శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం కోసం వర్కవుట్లు చేయాలని సలహా ఇస్తుంటారు అందరూ. అయితే కేవలం ఎక్సర్‌సైజ్ చేయడంతోనే సరిపోదు, వ్యాయామం చేయక ముందు, చేసిన తర్వాత తీసుకునే ఆహారాలను బట్టి కూడా దాని ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఒక క్రమపద్ధతిలో చేస్తేనే ఫలితం కనిపిస్తుంది. ఈ విషయంలో నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
ఏ వయసువారికైనా ఆరోగ్యంగా ఉండడంలో వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటి వ్యాయామం చేయడానికి ముందు, చేసిన తర్వాత ఏం తినాలో తెలుసుకోవడం అవసరం. అందువల్ల వ్యాయామం చేసే ముందు, తర్వాత ఏం తినాలి..? అనేదానిని ఇక్కడ చూద్దాం.
వర్కౌట్స్‌కు ముందు..?
ఎక్సర్‌సైజ్‌లు చేయడానికి కొద్దిసేపటి ముందే ఏదైనా తినడం మంచిది కాదు. దానివల్ల కొన్ని సమస్యలు వస్తాయి. అందువల్ల తిన్న వెంటనే వర్కవుట్స్‌కి దిగకుండా కొంత గ్యాప్ ఇవ్వాలి. వ్యాయామానికి కనీసం అరగంట నుంచి గంట ముందు అల్పాహారం పూర్తి చేయాలి. అలాగే కసరత్తులు చేసిన తర్వాత కూడా శరీరానికి శక్తి కావాలి. అందుకే వ్యాయామం అయిన తర్వాత గంటలోపు మీకిష్టమైన పోషకాలున్న ఆహారాన్ని తినాలి. ఆ ఆహారం కొవ్వులు, పిండి పదార్థాల మిశ్రమంగా ఉండాలి.
ఇక వ్యాయామం ముగిసిన తర్వాత బాడీ అలసిపోతుంది. ఈ సమయంలో శరీరానికి శక్తి ఎంతో అవసరం. అదే సమయంలో కసరత్తుల వల్ల ఖర్చైపోయిన శక్తిని పొందడానికి వోట్ మీల్, క్వినోవా, గుడ్లు, చికెన్, చేపలు, గింజలు, మొలకెత్తిన విత్తనాల వంటివి తీసుకోవాలి. వ్యాయామానికి ముందు, తర్వాత కూడా నీళ్లు తాగొచ్చు. ముఖ్యంగా ఎక్సర్సైజ్ చేయడానికి ముందు సుమారు 2 నుంచి 3 కప్పుల నీళ్లు తాగాలి. ఇక అయిపోయిన తర్వాత కూడా అంతే పరిమాణంలో తాగాలి.
కసరత్తులు చేస్తున్నప్పుడు..
హెవీ వెయిట్లు లేపడం, ఎక్కువ క్యాలరీలు ఖర్చయ్యే వ్యాయామాలు చేస్తే.. ప్రతి అరగంటకు 50 నుంచి 100 కేలరీల ఆహారం తీసుకోవాలి. దీనికోసం తక్కువ కొవ్వు ఉన్న పెరుగు, ఎండు ద్రాక్ష లేదా అరటి పండు తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment