కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ బర్దవాన్‌లో విషాద ఘటన జరిగింది. దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని బీజేపీ ఏర్పాటు చేసింది. ప్రతిపక్షనేత సువేంధు అధికారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే దుప్పట్ల పంపిణీకి అనుకున్నదానికంటే ఎక్కువ మంది రావడంతో ఈ ప్రమాదం జరిగింది. సువేందు అధికారి కార్యక్రమంలో పాల్గొని వెనుదిరిగిన వెంటనే తొక్కిసలాట చోటు చేసుకుంది.
అయితే ఈ కార్యక్రమానికి బీజేపీ ఎలాంటి అనుమతి తీసుకోలేదని అధికార టీఎంసీ ఆరోపించింది. చిన్న వేదికలో సామర్థ్యానికి మించి ఎక్కువమందిని తరలించారని, అందుకే ప్రమాదం జరిగిందని పేర్కొంది. నిబంధనలు పాటించని సువేందు అధికారిపై విమర్శలు గుప్పించింది. ఈ ఘటన దురదృష్టకరమని పేర్కొంది.
చదవండి: కదులుతున్న రైలు ఎక్కబోయి కిందపడ్డ తల్లీకూతురు.. తృటిలో..
Comments
Please login to add a commentAdd a comment