calories
-
50 గంటల్లో 16 వేల కేలరీల ఫాస్ట్ ఫుడ్ ఛాలెంజ్..కట్‌చేస్తే..!
ఆరోగ్యం కోసం మంచి సమతుల్య ఆహారం తీసుకోవడమే మేలు. కానీ ఒక్కోసారి జిహ్వ చాపల్యం చంపుకోలేక ఇష్టమైన జంక్ ఫుడ్‌ని లాగించేస్తాం. పైగా ఏదో అప్పుడప్పుడే కదా అని సర్ది చెప్పుకుని మరీ తినేస్తాం. ఆ తర్వాత వర్కౌట్లు చేసి అదనపు కేలరీలను తగ్గించే యత్నం చేస్తాం. కానీ ఇలా తినడం వల్ల మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో ప్రయోగాత్మకంగా తెలియజేశాడు ఓ యూట్యూబర్. అందుకోసం అతడు ఏం చేశాడంటే..ఫిట్నెస్ కంటెంట్ క్రియేటర్ అయిన 30 ఏళ్ల కెనడియన్ టెన్నిసన్ ఓ విచిత్రమైన ఫుడ్ ఛాలెంజ్‌ని తీసుకున్నాడు. ఆయన 50 గంటల ఫాస్ట్ ఫుడ్ మారథాన్ సవాలును స్వీకరించాడు. అందుకోసం తన బ్రేక్‌ఫాస్ట్ నుంచి లంచ్, డిన్నర్‌తో సహా మొత్తం ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఐటెమ్స్ వంటివి మాత్రేమ తీసుకున్నాడు. వాటిలో తృణధాన్యాలు, పెరుగు వంటివి కూడా ఉన్నాయి. తొలిరోజు అలాంటి ఫుడ్ తింటూ 8 వేల కేలరీలను వినియోగించినట్లు పేర్కొన్నాడు. ఈ ఆహారం కారణంగా తన మానసిస్థితి, శక్తి స్థాయిలోని ప్రతికూల భావాలను గుర్తించినట్లు తెలిపాడు. రెండో రోజు కూడా ఇలానే తినడం వల్ల గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడ్డట్లు తెలిపాడు. ఎక్కువ మొత్తంలో కేలరీలను పెంచినప్పటికీ పోషకాహార లోపంతో ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించాడు. ఈ ఫుడ్ కారణంగా ముఖంపై మొటిమలు రావడం మొదలయ్యిందని వెల్లడించాడు. ఆ తర్వాత కండరాలు తిమ్మిరిగా ఉండి బద్ధకంగా ఏదో తెలియని నీరసంతో ఇబ్బంది పడుతున్నట్లుగా అనిపించిందని వెల్లడించాడు. అలాగే ఈఫుడ్కి తగ్గట్టు చేయాల్సిన పదివేల స్టెప్స్‌కు బదులుగా తాను 4 వేల స్టెప్స్ నడిచినట్లు పేర్కొన్నాడు. ఈ రెండు రోజుల ఛాలెంజ్ తదనంతరం మూడో రోజు జిమ్సెషన్ అత్యంత భయంకరమైనది. ఎందుకంటే ఈ అధిక కేలరీల ఫుడ్ కారణంగా విపరీతమైన చెమట్లు పట్టి..వర్కౌట్లు చేయడం చాలా కష్టంగా అనిపించిందని చెప్పుకొచ్చాడు.అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల కలిగే పరిణమాల గురించి తెలియజేసేందుకే ఈ 50 గంటల ఫాస్ట్ ఫుడ్ ఛాలెంజ్‌ని స్వీకరించానని యూట్యూబర్ వెల్లడించాడు. అందుకు సంబంధించిన వీడియోని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఆహారంతో మిళితమైన శారీరక సంబంధం గురించి చాలా క్లియర్‌గా వివరించి మరీ చెప్పారంటూ సదరు యూట్యూబర్‌ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: సులభంగా ఇమ్యూనిటీ పెంపొందించుకోండి ఇలా..!) -
ఆ సినిమాలు చూస్తే..కేలరీలు బర్న్ అవుతాయట!
కేలరీలు బర్న్ అవ్వాలని రకరకాల వ్యాయామాలు, ఏవేవో ఫీట్లు చేస్తుంటా. అంతా చేసిన కాస్తో కూస్తో బరువు తగ్గుతాం. కానీ ఆ సినిమాలు చూస్తే వందల కొద్ది కేలరీలు ఖర్చు అవ్వడమే గాక ఆకలి తగ్గి తెలియకుండానే మితంగా తింటమట. బరువు కూడా ఈజీగా తగ్గుతామని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అదెలా సాధ్యం పైగా కూర్చొని సినిమా చూస్తే కేలరీలు తగ్గిపోతాయా..? అనిపిస్తుంది కదా!. కానీ ఇది నిజం అని బల్లగుద్ది మరీ నమ్మకంగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు. హారర్ మూవీలు చూసే అలవాటు ఉంటే..ఇంకా మంచిది అంటున్నారు పరిశోధకులు. హాయిగా హారర్ మూవీలు చూస్తూ.. ఈజీగా కేలరీలు తగ్గించుకోండి అని అంటున్నారు. ఈ మేరకు వెస్ట్‌మినిస్టర్ విశ్వవిద్యాలయం నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందుకోసం మూవీ రెంటల్ కంపెనీ సాయంతో సుమారు పదిమందిపై ఈ పరిశోధన చేశారు. వారంతా హారర్ మూవీలు చూస్తున్నప్పుడూ.. వారికి హృదయ స్పందన రేటు, ఆక్సిజన్ తీసుకుని కార్బన్డయాక్సైడ్ని వదులుతున్న రేటును కొలిచే పరికరాలను కూడా అమర్చారు. ఈ పరిశోధనలో పాల్గొన్న ఆ పదిమందికి సినిమాలు చూస్తున్నప్పుడూ.. హృదయ స్పందన రేటు, జీవక్రియ రేటు పెరిగాయని, తత్ఫలితంగా ఎక్కువ కేలరీలు బర్న్ అయినట్లు కనుగొన్నారు. అంతేగాదు ఈ కేలరీలు బర్న్ అవ్వడం అనేది వ్యక్తిని బట్టి మారుతుందని అన్నారు. కాగా ఈ పరిశోధనలో 90 నిమిషాల భయానక చిత్రం సగటున 150 కేలరీలను బర్న్ చేస్తుందని తెలిపారు. అది దగ్గర దగ్గరగా.. మనం చేసే జాగింగ్ లేదా 30 నిమిషాల పాటు చేసే వాకింగ్‌లో తగ్గే కేలోరీలకు సమానం అని చెప్పారు. తమ అధ్యయనం పాల్గోన్న ఆ పదిమంది చూసిన మొదటి పది రకాల భయానక చిత్రాలు వరుసగా ఎన్ని కేలరీలను బర్న్ చేశాయో కూడా వివరించారు. ఒత్తిడి సమయంలో విడుదలయ్యే అడ్రినల్ వేగంగా విడుదలై ఆకలిని తగ్గించి, బేసల్ మెటబాలిక్ రేటును పెంచి అధిక స్థాయిలో కేలరీలను తగ్గిస్తుందని డాక్టర్ రిచర్డ్ మాకెంజీ అన్నారు. ఈ పరిశోధన రోజూవారి వ్యాయామాన్ని, సక్రమమైన ఆహారపు అలవాట్లను మానేయమని సూచించదని హెచ్చరించారు. ఆరోగ్యకరంగా బరువు, జీవనశైలి ఉండాలంటే హారర్ మూవీలు ఒక్కటే చూడటం సరిపోదని చెప్పారు. సులభంగా కేలరీలు తగ్గించే పరిశోధనల్లో భాగంగా ఈ కొత్త విషయాన్ని కనుగొన్నామే గానీ ఇదే సరైనదని చెప్పడం లేదన్నారు. (చదవండి: 'నాన్న బ్లడ్ బాయ్'! 71 ఏళ్ల తండ్రి వయసు ఏకంగా 25 ఏళ్లకు..) -
బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే మీకోసమే ఇది
ఇటీవల కొంతమంది బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ద్వారా శరీరంలోని క్యాలరీస్‌ని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. బ్రీతింగ్ వ్యాయామాలు మంచివే అయినా... బరువు తగ్గించడానికి మాత్రం ఇది సరికాదు. దానివల్ల మన శరీరంలోకి ఆక్సిజన్ ఎక్కువగా వెళ్లడం వల్ల కొంత ఉపయోగం ఉండవచ్చు గాని... బరువు తగ్గాలంటే కొంత శారీరక వ్యాయామం కూడా అవసరం. బరువు తగ్గాల్సిన ప్రక్రియలో లయబద్ధమైన శాస్వప్రక్రియతో పాటు గుండెవేగం, రక్తనాళాల్లో రక్తప్రసరణ పెరగడం, కండరాలకు తగిన పని... ఈ అన్ని కార్యక్రమాలు సరైన సమన్వయంతో జరిగినప్పుడే కొవ్వు కరిగే అవకాశం ఉంటుంది. ఇలా కొవ్వును తగ్గించే వ్యాయామాల్నే ఏరోబిక్స్ అంటారు. మన శరీరంలో పేరుకొని ఉండే శక్తినిల్వల్లో ప్రధానమైనది కొవ్వు. దాన్ని కరిగించి శక్తి రూపంలోకి మార్చడానికి ఒక యాంత్రిక చర్య (మెకానికల్ యాక్షన్ అంటే ఉదాహరణకు ఏరోబిక్స్) అవసరం. అందుకు వ్యాయామం ఉపకరిస్తుంది. ఇక్కడ కొవ్వు ఎలా కరుగుతుందో తెలుసుకోవడం అవసరం. ►ఊపిరితిత్తులు – శ్వాసించడం ద్వారా ప్రాణవాయువు ఊపిరితిత్తులను చేరుతుంది. సరిగా శ్వాసించడం వల్ల బయటి వాయువుల నుంచి ఆక్సిజన్‌ను ఎక్కువ గ్రహించగలుగుతాం. ►గుండె, రక్తనాళాలు – గుండె, రక్తనాళాలు ఆక్సిజన్‌ను, పోషక పదార్థాలను శరీరంలోని కణజాలలకు అందచేస్తాయి. ఎరోబిక్ ద్వారా (ఓ నిర్ణీత పరిమితిలో) ఎంతగా గుండె కొట్టుకునేలా చేయగలిగితే అంత సమర్థంగా ఆక్సిజన్, పోషకాల అందజేత ప్రక్రియను మెరుగుపరచవచ్చు. ►పనిచేసే కండరాలు – ఇవి ఆక్సిజన్‌ను, పోషక పదార్థాలను గ్రహిస్తాయి. చక్కగా శ్వాసించడం, గుండె అధికంగా కొట్టుకోవటం, కండరాల పనితీరు– ఇవన్నీ శరీరంలో కొవ్వు కరిగేందుకు ఉపకరిస్తాయి. పై మూడు ప్రక్రియలను సమన్వయపరుస్తున్నప్పుడు చక్కటి ఫలితం ఉంటుంది. అందుకు బాగా ఉపయోగపడే వ్యాయామాలే ఏరోబిక్! అంటే... ఉదా. వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ లాంటి వ్యాయామాలు కొవ్వుని తగ్గించటంలో బాగా ఉపయోగపడతాయి. -
జ్ఞాపకాలనే గుర్తించుకోవాలన్న కరీనా..
ముంబై: జబ్ వీ మెట్ ఫేమ్ కరీనా కపూర్ సోషల్ మీడియాలో తన అభిరుచులను పంచుకుంటు నెటిజన్లను అలరిస్తుంటారు. అయితే తాను గతంలో ఓ రెస్టారెంట్లో ఆస్వాదిస్తున్న క్షణాలను నెటిజన్లకు ఫోస్ట్ చేసింది. కాగా కరీనా రెస్టారెంట్లో చదువుతున్న దృశ్యాన్ని పోస్ట్ చేసింది. ఈ ఫోటోలపై కరీనా స్పందిస్తు.. మీకు ఏదైనా రెస్టారెంట్ అద్భుతంగా అనిపిస్తే, కేవలం వాటి జ్ఞాపకాలను మాత్రమే గుర్తించుకోవాలని, కేలరీలను కాదని నెటిజన్లకు సూచించింది. కరీనా అభిప్రాయంపై నెటిజన్లు ఫిదా అయ్యారు. కరీనా విభిన్న అభిరుచిని, ప్యాషన్, స్టైల్‌ను నెటిజన్లు కొనియాడారు. మరోవైపు ఓ అభిమాని కరీనాను రాణిగా కీర్తించడం విశేషం. ప్రస్తుతం కరీనా అమీర్‌ఖాన్‌తో లాల్‌సింగ్ చద్దా, వీరే ది వెడ్డింగ్ సీక్వెల్, తక్త్ అనే సినిమాలలో హీరోయిన్గా నటిస్తుంది. కరీనా వివిధ పోటోలతో అభిమానులను అలరిస్తుంది. ఇటీవల కరీనా తన మిత్రులతో కలిసి దిగిన ఫోటోను నెటిజన్లకు పోస్ట్ చేసింది. చదవండి: చాలా ఏళ్ల తర్వాత జంటగా సైఫ్-కరీనా..! -
600 క్యాలరీలను కరిగించే బ్లాంకెట్
న్యూఢిల్లీ : ఆధునిక జీవన శైలిలో భాగంగా ఒంట్లో రోజు రోజుకు పెరిగి పోతున్న అదనపు క్యాలరీలను తగ్గించుకునేందుకు కొందరు వాకింగ్లు, జాగింగ్లు చేస్తూ ప్రయాస పడుతుంటే మరికొందరు జిమ్‌లకు వెళుతు కుస్తీలు పడుతుంటారు. ఇవేవీ చేయలేక ఇంకొందరు బొజ్జలకు, తొడలకు ఎలక్ట్రానిక్ వైబ్రేషన్ బెల్టులు ఉపయోగిస్తుంటారు. ఇలాంటి శ్రమలేవి అక్కర్లేకుండా, నిద్రపోతూ శరీరంలోని 600 కేలరీలను కరిగించుకునే సరికొత్త బ్లాంకెట్ ఒకటి మార్కెట్లోకి వచ్చింది. దీన్ని ఇన్ఫ్రారెడ్ సావున బ్లాంకెట్ అని పిలుస్తారు. ఆస్ట్రేలియాకు చెందిన ఎడ్వర్డ్ హాడ్జ్, వ్యాట్ వెస్ట్‌మోర్‌ల్యాండ్ వ్యాపారవేత్తలు కలిసి ‘మైహై’ బ్రాండ్ పేరుతో వీటిని విక్రయిస్తున్నారు. (చైనాకు దెబ్బ : ఇండియాకే ప్రాధాన్యం) బ్యాగ్‌లాగా ఉండే ఈ బ్లాంకెట్‌లో దూరి 45 నిమిషాలపాటు పడుకుంటే శరీరంలోకి దాదాపు 600 క్యాలరీలు కరగిపోతాయట. అంతేకాకుండా శరీరానికి కొత్త మెరపు వస్తుందని, మెదడుకు కూడా మంచి విరామం లభిస్తుందని ఉత్పత్తిదారులు చెబుతున్నారు. శరీరంలోని అదనపు క్యాలరీలను కరగించేందుకు, నిద్ర పుచ్చడం కోసం ఇన్ఫ్రారెడ్ సావునాను ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం ఇంతకుముందే అందుబాటులో ఉందని, దాన్ని తాము బ్లాంకెట్‌లో అమర్చి విక్రయిస్తున్నామని వారు వివరించారు. ఈ బ్లాంకెట్ సత్ఫలితాలనిస్తోందని ‘వెల్నెస్ గ్రూప్’కు చెందిన యాంటీ ఏజింగ్ నిపుణురాలు మెడలిన్ కాల్ఫాస్ తెలిపారు. కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ అమలుతో జిమ్ములు, పార్కులు మూతపడిన నేటి పరిస్థితుల్లో ఈ బ్లాంకెట్ మరింత ప్రయోజనకరం. ప్రస్తుతం ఆన్లైన్ 549 డాలర్ల ( దాదాపు 42 వేల రూపాయలు)కు ఈ బ్లాంకెట్ లభిస్తోంది. (కరోనాకు ధూమపానం మంచిదేనట!) -
ఢ్రై ఫ్రూట్స్ తింటే లావెక్కుతారా?
కొవ్వులెక్కువగా ఉన్నాయి కాబట్టి డ్రైఫ్రూట్స్ తింటే లావెక్కుతారని అనుకోవడం అపోహ మాత్రమేనని అంటున్నారు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు. కాకపోతే వీటిని మరీ ఎక్కువ మోతాదులో తినడం సరికాదని సూచిస్తున్నారు. డ్రై ఫ్రూట్స్‌లో ఉండే కొవ్వులు శరీరానికి మేలు చేసేవేనని... శరీరం శోషించుకోగల కొవ్వులు కూడా వీటిలో ఉండటం వల్ల వీటితో మేలేగానీ కీడు లేదని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. సాధారణంగా ప్రతిరోజూ 30గ్రాముల వరకూ డ్రైఫ్రూట్స్ తీసుకోవడం మేలన్నది అంచనా. కానీ.. వీటిల్లోని కొవ్వుల మోతాదు వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు జీడిపప్పు, పిస్తాల్లో కొవ్వుల శాతం దాదాపు 50 గ్రాముల వరకూ ఉంటే కొన్ని ఇతర డ్రైఫ్రూట్స్‌లో 70 శాతం వరకూ ఉంటుంది. అయితే ఈ కొవ్వులు మోనోశాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు. కొలెస్ట్రాల్ మోతాదులను తగ్గించడం ద్వారా ఇవి శరీరానికి మేలు చేస్తాయి. కేలరీలు, కొవ్వులు ఎక్కువగా ఉన్నప్పటికీ డ్రైఫ్రూట్స్‌ను తినడం ఆపాల్సిన అవసరం లేదని ఇప్పటికే పలు అధ్యయనాలు రుజువు చేశాయని, రోజూ వీటిని తిన్నవారు దీర్ఘకాలంలో బరువు పెరగడం చాలా తక్కువగా ఉంటుందని తాజా అధ్యయనం ఒకటి స్పష్టం చేసింది. తాము మొత్త 30 అధ్యయనాలను సమీక్షించామని అన్నింటిలోనూ డ్రైఫ్రూట్స్ తినడానికి బరువు పెరగడానికి మధ్య సంబంధం లేదని స్పష్టం చేశాయని.. ఒక అధ్యయనంలో ఒక పద్ధతి ప్రకారం డ్రైఫ్రూట్స్ తిన్న వారు బరువు తగ్గినట్లు తెలిసిందని ఒక శాస్త్రవేత్త వివరించారు. -
ఉబ్బసానికి విరుగుడు మితాహారమా?
ఉబ్బసంతో బాధపడేవారు వీలైనన్ని తక్కువ కేలరీలను తీసుకోవడం ద్వారా వ్యాధి లక్షణాల నుంచి ఉపశమనం పొందవచ్చునని అంటున్నారు హాప్కిన్స్ మెడిసిన్ శాస్త్రవేత్తలు. అంతేకాకుండా శరీరానికి అందే కేలరీలు కొవ్వుల నుంచి వచ్చినా.. చక్కెరల నుంచి వచ్చినా ఈ ఫలితాల్లో తేడాలేవీ ఉండవని వారు ఎలుకలపై జరిపిన పరిశోధనల ఆధారంగా చెబుతున్నారు. అధికాహారం కారణంగా ఊబకాయులైన వారి ఊపిరితిత్తులు మంట/వాపులకు గురవుతాయని.. ఫలితంగా ఉబ్బస లక్షణాలు కనిపిస్తాయని.. మంట/వాపు నివారణకు మందులు వేసుకుంటే పరిస్థితి సాధారణమవుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త వసెవోలోడ్ పొలోట్స్‌కీ అంటున్నారు. ఎలుకలకు తాము నాలుగు రకాల ఆహారాన్ని అందించి వాటిపై పరిశీలనలు జరిపామని, ఎనిమిది వారాల తరువాత తక్కువ కేలరీలు తీసుకున్న ఎలుకల ఊపిరితిత్తుల పనితీరు మెరుగ్గా ఉన్నట్లు తెలిసిందని, కొవ్వు ఎక్కువగా తీసుకున్న ఎలుకల ఊపిరితిత్తుల్లోని వాయుమార్గాలు సాధారణం కంటే చాలా రెట్లు కుంచించుకుపోయినట్లు తెలిసిదని వివరించారు. దీన్నిబట్టి మితాహారానికీ ఊబ్బస లక్షణాలకూ మధ్య సంబంధం ఉన్నట్లు తాము అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఉబ్బసం వ్యాధికి మరింత మెరుగైన చికిత్స కల్పించేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని అన్నార -
బరువు తగ్గడానికి ఫుల్లుగా లాగించండి
జీఎమ్ డైట్ ఒక విలక్షణమైన డైట్. తమ సంస్థలోని ఉద్యోగులు బరువు పెరగకుండా ఆరోగ్యకరంగా ఉండాలని ‘జనరల్ మోటార్స్’ సంస్థ అనేక పరిశోధనల తర్వాత ఒక డైట్‌ను రూపొందించింది. ప్రతిరోజూ ఒకే రకమైన ఆహారాన్ని కడుపునిండా తిన్నప్పటికీ బరువు పెరగరన్నది ఈ డైట్ ప్రక్రియ సిద్ధాంతం. ప్రయత్నించండి... బరువు తగ్గండి. ‘జీఎమ్ డైట్’ అంటే ‘జనరల్ మోటార్స్ డైట్’కు సంక్షిప్తరూపం. ఈ డైట్‌తో కేవలం ఒక వారంలో దాదాపు ఆరేడు కిలోల వరకు తగ్గవచ్చు. వారంలోని ఒక్కో రోజు ఒక్కో విధమైన ఆహారం (ఫుడ్) లేదా ఆహార సముదాయాన్ని (ఫుడ్ గ్రూపును) తీసుకోవడం ఈ డైట్ ప్రత్యేకత. జీఎమ్ డైట్ విధానం కొవ్వులను వేగంగా మండించేలా చేస్తూ బరువు తగ్గిస్తుంది. ఈ విధానంలో ఎప్పుడూ ఒంటికి క్యాలరీలు అవసరమవుతూ ఉంటాయి. అవి దొరక్క ఒంట్లోని క్యాలరీలు దహించుకుపోతూ ఉండటం వల్ల బరువు తగ్గుతుంది. జీఎమ్ డైట్ ఎలా ఉపయోగపడుతుందంటే... జీఎమ్ డైట్లో తీసుకునే ఆహారాలు జీర్ణశక్తిని పెంపొందిస్తాయి. కొవ్వులను మరింతగా దహనం చేసే సామర్థ్యాన్ని పెంచుతాయి. ఈ ప్రక్రియలో తీసుకునే ఆహారాలు పుష్కలమైన నీటిపాళ్లను కలిగి ఉంటాయి. అందువల్ల ఇవన్నీ ఒంట్లోని కొన్ని వ్యర్థాలు, విషాలు బయటకు వెళ్లేలా చేయడంలో సమర్థంగా పని చేస్తాయి. ఈ డైట్ విధానం వల్ల ప్రయోజనం పొంది, దీన్ని ఆమోదించేవారు చెప్పే మాట ఏమిటంటే... ఐదు రోజుల నుంచి ఏడు రోజుల గడువు ఇస్తూ మాటిమాటికీ ఈ ఆహార ప్రక్రియను రిపీట్ చేస్తూ కొనసాగించడం వల్ల చాలా బరువు తగ్గొచ్చని, మళ్లీ బరువు పెరగకుండా ఉండొచ్చని. ఇంకా ఏమేమి తీసుకోవాలి... దాంతో ప్రయోజనం ఏమిటి? ►ఈ ఆహార ప్రక్రియలో రోజూ 8 – 12 గ్లాసుల నీళ్లు తీసుకుంటూ ఉండటం వల్ల హైడ్రేటెడ్‌గా ఉండటంతో పాటు ఒంట్లోంచి అనవసర పదార్థాలు బయటకు విసర్జితమవుతాయి. ►ఈ ప్రక్రియ సమయంలో వ్యాయామం చేయడం తప్పనిసరి కాదుగానీ అభిరుచి ఉంటే చేయవచ్చు. అలా చేయదలచినప్పుడు మొదటి మూడు రోజులు మాత్రమే చేయాలి. ► ఈ ప్రక్రియను అనుసరించేవారు ప్రతిరోజూ రెండు నుంచి మూడు గిన్నెల (బౌల్స్‌లో) ‘జీఎమ్ వండర్ సూప్’ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సూప్‌ను క్యాబేజ్, సెలెరీ, టొమాటోలు, ఉల్లిగడ్డలు, బెల్పెప్పర్స్తో తయారుచేస్తారు. ఇది మనమూ చేసుకోవచ్చు. పై పదార్థాలతో మనం చారు కాచుకున్నట్లుగానే దీన్ని తయారు చేసుకోవచ్చు. జీఎమ్ డైట్ పాటించే సమయంలో కొన్ని సూచనలు ► జీఎమ్ డైట్ పాటించేవారు కాఫీలు తాగవచ్చా అనే సందేహం వస్తుంది. కాఫీలను నిపుణులు సిఫార్సు చేయరు. అయితే హెర్బల్ టీ మాత్రం పరిమితంగా కొన్నిసార్లు తీసుకోవచ్చు. ►జీఎమ్ వండర్సూప్కు ఏవైనా ప్రతిబంధకాలు ఉన్నాయా అని కొందరు అడుగుతుంటారు. అది ఎప్పుడైనా ఏ సమయంలోనైనా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా రోజులో రెండు మూడు సార్లైనా దీన్ని తీసుకోవచ్చు. డైట్ పాటించే సమయంలో ఆకలిగా అనిపించినప్పుడు దీన్ని తీసుకోవచ్చు. ► డైట్ ప్లాన్‌లో ఉండగా ఆల్కహాల్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోవద్దు. ఆల్కహాల్‌తో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాలు ఏవీ లేవు. ► డైట్ ప్లాన్‌లో ఉన్నప్పుడు బయట తినాల్సిన పరిస్థితి ఏర్పడితే బయటి ఆహారం తీసుకోవచ్చా అనే సందేహం చాలామందికి వస్తుంటుంది. అయితే డైట్‌ప్లాన్‌లో ఉన్నప్పుడు బయటి ఆహారం ఎలాంటి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. మీరు పూర్తిగా పాటించగలిగే సమయంలోనే డైట్‌ను ప్లాన్ చేసుకోవాలి. బయటి ఆహారాల్లో ప్రాసెస్ చేసినవి ఉండవచ్చు. హానికారక రసాయనాలు కలిసిన ఆహారపదార్థాలూ ఉండవచ్చు. ఉదాహరణకు బ్రెడ్ తయారీకి ఉపయోగించే పిండిలోనూ, ఇతర మాంసాహారాల్లోనూ కొన్ని కండిషనర్లు, సల్ఫేట్స్, మోనోసోడియమ్ గ్లుటామేట్ వంటి రుచిని ఇచ్చే చైనా ఉప్పు వంటివి, నైట్రేట్లు, ఫాస్ఫేట్లు ఉండేందుకు అవకాశం ఉంటుంది. అలాగే తీపిని ఇచ్చే అనేక పదార్థాలతో పాటు ఎక్కువ మోతాదులో ఉప్పు కూడా ఉండవచ్చు. అసలు జీఎమ్ డైట్ పాటించేదే వీటన్నింటి నుంచి దూరంగా ఉండటం కోసమే. అలాంటప్పుడు అవి తినాల్సి వస్తే జీఎమ్ డైట్ పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలేమీ ఒనగూరవు. ►నాలుగోరోజున పాలు తీసుకోవాలని జీఎమ్ డైట్ నిబంధన కదా... ఒకవేళ పాలు అంత ఇష్టంగా లేకపోతే మజ్జిగ లేదా పెరుగు తినవచ్చా అని చాలామందిలో సందేహాలు వస్తుంటాయి. అయితే పాలు తీసుకోవడం అంతగా ఇష్టపడకపోతే పెరుగు లేదా మజ్జిగ తీసుకోవచ్చు. అయితే పెరుగు లేదా మజ్జిగలో ఎట్టిపరిస్థితుల్లోనూ చక్కెర కలుపుకోకూడదు. ► జీఎమ్ డైట్‌ను అనుసరించడంలో భాగంగా చపాతీలు, గోధుమలు, తృణధాన్యాలు, బ్రెడ్ వంటివి ఏమాత్రం తీసుకోకూడదు. ►రోజూ పొద్దున్నే నిమ్మనీళ్లలో తేనె కలుపుకొని తాగడం మంచిదంటారు కదా... మరి జీఎమ్ డైట్ సమయంలో ఈ పని చేయవచ్చా అని కొంతమందిలో ఒక సందేహం ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ అనుసరించేవారు తేనె తీసుకోకూడదు. దానికి బదులు నిమ్మకాయనీరు (చక్కెర లేకుండా) ఎంతైనా తీసుకోవచ్చు. ►శాకాహారులు మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా తీసుకోదగినవి... కొబ్బరినూనె, ఆలివ్‌నూనె, వెన్న లేదా నెయ్యి. కొందరు మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా పెరుగు కూడా తీసుకుంటారు. అది కూడా మంచిదే. ► జీఎమ్ డైట్లో భాగంగా ఉప్పు, మిరియాలు లేదా ఇతర సుగంధద్రవ్యాలు (స్పైసెస్) తీసుకోవచ్చా అంటే... ఉప్పు చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ డైట్లో ఉన్నవారు చాలా ఎక్కువగా నీళ్లు తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల మూత్రం రూపంలో మనలోంచి వెళ్లిపోయే లవణాల కోసం ఉప్పు తీసుకోవడం అవసరమే అయినా దాన్ని చాలా పరిమితంగానే తీసుకోవాలని గుర్తుంచుకోవాలి. సముద్రపు ఉప్పు అయితే ఇంకాస్త మంచిది. మిరియాల వంటి చెట్ల నుంచి వచ్చే (హెర్బల్) సుగంధద్రవ్యాలన్నీ తీసుకోవచ్చు. మీ ఆహారానికి మంచి ఫ్లేవర్ తెచ్చుకొని, తినేందుకు అనువైనవిగా చేసుకునేందుకు ఈ డైట్లో స్పైసెస్ ఒక మంచి మార్గం. ►జీఎమ్ డైట్లో భాగంగా ఎండుఫలాలను (నట్స్) తీసుకోవడం ఏమాత్రం సరికాదు. అయితే మొదటిరోజున, మూడోరోజున... ఇలా జీఎమ్ డైట్ అనుమతించిన రోజుల్లో సాధారణ తాజా ఫలాలను మాత్రం తీసుకోవచ్చు. నట్స్ లేదా డ్రైఫ్రూట్స్‌లో పోషకాలన్నీ చాలా గాఢతతో చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొద్ది ఆహారంతోనే ఎక్కువ పోషకాలు ఒంట్లోకి వెళ్తాయి. అందుకే జీఎమ్ డైట్ పాటిస్తున్న కాలంలో వాటిని తీసుకోడానికి వీల్లేదు. అయితే డైట్ ప్లాన్ ముగిశాక మాత్రం... చాలా కొద్ది కొద్ది పరిమితుల్లో అప్పుడప్పుడు మాత్రం వాటిని తీసుకోవచ్చు. ► జీఎమ్ డైట్ ప్లాన్ వ్యవధి ముగిశాక ఎలాంటి ఆహారం తీసుకోవాలన్నది చాలామందిలో ఉండే ఒక సందేహం. ఎవరికి వారు తమ సాధారణ ఆహారాన్ని తీసుకోవచ్చు. అయితే మునపటిలా ఏది పడితే అది... ఎంత పడితే అంత, ఎప్పుడు పడితే అప్పుడు తినకుండా... మంచి ఆరోగ్యకరమైన సమతుల ఆహారం, నిర్ణీతమైన వేళలకు తింటూ మంచి జీవనశైలిని పాటించాలి. మంచి సమతుల ఆహారం అంటే... మీ కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు అన్నీ సమపాళ్లలో అందేలాంటి భోజనం. అందులో ఆకుకూరలు, కాయగూరల వంటివి చాలా ఎక్కువగా ఉండాలి. తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి. పొట్టు తీయని హోల్ గ్రెయిన్స్ తినడం చాలా మంచిది. అప్పుడు మాత్రమే జీఎమ్ డైట్‌తో ఒనగూరిన ఫలితాలు కాస్తంత ఎక్కువ రోజులు ఉంటాయి. ► జీఎమ్ డైట్ ప్లాన్ వ్యవధి ముగిశాక... యథాతథంగా తింటున్నప్పుడు మళ్లీ బరువు పెరుగుతామా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అవును... ముందుగా పేర్కొన్నట్లు మంచి సమతులాహారం తీసుకోకుండా... ఇష్టం వచ్చినట్లుగా తింటూ సక్రమమైన జీవనశైలి పాటించకపోతే... చాలా కొద్దికాలంలోనే మళ్లీ బరువు పెరిగే అవకాశాలు ఎక్కువ. అయితే తగ్గిన బరువు అలాగే ఉండాలంటే మాత్రం తప్పనిసరిగా మంచి ఆహారపు అలవాట్లు, మంచి జీవనశైలిని అనుసరించాలి. అయితే కొందరిలో థైరాయిడ్ వంటి ఆరోగ్యకారణాల వల్ల బరువు పెరుగుతుంటే మాత్రం వారిలో ఈ డైట్ వల్ల ప్రయోజనం ఉండదు. వారు తమకు ఉన్న అసలు సమస్య (అండర్లైయింగ్ ప్రాబ్లమ్)కు చికిత్స తీసుకోవాలి. ► జీఎమ్ డైట్‌ను మొదలు పెట్టాక అదేపనిగా దీన్ని కొనసాగించవచ్చా... అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అయితే నిర్ణీత వ్యవధి కోసం దీన్ని పాటించాక... మళ్లీ మొదలు పెట్టడానికి తప్పకుండా గ్యాప్ ఇవ్వాలి. జీఎమ్ డైట్ప్లాన్నే ఒక జీవనశైలి అలవాటుగా మార్చుకోకూడదు. ఏదైనా డైట్‌ప్లాన్ మళ్లీ ప్రారంభించాలని అనుకుంటే మాత్రం... కనీసం రెండు వారాల వ్యవధి తర్వాత మళ్లీ ఆ డైట్‌ప్లాన్ మొదలుపెట్టాలి. ► జీఎమ్ డైట్ పాటిస్తున్నప్పుడు యోగా చేయవచ్చా లేదా అన్నది చాలామందిలో ఉండే సందేహం. అయితే జీఎమ్ డైట్ పాటిస్తూ యోగా చేస్తే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. వ్యాయామం చేయాలన్న నియమేమీ లేదుగానీ... ఒకవేళ ఇష్టమై చేస్తుంటే మాత్రం మంచిదే. అయితే చాలా శ్రమతో కూడుకున్న వ్యాయామాలు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. యోగాలాంటివీ, శారీరక శ్రమ లేనివి మాత్రం మామూలుగానే చేసుకోవచ్చు. గమనిక : జీఎమ్ డైట్‌ను పాటించే సమయంలో మొదటి రెండు రోజులు తగిన ప్రోటీన్, మిగతా రోజుల్లో అన్ని పోషకాలు అందక కొందరిలో సమస్యలు రావచ్చు. అందుకే దీన్ని ప్రారంభించాలనుకున్న వారు ఒకసారి డాక్టర్ లేదా డైట్ నిపుణులను సంప్రదించి, తమ వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా డైట్‌ప్లాన్ పొంది అప్పుడు మొదలుపెట్టడం మంచిది. జీఎమ్ డైట్ ప్రతికూలతలు ఈ ఆహార ప్రక్రియలో కొన్ని రకాల ప్రతికూలతలు ఉన్నాయి. అవి... ►ఇది బరువు తగ్గిస్తుంది. కానీ ఈ ఆహారం బరువును ఎలా తగ్గిస్తుందన్న విషయంలో ఎలాంటి నిరూపిత అధ్యయనమూ లేదు. ►ఈ ఆహారం సమతులాహారం కాదు. దీన్ని తీసుకున్నప్పుడు కొన్ని రకాల అసంతృప్తులు, ఆకలి ఉంటాయి. రకరకాల ఆహారాలు తీసుకుంటున్నప్పుడు మనకు అవసరమైన కొన్ని సూక్ష్మపోషకాలు ఒంటికి అందకపోవచ్చు. ►వారంలోని చాలా రోజుల్లో ఒంటికి అవసరమైన ప్రోటీన్ అందదు. అందినది చాలా తక్కువ. అది సరిపోదు. ► ముందుగా చెప్పినట్లే చాలా సందర్భాల్లో ఒంటికి అవసరమైన అన్ని పోషకాలు అందవు. ముఖ్యంగా మొదటి మూడు రోజులూ ఒంటికి అవసరమైన కొవ్వులు, విటమిన్ బి12, ఐరన్, క్యాల్షియమ్ వంటివి లోపించే ప్రమాదం ఉంది. ►జీఎమ్ డైట్‌తో ఒనగూరే ప్రయోజనం కేవలం తాత్కాలికం. అందుకే కొంత వ్యవధి ఇస్తూ మాటిమాటికీ చేయాలంటూ దీనితో ప్రయోజనం పొంది, దీన్ని ఆమోదించిన వారు చెబుతుంటారు. జీఎమ్ డైట్ పాటించే పద్ధతి డా. సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
చక్కెర కేలరీలతో చిక్కే
ఆహారం ఏదైనా కేలరీలు ఎక్కువైతే ఊబకాయం, మధుమేహం వంటివి వచ్చేస్తాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే చక్కెరతో కూడిన పానీయాలతో శరీరానికి చేరే కేలరీలతో సమస్య మరింత ఎక్కువ అవుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఒబేసిటీ రివ్యూస్ జర్నల్‌లో పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. ఆహారం, ఆరోగ్యంపై ప్రభావం అనే అంశంపై ఇప్పటికే జరిగిన దాదాపు 22 పరిశోధనల ఫలితాలను విశ్లేషించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చినట్లు కింబర్ స్టాన్హోప్ తెలిపారు. చక్కెర బదులుగా వాడే ఆస్పర్టైమ్ వంటి కృత్రిమ పదార్థాలతో బరువు పెరుగుతారన్నది అపోహ అని స్టాన్హోప్ అంటున్నారు. ఈ విషయం అందరి ఆలోచనల కంటే భిన్నంగా ఉన్నప్పటికీ పరిశోధనలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని వివరించారు. కొన్ని రకాల నూనెలు, విత్తనాలు, గింజల్లో ఉండే పాలీ అన్శ్యాచురేటెడ్ కొవ్వులు సంతృప్త కొవ్వులతో పోలిస్తే మేలైనవని అన్నారు. అయితే పాల ఉత్పత్తులో ఉండే సంతృప్త కొవ్వులతో పెద్దగా ఇబ్బందేమీ లేదని స్పష్టం చేశారు. -
శక్తినిచ్చే ఉపాహారంతో మధుమేహులకు మేలు!
ఊబకాయంతో పాటు మధుమేహంతో బాధపడుతున్న వారు ఉదయాన్నే ఉపాహారం తీసుకోవాలి. ఆ ఉపాహారంలో ఎక్కువ శక్తి ఉండేలా చూసుకోవడం మంచిదని సూచిస్తున్నారు ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు. అధిక కేలరీలున్న ఉపాహారం... కొంచెం తక్కువ కేలరీతో మధ్యాహ్న భోజనం, అతితక్కువ కేలరీలతో రాత్రి భోజనం తీసుకుంటుంటే, ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని అధ్యయన పూర్వకంగా తెలుసుకున్నామని వారు ఇటీవలే ముగిసిన ఓ అంతర్జాతీయ సదస్సులో ప్రకటించారు. చిన్న మోతాదుల్లో ఆరు సార్లు ఆహారం తీసుకోవాలని మధుమేహులకు చెబుతూంటారని.. తాము సూచించే పద్ధతి వల్ల వారు బరువు తగ్గడమే కాకుండా ఇన్సులిన్ మోతాదు నియంత్రణలో ఉంటుందని, ఆకలి తగ్గడంతో పాటు తక్కువ ఇన్సులిన్‌తోనే మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకునేందుకూ ఇది ఉపయోగపడుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డేనియాలే జకోబోవిచ్ తెలిపారు. ఏ సమయంలో ఆహారం తీసుకుంటామన్నదే ముఖ్యం గానీ.. ఎన్ని కేలరీలు అన్నది కాదని చెప్పారు. దాదాపు 70 ఏళ్ల వయసున్న, ఊబకాయులు, మధుమేహ వ్యాధిగ్రస్తులపై మూడు నెలలపాటు అధ్యయనం చేశారు. కొంతమందికి సంప్రదాయ పద్ధతుల్లోనూ.. ఇంకొందరికి కొత్త పద్ధతి ద్వారా ఆహారం అందించాక, జరిపిన పరిశీలనలో, కొత్త పద్ధతి ద్వారా మంచి ఫలితాలు వచ్చినట్లు తెలిసింది. -
కేలరీల్లో కోతతో మధుమేహానికి చెక్!
మధుమేహం నుంచి విముక్తి పొందేందుకు తాజాగా యాల్ యూనివర్శిటీ పరిశోధకులు అన్నింటికంటే సింపుల్ పరిష్కారం ఒకదాన్ని సూచిస్తున్నారు. ఆహారం ద్వారా వంటబట్టే కేలరీలను వీలైనంత తగ్గిస్తే చాలు.. టైప్ –2 మధుమేహాన్ని నయం చేసుకోవచ్చునని అంటున్నారు. ఎలుకలకు సాధారణ కేలరీల్లో నాలుగోవంతు మాత్రమే అందించి చేసిన ప్రయోగాల్లో వ్యాధి నయమైనట్లు స్పష్టమైందని గెరాల్డ్ షూల్మన్ అనే శాస్త్రవేత్త తెలిపారు. ఈ రకమైన ఆహారం అందించిన తరువాత ఎలుకల జీవక్రియల్లో జరిగిన మార్పులను పరిశీలించడం ద్వారా వ్యాధి ఎలా నయమైందీ గుర్తించారు. తక్కువ కేలరీలున్న ఆహారాన్ని తీసుకున్నప్పుడు కాలేయంలో గ్లూకోజ్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిందని, అదే సమయంలో గ్లైకోజెన్.. గ్లూకోజ్‌గా మారే వేగమూ తగ్గిందని, అలాగే శరీరంలో కొవ్వు శాతమూ తగ్గడం వల్ల కాలేయం ఇన్సులిన్‌కు స్పందించే లక్షణంలోనూ మార్పులొస్తాయని ఆయన వివరించారు. కేవలం మూడు రోజులపాటు కేలరీలు తక్కువన్న ఆహారం తీసుకున్నప్పటికీ మధుమేహ తీవ్రతలో స్పష్టమైన మార్పులు కనిపించినట్లు ఈ ప్రయోగాల్లో తేలింది. ఊబకాయాన్ని తగ్గించుకునేందుకు బేరియాట్రిక్ శస్త్రచికిత్స చేసుకున్న వారు, ఇప్పటికే అతితక్కువ కేలరీలున్న ఆహారం తీసుకుంటున్న మధుమేహ వ్యాధిగ్రస్తులపై కూడా ఇదేరకమైన ప్రయోగాలు చేసి ఫలితాలను నిర్ధారించుకునేందుకు ప్రస్తుతం తాము ప్రయత్నాలు చేస్తున్నట్లు షుల్మన్ తెలిపారు. -
క్లాస్‌రూంలో కామ్‌గా సైక్లింగ్..
క్లాస్‌రూంలో కామ్‌గా పాఠాలు వినాల్సిన పిల్లలు సైక్లింగ్ చేస్తున్నారు.. ఎందుకో తెలుసా? ఏకాగ్రత పెరగడం కోసమట! ఈ ఐడియా 8 క్లాసు గణితం ఉపాధ్యాయురాలు బెథానీ లాంబర్ట్ది. క్లాసులో పాఠాలు చెప్పేటప్పుడు విద్యార్థులు ఏకాగ్రతతో వినకుండా అటూ ఇటూ కదలడం.. తిరగడం వంటివి చేస్తున్నారట.. దీంతో కాళ్లు అటుఇటూ కదలాల్సిన పనిలేకుండా ఈ సైక్లింగ్ డెస్క్‌లను ఏర్పాటు చేసింది. అంతే.. విద్యార్థులు తిరగడం తగ్గించి.. ఓవైపు సైక్లింగ్ చేస్తూ.. మరోవైపు క్లాసులు వినేస్తున్నారు. అంతేకాదు.. దీని వల్ల పాఠాలపై ఏకాగ్రత పెరిగిందని చెబుతున్నారు. పైగా.. సైక్లింగ్ వల్ల క్యాలరీలు ఖర్చయి.. ఫిట్‌గా ఉంటున్నామని అంటున్నారు. వాళ్ల గ్రేడ్లు కూడా పెరిగాయట. అమెరికాలోని నార్త్‌కరోలినా రాలీగ్‌లో ఉన్న మార్టిన్ మిడిల్ స్కూల్లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ సైక్లింగ్ డెస్క్‌లపై మిగిలిన పాఠశాలల వాళ్లూ ఆసక్తి చూపుతున్నారట. -
స్కానింగా మజాకా...
మీరు తీసుకునే ఆహారంలో క్యాలరీలు, ప్రొటీన్లు, షుగర్ లాంటివి ఎంతెంత ఉన్నాయో తెలుసా? పోనీ తెలుసుకోవాలని ఉందా? అవి చూస్తే కనపడవు. మరి ఎలా? స్కాన్ చేస్తే సరిపోతుంది. స్కానింగ్‌లో అవన్నీ ఎలా తెలుస్తాయనేగా మీ సందేహం. ఏమీ లేదండీ.. పక్కన కనిపిస్తున్న పరికరం పేరు ‘టెల్స్పెక్’. దీంతో మీరు తినే ఆహారాన్ని స్కాన్ చేయాలి. అప్పుడు అందులో ఎన్ని క్యాలరీలు, ప్రొటీన్లు ఉన్నాయో చెప్పడమే కాక ఎన్ని రసాయనాలున్నాయో కూడా చెప్పేస్తుంది. ఎలా అంటే, ఆ సమాచారమంతా దానికి అమర్చి ఉన్న బ్లూటూత్ ద్వారా మీ మొబైల్ లేదా ఐప్యాడ్‌లో కనిపిస్తుంది. దానివల్ల ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ... రసాయనాలతో కూడిన ఆహారానికి దూరంగా ఉండొచ్చు. -
ఇటీవలే సైక్లింగ్‌కు మారాను... మంచిదేనా?
నా వయసు 29. ఇటీవలే నాకు నగరం నుంచి జిల్లా కేంద్రానికి బదిలీ అయ్యింది. నగరంలో ఉండగా ఈతకొలనులో ఈత కొట్టేవాడిని. ఇప్పుడు నగరానికి దూరంగా వచ్చేయడంతో ఈతకు అవకాశం లేదు. అందుకే ఇప్పుడు కాసేపు సైక్లింగ్ చేస్తున్నాను. వ్యాయామ అంశంగా సైక్లింగ్ ప్రయోజనాలు చెప్పండి. - ప్రకాశ్, మెదక్ మీ ఎంపిక చాలా బాగుంది. సైక్లింగ్ వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. సైక్లింగ్ మొదలుపెట్టగానే గుండె వేగం పెరుగుతుంది. శరీరం బరువు కాళ్ల మీద పడకపోవడం వల్ల ఈ వ్యాయామాన్ని కాస్త సుదీర్ఘకాలం చేసినా ఎలాంటి దుష్పరిణామాలూ ఉండవు. అందుకే బరువు ఎక్కువగా ఉన్నవారికి రన్నింగ్, జాగింగ్ కంటే సైక్లింగ్ చేయాలంటూ ఫిట్నెస్ నిపుణులు సూచిస్తుంటారు. బరువు ఎక్కువగా ఉన్నవారు తాము తగ్గాలనుకున్న బరువు లక్ష్యాన్ని తేలిగ్గా సాధించేందుకు అనువైన వ్యాయామం ఇది. ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మేలైన వ్యాయామమిది. మనలో చాలామంది ఇళ్లలో సైకిల్ ఉండనే ఉంటుంది. మిగతా వ్యాయామాలకు అవసరమైనట్లుగా దీనికి ప్రత్యేకమైన శిక్షణగాని, పర్యవేక్షకుల పర్యవేక్షణ గాని అవసరం ఉండదు. సైక్లింగ్ వల్ల కాలి కండరాలు, పిక్కలు వంటివి బలంగా రూపొందుతాయి. కాళ్ల ఆకృతి బాగుంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా అరగంట సేపు సైకిల్ తొక్కితే... ఆయా వ్యక్తుల బరువును బట్టి 75 క్యాలరీలు మొదలుకొని 670 క్యాలరీల వరకు ఖర్చవుతుంది. ఇక ఆరోగ్యం మెరుగుదల విషయానికి వస్తే సైక్లింగ్ వల్ల గుండెకు, ఊపిరితిత్తులకు ప్రయోజనం చేకూరుతుంది. వైద్యపరిభాషలో చెప్పాలంటే కార్డియోవాస్క్యులార్ ఫిట్నెస్ లభిస్తుంది. ప్రతి కణానికి ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. రక్తంలో కొవ్వు శాతం తగ్గుతుం ది. ఒక్కమాటలో చెప్పాలంటే... మన ఆఫీసు గనక 10 కి.మీ. లోపు ఉంటే... అప్పుడు మనం ఆఫీసులకు వెళ్లడానికి కారు లేదా మోటారుసైకిల్‌కు బదులు సైకిల్‌ను ఉపయోగిస్తే దేశవ్యాప్తంగా నమోదవుతున్న గుండెజబ్బులలో కనీసం 10 శాతం తగ్గుదల ఉంటుందన్నది తాజా అధ్యయనాల అంచనా. డాక్టర్ భక్తియార్ చౌదరి స్పోర్ట్స్ మెడిసిన్ - ఫిట్నెస్ నిపుణుడు, హైదరాబాద్