Blankets
-
ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. 110 విమానాలు ఆలస్యం
ఢిల్లీ: దేశ రాజధానిలో చలి బెంబేలెత్తిస్తోంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడంతో విపరీతంగా చలి పెరుగుతోంది. దీనికితోడు పొగమంచు దట్టంగా వ్యాపిస్తోంది. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌లలోనూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ఉత్తర భారతదేశమంతటా చలిగాలులు వీస్తున్నాయి. #WATCH | Dense fog covers parts of national capital as cold wave continues. (Visuals from Dhaula Kuan area, shot at 6:15 am) pic.twitter.com/MneDB9QmJC — ANI (@ANI) December 27, 2023 పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తర మధ్యప్రదేశ్‌లో పొగమంచు ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు చూపించే ఉపగ్రహ చిత్రాన్ని కూడా వాతావరణ శాఖ విడుదల చేసింది. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలోని సఫర్‌జంగ్‌లో 50 మీటర్లకు దృశ్యమానత పడిపోయింది. పంజాబ్‌లోని అమృత్సర్ విమానాశ్రయంలో విజిబిలిటీ 0కి పడిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దడ పుట్టిస్తున్న చలి చలి తీవ్రత పెరగడంతో రాజధాని వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంట్లో నుంచి బయటకు రావడానికి భయపడిపోతున్నారు. అత్యవసరమైన పనులపై బయటికి వెళ్లేవారు మాత్రమే బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చలి తవ్రత పెరిగిన కారణంగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని.. జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 110 విమాన రాకపోకలకు అంతరాయం పొగమంచు కమ్ముకోవడంతో ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎయిర్‌పోర్టులో దృశ్యమానత(విజిబిలిటీ) దాదాపు సున్నాకి పడిపోయింది. ఉదయం 10 గంటలకు కూడా రహదారులన్నీ పొగమంచుతో కమ్ముకున్నాయి. 'దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో 110 విమాన రాకపోకలకు ఆలస్యం అవుతోంది' అని ఢిల్లీ ఎయిర్‌పోర్టు అథారిటీ పేర్కొంది. పొగమంచు కారణంగా ఢిల్లీలోని 25 రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. తెలుగురాష్ట్రాలను కప్పేసిన మంచు తెలుగురాష్ట్రాలను కూడా పొగమంచు దుప్పటి కప్పేసింది. ఉదయం 8 గంటలు అయినా పొగమంచు వీడటం లేదు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. అటు.. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరిగిపోతోంది. రోడ్లు కనపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదీ చదవండి: ఢిల్లీలో ఇజ్రాయెల్ ఎంబసీకి బాంబు బెదిరింపులు -
సేవాడేస్ కార్యక్రమంలో పేదలకు దుప్పట్ల పంపిణి
తెలంగాణ అమెరికాన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ ఆధ్వర్యంలో మూడవ రోజు జరిగిన సేవాడేస్ కార్యక్రమం విజయవంతమైంది. సేవాడేస్ పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తోన్న టీటీఏ మూడవ రోజు ధార్మిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. టీటీఏ ఎథిక్స్ కమిటీ డైరెక్టర్ గణేష్ వీరమనేని స్వగ్రామం నల్గొండ జిల్లా, పెండ్లిపాకల గ్రామంలో ముత్యాలమ్మ దేవాలయ ప్రారంభోత్సవంలో టీటీఏ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని పేద ప్రజలకు దుప్పట్లు పంపిణి చేశారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న టీటీఏ సంస్థను గ్రామ ప్రజలు కొనియాడారు. -
రెండు నెలల్లో రూ.4 లక్షలు.. ఏసీ కోచ్‌ల నుంచే..
గత రెండు నెలల్లో ట్రైన్ ఎస్ కోచ్‌ల నుంచి లక్షల విలువైన దుప్పట్లు, బెడ్షీట్లు, దిండ్లు, ఇతర వస్తువులు చోరీకి గురయ్యాయని ప్రభుత్వ రైల్వే పోలీసు అధికారులు తెలిపారు. చోరీకి గారైన వస్తువుల విలువ ఎంత? ఎక్కడ ఈ చోరీలు ఎక్కువగా జరిగాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. ఏసీ కోచ్‌ల ప్రయాణించే ప్రయాణికులకు దుప్పట్లు, దిండ్లు వంటి వస్తువులను రైల్వే శాఖ ఉచితంగానే అందిస్తుంది. కొందరు ప్రయాణికులు వారి ప్రయాణం పూర్తయిన తరువాత ఆ దుప్పట్లను మడిచి బ్యాగులో వేసుకునే వెళ్లిపోయే సంఘటనలు చాలానే ఉన్నాయి. ప్రయాణికులు కాకుండా.. ఏసీ కోచ్ అటెండర్లు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సంఘటనలు ఎక్కువగా భోపాల్‌లో జరిగినట్లు సమాచారం. భోపాల్ నుంచి ఢిల్లీకి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లలో ఇలాంటి చోరీలు జరిగాయని కొందరు అధికారులు తెలియజేసారు. భోపాల్ ఎక్స్‌ప్రెస్, రేవాంచల్ ఎక్స్‌ప్రెస్, మహామన ఎక్స్‌ప్రెస్, హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ గమ్యస్థానానికి చేరుకోవడానికి సుమారు 12 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుండటంతో ఇలాంటి దొంగతనాలు ఎక్కువగా జరిగాయి. అన్ని రైళ్లలో 12 కోచ్‌లు, ఇద్దరు అటెండర్లు మాత్రమే ఉంటారు. వారు రాత్రి సమయంలో పడుకునే సందర్భంలో మధ్యలో దిగిపోయేవారు ఇలాంటి చర్యలకు పాల్పడి ఉంటారని చెబుతున్నారు. ఇదీ చదవండి: బిలినీయర్స్ జాబితాలో కొత్త వ్యక్తి.. మద్యం అమ్ముతూ అరుదైన ఘనత కేవలం గత రెండు నెలల్లో రైళ్లలో రూ.2.65 లక్షల విలువైన 1,503 బెడ్షీట్లు, రూ.1.9 లక్షల విలువైన 189 దుప్పట్లు, రూ.10 వేలకు పైగా విలువ చేసే 326 దిండ్లు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకులు ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తులపై పెద్దగా చర్యలు తీసుకోలేదని.. చోరీలను ఆపడానికి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సంబంధిత అధికారులు వెల్లడించారు. 🚨 Blankets, bed sheets, pillows and other stuff worth 4 lakh were stolen from trains AC coaches in last two months. Most incidents took place in Bhopal, Rewanchal, Mahamana and Humsafar express (GRP Officials) pic.twitter.com/paAGnaNSRH — Indian Tech & Infra (@IndianTechGuide) December 14, 2023 -
వెచ్చదనమే కాదు.. వేసవిలో చల్లగానూ ఉంచే దుప్పటి గురించి తెలుసా?
సాధారణంగా చలికాలంలో దుప్పట్లు అవసరమవుతాయి. వేసవిలో ఏసీ గదుల్లో గడిపేవాళ్లు తప్ప మరెవరూ దుప్పట్లు వాడరు. అయితే ఏడాది పొడవునా వాడగలిగే దుప్పటిని అమెరికన్ కంపెనీ తయారు చేసింది. ‘హిలు’ బ్రాండ్ పేరుతో ఇటీవల మార్కెట్లోకి విడుదలైన ఈ దుప్పటి సాదాసీదా దుప్పటి కాదు, ఇది ‘థర్మో రెగ్యులేటింగ్ బ్లాంకెట్’. పూర్తి గ్రాఫీన్ ఫైబర్‌తో అడాప్టెస్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రూపొందించిన ఈ దుప్పటి శరీర ఉష్ణోగ్రతకు అనుగుణంగా పనిచేస్తుంది. చలికాలంలో శరీరాన్ని వెచ్చగాను, వేసవిలో చల్లగాను ఉంచుతుంది. ఇది పూర్తిగా పర్యావరణ అనుకూలమైనది. చూడటానికి ఇది చాలా భారీగానే కనిపించినా, తేలికగా ఉంటుంది. పదేళ్ల వారంటీతో వివిధ సైజుల్లో లభించే ‘హిలు’ బ్లాంకెట్స్ 175 డాలర్లు (రూ.14,465) మొదలుకొని 550 డాలర్ల (రూ.45,464) వరకు వివిధ ధరల్లో దొరుకుతాయి. ప్రస్తుతం ఇవి అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్ మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి. (ఇదీ చదవండి: ఎగిరే ఏసీ! ఇల్లంతా తిరిగేస్తుంది.. సూపర్ గ్యాడ్జెట్) -
Banjara Hills: దోమ తెరలు, బ్లాంకెట్ల సరాఫరా.. 60 కోట్ల కాంట్రాక్ట్ ఇప్పిస్తానని..
సాక్షి, బంజారాహిల్స్: అస్సాంలోని దోమ తెరలు, బ్లాంకెట్ల సరఫరాకు సంబంధించి 60 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇప్పిస్తానని నమ్మబలికి 20 లక్షల రూపాయలు తీసుకొని మోసం చేసిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. రహ్మత్‌నగర్‌కు చెందిన కె.నర్సింహారెడ్డి వ్యాపారి. ఆయనకు విశ్రాంత ఐఏఎస్ అధికారి కె.నారాయణతో పరిచయం ఉంది. కొద్ది రోజుల కిత్రం నారాయణ ద్వారా మాదాపూర్ జైహింద్ రోడ్డులో నివాసం ఉండే గుండుబోయిన వినయ్, కాకాని మనోహర్‌రెడ్డితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు తమకు వివిధ ప్రభుత్వాలతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. పెద్ద పెద్ద కాంట్రాక్ట్‌లు చేస్తుంటామని నమ్మించారు. అనంతరం అస్సాం రాష్ట్రంలో 60 కోట్ల రూపాయల విలువ చేసే దోమ తెరలు, బ్లాంకెట్లు సరఫరా చేసే కాంట్రాక్ట్ అప్పగింత పని తమ చేతిలో ఉందని తెలిపారు. ఎవరైన పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని నర్సింహారెడ్డికి ఆశ కల్పించారు. ఆ తర్వాత కాంట్రాక్ట్ తామే తీసుకుంటున్నట్టు చెప్పడంతో కొంత పెట్టుబడి పెడితే వాటా ఇస్తామని చెప్పారు. నర్సింహారెడ్డి వారి మాటలను నమ్మి 20 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఆ తరువాత వారిద్దరు మోసగాళ్లని తెలిసింది. తన డబ్బు తిరిగి ఇచ్చేయాలని నర్సింహారెడ్డి ఇద్దరిని పలుమార్లు అడిగాడు. కాని వారు స్పందించలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించగా జూబ్లీహిల్స్ పోలీసులు వినయ్, కాకాని మనోహర్‌రెడ్డిలపై ఐపీసీ 406,420, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
Stampede: బెంగాల్లో తొక్కిసలాట.. ముగ్గురు మహిళలు మృతి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ బర్దవాన్‌లో విషాద ఘటన జరిగింది. దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని బీజేపీ ఏర్పాటు చేసింది. ప్రతిపక్షనేత సువేంధు అధికారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే దుప్పట్ల పంపిణీకి అనుకున్నదానికంటే ఎక్కువ మంది రావడంతో ఈ ప్రమాదం జరిగింది. సువేందు అధికారి కార్యక్రమంలో పాల్గొని వెనుదిరిగిన వెంటనే తొక్కిసలాట చోటు చేసుకుంది. అయితే ఈ కార్యక్రమానికి బీజేపీ ఎలాంటి అనుమతి తీసుకోలేదని అధికార టీఎంసీ ఆరోపించింది. చిన్న వేదికలో సామర్థ్యానికి మించి ఎక్కువమందిని తరలించారని, అందుకే ప్రమాదం జరిగిందని పేర్కొంది. నిబంధనలు పాటించని సువేందు అధికారిపై విమర్శలు గుప్పించింది. ఈ ఘటన దురదృష్టకరమని పేర్కొంది. చదవండి: కదులుతున్న రైలు ఎక్కబోయి కిందపడ్డ తల్లీకూతురు.. తృటిలో.. -
‘జొమాటో చెప్పినట్లే చేస్తోంది’
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో వాటాదారులకు చెప్పినట్టుగానే అడుగులు వేస్తోంది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నష్టాలను మరింత తగ్గించుకుని.. రూ.251 కోట్లకు పరిమితం చేసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నష్టాలు రూ.435 కోట్లతో పోలిస్తే సగం తగ్గినట్టు తెలుస్తోంది. కార్యకలాపాల ద్వారా ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.1,024 కోట్లతో పోలిస్తే 60 శాతం పెరిగి రూ.1,661 కోట్లకు ఎగసింది. ఆగస్ట్ 10 నుంచి జొమాటో విలీనం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి జొమాటో గణాంకాలను కూడా కలిపి చూస్తే ఆదాయం త్రైమాసికం వారీగా 16 శాతం పెరిగి, (వార్షికంగా 48 శాతం వృద్ధి) రూ.2,107 కోట్లుగా ఉంది. వార్షికంగా చూస్తే బిలియన్ డాలర్ల (రూ.8,000 కోట్లు) ఆదాయ మార్క్‌ను మొదటిసారి ఓ త్రైమాసికంలో చేరుకున్నట్టు జొమాటో ప్రకటించింది. ‘‘దీర్ఘకాలం కోసం వ్యాపార నిర్మాణ క్రమంలో ఉన్నాం. దీర్ఘకాలం కోసం స్వల్పకాల అంచనాల విషయంలో రాజీపడడం, అవకాశాలను అంచనా వేయడం అన్నది ఎప్పటి మాదిరే కొనసాగుతుంది’’అని జొమాటో సీఈవో, వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ తెలిపారు. మెరుగైన పనితీరు అంశంపైనా మాట్లాడారు. ‘‘చాలా విభాగాల్లో మేము మెరుగుపడాల్సి ఉంది. నాణ్యమైన ఉత్పత్తులను పెద్ద మొత్తంలో, వేగంగా డెలివరీ చేయాలి. కస్టమర్ల అభిప్రాయాలను సరైన విధంగా అర్థం చేసుకోవాలి. అలాగే, రెస్టారెంట్ భాగస్వాములు, డెలివరీ భాగస్వాముల అభిప్రాయాలను కూడా తరచూ వినాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్న నమూనాలను సవాలు చేస్తూ, మరిన్ని రిస్క్‌లు తీసుకోవాల్సి ఉంది’’అని వివరించారు. బ్లింకిట్‌పై అభిప్రాయం మారుతుంది బ్లింకిట్ గురించి మాట్లాడుతూ.. ‘‘చాలా మంది ఇన్వెస్టర్లు ప్రస్తుతం బ్లింకింట్ వ్యాపారానికి సున్నా విలువ కడుతున్నారు. అది అర్థం చేసుకోతగినది. కొంత కాలానికి ఇది మారుతుందని నాకు నమ్మకం ఉంది’’అని గోయల్ వివరించారు. అన్ని ఇబ్బందులను అధిగమించామని, ప్రస్తుతం బ్లింకిట్‌కు నిలకడైన టీమ్ ఏర్పడిందని చెప్పారు. ఈ బృందం మంచి ఫలితాలను తీసుకొస్తున్నట్టు చెప్పారు. -
చిప్స్ ప్యాకెట్లతో నులి వెచ్చటి దుప్పట్లు!
చాలా మంది పేదవాళ్ల కోసం తమకు తోచినరీతిలో రకరకాలు సహాయ సహకారాలు అందించడం గురించి విని ఉన్నాం. అంతెందుకు వాళ్లకు ఉండేందకు వసతి, మూడు పూటలా భోజనం వంటి రకరకాల ఏర్పాట్లు చేసిన గొప్ప గొప్ప వ్యక్తులను కూడా చూశాం. కానీ 11 ఏళ్ల బాలిక తనకు వీలైనంతలో అది కూడా పర్యావరణ రహితంగా నిరాశ్రయులకు ఉపయుక్తంగా ఉండేలా దుప్పట్లు తయారు చేసి తనకున్న దొడ్డ మనసును చాటుకుంది. (చదవండి: ఒమిక్రాన్ ప్రమాదకారి కాదని అనుకోవద్దు, ఆస్పత్రుల్లో చేరుతున్నారు.. ప్రాణాలు పోతున్నాయ్) అసలు విషయంలోకెళ్లితే....యూకేలో వేల్స్‌లోని ప్రిస్టాటిన్కు చెందిన 11 ఏళ్ల అలిస్సా డీన్ నిరాశ్రయుల కోసం దుప్పట్లను తయారు చేస్తోంది. చలికాలంతో వెచ్చని దుప్పట్లు లేక బాధపడుతున్న అభాగ్యులను సురక్షితంగా ఉంచే నిమిత్తం దుప్పట్లను తయారు చేయాలనుకుంది. అంతేకాదు దుప్పట్లు తయారు చేసే నిమిత్తం ప్లాస్టిక్ సంచులను సేకరించడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఆమె టోపీలు, చేతికి వేసుకును గ్లౌజులు, చాక్లెట్ ట్రీట్ వంటి తదితర ప్యాకెట్లను ఉపయోగించి 80 దుప్పట్లను తయారు చేసింది. అయితే ఒక్కో దుప్పటి తయారు చేయడానికి 44 ప్యాకెట్లు అవసరం. అంతేకాదు విరామ సమయంలో అలిస్సా, ఆమె తల్లి రకరకాల సంచులను సేకరించే పనిలో నిమగ్నమౌతారు. ఈ మేరకు ప్రతి దుప్పటిని ఇస్త్రీ చేసి వెదర్ ప్రూఫింగ్(అన్ని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా) చేసి ఇస్తామని అలిస్సా తెలిపింది. అయితే తాము వారికి మన్నికైన మంచి దుప్పట్లు ఇవ్వాలనుకున్నాం అని అన్నారు. అయితే వీటిని తయారుచేసేందుకు ఆమె కూతురు తన పాకెట్ మనీ ఉపయోగించేది. కానీ ఇప్పుడూ తాము నిధులను సమకూర్చుకుంటున్నాం అని అన్నారు. అంతేకాదు తాము తయారు చేసే దుప్పట్లు డెన్బిగ్షైర్తో పాటు కాన్వీ, ఫ్లింట్షైర్ అంతటా పంపిణీ చేశాం అని చెప్పారు. ఈ మేరకు అలిసా, ఆమె తల్లి ఫేస్బుక్ సాయంతో దుప్పట్లు తయారు చేయడానికి అవసరమైన ప్యాకెట్లను సేకరిస్తామని తెలిపారు. (చదవండి: క్యూఆర్ కోడ్ ఉన్నపెప్సీ ట్రక్‌లను తగలబెట్టేస్తా!) -
Anila Parashar: మహిళా పోలీస్..శీతల సైనికురాలు
Madhya Pradesh: Woman Police Anila Parashar donate blankets to homeless people: నిరాశ్రయులై వీధుల్లో తలదాచుకునేవారికి ఒంటిమీద బట్టలే సరిగా ఉండవు. ఇక చలి నుంచి రక్షణకు కంబళ్లు, దుప్పట్లు అంటే కష్టమైన పనే. అలాంటి వారు పడే ఇబ్బందులను గుర్తించిన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో మహిళా సబ్ ఇన్స్పెక్టర్ అనిలా పరాశర్ రాత్రిపూట వీధుల్లో పడుకునే నిరాశ్రయులకు దుప్పట్లు, రగ్గులు పంచుతూ ఉదారతను చాటుకుంటోంది. ఈ మహిళా పోలీస్ చేసే పని పై అధికారులను కూడా కదిలించింది. పోలీసులే బృందాలుగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని మూడేళ్ల నుంచి నిర్విఘ్నంగా కొనసాగేలా చేస్తోంది. అనిలా పరాశర్ చేస్తున్న ఈ దాతృత్వాన్ని తెలుసుకోవడానికి అక్కడి ఏ పోలీసును అడిగినా ఆమె గొప్పతనాన్ని చెబుతారు. కదిలించిన సంఘటనలు మూడేళ్ల క్రితం చలికాలంలో రాత్రిపూట ఆమె విధుల్లో భాగంగా పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు విపరీతమైన చలి కారణంగా కొందరు మహిళలు, వృద్థులు చనిపోవడం చూశామని చెబుతారు అనిల. ‘ఆ హృదయవిదారక సంఘటనలు ఇప్పటికీ నా కళ్లముందు కదులుతూనే ఉంటాయి. ఆ పరిస్థితులను గమనించాక ఇంటి నుంచి దుప్పట్లు, కంబళ్లు తీసుకెళ్లి పంచేదాన్ని. పోలీసుల బృందాలనే కదిలించి.. అది కాస్తా ఓ కార్యక్రమంగా ప్రారంభమైంది. పరిస్థితి వివరించినప్పుడు నా భర్త వికాస్ పరాశర్ కూడా ఇందుకు సాయం చేస్తా అని చెప్పాడు. దీంతో ‘తాండ్ కే సిపాయ్’ (శీతల సైనికుడు) అనే పేరుతో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మా పోలీసులూ ఇందుకు ముందుకు వచ్చారు. ఒక బృందం ఏయే ప్రాంతాల్లో నిరాశ్రయులు ఉన్నారో గుర్తిస్తుంది. ఆ పై నిర్దిష్ట ప్రాంతాల్లో మరో బృందం దుప్పట్లు, కంబళ్లు పంపిణీ డ్రైవ్ నిర్వహిస్తుంది’ అని వివరిస్తారు ఈ మహిళా పోలీస్. సామాజిక సంస్థలూ చేయూత ‘ఈ ధార్మిక కార్యక్రమంలో నేనూ పాలుపంచుకోవడం అనిల భర్తగా పిలిపించుకోవడం నాకు చాలా గర్వంగా ఉందంటారు ఈ మహిళా పోలీస్ భర్త వికాస్ పరాశర్. అనిలా ప్రారంభించిన ఈ కార్యక్రమం మూడేళ్లుగా తన సేవలు అందిస్తోంది. కిందటేడాది ఎనిమిది వేలకు పైగా దుప్పట్లు, కంబ్లళ్లను పంచింది. ‘ఇండోర్‌లో రాత్రిళ్లు పనిచేసే సమయాల్లో అధికారులు సైతం చలిలో వణుకుతూ విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితులు ఎదురవు తుంటాయి. అలాంటి పరిస్థితిలో పోలీసులకు దుప్పట్లను ఇచ్చేవారు. అందులో భాగంగానే పోలీసులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. ఇప్పుడు కొన్ని సామాజిక సంస్థలు కూడా చేరాయి. దీంతో ఈ కార్యక్రమం ద్వారా అసుపత్రులు, అనాథ శరణాలయాల్లోనూ దుప్పట్లు, కంబళ్లు పంపిణీ చేస్తున్నారు. సాధారణంగా ఖాకీ డ్రెస్ వేసుకున్నవారిలో కాఠిన్యమే కనిపిస్తుంది అనుకుంటారు చాలా మంది. కానీ, సమాజ రక్షణలో నలుదిక్కులను గమనించేవారికే సమస్యలు బాగా కనిపిస్తాయని, వాటికి పరిష్కార మార్గం కూడా వారికే బాగా తెలుస్తుందని నిరూపిస్తుంది అనిలా పరాశర్. మహిళా పోలీసుగా ఒక చిన్న అడుగుతో మొదలైన ఈ కార్యక్రమం ఇప్పుడు పోలీసు బృందాలే పనిచేసే దిశగా ఎదిగింది. చదవండి: ‘ఫోర్బ్స్’ లిస్ట్‌లో ఆశా వర్కర్..ఎందుకంటే..? -
అంత్యక్రియలకు డబ్బుల్లేక దుప్పట్లో భార్య మృతదేహాన్ని..
హయత్‌నగర్: దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో ఓ వ్యక్తి తన భార్య మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా దుప్పట్లో చుట్టి బయట పడేసే ప్రయత్నాన్ని స్థానికులు అడ్డుకున్నారు. ఈ సంఘటన శక్రవారం రాత్రి హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. హయత్‌నగర్ పాత గ్రామంలోని హనుమాన్ దేవాలయం సమీపంలో డేగ శ్రీను, లక్ష్మీ దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. చదవండి: ఫారెన్ వెళ్లలేకపోతున్నా.. మనస్తాపంతో యువతి శ్రీను మేస్త్రీ పని చేస్తుండగా, లక్ష్మి(35) కూలి పని చేసేది. ఆమె అనారోగ్యంతో ఇంట్లోనే ఉండగా శ్రీను పనికి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చాడు. తల్లికి కూతురు భవాని మంచి నీళ్ళు ఇవ్వగా కొద్దిసేపటికి లక్ష్మీ మృతి చెందింది. అయితే దహన సంస్కారాలకు డబ్బులు లేవని రాత్రి 11 గంటల సమయంలో అతని స్నేహితుడు వినోద్ సహాయంతో బార్య మృత దేహాన్ని భజంపై వేసుకుని సమీపంలో ఉప్ప బాతుల చెరువు అలుగు వద్ద పడేసేందుకు వెళుతున్నాడు. చదవండి: మృతదేహాన్ని అడ్డగింత.. చితి పైకెక్కి ఆందోళన ఇది గమనించిన స్థానికులు అతన్ని అడ్డుకుని నిలదీశారు. చంపి శవాన్ని పడేసేందుకు వచ్చారనే అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి లక్ష్మీ మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా అసుపత్రికి తరలించి శ్రీను, వినోద్‌లను అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తే వాస్తవాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. -
రంగారెడ్డి: హయత్‌నగర్‌లో మహిళ మృతదేహం కలకలం
-
హయత్‌నగర్: దుప్పటిలో మహిళ మృతదేహం కలకలం
సాక్షి, హైదరాబాద్: హయత్‌నగర్‌లో గుట్టుచప్పుడు కాకుండా మహిళ మృతదేహాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను స్థానిక యువకులు అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం అందించి.. వారిని అప్పగించారు. హయత్‌నగర్‌లోని తొర్రూరు రోడ్డులో ఉన్న బాతుల చెరువు సమీపంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సదరు వ్యక్తులు గురువారం రాత్రి 10 గంటల సమయంలో మహిళ మృతదేహాన్ని ఓ దుప్పటిలో చుట్టి తీసుకెళ్తుండగా స్థానికులు గమనించారు. బ్లాంకెట్‌లో ఏమిటని ప్రశ్నించగా.. సదరు వ్యక్తులు పొంతన లేని సమాధానం చెప్పారు. దాంతో అనుమానం వచ్చిన స్థానికులు వారిద్దరిని చితకబాది పోలీసులకు అప్పగించారు. అనుమానితుల్లో ఒక వ్యక్తి తన పేరు శ్రీనివాస్ అని.. బ్లాంకెట్‌లో ఉన్నది తన భార్య మృతదేహం అని.. తమది లవ్ మ్యారేజ్ అని చెప్పాడు. ఆమె ఎలా చనిపోయిందని అని అడిగితే.. శ్రీనివాస్ సరైన సమాధానం చెప్పలేదు. (చదవండి: శవం తెచ్చిన తంటా.. ఇద్దరు ఆలయ అధికారుల సస్పెండ్) దీంతో అనుమానంతో పోలీసులకు వారిని పట్టించారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఇక మహిళ ఒంటి మీద ఎలాంటి బట్టలు లేకపోవడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. మృతురాలిని డేగ లక్ష్మీగా గుర్తించారు. కర్ణాటకకు చెందిన డేగ లక్ష్మి, నెల్లూరుకి చెందిన శ్రీనివాస్‌కు 12 ఏళ్ల కిందట ప్రేమ వివాహంమైంది. వీరికి ఒక బాబు, ఒక పాప ఉన్నారు. రెండేళ్ల కిందట బతుకుదెరువు కోసం శ్రీనివాస్ హైదరాబాద్ వచ్చాడు. తాపీమేస్త్రీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే కొంతకాలంగా తన భార్య అనారోగ్యంతో బాధపడుతోందని.. ఈక్రమంలోనే ఆమె మృతి చెందినట్లు శ్రీనివాస్ చెప్పినట్టు సమాచారం. (చదవండి: పెన్షన్ డబ్బుల కోసం.. తల్లి మృతదేహాన్ని ‘మమ్మీ’గా మార్చి) డబ్బులు లేక స్నేహితుడి సహాయంతో ఎక్కడన్నా దహన సంస్కారాలు చేద్దామని తీసుకువెళ్తున్నట్లు శ్రీనివాస్ పోలీసుల విచారణలో తెలిపాడు. పోస్ట్మామార్టం రిపోర్ట్ వచ్చాకే లక్ష్మి మృతికి కారణాలు తెలుస్తాయంటున్నారు పోలీసులు. ప్రస్తుతం లక్ష్మి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చదవండి: ఆ బాడీ దొరికితేనే సంచలన కేసు కొలిక్కి: కృష్ణానదిలో గాలింపు ముమ్మరం -
600 క్యాలరీలను కరిగించే బ్లాంకెట్
న్యూఢిల్లీ : ఆధునిక జీవన శైలిలో భాగంగా ఒంట్లో రోజు రోజుకు పెరిగి పోతున్న అదనపు క్యాలరీలను తగ్గించుకునేందుకు కొందరు వాకింగ్లు, జాగింగ్లు చేస్తూ ప్రయాస పడుతుంటే మరికొందరు జిమ్‌లకు వెళుతు కుస్తీలు పడుతుంటారు. ఇవేవీ చేయలేక ఇంకొందరు బొజ్జలకు, తొడలకు ఎలక్ట్రానిక్ వైబ్రేషన్ బెల్టులు ఉపయోగిస్తుంటారు. ఇలాంటి శ్రమలేవి అక్కర్లేకుండా, నిద్రపోతూ శరీరంలోని 600 కేలరీలను కరిగించుకునే సరికొత్త బ్లాంకెట్ ఒకటి మార్కెట్లోకి వచ్చింది. దీన్ని ఇన్ఫ్రారెడ్ సావున బ్లాంకెట్ అని పిలుస్తారు. ఆస్ట్రేలియాకు చెందిన ఎడ్వర్డ్ హాడ్జ్, వ్యాట్ వెస్ట్‌మోర్‌ల్యాండ్ వ్యాపారవేత్తలు కలిసి ‘మైహై’ బ్రాండ్ పేరుతో వీటిని విక్రయిస్తున్నారు. (చైనాకు దెబ్బ : ఇండియాకే ప్రాధాన్యం) బ్యాగ్‌లాగా ఉండే ఈ బ్లాంకెట్‌లో దూరి 45 నిమిషాలపాటు పడుకుంటే శరీరంలోకి దాదాపు 600 క్యాలరీలు కరగిపోతాయట. అంతేకాకుండా శరీరానికి కొత్త మెరపు వస్తుందని, మెదడుకు కూడా మంచి విరామం లభిస్తుందని ఉత్పత్తిదారులు చెబుతున్నారు. శరీరంలోని అదనపు క్యాలరీలను కరగించేందుకు, నిద్ర పుచ్చడం కోసం ఇన్ఫ్రారెడ్ సావునాను ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం ఇంతకుముందే అందుబాటులో ఉందని, దాన్ని తాము బ్లాంకెట్‌లో అమర్చి విక్రయిస్తున్నామని వారు వివరించారు. ఈ బ్లాంకెట్ సత్ఫలితాలనిస్తోందని ‘వెల్నెస్ గ్రూప్’కు చెందిన యాంటీ ఏజింగ్ నిపుణురాలు మెడలిన్ కాల్ఫాస్ తెలిపారు. కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ అమలుతో జిమ్ములు, పార్కులు మూతపడిన నేటి పరిస్థితుల్లో ఈ బ్లాంకెట్ మరింత ప్రయోజనకరం. ప్రస్తుతం ఆన్లైన్ 549 డాలర్ల ( దాదాపు 42 వేల రూపాయలు)కు ఈ బ్లాంకెట్ లభిస్తోంది. (కరోనాకు ధూమపానం మంచిదేనట!) -
గరీబ్‌రథ్ ప్రయాణికులపై కొత్త భారం
కొత్త సంవత్సరం కానుకగా ప్రయాణికుల నెత్తిన చార్జీల భారం మోపిన రైల్వే బోర్డు.. ఇప్పుడు మరో నిర్ణయంతో నడ్డి విరిచేందుకు సిద్ధమైంది. సామాన్యులకు ఏసీ ప్రయాణ సౌకర్యం అందించేందుకు ప్రారంభించిన గరీబ్‌రథ్ రైళ్లలో అదనపు సర్ చార్జీలు వసూళ్లు చేసేందుకు సిద్ధమైంది. గరీబ్‌రథ్ ఎక్కిన ప్రయాణికులు దిండు, బ్లాంకెట్ కావాలంటే రూ.25 రుసుం చెల్లించాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే విశాఖ నుంచి సికింద్రాబాద్ వరకు గరీబ్‌రథ్‌లో వెళ్లే ప్రయాణికులపై చార్జీల వడ్డన కారణంగా రూ.30 అదనపు భారం పడుతుండగా.. ఇప్పుడు మరో రూ.25 బాదుడుతోప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రైల్వే శాఖ ప్రయాణికులకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. జనవరి ఒకటి నుంచి రైలు చార్జీలు పెంచి ప్రయాణికుల పై భారం మోపిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు మరో భారం మోపుతూ రైల్వే శాఖ ఇచ్చిన ఉత్తర్వులు ప్రయాణికుల పుండుపై కారం చల్లినట్లుగా మారింది. గరీబ్‌రథ్ రైళ్లలో ప్రయాణించే వారు ఇకపై దిండు, బ్లాంకెట్ కోసం ప్రత్యేక చార్జీలు చెల్లించాల్సిందేనంటూ ఆదేశాలు అమల్లోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా గరీబ్ రథ్ రైళ్లను 2005లో ప్రవేశపెట్టారు. గరీబ్‌రథ్ అంటే పేదల రథం. అతి తక్కువ ధరకే పేదలకు ఏసీ కోచ్‌లు అందించాలనే లక్ష్యంతో ఈ సేవలు మొదలయ్యాయి. ఇతర రైళ్ల ఏసీ ప్రయాణం కంటే ఇందులో 2/3 వంతు ఛార్జీ వసులు చేస్తారు. ఈ నెల ఒకటి నుంచి చార్జీలు పెంపుతో అదనపు భారం పడింది. దీనికి తోడు ఏసీ ప్రయాణికులకు అందించే దుప్పట్లపైనా ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించారు. రూ.500తో ప్రారంభమై..: గరీబ్‌రథ్ పేరుతో మొదలైన సేవలు అనుకున్నట్లుగానే సామాన్యుడికి అందుబాటులోనే టికెట్ ధరలుండేవి. గరీబ్ రథ్‌ని ప్రారంభించిన సమయంలో టికెట్ ధర కేవలం రూ.500 మాత్రమే ఉండేది. తరువాత రూ.715 వరకు పెంచుకొచ్చారు. జనవరి ఒకటి నుంచి అమలైన ధరలతో టికెట్‌పై ఏకంగా రూ.30 భారం పడింది. ఈ భారమే ఎక్కువైందని సామాన్యులు భావిస్తున్న నేపథ్యంలో తాజాగా తీసుకున్న నిర్ణయం మరింత భారం మోపింది మొత్తంగా రూ.55 భారం : ఇకపై రిజర్వేషన్ చార్జీతో పాటు ఏసీ ప్రయాణికులకు అందించే బ్లాంకెట్ కోసం అదనంగా రూ.25 వసూలు చెయ్యనున్నారు. ఈ కొత్త ధర మే 15 నుంచి అమల్లోకి తీసుకురావాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. టికెట్ బుక్ చేసినప్పుడే ఈ చార్జీలను అందులోనే కలిపెయ్యాలని నిర్ణయించారు. అంటే ప్రస్తుతం వసూలు చేస్తున్న రూ.745తో పాటు రూ.25 కలిపి మొత్తం టికెట్ ధర రూ.770గా మారనుంది. అంటే గరీబ్‌రథ్‌లో ప్రయాణం చెయ్యాలనుకునే సగటు ప్రయాణికుడిపై రూ.55 అదనపు భారం(పెరిగిన టికెట్ చార్జీ రూ.30, బ్లాంకెట్ చార్జీ రూ.25) పడనుంది. రైల్వే బోర్డు నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎవరి కోసం గరీబ్‌రథ్.? సామాన్య ప్రయాణికుల కోసం గరీబ్‌రథ్ ప్రవేశపెట్టామన్నారు. కానీ ఎప్పటికప్పుడు ధరలు పెంచేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ దిండ్లు, దుప్పట్లకి కూడా చార్జీలు వసూలు చెయ్యడం దారుణం. ఇలా ప్రయాణికులపై ఎప్పటికప్పుడు భారం పెంచేసి సాధారణ రైలు టికెట్లా వసూలు చేస్తే గరీబ్‌రథ్ ఎవరి కోసం ప్రవేశపెట్టారో రైల్వే అధికారులే చెప్పాలి.– బి.రవికుమార్, విశాఖ ప్రయాణికుడు -
నిరాశ్రయులకు నీడ కల్పిస్తున్నాం
సాక్షి సిటీబ్యూరో: నగరంలో రహదారులు, ఫుట్‌పాత్‌లపై నిరాశ్రయులు లేకుండా వారికి జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన షెల్టర్లకు తరలిస్తున్నట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ తెలిపారు. తీవ్రమైన చలి ఉండడంతో నగరంలో ఆసుపత్రులు, బస్టాండ్లు, ఇతర జంక్షన్లలో నిద్రిస్తున్న నిరాశ్రయులకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఉచితంగా బ్లాంకెట్లు, దుప్పట్లను బుధవారం రాత్రి పంపిణీ చేశారు. బంజారాహిల్స్ బసవ రామ తారకం కేన్సర్ ఆసుపత్రి సమీపంలో ఫుట్‌పాత్‌పై నిద్రించేవారికి జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ బ్లాంకెట్లను పంపిణీ చేశారు. అడిషనల్ కమిషనర్ హరిచందన, జోనల్ కమిషనర్ ముషారఫ్ అలీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం దానకిషోర్ మాట్లాడుతూ నగరంలో నిరాశ్రయులు ఉండవద్దనే లక్ష్యంతో 15 నైట్ షెల్టర్లను జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామన్నారు. వీటిలో దాదాపు 700 మందికి ఆశ్రయం కల్పించామని పేర్కొన్నారు. నగరంలో రాత్రిపూట ప్రధాన జంక్షన్లు, ఫుట్‌పాత్‌లపై నిద్రించేవారిని గుర్తించి వారికి అందుబాటులో ఉన్న జీహెచ్ఎంసీ కమ్యునిటీ హాళ్లు, మోడల్ మార్కెట్లలో బస కల్పిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్ నగరానికి ఇతర రాష్ట్రాలు, వివిధ జిల్లాల నుంచి ప్రతిరోజు లక్షలాది మంది వివిధ పనుల నిమిత్తం వస్తారని, వీరిలో అధికశాతం మంది జీవనోపాధికై వచ్చి రహదారులు, జంక్షన్ల వద్ద తాత్కాలికంగా బస చేస్తున్నారని అన్నారు. వీరిని గుర్తించి నైట్ షెల్టర్లలో బస కల్పించనున్నట్టు కమిషనర్ తెలిపారు. మహిళలకు, పురుషులకు వేర్వేరుగా నైట్ షెల్టర్లు ఉన్నాయని అన్నారు. నగరంలో ఇటీవల రూ. 9.71 కోట్ల వ్యయంతో ఏడు నైట్ షెల్టర్ల నిర్మాణం చేపట్టగా మూడింటిని పూర్తి చేశామని తెలిపారు. కింగ్‌కోటిలోని మెటర్నటీ ఆసుపత్రి, మాసబ్ ట్యాంక్ మహావీర్ ఆసుపత్రి, నీలోఫర్ ఆసుపత్రిలోని నైట్ షెల్టర్లను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. వీటితో పాటు ఈఎన్టీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో నైట్ షెల్టర్ల నిర్మాణం పురోగతిలో ఉన్నాయని తెలిపారు. రూ. 5 భోజనం, నైట్ షెల్టర్ల ఏర్పాటు తదితర సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు దానకిషోర్ తెలియజేశారు. మూడు వేల దుప్పట్ల పంపిణీ గ్రేటర్ హైదరాబాద్‌లో రహదారులు, జంక్షన్లు, తాత్కాలిక గుడిసెల్లో నిద్రిస్తున్న దాదాపు 3 వేల మందికి బ్లాంకెట్లు, దుప్పట్లను జీహెచ్ఎంసీ అధికారులు పంపిణీ చేశారు. శేరిలింగంపల్లి జోన్ పరిధిలో శిల్పారమం నుంచి కొత్తగూడ వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా నిద్రిస్తున్న వారికి జోనల్ కమిషనర్ హరిచందన, డిప్యూటీ కమిషనర్లు దుప్పట్లను పంపిణీ చేశారు. సికింద్రాబాద్ జోన్లో అల్వాల్ మీ సేవ కేంద్రం, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, విద్యానగర్, రైల్వేస్టేషన్ల వద్ద నిరాశ్రయులకు జోనల్ కమిషనర్ సి.ఎన్.రఘుప్రసాద్ నేతృత్వంలో బ్లాంకెట్ల పంపిణీ జరిగింది. జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ జోనల్లోని ఉప్పల్ జంక్షన్, హయత్‌నగర్ బస్టాండ్ల వద్ద పంపిణీ జరగగా ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ముషారఫ్ అలీ నేతృత్వంలో బసవతారకం ఇనిస్టిట్యూట్, నీలోఫర్ ఆసుపత్రుల వద్ద, జోనల్ కమిషనర్ శంకరయ్య ఆధ్వర్యంలో కూకట్‌పల్లిలోని పాలీజ్ ప్రాంతాల్లో చార్మినార్ జోనల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఆరాంఘర్, అత్తాపూర్, మలక్‌పేట్, చాంద్రాయణ గుట్టలలో బ్లాంకెట్ల పంపణీ జరిగింది. -
పరువు తీసుకున్న బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే
సాక్షి, లక్నో : సాయం చేసేందుకు వెళ్లి వేరే విషయంపై ఫోకస్ చేసి ఇద్దరు బీజేపీ నేతలు పరువు తీసుకున్నారు. అది కూడా వారు చిన్నాచితక చోటామోటా నేతలు కాదు.. ఒకరు ఎంపీ కాగా మరొకరు ఎమ్మెల్యే. ప్రజాప్రతినిధులు ఇలాగేనా వ్యవహరించేదని, పైగా ఒక పార్టీ వారికి చెందిన వారే ఇలా చేస్తే మిగితా పార్టీల వారు ఏమనుకుంటారో తెలియదా అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా.. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఎంపీ రేఖావర్మ, మరో మహిళా ఎమ్మెల్యే తమ మద్దతుదారులతో కలిసి దుప్పట్లు పంపిణీ చేసేందుకు సీతాపూర్ జిల్లాకు వెళ్లారు. పెద్దపెద్ద అధికార ప్రతినిధులు హాజరవడంతోపాటు వారి మద్దతుదారులు కూడా ఆ కార్యక్రమానికి వచ్చారు. గత కొద్ది రోజులుగా విపరీతమైన చలికారణంగా పలువురు రోడ్డుపక్కన ఉండేవారు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో వారికి దుప్పట్ల సాయం చేసేందుకు వెళ్లారు. అయితే, అక్కడికి వెళ్లిన వారు దుప్పట్లు పంచే క్రమంలో ఫొటో విషయంలో పంచాయితీ పెట్టున్నారు. తానంటే తాను ముందు ఫొటో దిగాలంటూ గొడవకు దిగారు. అందరూ చూస్తున్నారనే సోయి మరిచిపోయి ఆగ్రహంతో ఊగిపోతూ ఒకరినొకరు తోసుకున్నారు. ఎంపీ రేఖా వర్మ ఓ వ్యక్తిపై చేయి చేసుకోగా మరో మహిళా ఎమ్మెల్యే తన చెప్పు తీసుకొని ఎంపీ మద్దతుదారుపై దాడి చేసింది. ఇలా ఆ కార్యక్రమం రచ్చరచ్చయింది. చివరకు అక్కడికి జిల్లా మేజిస్ట్రేట్, పోలీసు బాసు చేరుకొని గొడవ సదర్దుమణిగేలా చేశారు. అయితే, ఈ వీడియో మాత్రం బాగా హల్చల్ చేస్తోంది. -
రాముడికి చలిగా ఉంది.. దుప్పట్లు ఇవ్వాలి
లక్నో: శీతాకాలంలో అయోధ్యలో బాల రాముడి (రామ్‌లల్లా)కి చలిపెడుతోందనీ, ఉన్ని దుస్తులు, దుప్పట్లు, రూమ్ హీటర్ కూడా ఇవ్వాలని విశ్వహిందూ పరిషత్ మంగళవారం డిమాండ్ చేసింది. చలి వాతావరణం నుంచి రక్షణ పొందేందుకు ఆయనకు ఇవి అవసరమని వీహెచ్‌పీ ప్రాంతీయ మీడియా ఇన్చార్జ్ శరద్ శర్మ అన్నారు. రాముడంటే కోట్లాది ప్రజల నమ్మకం, భక్తి అనీ, అలాంటి రాముణ్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత భక్తులందరిదీ అని ఆయన అన్నారు. రాముడి బాగోగులు చూసుకోడానికి అనేక హిందూ సంస్థలు, సాధువులు సిద్ధంగా ఉన్నారన్నారు. -
విద్యార్థులకు దుప్పట్ల ‘వసతి’
సాక్షి, హైదరాబాద్/కరీంనగర్: దుప్పట్లు లేక సాంఘిక సంక్షేమ వసతి గృహ విద్యార్థులు పడుతున్న అవస్థలపై అధికార యంత్రాంగం ఎట్టకేలకు స్పందించింది. చలికాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా హాస్టళ్లల్లోని విద్యార్థులకు ఇవ్వాల్సిన దుప్పట్లు, బెడ్షీట్లు, కాస్మోటిక్ చార్జీలు అందని వైనాన్ని ‘సాక్షి’వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ‘వణుకుతున్న వసతి’శీర్షికతో ఈనెల 17న సాక్షి ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనంతో అధికారుల్లో కదలిక వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక చొరవ తీసుకుని హాస్టల్ విద్యార్థులకు ముందస్తుగా రగ్గులు, కార్పెట్ల (జంపఖానా)లను పంపిణీ చేసేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ ఉపక్రమించింది. దుప్పట్ల పంపిణీకి చర్యల్ని మరింత వేగిరం చేసింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 686 సంక్షేమ వసతి గృహాలుండగా.. వీటిలో 58 వేల మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. చలికాలాన్ని తట్టుకునే విధంగా నాణ్యమైన రగ్గులు, కార్పెట్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఎస్సీ అభివృద్ధి శాఖ.. టెస్కోతో ఒప్పందం కుదుర్చుకుంది. వసతి గృహాల్లోని విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.750 విలువైన రగ్గు, కార్పెట్‌ను పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో విద్యార్థులకు అవసరమైన స్టాకును రెండు రోజుల క్రితం టెస్కో ప్రతినిధులు ఎస్సీ అభివృద్ధి శాఖకు అందజేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు పంపిణీ నిమిత్తం అధికారులు జిల్లాలకు తరలించారు. స్టాక్‌ను వెంటనే విద్యార్థులకు పంపిణీ చేయాల్సిందిగా సంక్షేమాధికారులను ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు పి.కరుణాకర్ ఆదేశించారు. శుక్రవారం నాటికి జిల్లా కేంద్రాలకు దుప్పట్లు చేరుకోగా.. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్, జమ్మికుంట పరిధిలో శుక్రవారం రాత్రే పంపిణీ చేశారు. -
ప్రకాశించని ‘సప్తవర్ణం’..
సాక్షి, అమరావతి: సప్తవర్ణ దుప్పట్ల పథకం రోగులకు రంగుల కలగానే మిగిలిపోయింది. కొద్ది నెలల కిందట ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే దీనికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఏడు రంగుల కలిగిన దుప్పట్లు ఏడు రోజులు రోగుల పడకలపై వేయాలి. కానీ నిర్వాహకులు మాత్రం మాసిన దుప్పట్లే వేసి మమ అనిపిస్తున్నారు. ఏడు రోజుల దుప్పట్ల సంగతి దేవుడెరుగు వారానికి రెండు రకాల దుప్పట్లు కూడా వేయడం లేదు. దీంతో ఈ పథకంపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఉన్నతాధికారులు విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. అనంతరం విజిలెన్స్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వాస్పత్రులకు విచారణకు వెళ్లగా అసలు నిజాలు బయటికొచ్చాయి. మాసిపోయినవి.. ఉతకని దుప్పట్లే వేస్తున్నారు సప్తవర్ణాలు ఆ దుప్పట్లపై కనిపించనే లేదని, ఆ రంగులు ఒక్క ఉతుకుకే వెలిసిపోయాయని, రంగులు కనిపించకపోవడంతో వాళ్ల ఇష్టమొచ్చిన దుప్పట్లు వేసి వెళుతున్నారని, బిల్లులు మాత్రం సప్తవర్ణ దుప్పట్లు వేస్తున్నట్టుగా చూపిస్తున్నారని నిర్ధారించారు. కొన్ని చోట్ల సగం పడకకు కూడా సరిపోని దుప్పట్లు, మాసిపోయిన దుప్పట్లు, ఉతకని దుప్పట్లు వేస్తున్నట్లు విజిలెన్స్ అధికారుల దృష్టికి వచ్చాయి. ముఖ్యంగా బోధనాస్పత్రుల్లో అత్యంత దారుణంగా సప్తవర్ణ దుప్పట్లున్నాయని.. దీనిపై రెండ్రోజుల కిందటే విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఓ వైపు సప్తవర్ణ దుప్పట్లు అందుబాటులోకి తీసుకొచ్చామని ప్రభుత్వం గొప్పగా చెబుతుండగా.. ప్రారంభించిన కొద్ది రోజులకే పథకం నీరుగారడంపై అధికారులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధనలు అమలైతే ఒట్టు - ఏడు రోజులకు ఏడు రంగులు కలిగిన దుప్పట్లు వేయాలి. - రోజూ ఉతికిన దుప్పట్లే వేయాలి. - 60 సార్లు ఉతుకులుపడ్డాక ఆ దుప్పట్లను మార్చాలి. - ఈ నిబంధనలు విధిగా పాటిస్తేనే నిర్వాహకులకు డబ్బులివ్వాలి. కానీ ఇవేవీ పాటించకుండానే కొత్త దుప్పట్లు మార్చినట్టు చూపించి బిల్లులు పెడుతున్నారు. ఏడు వర్ణాలు కలిగిన దుప్పట్లు ఒక్క రోజులోనే రంగు వెలిసిపోయాయి. రంగులు లేకపోవడంతో దుప్పట్లు తారుమారవుతున్నాయి. ఇప్పటికే దుప్పట్ల వ్యవహారంపై సర్కారుకు పలు ఫిర్యాదులొచ్చాయి. దుప్పట్ల నిర్వహణ లోపాలపై విజిలెన్స్ కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. -
నేటి నుంచి ఆస్పత్రుల్లో రెండు రంగుల దుప్పట్లు
- రోజు విడిచి రోజు మార్చనున్న సిబ్బంది - ప్రతి సోమవారం గులాబీ, మంగళవారం తెల్ల బెడ్‌షీట్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల పడకలపై రెండు రంగుల బెడ్షీట్లు దర్శనమివ్వనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వాస్పత్రుల్లో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం సోమవారం ప్రారంభం కానుంది. ఇకపై అన్ని ప్రభుత్వాస్పత్రుల పడకలపై ప్రతి సోమవారం గులాబీ బెడ్షీట్లు, మంగళవారం తెల్ల బెడ్షీట్లు వేస్తారు. రోజు విడిచి రోజు ఆ 2 రంగుల బెడ్షీట్లను మారుస్తూ ఉంటారు. రాష్ట్రంలో మొత్తం 20 వేల పడకలకు లక్ష బెడ్షీట్లు పంపిణీ చేయాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం 10,737 పడకలకు 51,998 రంగు రంగుల బెడ్షీట్లు అందుబాటులోకి వచ్చాయి. వాటిని వివిధ ఆస్పత్రులకు పంపించారు. మిగిలిన వాటికి త్వరలోనే పంపిణీ చేయనున్నారు. అందులో 19,974 గులాబీ, 19,974 తెల్ల బెడ్షీట్లు ఉన్నాయి. 6,025 లేత నీలం, 6,025 ముదురు నీలం బెడ్ షీట్లను సిద్ధం చేశారు. అలాగే ప్రతి రోజు పడకలపై బెడ్షీట్లు మారుస్తారు. ఇప్పటికే వైద్య రంగంలో అనేక సంస్కరణలు తెస్తున్న సీఎం కేసీఆర్‌కు రంగురంగుల బెడ్షీట్ల పంపిణీతో పరిశుభ్రత పెరుగుతుందని వైద్యారో గ్యశాఖ వర్గాలు తెలిపాయి. ప్రతిరోజూ బెడ్ షీట్లు మార్చాల్సిందే... ఇప్పటివరకు పడకలు పాడైపోయినా, వాటిపై వేసే బెడ్షీట్లు మార్చ కపోయినా అడిగే నాథుడే ఉండేవాడు కాదు. తెల్ల బెడ్‌షీట్ ఉన్నా అవి ఎన్ని రోజులకు మారుస్తారో, అసలు మారుస్తున్నారో లేదో కూడా తెలిసే ది కాదు. దీంతో అనేక ఇన్ఫెక్షన్లతో రోగులు బాధలు పడాల్సి వచ్చేది. దీని కి విరుగుడుగా వైద్యారోగ్య శాఖ రంగు రంగుల దుప్పట్లను ఏర్పాటు చేసింది. ఇక ప్రతి సోమవారం నుంచి కచ్చితంగా ప్రతి రోజు బెడ్షీట్లు మార్చాల్సిందే. సోమవారం గులాబీ వేస్తే, మంగళవారం తెల్ల బెడ్షీట్లు వేస్తారు. అలా బుధవారం గులాబీ రంగు బెడ్‌షీట్, గురువారం తెల్ల బెడ్ షీట్ ఇలా మారుస్తూ పోతారని వైద్యారోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. బెడ్ షీట్లతోపాటు అనేక ఆస్పత్రులనూ ఆధునీకరించి, ఆధునిక వైద్య పరికరాలను, కొత్త ఫర్నీచర్ అందుబాటులోకి తీసుకొచ్చారు. బెడ్షీట్ల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం సిద్దిపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావుతో కలసి వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభిస్తారు. మిగతా ఆస్పత్రుల్లో ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు బెడ్షీట్లు పంపిణీ చేస్తారు. -
జగన్ జన్మదినం సందర్భంగా పేదలకు దుప్పట్లు
-
ఆసుపత్రులకు రంగుల దుప్పట్లు
- తెలుపు, గులాబీ, నీలి ఆకాశం,నీలి రంగులు ఖరారు - నెల రోజుల్లో సరఫరా...టెండర్లు వేసిన ఏడు కంపెనీలు - లక్ష దుప్పట్ల కొనుగోలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరో నెల రోజుల్లో నాలుగు రంగుల దుప్పట్లు దర్శనమివ్వనున్నాయి. వీటిని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం టెండర్లు పిలవగా ఏడు కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి. వాటిని వారం రోజుల్లో ఖరారు చేసి నెల రోజుల్లో ఆసుపత్రులకు రంగుల దుప్పట్లను సరఫరా చేయనున్నారు. మొదట ఏడు రోజులకు ఏడు రంగుల దుప్పట్లు అనుకున్నారు. ఆ తర్వాత రెండు రంగుల దుప్పట్లపై కసరత్తు జరిగింది. చివరకు నాలుగు రంగులతో నాలుగు రకాల దుప్పట్లను ఖరారు చేశారు. తెలుపు, గులాబీ, నీలి ఆకాశం, నీలి రంగులను ఖరారు చేశారు. లక్ష దుప్పట్లలో 40 వేలు తెలుపు, 40 వేలు గులాబీ, 10 వేలు నీలి ఆకాశం, మరో 10 వేలు నీలి రంగులను ఆసుపత్రులకు సరఫరా చేస్తారు. తెలుపు, గులాబీ రంగు దుప్పట్లను ప్రభుత్వ ఆసుపత్రుల్లోని సాధారణ పడకలపై రోజు విడిచి రోజు మార్చుతారు. ఇక నీలి ఆకాశం, నీలి దుప్పట్లను ఐసీయూలు, డాక్టర్లు, నర్సుల ప్రత్యేక గదుల్లో వాడాలని నిర్ణయించామని తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) ఎండీ వేణుగోపాల్ ‘సాక్షి’కి తెలిపారు. కొత్త దుప్పట్ల కోసం రూ.3 కోట్లు కేటాయించామన్నారు. ఒక్కో దుప్పటికి రూ.300 నుంచి రూ.350 వరకు ఖర్చు కాగలదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం వాడుతున్న తెల్ల దుప్పట్లు పెద్ద నాణ్యమైనవి కావన్నారు. అవి ఆరేడు నెలలకు మించి మన్నిక ఉండబోవన్నారు. వాటిని రూ.180 చొప్పున కొనుగోలు చేసేవారమన్నారు. కొత్తగా కొనుగోలు చేసే దుప్పట్లను నాణ్యమైనవాటినే కంపెనీల నుంచి తీసుకుంటామని... వాటి మన్నిక కనీసం రెండేళ్లు ఉంటుందని అన్నారు. తమ ప్రమాణాల మేరకు సరఫరా చేసే కంపెనీలకే టెండర్ ఖరారు చేస్తామని వేణుగోపాల్ తెలిపారు. 20 వేల పడకలపై కొత్త దుప్పట్లు... ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో తెల్ల రంగు దుప్పట్లను ఉతక్కుండానే రోజుల తరబడి ఉపయోగిస్తున్నారు. దీంతో ఒక రోగి వాడిన దుప్పటిని మరో రోగి వాడుతున్న పరిస్థితి నెలకొంది. ఫలితంగా రోగులు అంటు వ్యాధులకు గురవుతున్నారు. పడకలు అపరిశుభ్రానికి ఆనవాళ్లుగా మిగిలిపోతున్నాయి. ఈ పరిస్థితికి చరమగీతం పాడాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. గాంధీ ఆసుపత్రిలో ఇప్పటికే ప్రయోగాత్మకంగా రంగు రంగుల దుప్పట్లను వాడుతున్నారు. రోజు విడిచి రోజు దుప్పట్లు మార్చడం వల్ల వాడిన దుప్పట్లను తప్పనిసరిగా ఉతికి ఆరేస్తారనేదే సర్కారు ఉద్దేశం. దీనివల్ల పర్యవేక్షణ కూడా సులువుగా ఉంటుందని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ రోజు ఏ రంగు దుప్పటి వాడాలో నిర్ణయిస్తారు. ఆ ప్రకారమే ఆసుపత్రి సిబ్బంది దుప్పట్లను మార్చుతూ... మార్చిన వాటిని ఉతికేయించి మరో రోజుకు సిద్ధంగా ఉంచుతారు. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, రాష్ట్రస్థాయిలో ఉస్మానియా, నీలోఫర్, నిమ్స్, ఎంఎన్‌జే సహా అనేక పెద్దాసుపత్రులున్నాయి. అలాగే బోధనాసుపత్రులూ ఉన్నాయి. వాటన్నింటిలో దాదాపు 20 వేల వరకు పడకలున్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే నిమ్స్, ఉస్మానియా, గాంధీ, నీలోఫర్, ఎంఎన్‌జే క్యాన్సర్, సరోజినీ దేవి వంటి పెద్దాసుపత్రులు, బోధనాసుపత్రుల్లో ఏకంగా 8,374 పడకలున్నాయి. వాటిల్లోనూ రెండు రంగుల బెడ్షీట్లు రానున్నాయి. -
పేదలకు దుప్పట్లు పంపిణీ
నేరేడుచర్ల : పేదలకు జ్యోతి ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని మిర్యాలగూడ డీఎస్పీ ఎన్. రాంగోపాల్‌రావు అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక సీతారామనర్సయ్య టౌన్హాల్లో జ్యోతి ఫౌండేషన్ ఆ«ధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేసి మొక్కలను నాటారు. కార్యక్రమంలో జ్యోతి ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు కె. సుజాత, హుజుర్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి పసుపులేటి నర్సింహారావు, పెంచికల్‌దిన్నె సర్పంచ్ సుంకర క్రాంతికుమార్, పోరెడ్డి వెంకటరమణరెడ్డి పాల్గొన్నారు. -
అనాథాశ్రమంలో దుప్పట్ల పంపిణీ
దురాజ్‌పల్లి(చివ్వెంల) : మాజీ రాజ్యసభ సభ్యుడు, టీడీపీ సీనియర్ నాయకుడు ఆకారపు సుదర్శన్ 5 వ వర్ధంతిని ఆపార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈసందర్భంగా దురాజ్‌పల్లి గ్రామ శివారులోని ఆలేటి ఆటం వరల్డ్ అనాథాశ్రమంలో దుప్పట్లు, స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఆయన సతీమణి మేరమ్మ, కుమారుడు ఆకారపు రమేష్, టీడీపీ నియోజక వర్గ ఇన్చార్జ్ పటేల్ రమేష్‌రెడ్డి, పగడాల లింగయ్య, ధారోజు జానకి రాములు, జుట్టుకొండ సత్యనారాయణ, పెద్ది రెడ్డి రాజా, ఎండీ మునీర్ ఖాన్, బొలికొండ సైదులు, కంచర్ల గోవిందరెడ్డి, పల్స ఉపేందర్‌గౌడ్, సోమిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, గండి కోట లక్ష్మయ్య, నేరెడ్ల సోమయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆ దుప్పట్లు ఉతికేది ఎన్ని నెలలకో?
ఆర్టీసీ ఏసీ బస్సుల్లో రాత్రి ప్రయాణాలు నరకం.. క్లీనింగ్ కాంట్రాక్టు నిర్వహణ లోపభూయిష్టం పట్టించుకోని యాజమాన్యం సాక్షి, హైదరాబాద్: సురక్షితమైన.. సుఖవంతమైన ప్రయాణం ఆర్టీసీతోనే సాధ్యం... ఆర్టీసీ చెప్పే ప్రధాన స్లోగన్లలో ఇది ముఖ్యమైంది. ఇందులో సురక్షితం మాటెలా ఉన్నా.. సుఖవంతమైన ప్రయాణం మాత్రం ప్రయాణికులకు కరువవుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఏసీ బస్సుల్లో రాత్రివేళ ప్రయాణాలు నరకాన్ని చూపుతున్నాయి. ఏసీ బస్సుల్లో ప్రయాణిస్తే అంటువ్యాధులు ఫ్రీ అని ప్రయాణికులంటున్నారంటే సేవల తీరెలా ఉందో విదితమవుతోంది. ఇందుకు కారణం బస్సుల్లో అందించే బ్లాంకెట్లు, బెడ్షీట్లు దుర్వాసన వెదజల్లడంతోపాటు అపరిశుభ్రతతో కూడుకోవడమే. ప్రైవేటు సర్వీసులకంటే మెరుగైన సౌకర్యాలు కల్పించి ప్రయాణికుల ఆదరణ చూరగొనాల్సిన ఆర్టీసీ సేవలు అథమంగా ఉంటున్నాయి. రాష్ట్రవిభజన తర్వాత ఆర్టీసీ ఏపీలో 307 ఏసీ బస్సుల్ని వివిధప్రాంతాలకు నడుపుతోంది. ఇందులో వెన్నెల, గరుడ ప్లస్ బస్సుల్లో సేవలు ఫర్వాలేదనిపిస్తే, ఇంద్ర, గరుడ బస్సుల్లో రాత్రివేళ ప్రయాణమంటే బెంబేలెత్తిపోవాల్సిందే. చిరిగిన బ్లాంకెట్లు, దుర్వాసన వెదజల్లే ఉలెన్ బ్లాంకెట్లు ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. వీటివల్ల ప్రయాణికులు చర్మవ్యాధులు, అంటువ్యాధుల బారిన పడుతున్నారు. ప్యాసింజర్ సెస్ పేరిట టికెట్‌పై రూ.3 నుంచి రూ.5 వసూలుచేస్తూ ఏటా రూ.250 కోట్లవరకు భారం మోపుతున్నా.. ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలు అథమంగా ఉంటున్నాయి. బస్సెక్కితే సీట్లలో నల్లులు, అధ్వాన సేవలంటూ సాక్షాత్తూ రవాణామంత్రి శిద్ధా రాఘవరావు వ్యాఖ్యానిస్తున్నారంటే.. పరిస్థితేంటో విదితమవుతోంది. రైళ్లలో దుప్పట్లు ఉతికేది రెండు నెలలకోసారి మాత్రమేనని సాక్షాత్తూ రైల్వేశాఖ సహాయమంత్రి మనోజ్‌సిన్హా రాజ్యసభలో పేర్కొన్నారంటే.. ఇక ఆర్టీసీబస్సుల్లో దుప్పట్లను ఉతికేది ఎన్ని నెలలకోననే సందేహం తలెత్తుతోంది. ప్రైవేటుకు అప్పగించడం వల్లే.. ఏసీ బస్సుల నిర్వహణనంతటినీ ప్రైవేటువ్యక్తుల చేతుల్లో పెట్టడమే సేవలు అథమంగా ఉండడానికి ప్రధాన కారణం. ఏటా టెండర్లద్వారా ఆర్టీసీ ఏసీ బస్సుల క్లీనింగ్, బ్లాంకెట్ల క్లీనింగ్, అటెండర్ వ్యవస్థను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతోంది. కాంట్రాక్టు పొందినవారు ఏసీ బస్సుల నిర్వహణను తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారు. రూ.కోట్ల సొమ్ము ప్రైవేటు కంపెనీలకు చెల్లిస్తున్నా.. సేవలు ఘోరంగా ఉంటున్నాయి. ఏసీ బస్సుల్లో సీటుకొకటి చొప్పున రాత్రిపూట ప్రయాణంలో అందించే బ్లాంకెట్లను ఒక ప్రయాణానికే వినియోగించాలి. కానీ బస్సులో డ్రైవర్‌కు సహాయకుడిగా ఉండే అటెండర్ కాంట్రాక్టు పొందిన సంస్థకు చెందినవారవడంతో ప్రయాణికులు దిగిపోగానే.. బ్లాంకెట్లు, బెడ్షీట్లను మడతపెట్టి తిరుగు ప్రయాణానికీ వాటినే వాడుతున్నారు. క్లీనింగ్ లేకుండా రెండు,మూడు దఫాలు ఇలా వినియోగించడంతో అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు మెండుగా ఉన్నాయని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. ఫిర్యాదుకు లేని అవకాశం.. ఏసీ బస్సుల్లో అసౌకర్యాలపై ఫిర్యాదు చేసేందుకు ప్రయాణికులకు అవకాశమే లేకుండాపోయింది. ప్రయాణికులనుంచి ఫీడ్‌బ్యాక్ తెలుసుకునే అవకాశాన్ని కల్పించకపోగా.. కనీసం ఓ లాగ్‌బుక్ అందుబాటులో ఉంచడమో లేదా టోల్‌ఫ్రీ నంబర్‌ద్వారా ఫిర్యాదు చేసేందుకూ తావులేదు. ఒకవేళ ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు కాంట్రాక్టు సంస్థకు వత్తాసు పలుకుతున్నారేతప్ప పట్టించుకోవట్లేదనేది ప్రయాణికుల భావనగా ఉంది. రోజుకు సగటున ఏపీలోని ఏసీ బస్సుల్లో పదివేల మంది ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో సేవలు మెరుగ్గా ఉంటే ప్రైవేటు బస్సుల్ని ఎందుకు ఆశ్రయిస్తామని పలువురు అంటున్నారు. ఏసీ బస్సుల్లో సేవలపై వివరణనిచ్చేందుకు ఆర్టీసీ అధికారులు సుముఖత వ్యక్తపరచకపోవడం గమనార్హం. ఫంగల్ ఇన్ఫెక్షన్లు అధికం.. దుస్తులు లేదా పడకల్ని పరిశుభ్రంగా ఉంచకపోతే కంటేజియస్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్లకు అవకాశముండే జబ్బులొస్తాయి. ఆర్టీసీ బస్సుల విషయానికొస్తే సీట్లపై వేసే దుస్తులుగానీ, టవల్స్గానీ మార్చకపోతే ఒకరినుంచి ఒకరికి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్లు సోకే అవకాశమెక్కువ. అంతేగాక స్కిన్ అలర్జీలు వచ్చే వీలుంటుంది. ఒక్కోసారి చికెన్‌ఫాక్స్ ఉన్నవాళ్లు ప్రయాణించిన సందర్భాల్లో అలాంటి దుప్పట్లను శుభ్రం చేయకుంటే మరొకరికి వచ్చే అవకాశం ఎక్కువ. -డా.ఉమ,చర్మవ్యాధి నిపుణులు, హైదరాబాద్