న్యూఢిల్లీ : ఆధునిక జీవన శైలిలో భాగంగా ఒంట్లో రోజు రోజుకు పెరిగి పోతున్న అదనపు క్యాలరీలను తగ్గించుకునేందుకు కొందరు వాకింగ్‌లు, జాగింగ్‌లు చేస్తూ ప్రయాస పడుతుంటే మరికొందరు జిమ్‌లకు వెళుతు కుస్తీలు పడుతుంటారు. ఇవేవీ చేయలేక ఇంకొందరు బొజ్జలకు, తొడలకు ఎలక్ట్రానిక్ వైబ్రేషన్ బెల్టులు ఉపయోగిస్తుంటారు. ఇలాంటి శ్రమలేవి అక్కర్లేకుండా, నిద్రపోతూ శరీరంలోని 600 కేలరీలను కరిగించుకునే సరికొత్త బ్లాంకెట్ ఒకటి మార్కెట్‌లోకి వచ్చింది. దీన్ని ఇన్‌ఫ్రారెడ్ సావున బ్లాంకెట్ అని పిలుస్తారు. ఆస్ట్రేలియాకు చెందిన ఎడ్‌వర్డ్ హాడ్జ్, వ్యాట్ వెస్ట్‌మోర్‌ల్యాండ్ వ్యాపారవేత్తలు కలిసి ‘మైహై’ బ్రాండ్ పేరుతో వీటిని విక్రయిస్తున్నారు. (చైనాకు దెబ్బ : ఇండియాకే ప్రాధాన్యం)
బ్యాగ్‌లాగా ఉండే ఈ బ్లాంకెట్‌లో దూరి 45 నిమిషాలపాటు పడుకుంటే శరీరంలోకి దాదాపు 600 క్యాలరీలు కరగిపోతాయట. అంతేకాకుండా శరీరానికి కొత్త మెరపు వస్తుందని, మెదడుకు కూడా మంచి విరామం లభిస్తుందని ఉత్పత్తిదారులు చెబుతున్నారు. శరీరంలోని అదనపు క్యాలరీలను కరగించేందుకు, నిద్ర పుచ్చడం కోసం ఇన్‌ఫ్రారెడ్ సావునాను ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం ఇంతకుముందే అందుబాటులో ఉందని, దాన్ని తాము బ్లాంకెట్‌లో అమర్చి విక్రయిస్తున్నామని వారు వివరించారు. ఈ బ్లాంకెట్ సత్ఫలితాలనిస్తోందని ‘వెల్‌నెస్ గ్రూప్’కు చెందిన యాంటీ ఏజింగ్ నిపుణురాలు మెడలిన్ కాల్ఫాస్ తెలిపారు. కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ అమలుతో జిమ్ములు, పార్కులు మూతపడిన నేటి పరిస్థితుల్లో ఈ బ్లాంకెట్ మరింత ప్రయోజనకరం. ప్రస్తుతం ఆన్‌లైన్ 549 డాలర్ల ( దాదాపు 42 వేల రూపాయలు)కు ఈ బ్లాంకెట్ లభిస్తోంది. (కరోనాకు ధూమపానం మంచిదేనట!)
Comments
Please login to add a commentAdd a comment