింది. రామలీలా చిత్రం పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఈ సినిమాకు అరుణ్‌ గోపి దర్శకత్వం వహించాడు.

వాస్తవానికి ఈ చిత్రం ఎప్పుడో విడుదలవ్వాల్సి ఉన్నప్పటికీ దిలీప్‌ జైలుకు వెళ్లిన కారణంగా రెండుసార్లు వాయిదా పడింది. అయితే, అతడు విడుదలయ్యాకే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు. అయితే, దాదాపు నాలుగుసార్లు పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ కూడా కోర్టు రద్దు చేయడంతో ఇక సినిమాపై ప్రభావం చూపించకుండా ఈ నెల సెప్టెంబర్‌ 28న విడుదల చేశారు. తాజాగా దిలీప్‌కు కూడా మంగళవారం బెయిల్‌ రావడంతో అతడికి రెండు శుభవార్తలు విన్నట్లయింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement