గత రెండు నెలల్లో ట్రైన్ ఎస్ కోచ్‌ల నుంచి లక్షల విలువైన దుప్పట్లు, బెడ్‌షీట్లు, దిండ్లు, ఇతర వస్తువులు చోరీకి గురయ్యాయని ప్రభుత్వ రైల్వే పోలీసు అధికారులు తెలిపారు. చోరీకి గారైన వస్తువుల విలువ ఎంత? ఎక్కడ ఈ చోరీలు ఎక్కువగా జరిగాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
ఏసీ కోచ్‌ల ప్రయాణించే ప్రయాణికులకు దుప్పట్లు, దిండ్లు వంటి వస్తువులను రైల్వే శాఖ ఉచితంగానే అందిస్తుంది. కొందరు ప్రయాణికులు వారి ప్రయాణం పూర్తయిన తరువాత ఆ దుప్పట్లను మడిచి బ్యాగులో వేసుకునే వెళ్లిపోయే సంఘటనలు చాలానే ఉన్నాయి.
ప్రయాణికులు కాకుండా.. ఏసీ కోచ్ అటెండర్లు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సంఘటనలు ఎక్కువగా భోపాల్‌లో జరిగినట్లు సమాచారం. భోపాల్ నుంచి ఢిల్లీకి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లలో ఇలాంటి చోరీలు జరిగాయని కొందరు అధికారులు తెలియజేసారు.
భోపాల్ ఎక్స్‌ప్రెస్, రేవాంచల్ ఎక్స్‌ప్రెస్, మహామన ఎక్స్‌ప్రెస్, హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ గమ్యస్థానానికి చేరుకోవడానికి సుమారు 12 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుండటంతో ఇలాంటి దొంగతనాలు ఎక్కువగా జరిగాయి. అన్ని రైళ్లలో 12 కోచ్‌లు, ఇద్దరు అటెండర్లు మాత్రమే ఉంటారు. వారు రాత్రి సమయంలో పడుకునే సందర్భంలో మధ్యలో దిగిపోయేవారు ఇలాంటి చర్యలకు పాల్పడి ఉంటారని చెబుతున్నారు.
ఇదీ చదవండి: బిలినీయర్స్ జాబితాలో కొత్త వ్యక్తి.. మద్యం అమ్ముతూ అరుదైన ఘనత
కేవలం గత రెండు నెలల్లో రైళ్లలో రూ.2.65 లక్షల విలువైన 1,503 బెడ్‌షీట్లు, రూ.1.9 లక్షల విలువైన 189 దుప్పట్లు, రూ.10 వేలకు పైగా విలువ చేసే 326 దిండ్లు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకులు ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తులపై పెద్దగా చర్యలు తీసుకోలేదని.. చోరీలను ఆపడానికి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సంబంధిత అధికారులు వెల్లడించారు.
🚨 Blankets, bed sheets, pillows and other stuff worth 4 lakh were stolen from trains AC coaches in last two months.
— Indian Tech & Infra (@IndianTechGuide) December 14, 2023
Most incidents took place in Bhopal, Rewanchal, Mahamana and Humsafar express (GRP Officials) pic.twitter.com/paAGnaNSRH
Comments
Please login to add a commentAdd a comment