ఐటమ్ సాంగ్‌లో హాట్ హాట్‌గా...
షేక్స్‌పియర్ రచించిన అద్భుత నాటకాల్లో ‘రోమియో జూలియట్’కి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నాటకం ఆధారంగా సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రామ్‌లీలా’. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన రణవీర్, దీపికాల రొమాంటిక్ పోస్టర్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ చిత్రంలో ఉన్న ఓ ఐటమ్ సాంగ్‌కు ప్రియాంక చోప్రా కాలు కదిపారు. ముంబయ్‌లోని ఫిల్మ్ సిటీ స్టూడియోస్‌లో రూపొందించిన ఓ భారీ సెట్‌లో ఈ పాటను చిత్రీకరించారు. విష్ణు దేవా నృత్యదర్శకత్వంలో రూపొందిన ఈ పాటలో ప్రియాంక అదిరిపోయే స్టెప్స్ వేశారట.
ఆమె చాలా హాట్‌గా కనిపించనుందని సమాచారం. ఈ ఐటమ్ సాంగ్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని యూనిట్ సభ్యులు అంటున్నారు. నవంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.