Burdwan
-
Stampede: బెంగాల్లో తొక్కిసలాట.. ముగ్గురు మహిళలు మృతి
కోల్కతా: పశ్చిమ బెంగాల్ బర్దవాన్లో విషాద ఘటన జరిగింది. దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని బీజేపీ ఏర్పాటు చేసింది. ప్రతిపక్షనేత సువేంధు అధికారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే దుప్పట్ల పంపిణీకి అనుకున్నదానికంటే ఎక్కువ మంది రావడంతో ఈ ప్రమాదం జరిగింది. సువేందు అధికారి కార్యక్రమంలో పాల్గొని వెనుదిరిగిన వెంటనే తొక్కిసలాట చోటు చేసుకుంది. అయితే ఈ కార్యక్రమానికి బీజేపీ ఎలాంటి అనుమతి తీసుకోలేదని అధికార టీఎంసీ ఆరోపించింది. చిన్న వేదికలో సామర్థ్యానికి మించి ఎక్కువమందిని తరలించారని, అందుకే ప్రమాదం జరిగిందని పేర్కొంది. నిబంధనలు పాటించని సువేందు అధికారిపై విమర్శలు గుప్పించింది. ఈ ఘటన దురదృష్టకరమని పేర్కొంది. చదవండి: కదులుతున్న రైలు ఎక్కబోయి కిందపడ్డ తల్లీకూతురు.. తృటిలో.. -
బీజేపీ ఎంపీని చితకబాదారు!
కోల్ కతా: అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీ కార్యకర్తలు ఏకంగా ఓ బీజేపీ ఏంపీని టార్గెట్ చేసి చితకబాదారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్ లోని కల్నాలో శనివారం చోటుచేసుకుంది. ఆ వివరాలివి.. బీజేపీ ఎంపీ జార్జ్ బేకర్ తన టయోటా వాహనంలో పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు బయలుదేరారు. ఆయన కాన్వాయ్ బుద్వాన్ లో సమావేశ ప్రాంగణానికి వెళుతుండగా అధికార టీఎంసీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎంపీ జార్ట్ బేకర్ కాన్వాయ్ ను అడ్డుకున్నారు. మొదట ఎంపీ కాన్వాయ్ పై టీఎంసీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఎందుకు దాడి చేస్తున్నారో తెలుసుకునేలోగా బీజేపీ ఎంపీపై దాడికి పాల్పడి ఆయనను చితకబాదారు. పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేయడంతో టీఎంపీ కార్యకర్తలు అక్కడినుంచి పరారయ్యారు. ఎంపీ బేకర్ ను ప్రాథమిక చికిత్స నిమిత్తం కల్నాలోని సబ్ డివిజన్ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. బాధిత ఎంపీ తనపై జరిగిన దాడికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు తమ పార్టీ నేతపై దాడి జరగలేదని రాష్ట్ర బీజేపీ చెప్పడం గమనార్హం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఘోర రోడ్డు ప్రమాదం: కుటుంబమంతా మృతి..
బుర్ద్వాన్: పశ్చిమబెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటన బుధవారం ఉదయం బుర్ద్వాన్ జిల్లా తేజ్గంజ్ సమీపంలోని నేషనల్ హైవే-2 పై చోటుచేసుకుంది. రోడ్డు నిర్మాణానికి తారు తీసుకెళ్తున్న ట్యాంకర్ను కారు ఓవర్టెక్ చేయబోయి ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాల్లో మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందగానే ఫైర్ ఇంజన్తో మంటలు అదుపు చేశామని పోలీసులు తెలిపారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని, మృతుల్లో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ఒక చిన్నారి ఉన్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాని పోలీసులు తెలిపారు. కాగా రోడ్డు ప్రమాదంతో పోలీసులు రోడ్డును బ్లాక్ చేశారు. దీంతో స్థానికులు ఆగ్రహానికి లోనయ్యారు. -
పడవ బోల్తా : ఐదుగురి గల్లంతు
బుద్వాన్: పశ్చిమబెంగాల్ బుద్వాన్ జిల్లాలో కల్నా సమీపంలోని భగీరథీ నదిలో శనివారం రాత్రి పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గల్లంతయ్యారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ గౌరబ్ శర్మ వెల్లడించారు. కల్నాలో జరిగిన ఉత్సవాల్లో పాల్గొని వారంతా నడియా జిల్లాలో శాంతిపూర్ తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో పడవలో చాలా మంది ఉన్నారని... వారిలో చాలా మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారని తెలిపారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. -
మానవత్వం చూపిన రాష్ట్రపతి తనయుడు
బురద్వాన్(పశ్చిమ బెంగాల్): రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనయుడు అభిజిత్ ముఖర్జీ.. మానవీయత చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితురాలిని ఆస్పత్రికి తరలించి ఆదుకున్నారు. అంతేకాదు మెరుగైన వైద్యం కోసం ఆమెను మరో ఆస్పత్రికి తరలించేందుకు సహాయపడ్డారు. బాధితురాలు సుమితాపాల్ ఆదివారం తన కుమారుడు ఆర్ఘ్యతో కలిసి మోటారు సైకిల్ పై బురద్వాన్ నుంచి గస్కరాలోని ఆలయానికి వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారు. సుమితాపాల్ కింద పడిపోవడంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. నిర్మానుష్య ప్రాంతం కావడంతో ఆర్ఘ్యకు ఏమీ తోచలేదు. అదేదారిలో వెళుతున్న అభిజిత్ విషయం తెలుసుకుని తన కారులో సుమితాపాల్ ను హుటాహుటిన గస్కరా ఆస్పత్రికి తరలించారు. బురద్వాన్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించడంతో వెంటనే అంబులెన్స్ ఏర్పాటు చేశారు. కలెక్టర్ తో మాట్లాడి ఆమెకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరారు. అంతేకాదు వైద్యఖర్చుల కోసం కొంత డబ్బు కూడా ఆర్ఘ్యకు అందజేశారు. తాను ప్రత్యేకంగా చేసిందేమీ లేదని, సాటి మనిషిగా సాయం చేశానని అభిజిత్ ముఖర్జీ తెలిపారు. ముర్షిదాబాద్ లోని జంగీపూర్ లోక్ సభ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ప్రమాద బాధితురాలిని స్వయంగా ఆస్పత్రికి తీసుకొచ్చిన ఆయనను పలువురు ప్రశంసించారు.