
లక్నో: శీతాకాలంలో అయోధ్యలో బాల రాముడి (రామ్‌లల్లా)కి చలిపెడుతోందనీ, ఉన్ని దుస్తులు, దుప్పట్లు, రూమ్ హీటర్ కూడా ఇవ్వాలని విశ్వహిందూ పరిషత్ మంగళవారం డిమాండ్ చేసింది. చలి వాతావరణం నుంచి రక్షణ పొందేందుకు ఆయనకు ఇవి అవసరమని వీహెచ్‌పీ ప్రాంతీయ మీడియా ఇన్‌చార్జ్ శరద్ శర్మ అన్నారు. రాముడంటే కోట్లాది ప్రజల నమ్మకం, భక్తి అనీ, అలాంటి రాముణ్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత భక్తులందరిదీ అని ఆయన అన్నారు. రాముడి బాగోగులు చూసుకోడానికి అనేక హిందూ సంస్థలు, సాధువులు సిద్ధంగా ఉన్నారన్నారు.