క్లాస్‌రూంలో కామ్‌గా సైక్లింగ్..
క్లాస్‌రూంలో కామ్‌గా పాఠాలు వినాల్సిన పిల్లలు సైక్లింగ్ చేస్తున్నారు.. ఎందుకో తెలుసా? ఏకాగ్రత పెరగడం కోసమట! ఈ ఐడియా 8 క్లాసు గణితం ఉపాధ్యాయురాలు బెథానీ లాంబర్ట్‌ది. క్లాసులో పాఠాలు చెప్పేటప్పుడు విద్యార్థులు ఏకాగ్రతతో వినకుండా అటూ ఇటూ కదలడం.. తిరగడం వంటివి చేస్తున్నారట.. దీంతో కాళ్లు అటుఇటూ కదలాల్సిన పనిలేకుండా ఈ సైక్లింగ్ డెస్క్‌లను ఏర్పాటు చేసింది. అంతే.. విద్యార్థులు తిరగడం తగ్గించి.. ఓవైపు సైక్లింగ్ చేస్తూ.. మరోవైపు క్లాసులు వినేస్తున్నారు. అంతేకాదు.. దీని వల్ల పాఠాలపై ఏకాగ్రత పెరిగిందని చెబుతున్నారు. పైగా.. సైక్లింగ్ వల్ల క్యాలరీలు ఖర్చయి..
ఫిట్‌గా ఉంటున్నామని అంటున్నారు. వాళ్ల గ్రేడ్‌లు కూడా పెరిగాయట. అమెరికాలోని నార్త్‌కరోలినా రాలీగ్‌లో ఉన్న మార్టిన్ మిడిల్ స్కూల్‌లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ సైక్లింగ్ డెస్క్‌లపై మిగిలిన పాఠశాలల వాళ్లూ ఆసక్తి చూపుతున్నారట.