lessons
-
స్టాక్స్ బడిలో ‘టీనేజీ’ పాఠాలు!
పిల్లలు విద్యలో రాణిస్తుంటే తల్లిదండ్రుల ఆనందానికి హద్దులుండవు. వారి భవిష్యత్ బంగారమేనని మురిసిపోతుంటారు. తమ వారసులకు నాణ్యమైన విద్య, ఉపాధి మార్గం చూపడంతోనే తల్లిదండ్రుల బాధ్యత తీరిపోయినట్టు కాదు. సంపాదనను సంపదగా మార్చే విద్య కూడా వారికి చెప్పాలి. ఆర్ధిక అంశాలపై సమగ్రమైన అవగాహన వారిని స్థితిమంతులను చేస్తుంది. ఆర్ధిక సమస్యల్లో చిక్కుకోకుండా కాపాడుతుంది. ప్రతి ముగ్గురు అమెరికన్ ఈక్విటీ ఇన్వెస్టర్లలో ఒకరు 18 ఏళ్లకే ఈక్విటీల్లోకి అడుగు పెడుతున్నారు. మన దగ్గర 25 ఏళ్ల తర్వాతే ఎక్కువ మందికి ఈక్విటీల గురించి తెలుస్తోంది. స్టాక్స్ గొప్ప కాంపౌండింగ్ మెషిన్. ఎంత ముందుగా పెట్టుబడి మొదలు పెడితే, అన్ని రెట్లు అధిక ప్రతిఫలాన్ని ఇస్తుంది. గుజరాత్, మహారాష్ట్రలోని కొన్ని కమ్యూనిటీల్లో యుక్త వయసులోనే పిల్లలకు తల్లిదండ్రులు స్టాక్స్ పాఠాలు చెప్పడం మొదలు పెడతారు. పెట్టుబడుల వారసత్వాన్ని సైతం వారు ఎంతో కీలకంగా చూస్తారు. ఈ తరహా విధానం అందరికీ అనుసరణీయమేనన్నది నిపుణుల అభిప్రాయం. చిన్న నాటి నుంచే ఈక్విటీ పెట్టుబడుల పరిచయంతో భవిష్యత్తులో దాన్ని సంక్లిష్టంగా కాకుండా క్రమబద్ధంగా, సంపద సృష్టికి సులభమైన మార్గంగా చూడడం అలవడుతుందనేది ఈక్విరస్ వెల్త్ మేనేజ్మెంట్ ఎండీ, సీఈవో అభిజిత్ భవే అభిప్రాయం. ‘‘ఆరంభానికి 16 ఏళ్ల వయసు అనువైనది. వాస్తవిక ఆర్ధిక విషయాలను వారు అప్పుడే అర్థం చేసుకోవడం మొదలవుతుంది. 17 ఏళ్ల వయసుకు రిస్క్, రాబడి, దీర్ఘకాలంలో పెట్టుబడుల వృద్ధి తదితర అంశాలను అర్థం చేసుకోగలరు’’ అని అభిజిత్ భవే చెప్పారు. ‘‘టీనేజ్‌లో కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల ద్వారా పెట్టుబడుల గురించి వింటుంటారు. ఆ దశలోనే వారిలోని ఆసక్తిని గుర్తించి నేరి్పంచడం మొదలు పెట్టాలి. 15–16 ఏళ్లపుడు ఆరంభిస్తే.. 17–19 ఏళ్లు వచ్చే సరికి ఈక్విటీలను అర్థం చేసుకోగలరు. వీరిలో కొందరు కెరీర్‌గానూ మలుచుకునే అవకాశం ఉంటుంది’’ అని 5నాన్స్ డాట్ కామ్ వ్యవస్థాపకుడు దినేష్ రోహిరా సూచించారు. ‘‘వారంతట వారే నేర్చుకునేలా పిల్లలను ప్రోత్సహించాలి. మెరుగైన మ్యూచువల్ ఫండ్స్ పథకాలు లేదా స్టాక్స్‌ను గుర్తించే అవకాశం కలి్పంచాలి. అప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి. నిర్ణయాలను నిందించకుండా, మంచి చెడుల పరంగా తీర్పు ఇవ్వకుండా తమ పెట్టుబడులు, తప్పిదాలు, విజయాల గురించి పంచుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. తమను తాము ఆవిష్కరించుకునే అవకావం ఇవ్వాలి’’ అని సెంటర్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఎడ్యుకేషన్ అండ్ లెరి్నంగ్ చైర్పర్సన్ ఉమా శశికాంత్ అన్నారు. ఇలా స్వేచ్ఛా వాతావరణం ఉంటే పిల్లలు సంతోషంగా పంచుకుంటారు. అప్పుడు వారి నిర్ణయాల్లోని లోపాలను ఎలా సరిచేసుకోవాలో వివరించి చెప్పొచ్చు. టీనేజ్ నుంచే వెన్నుతట్టి ప్రోత్సహించడం వల్ల సంపాదన మొదలయ్యే నాటికి వారు మెరికలుగా మారతారు. ‘‘ఈక్విటీల్లో కాంపౌండింగ్ (రాబడిపై రాబడి)కు సమయం కావాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు ముందుగా ఈక్విటీ పెట్టుబడులను పరిచయడం చేయడం వల్ల, మార్కెట్లను మెరుగ్గా అర్థం చేసుకోగలిగి భవిష్యత్తులో అద్భుతమైన సంపదను సృష్టించుకోగలరు’’ అని రూపీ విత్ రుషబ్ ఇన్వెస్ట్మెంట్ సరీ్వసెస్ వ్యవస్థాపకుడు రుషబ్ దేశాయ్ పేర్కొన్నారు.ప్రాథమిక అంశాలు.. ఆర్ధిక అంశాలు, పెట్టుబడులు, వివిధ సాధనాల గురించి స్కూల్ పాఠాల్లో ఉండదు. కనుక వీటి గురించి చెప్పే బాధ్యతను తల్లిదండ్రులు తీసుకోవాలి. పదో తరగతి లేదా ఇంటర్లోకి వచి్చన వెంటనే ప్రాథమిక అంశాల గురించి అర్థమయ్యేలా వివరించి, కొన్ని కోర్సులను వారికి పరిచయం చేయాలి. దీంతో ఈక్విటీల గురించి మరింత లోతుగా నేర్చుకుంటారు. అయితే, మెజారిటీ తల్లిదండ్రులకు క్యాపిటల్ మార్కెట్లపై అవగాహన లేకపోవడం సమస్యగా పేర్కొన్నారు ఫిన్‌సేఫ్ ఇండియా వ్యవస్థాపకురాలు మృణ్ అగర్వాల్. అయినా సంకోచించకుండా, తమ పిల్లలను ఫైనాన్షియల్ ప్లానర్లు/ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ల వద్దకు తీసుకెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు. ఆన్లైన్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ తల్లిదండ్రులు స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే, కంపెనీలు, వాటి ఈక్విటీ, ఆదాయం, లాభాలు, యాజమాన్యం, రుణభారం, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్, వాటి పెట్టుబడుల విధానం, రిస్క్, రాబడులు, బేర్, బుల్ మార్కెట్లు, ఆటుపోట్లు (వోలటాలిటీ), పెట్టుబడుల్లో వైవిధ్యం, కాంపౌండింగ్, లక్ష్యాలను నిర్ణయించుకోవడం, దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయడం తదితర అంశాల గురించి చెప్పాలి. ముందుగా పెట్టుబడులు ఆరంభించడం వల్ల రాబడిపై రాబడి (కాంపౌండింగ్) తోడయ్యి వచ్చే అద్భుత రాబడుల సూత్రాన్ని వివరించాలి. అధిక రాబడులు ఎప్పుడూ కూడా అధిక రిస్‌్కతో ఉంటాయన్న వాస్తవాన్ని తెలియజేయాలి. ఈ రిస్క్‌ను అధిగమించే వ్యూహాలపై అవగాహన కలి్పంచాలి.పరిశోధన, అధ్యయనం 17–19 ఏళ్ల వయసులో ప్రాథమిక అంశాలను దాటి లోతైన విశ్లేషణ, అధ్యయనాన్ని టీనేజర్లు ఆరంభించేలా చూడాలి. మార్కెట్లు, కంపెనీలను విశ్లేíÙంచే సామర్థ్యాలు కచ్చితంగా తెలియాలి. అప్పటికే ఎన్నో ఏళ్ల పాటు పెట్టుబడులు పెట్టిన అనుభవం, మార్కెట్లపై సమగ్రమైన అవగాహన ఉంటే తల్లిదండ్రులే వీటి గురించి వివరంగా చెప్పొచ్చు. లేదంటే ఆన్లైన్, ఆఫ్‌లైన్ కోర్సుల్లో వారిని చేర్పించాలి. ఎన్ఎస్ఈ, బీఎస్ఈతోపాటు మరికొన్ని సంస్థలు ఈక్విటీలు, పెట్టుబడులకు సంబంధించి పలు కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. నిపుణులు రాసిన చక్కని పుస్తకాలు కూడా ఉన్నాయి. పరిశ్రమకు చెందిన నిపుణులు వర్క్‌షాప్‌లు, వెబినార్లను నిర్వహిస్తుంటారు. వర్చువల్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లు, వార్తా పత్రికలు సమాచార వేదికలుగా ఉపయోగపడతాయి. తొలుత ఆరంభ స్థాయి, తదనంతరం అడ్వాన్స్డ్ కోర్సుల్లో చేర్పించొచ్చు. ఆర్థిక అంశాలు, ఆర్ధిక వ్యవస్థల గురించి అవగాహన తప్పనిసరి. కంపెనీ ఆర్ధిక మూలాలు, కంపెనీ ఉత్పత్తులు లేదా సేవలు, వాటి ద్వారా ఆదాయం పొందుతున్న తీరు, కీలక రంగాలు, వాటి పనితీరు, అంతర్జాతీయ ధోరణులు మార్కెట్లపై ఎలా ప్రభావం చూపిస్తాయన్నది తెలియాలి. ఫండమెంటల్, టెక్నికల్ కోర్సులను నేరి్పంచాలి. ‘‘కంపెనీ బ్యాలన్స్ షీటును అర్థం చేసుకుని, విశ్లేషించే సామర్థ్యాలు అలవడితే, కంపెనీ నిధులను ఎలా వినియోగిస్తుందో తెలుసుకోగలిగితే అప్పుడు వారు తగిన కంపెనీని ఎంపిక చేసుకోగలరు. అప్పుడు అది పెట్టుబడి అవుతుందే కానీ, గ్యాంబ్లింగ్ కాబోదు. ఏమి చేస్తున్నాం? ఎందుకు చేస్తున్నాం? అన్న స్పష్టత ఉండాలి’’ అని దినేష్ రోహిరా సూచించారు. రిస్క్‌లు/మోసాలు ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులకు సంబంధించి రిస్‌్కలు, మోసాల గురించి వివరంగా చెప్పాలి. తప్పుడు సలహాలతో ఏర్పడే నష్టం, వేరొకరి సూచనను గుడ్డిగా అనుసరించడం వల్ల వచ్చే రిస్‌్కల గురించి, భావోద్వేగాల నియంత్రణ ప్రాధాన్యాన్ని అర్థమయ్యేలా వివరించాలి. వేగంగా డబ్బులు సంపాదించేయాలన్న ధోరణి అస్సలు పనికిరాదు. ఒకవేళ మీ పిల్లల్లో ఈ ధోరణిని గుర్తిస్తే వెంటనే దాన్ని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి. నేటి యువతరం ఎక్కువ మంది ఇదే ధోరణితో స్టాక్స్ వైపు అడుగులు వేస్తుండడాన్ని గమనించొచ్చు. క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాలిక పెట్టుబడుల విధానానికి బదులు ట్రేడింగ్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. డెరివేటివ్స్ లావాదేవీల్లో లాభం వచి్చనా, నష్టం వచి్చనా రూ.వేలు, రూ.లక్షల్లో ఉంటుంది. డెరివేటివ్స్ స్పెక్యులేటివ్ ఆధారితం. ఇందులో రిస్‌్కల పట్ల పిల్లల్లో అవగాహన తప్పనిసరి. కష్టార్జితాన్ని కాపాడుకుంటూ, మెరుగైన రాబడులు సంపాదించడమే కర్తవ్యంగా ఉండాలి. కానీ, స్వల్పకాలంలోనే సంపద కూడబెట్టడం అసాధ్యం అన్నది పిల్లలకు అర్థమయ్యేలా చేయాలి. వాట్సాప్, యూట్యూబ్, ఎక్స్ తదితర ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వచ్చే స్టాక్ రికమండేషన్ల ఉచ్చులో పడకుండా, టిప్స్‌కు దూరంగా ఉండేలా చూడాలి. ‘‘అన్ని మార్గాల ద్వారా వస్తున్న సమాచారంతో ఈక్విటీ మార్కెట్లో డబ్బులు సంపాదించడం తేలికన్న భావన యువతలో సహజంగా ఏర్పడుతుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అతిపెద్ద రిస్క్’’ అని మృణ్ అగర్వాల్ తెలిపారు. ఇతరులను గుడ్డిగా అనుసరిస్తే పెట్టుబడిని కూడా కోల్పోయే ప్రమాదం గురించి అర్థం కావాలి. నిజానికి సరైన రీతిలో వినియోగించుకుంటే సామాజిక మాధ్యమాలు, ఆన్లైన్ వేదికల నుంచి ఎంతో కీలక సమాచారాన్ని పొందొచ్చు. సమాచార వడబోత గురించి టీనేజర్లకు తెలిస్తే తప్పటడుగులు వేయకుండా మెరుగైన రక్షణ ఏర్పడినట్టే. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్, సెక్టోరల్/థీమ్యాటిక్ ఫండ్స్‌లో ఉండే అధిక రిస్్కపై అవగాహన కలి్పంచాలి. స్టాక్స్‌లో స్వల్పకాలిక అస్థిరతల ప్రభావంతో నియంత్రణ కోల్పోకుండా చూడాలి. పెట్టుబడులు–పర్యవేక్షణ టీనేజర్లలో స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్‌పై ఏ మేరకు అవగాహన, విజ్ఞానం వచ్చిందో కొంత పెట్టుబడి వారికి సమకూర్చి పరీక్షించొచ్చు. పిల్లలు అప్పటి వరకు దాచుకున్న పాకెట్ మనీ ఉంటే, దాన్ని కూడా పెట్టుబడిగా పెట్టేలా ప్రోత్సహించాలి. లేదంటే తల్లిదండ్రులే ఆరంభ పెట్టుబడి కింద రూ.10,000 సమకూర్చాలి. లావాదేవీలకు వీలుగా డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు వారి పేరిట తెరిపించాలి. 18 ఏళ్లు నిండగానే ఈ పనిచేయాలి. 18 ఏళ్లలోపే పిల్లలు వీటి గురించి మెరుగ్గా తెలుసుకున్నారని భావిస్తే, అప్పుడు తల్లిదండ్రుల్లో ఒకరు తమ పేరిట ఖాతా తెరిచి, పిల్లలకు అందుబాటులో ఉంచాలి. మరోవైపు మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులు పెట్టేలా చూడాలి. కొంత కాలానికి ఈ రెండింటి పనితీరును వారు పోల్చుకోగలరు. స్టాక్స్‌లో ఆటుపోట్లు ఎక్కువ. వీటిని ఫండ్స్ ఎలా అధిగమిస్తున్నాయన్నది తెలుసుకునే ఆసక్తి ఏర్పడుతుంది. ప్రతి 15 రోజులకు, నెల రోజులకు ఒకసారి పిల్లల పోర్ట్‌ఫోలియోను సమీక్షించి, అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తూ ప్రోత్సహించాలి. తప్పులను చూపించి నిందించడం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరాదు.వర్చువల్ ట్రేడింగ్ వేదికలు నియోస్టాక్స్: వర్చువల్ ట్రేడింగ్‌కు సులభంగా, అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇందులో రిజిస్టర్ చేసుకుని, సెక్యూరిటీలను ఎంపిక చేసుకుని ట్రేడింగ్ ప్రారంభించొచ్చు. స్టాక్ ట్రెయినర్ : మన దేశంతోపాటు ! అమెరికా సహా 15కు పైగా దేశాల స్టాక్స్ డేటాను ఈ ఆండ్రాయిడ్ యాప్ ఆఫర్ చేస్తోంది. వాటిలో వర్చువల్‌గా ట్రేడ్ చేసుకోవచ్చు. పనితీరును విశ్లేషించుకోవచ్చు. నేర్చుకునేందుకు వేదికలు.. ఎన్ఎస్ఈ అకాడమీ సర్టిఫికేషన్ ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్స్ (ఎన్సీఎఫ్ఎం): నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ (ఎన్ఎస్ఈ) నిర్వహిస్తున్న అకాడమీ ఇది. ఆన్లైన్ ద్వారా ఎన్నో రకాల కోర్సులను అందిస్తోంది. బిగినర్, బేసిక్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్ ఇలా వివిధ దశల్లో వీటిని పొందొచ్చు. ఆన్లైన్లో పేరు నమోదు చేసుకుని, ఫీజు చెల్లించిన తర్వాత మెటీరియల్ పొందొచ్చు. సన్నద్ధమైన తర్వాత పరీక్షలు రాయవచ్చు. ఎన్ఎస్ఈ అకాడమీ డాట్ కామ్ పోర్టల్‌ను సంప్రదించాలి. బీఎస్ఈ ఇనిస్టిట్యూట్ బీఎస్ఈ సబ్సిడరీ ఇది. మూడేళ్ల గ్రాడ్యుయేట్, ఏడాది, రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను సైతం ఆఫర్ చేస్తోంది. ప్లస్2 తర్వాత వీటిలో చేరొచ్చు. రోజులు, వారాల నిడివితో స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, డెరివేటివ్‌లపై స్వల్పకాలిక ప్రోగ్రామ్‌లు, కోర్సులను సైతం అందిస్తోంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ (ఎన్ఐఎస్ఎం): సెక్యూరిటీలపై స్వల్పకాలిక, దీర్ఘకాలిక కోర్సులను ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో సెబీ అందిస్తోంది. ఉడెమీ : ఇదొక ఆన్లైన్ లెరి్నంగ్ ప్లాట్‌ఫామ్. ఉచిత కోర్సులు కూడా ఇక్కడ లభిస్తాయి. రూ.449 నుంచి చెల్లింపుల కోర్సులు కూడా ఉన్నాయి.నేర్చుకోండి.. నేర్చుకోండి.. నేర్చుకోండి.. సరిగ్గా జీవించడమంటే అన్ని వేళలా నేర్చుకోవడమే.– చార్లీ ముంగర్, విఖ్యాత ఇన్వెస్టర్ – సాక్షి, బిజినెస్‌డెస్క్ -
నో క్లాసులు...నో పాఠాలు..దాని పేరే అగోరా స్కూల్!
స్కూల్ అనగానే క్లాస్‌రూమ్‌లు, బల్లలు, బ్లాక్‌బోర్డులు, పాఠాలు చెప్పే టీచర్లు గుర్తుకొస్తారు. కానీ యూరప్‌లోని నెదర్ల్యాండ్స్ దేశంలో ఉన్న ‘అగోరా స్కూల్’లో మాత్రం అవేమీ ఉండవు. అక్కడున్న పిల్లలంతా తమకు నచ్చిన ఆటలు ఆడుకోవచ్చు, నచ్చినట్లు ఉండొచ్చు. అక్కడ గదుల్లో బల్లలు, కుర్చీలుంటాయి. కానీ అవేవీ మనకు మామూలు స్కూళ్లలో కనిపించేలా ఉండవు. అక్కడ పిల్లలు చూసేందుకు టీవీ, వాడేందుకు కంప్యూటర్లు ఉంటాయి. అక్కడ తరగతులకు బదులుగా గ్రూప్‌లు మాత్రమే ఉంటాయి. ఒక్కో గ్రూప్‌లో 17 మంది దాకా ఉంటారు. రకరకాల వయసున్నవారు ఒకచోట చేరతారు. స్కూల్‌కి రాగానే ఆ రోజు వారు చేయాల్సిన పనులను, పూర్తి చేయాల్సిన లక్ష్యాలను రాసుకుంటారు. ఇవి కూడా అందరికీ ఒకేలా ఉండవు. ఎవరికి తగ్గట్టు వారికి వేరుగా ఉంటాయి. ఒకరు సంగీతం నేర్చుకోవాలనుకుంటే మరొకరు పుస్తకం చదవాలన్నది పనిగా పెట్టుకుంటారు. మరొకరు ఆ రోజుకు ఒక బొమ్మ గీయడాన్ని లక్ష్యంగా మార్చుకుంటారు. టీచర్లు వారు చేయాలనుకున్న పనిలో సాయం చేస్తారు... కొట్టడం, కోప్పడటం లాంటివి చేయరు. ఆటల మీదే కాకుండా ఇతర అంశాల మీద దృష్టి పెట్టేవారు కూడా ఉంటారు. అలాంటి వారి కోసం అక్కడ రకరకాల విభాగాలున్నాయి. వంట నేర్చుకోవడం, శిల్పాలు చేయడం, చెక్కతో కళాకృతులు తయారు చేయడం, చిత్రలేఖనం, రోబోలు తయారు చేయడం.. ఇలా ఎవరికి నచ్చిన పని వారు నేర్చుకునే అవకాశం కల్పిస్తారు. కేవలం చదువుకోవాలనుకునేవారి కోసం ‘సైలెంట్ రూమ్స్’ ఉంటాయి. అందులోకి వెళ్లి, కూర్చుని నచ్చిన పుస్తకాలు చదువుకోవచ్చు. రొటీన్ స్కూళ్లకు భిన్నంగా పిల్లలకు సృజనాత్మక విద్య నేర్పించాలనుకునే వారి కోసం 2014లో ఈ స్కూల్‌ని స్థాపించారు. రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా పిల్లలు ఈ స్కూల్లో ఉంటారు. మొత్తం మూడు దేశాల్లో ఈ స్కూళ్లను మొదలుపెట్టారు. ప్రస్తుతం 1800 మందికిపైగా పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు. -
ఇటు వర్క్‌ని.. అటు కుటుంబాన్ని.. బ్యాలెన్స్ చేశారిలా.. !
పెప్సికో మాజీ సీఈవో ఇంద్రా నూయి భారత సంతతి అమెరికన్ వ్యాపారవేత్త. భారత తొలి మహిళా సీఈవో కూడా ఆమె. ఫోర్బ్స్ శక్తిమంతమైన మహిళా జాబితాలో కూడా స్థానం దక్కించుకుంది. ఎన్నో అత్యత్తమమైన అవార్డులను సొంతం చేసుకుని వ్యాపార సామ్రాజ్యంలో తిరుగులేని విజయాలను అందుకుంది. అలాగే ఇద్దరు పిల్లల తల్లిగా సమర్థవంతంగా బాధ్యతలను నిర్వర్తించి కుటుంబ జీవితాన్ని పూర్తి న్యాయం చేసింది. ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదు కదా..! మరీ నూయికీ ఎలా సాధ్యమయ్యిందో తెలుసుకుందామా..!ఆమె రాసిని 'మై లైఫ్ ఇన్ ఫుల్' అనే పుస్తకంలో కుటుంబాన్ని, వర్క్‌ని ఎలా బ్యాలెన్సు చేసుకోవాలో క్లియర్‌గా వివరించింది. ఆ పుస్తకంలో ఓ పెద్ద కంపెనీని సమర్థవంతంగా నిర్వహిస్తూ..కుటుంబ బాధ్యతలను ఎలా తాను బాల్యెన్సు చేసిందో వివరిస్తూ.. తన అనుభవాన్ని పంచుకున్నారు. అవేంటో చూద్దామా..!ఇంద్ర నూయి పేరెంటింగ్ చిట్కాలు..కుటుంబం ప్రాముఖ్యత..తన తొలి సంతానం ప్రీత పుట్టినప్పుడూ యూఎస్‌లో ఆమెకు తన కూతుర్ని పర్యవేక్షించే పిల్లల సంరక్షణ ఏది కనిపించలేదు. ఆ సమయంలో ఆమె తల్లి, అత్తగారు ఆమెకు సహాయ సహకారాలు అందించారు. వారివురు తన పిల్లల బాధ్యతను తీసుకోవడంతో తాను కెరీర్లో దూసుకుపోగలిగానని అన్నారు. అదే సమయంలో వారేమీ నా పిల్లలను చూసుకున్నందుకు తన నుంచి ఎలాంటి డబ్బులు ఆశించలేదు. తరతరాలుగా వస్తున్న బాధ్యతగా వారు తీసుకున్నారు. ఇదే కుటుంబం అంటే అని చెబుతుంది. దానికి ప్రాముఖ్యత ఇవ్వకపోతే ఎలాంటి విజయాలను అందుకోలేవని అంటోంది నూయి. పిల్లలను మంచిగా పెంచడం అనేది తల్లిదండ్రులిద్దరూ సమిష్టగా చేయాల్సిన పని అని నొక్కి చెబుతోంది. అలాగే తన రెండో కూతురు తార వచ్చేటప్పటికీ పిల్లల సంరక్షణను అందుబాటులో ఉంది. అయినప్పటికీ తన కుటుంబమే వారి బాధ్యతను తీసుకుందని చెప్పుకొచ్చింది నూయి.ఒంటరిగా ఉండిపోవద్దు..మాతృత్వం అనేది ఓ గొప్ప అనుభూతి. మీకు మద్దతు ఇచ్చే వ్యక్తుల సాయంతో ధైర్యంగా లీడ్ చేయాలి. తాను కష్టంతో కాకుండా ఆనందంతో ఆ బాధ్యతలను నిర్వహించడానికి ప్రయత్నిస్తే ఉద్యోగ జీవితానికి దూరమవుతున్నానే బాధ అనిపించదు. మాతృత్వపు బాధ్యతలను నిర్వర్తిస్తూనే కెరీర్‌ని ఎలా తిరిగి పునర్నిర్మించుకోవాలనే దానిపై దృష్టి పెట్టాలి. అందుకు మీ కుటుంబ సహకారం కూడా తీసుకోవాలి అని చెబుతోంది.సమయం కేటాయించటం..కొన్ని సార్లు తల్లిగా పిల్లలను చూసుకోవడంలో చాలా బిజీగా ఉంటారు. ప్రత్యేకంగా మీకు సమయం కేటాయించుకోవడం కష్టమే అయినా వాళ్లతో ఆడుతూ పాడుతూ మీ పనిచేసుకునే మార్గాన్ని అన్వేషించాలి. చేయాలనే తపన, ఉత్సాహం ఉంటే ఎలాగైన తగిన సమయం దొరుకుతుందని చెబుతోంది నూయి. కష్టపడక తప్పని స్థితి..ఒక్కోసారి రెండు పనులు నిర్వర్తిస్తున్నప్పుడూ ఓ యుద్ధమే చేస్తున్నట్లు ఉంటుంది. అధిక శ్రమకు గురయ్యే అవకాశం లేకపోలేదు. అలాంటప్పుడూ కుటుంబ సహకారం లేదా జీవిత భాగస్వామి సహాయం తీసుకోండి. తల్లిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించేందుకు వారి సహకారం అత్యంత ముఖ్యం.సెలవుల సాకు వద్దు..సెలవులు దొరకడం లేదు అందుకే కుటుంబంతో గడపలేకపోతున్నా అని చెబుతుంటారు. ఇదస్సలు సరైనది కాదు. తల్లిదండ్రులుగా ఉన్నప్పుడూ సెలవు అనే సాకు కోసం చూడొద్దు వీలు చిక్కినప్పుడల్లా పిల్లలపై దృష్టిసారించండి. వారితో గడిపే సమయాన్ని విరామ సమయంగా లేదా రిఫ్రెష్ అయ్యే సమయంగా ఫీలయ్యేతే సెలవుతో సంబంధం ఉండదంటోంది నూయి. జీవిత భాగస్వామి సపోర్టు..పిల్లల పెంపకం అనేది తల్లి బాధ్యతనే భావనలో ఉండొద్దు. ఇది ఇరువురి బాధ్యత అని అర్థం చేసుకోవాలి. అప్పడే ఓ కుటుంబం ఆనందమయంగా ఉండగలదు. పైగా మంచిగా పిల్లలు ఎదిగే వాతావరణం అందుతుంది. అందుకు జీవిత భాగస్వామి పూర్తి సహకారం చాలా కీలకం. కాబోయే తల్లిదండ్రులిద్దరూ ఈ చిట్కాలను అనుసరిస్తే వర్క్‌ని కుటుంబ జీవితాన్ని ఈజీగా బ్యాలెన్స్ చేస్తూ కెరీర్లో ముందుకు దూసుకుపోగలరు. ఇక్కడ ఇంద్రా నూయి సమిష్టి కృషికి పెద్దపీట వేసింది. బహుశా ఈ ఆటిట్యూడ్ ఇంద్రనూయిని అంత పెద్ద కంపెనీకి నాయకురాలిగా చేసి, బాధ్యతలను కట్టబెట్టిందేమో కదూ..!.(చదవండి: మానసిక ఆరోగ్యంపై శృతి హాసన్ హెల్త్ టిప్స్!) -
Nayi Disha Seema Seth: కార్పొరేట్ రంగం నుంచి కార్మిక లోకానికి...
కార్పొరేట్ ప్రపంచంలో మూడు దశాబ్దాల పాటు పనిచేసిన హరియాణాలోని గురుగ్రామ్‌కు చెందిన సీమా సేథ్ ఇక ఆ రంగంలో మరింత ముందుకు వెళ్లాలనుకోలేదు. ఒకసారి వెనక్కి తిరిగి చూసింది. ఒకరోజు ఒక ఆటోడ్రైవర్‌తో మాట్లాడుతున్నప్పుడు చదువుకు దూరమైన నిరుపేద పిల్లల గురించి తెలుసుకుంది. ఈ క్రమంలో కార్పొరేట్ ప్రపంచాన్ని వదిలి ‘నయీ దిశ’ పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి కొత్తదారిలో ప్రయాణిస్తోంది. అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లలను విద్యావంతులను చేస్తోంది. తాను కూడా టీచర్‌గా మారి పిల్లలకు పాఠాలు చెబుతోంది.... ‘ఇంజినీర్ కావాలనేది నా లక్ష్యం’ అంటున్న బప్పన్ దాస్ ‘నయీ దిశ’ గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతాడు. బప్పన్ తొమ్మిది నెలల వయసు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఉపాధి వెదుక్కుంటూ పశ్చిమ బెంగాల్ నుంచి గురుగ్రామ్‌కు వచ్చారు. ‘ఈరోజు తిండి దొరికేతే చాలు’ అన్నట్లుగా ఉండేది వారి ఆర్థిక పరిస్థితి. దీంతో చదువు మాట అటుంచి బప్పన్ కనీసం బడిముఖం కూడా చూడలేకపోయాడు. ‘నయీ దిశ’ పుణ్యమా అని బప్పన్ ఎనిమిది సంవత్సరాల వయసులో బడిలోకి అడుగు పెట్టాడు. ‘సీమా మేడమ్ నుంచి పాఠాలు వినడమే కాదు ఆమెతో కలిసి ఆడుకున్నాం. సరదాగా ఎన్నో ప్రాంతాలు తిరిగాం’ అంటాడు బప్పన్. బడి అంటే భయపడే స్థితి నుంచి బడికి ఇష్టంగా వెళ్లడం వరకు బప్పన్‌ను మార్చివేసింది సీమ. ‘నిరుపేద పిల్లల జీవితాల్లో మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక మార్గం మరో మార్గంలోకి తీసుకువెళ్లి మరిన్ని మంచిపనులు చేయిస్తుంది’ అంటుంది సీమ. ఉద్యోగం చేస్తున్న రోజుల్లో ప్రతి రోజూ సాయంత్రం సికిందర్‌పూర్‌లోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి పిల్లలకు ఇంగ్లీష్ పాఠాలు బోధించేది. ఈ పని తనకు ఎంతో ఉత్సాహాన్ని, బలాన్ని ఇచ్చేది. తనను రోజూ స్కూల్‌కు తీసుకెళ్లే ఆటోడ్రైవర్ ‘పిల్లలకు పాఠాలు చెప్పడానికి డబ్బులు తీసుకుంటారా?’ అని అడిగాడు. ‘లేదు’ అని చెప్పింది సీమ. తాను ఉండే కాలనీ పేరు చెప్పి ‘అక్కడ చాలామంది పిల్లలు బడికి వెళ్లడం లేదు’ అని చెప్పాడు. ‘ఎందుకు?’ అని అడిగింది సీమ. ‘పిల్లలను బడికి పంపించే స్తోమత తల్లిదండ్రులకు లేదు’ అని చెప్పాడు ఆటోడ్రైవర్. ఆ తరువాత... ‘మేడమ్... మీరు అక్కడ స్కూల్ పెట్టండి. ఎంతోమంది పిల్లలు చదువుకొని బాగుపడతారు’ అన్నాడు ఆటోడ్రైవర్. సీమ ఆలోచనలో పడింది. ఆ తరువాత ఆసక్తి పెరిగింది. ‘మీ కాలనీలో స్కూల్ ఎక్కడ స్టార్ట్ చేయాలో చెబితే అక్కడే చేస్తాను’ అన్నది సీమ. ఆటోడ్రైవర్ నివసించే పేద ప్రజల కాలనీలో ఒక గోదాములో సీమ స్కూల్ స్టార్ట్ చేసింది. 35మంది పిల్లలతో ‘నయీ దిశ’ ప్రస్థానం మొదలైంది. కొద్దిమంది పిల్లలతో ఒక గదిలో మొదలైన స్కూల్ ఆ తరువాత వందమంది పిల్లలతో ఎనిమిది గదుల్లోకి విస్తరించింది. గురుగ్రామ్‌లోని వివిధ కళాశాలలలో చదివే విద్యార్థులు ఈ స్కూల్‌కు వచ్చి కంప్యూటర్ నుంచి థియేటర్ వరకు ఎన్నో విషయాలు బోధిస్తున్నారు. విద్యాసంబంధమైన కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా ‘నయీ దిశ’ కేంద్రంగా మారింది. ‘నయీ దిశ’ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతోమంది నిరుపేద పిల్లలకు అకాడమిక్ పునాదిని ఏర్పాటు చేసింది సీమ. ఇప్పుడు ఆ పునాది మీదే పిల్లలు ఎన్నో కలలు కంటున్నారు. ‘తమ పిల్లల్లో వచ్చిన మార్పును చూసి తల్లిదండ్రులు సంతోషించారు. నయీ దిశ పిల్లలకు ఎంత విలువ ఇస్తుందో దగ్గరనుంచి చూశారు. పిల్లలకు బడి అంటే స్వేచ్ఛ అనుకునేలా చేశాం. పిల్లలు తమ మనసులోని భావాలను అందంగా వ్యక్తీకరించడం నుంచి ఇంగ్లీష్‌లో మాట్లాడడం వరకు ప్రతిక్షణం అభ్యాస వేడుకే’ అంటుంది సీమ. ‘మొదటి నుంచీ పిల్లలకు ఎన్నో సబ్జెక్ట్‌లు బోధిస్తూ వారి ఎదుగుదలను చూశాను. మొదట్లో క్రమశిక్షణా రాహిత్యంతో ఉండే పిల్లలు... కాలక్రమేణా మాట, మర్యాద నేర్చుకున్నారు’ అంటుంది ‘నయి దిశ’ స్కూల్లో పని చేస్తున్న నిషా అనే టీచర్. ‘నయీ దిశ’ విజయంతో ఇందిరా కాలనీలో మరో స్కూల్‌ను ప్రారంభించించి సీమ. ఈ స్కూల్లో 65 మంది నిరుపేద పిల్లలు చదువుకుంటున్నారు. సిలబస్‌ను సరిగ్గా అనుసరిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకోవడానికి నెలకొకసారి టీచర్ ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ప్రతి నెల పేరెంట్స్–టీచర్ మీటింగ్ కూడా ఉంటుంది. ‘మా అబ్బాయికి చదువు పట్ల ఉండే శ్రద్ధ చూస్తుంటే ముచ్చట వేస్తోంది. ఇదంతా నయీ దిశ పుణ్యమే. డాక్టర్ కావాలనేది మా అబ్బాయి కల. పదిమందికి ఉపయోగపడే కల కంటే అది తప్పక నెరవేరుతుంది అని సీమ మేడమ్ ఒక మీటింగ్‌లో చెప్పారు’ అంటున్నాడు అశోక్‌రావు అనే పేరెంట్. వినే వారు తప్పకుండా ఉంటారు మన మనసులో మంచి ఆలోచన ఉన్నప్పుడు, అది వినడానికి ఈ విశ్వంలో ఎవరో ఒకరు తప్పనిసరిగా ఉంటారు. ‘ఆలోచన బాగానే ఉంది గానీ.. అసలు ఇది నెరవేరుతుందా...’ అనుకున్న ఎన్నో ఆలోచనలు నెరవేరాయి. మంచి పని కోసం ప్రయాణం ప్రారంభించినప్పుడు దారే తన వెంట తీసుకువెళుతుంది. ఎన్ని అవరోధాలు ఉన్నా వాటంతట అవే తొలగిపోతాయి. – సీమ, నయీ దిశ– వ్యవస్థాపకురాలు -
విద్యా వ్యవస్థలో మరో విప్లవం
రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థికి కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలన్న సంకల్పంతో సీఎం జగన్ విభిన్న ప్రాజెక్టులతో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు సుకొస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో పునాది స్థాయిలోనే కంప్యూటర్ విద్యను అందిస్తే.. భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే యువతగా విద్యార్థులు తలెత్తుకొని జీవించగలరనే నమ్మకంతో మరో కీలక ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అమెజాన్ ఇండియాతో జతకడుతూ ‘అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ ప్రోగ్రాం’ కింద వరుసగా రెండో ఏడాది కూడా ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర జిల్లాల విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి కంప్యూటర్ సైన్స్ పాఠాలు పాఠశాల స్థాయిలో 6వ తరగతి నుంచి బోధించేందుకు అడుగులు పడనున్నాయి. వెనక బాటు జిల్లాలుగా ఉన్న ఈ ప్రాంత భవిష్యత్తు సార థులైన విద్యార్థులకు ప్రభుత్వం ఈ గొప్ప అవకాశం కల్పిస్తోంది. 2024–25 విద్యా సంవత్సరం నాటికి 10 వేల మంది ఏపీ విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్ విద్యతో సాధికారత కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమెజాన్ ఇండియాతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. 2026–27 నాటికి సంపూర్ణంగా ఈ ప్రయోజనాలను లక్ష మందికి అందించాలన్నదే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఇందులో భాగంగా విజయవాడలో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి, సమగ్రశిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు సమక్షంలో ఒప్పంద సంతకాలు జరిగాయి. రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రపంచ బ్యాంకు భాగస్వామ్యంతో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన ఈ బృహత్తర కార్యానికి అనేక సంస్థలు మందుకువచ్చాయి. అమెజాన్ ఇండియా ఫండ్స్, సమగ్ర శిక్షతో పాటు ప్రపంచబ్యాంక్ టెక్నికల్ సపోర్ట్ సిస్టమ్, లీడర్షిప్ ఫర్ ఈక్విటీ, క్వెస్ట్ అలయన్స్ అనే ఎన్జీవో ఇందులో ఉన్నాయి. వీరందరి భాగస్వామ్యంతో ఉత్తరాంధ్ర విద్యార్థుల భవితను తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. ‘కంప్యూటేషనల్ థింకింగ్ అండ్ 21 సెంచరీ స్కిల్స్’పై శిక్షణా కార్యక్రమం ద్వారా తరగతి గదుల్లో కంప్యూటర్ సైన్స్ పాఠ్యాంశాలను సమర్థవంతంగా అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. కేవలం విద్యార్థులకే కాకుండా ఉపాధ్యాయులకు కూడా బోధన, సాంకేతిక, నాయకత్వ నైపుణ్యాలపై శిక్షణ ఇస్తారు. 10 వేల మంది నుంచి లక్ష వరకూ.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు కంప్యూ టర్ సైన్స్ పాఠ్యాంశాలు సులువుగా అర్థమయ్యేలా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. పైలట్ ప్రాజెక్టు కింద ఉత్తరాంధ్రలో 10 వేల మంది విద్యార్థులకు ఈ తరగతులు అందుబాటులోకి రానున్నాయి. ఏపీలో లక్ష మందికి ఈ విద్యను చేరువ చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఎస్సీఈఆర్టీతో కలిసి పాఠశాలల్లో కంప్యూటేషనల్ థింకింగ్ క్లబ్‌లు ఏర్పాటు చేయనుంది. విద్యార్థులకు కంప్యూటర్ సై న్స్ పాఠాల బోధన, ప్రాక్టికల్‌గా శిక్షణ ఇలా విభిన్న అంశాల్లో తరగతులు నిర్వహించి పిల్లల్ని నిష్ణాతుల్ని చేయనుంది. ఎక్సలెన్స్ కోర్సుల అనుసంధానం కంప్యూటర్ సైన్స్ టీచింగ్ ఎక్సలెన్స్ కోర్సులను అనుసంధానం చేయడం ద్వారా డిజిటల్ యుగానికి అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు అందించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ప్రైవేట్ పబ్లిక్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సాంకేతిక విద్యను చేరువ చేస్తున్నాం. దీనివల్ల విద్యార్థుల ఉన్నత చదువులకు ఈ ప్రోగ్రాం ఒక పునాదిలా మారుతుంది. – బి.శ్రీనివాసరావు, సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ ప్రతి విద్యార్థికి అవకాశం అమేజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులందరినీ సాంకేతిక విద్యను చేరువ చేయాలన్నదే అమేజాన్ ఇండియా లక్ష్యం. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంతో అడుగులు వేస్తున్నాం. విద్యార్థులకు వారి కెరీర్లకు అవ సరమైన నైపుణ్యాల్ని అందిస్తాం. బెస్ట్ కెరీర్‌కు కంప్యూటర్ సైన్స్ విద్య ఎంతో దోహద పడు తుంది. రెండేళ్లలో దేశ వ్యాప్తంగా 1.5 మిలి యన్ మంది విద్యార్థులకు, 8 వేల మంది టీచర్లకు కంప్యూటర్ సైన్స్ విద్య అందించాం. – అక్షయ్ కశ్యప్, అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ ఇండియా లీడర్ -
ఆర్థిక విజయానికి రామబాణం
కోట్లాది మంది దశాబ్దాల స్వప్నం సాకారమై, అయోధ్యలో బాలరాముడు కొలువు దీరాడు. రామాయణాన్ని గృహస్థ ధర్మానికి అద్భుతమైన నిదర్శనంగా పేర్కొంటారు. శ్రీరాముడి జీవన మార్గాన్ని పరిశీలించి చూస్తే వ్యక్తిగత ఆర్థిక విషయాల్లో ఎలా నడుచుకోవాలనే విషయమై విలువైన పాఠాలు కనిపిస్తాయి. శ్రీరాముడిని విశ్వసించే ప్రతి ఒక్కరూ, తమ ఆర్థిక విజయానికి కావాల్సిన సూత్రాలను రామాయణం నుంచి తీసుకోవచ్చు. రాముడి వనవాసం.. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు తగిన ప్రణాళిక అవసరాన్ని గుర్తు చేస్తుంది. వ్యక్తిగత ఆర్థిక జీవితానికి ఆలోచనాత్మక ఆర్థిక ప్రణాళిక ఎంతో అవసరమని నిపుణులు తరచూ సూచిస్తుంటారు. ఆర్థిక లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవడం, వాటికి తగిన బడ్జెట్ కేటాయించుకోవడం, వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టడం వల్ల జీవితంలో అనిశ్చితులు ఎదురైనా, వాటిని సులభంగా అధిగమించొచ్చు. ఎన్ని కష్టాలు ఎదురైనా రాముడు తన బాధ్యతలను ఏనాడూ విస్మరించలేదు. అందుకే ఊహించని పరిస్థితులు ఎదురైతే వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడం ఎలా అన్నది రాముడి చేసి చూపించాడు. మనం కూడా ఆర్థిక ప్రణాళిక ఆధారంగా జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు సన్నద్ధత ఏర్పాటు చేసుకోవాలి. జీవితానికి తగినంత బీమా కవరేజీ, ఆరోగ్య బీమా తీసుకోవాలి. అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. జీవిత లక్ష్యాలు, అందుకు కావాల్సిన మొత్తం, చేయాల్సిన పెట్టుబడి, వివిధ సాధనాల మధ్య రిస్క్ ఆధారంగా కేటాయింపులు.. వీటన్నింటికీ ఆర్థిక ప్రణాళిక మార్గం చూపిస్తుంది. ధర్మ మార్గం ధర్మం పట్ల రాముడి అచంచలమైన నిబద్ధత ఆయన జీవన గమనానికి మూలస్తంభంగా కనిపిస్తుంది. వ్యక్తిగత ఆర్థిక జీవితంలో నైతిక ఆర్థిక విధానాల ఆచరణ అవసరాన్ని ఇది తెలియజేస్తుంది. ఇదే దీర్ఘకాలంలో విజయానికి బాటలు పరుస్తుంది. నిజాయితీ, చిత్తశుద్ధి, ఆర్థిక నిర్ణయాల్లో పారదర్శకత, క్రమశిక్షణ, భావోద్వేగాల నియంత్రణ, వేగంగా ధనవంతులు కావచ్చనే ప్రచారానికి ఆకర్షితులు కాకపోవడం వంటివి ఆర్థిక విజయాలకు భరోసానిస్తుంది. ఆర్థిక విషయాల్లో ధర్మానికి కట్టుబడి ఉండడం వల్ల అది స్థిరమైన, నైతిక సంపద సృష్టికి దారితీస్తుంది. రిస్క్ నిర్వహణ రావణుడితో రాముడు సాగించిన యుద్ధం.. ధైర్యం, రిస్క్ నిర్వహణ ప్రాధాన్యతను తెలియజేస్తుంది. వ్యక్తిగత ఆర్థిక విషయాల్లోనూ వీటి అవసరం ఎంతో ఉంది. సంపద సృష్టికి, ఆర్థిక లక్ష్యాల సాధనకు ధైర్యంగా, తమకు సరిపడే రిస్‌్కలను తీసుకోవాల్సిందే. రిస్‌్కలను మదించే విషయమై, అనిశి్చతులను అధిగమించేందుకు అవసరమైతే నిపుణుల సాయం తీసుకోవడాన్ని మర్చిపోవద్దు. ధర్మం కోసం రాముడు యుద్ధం చేయక తప్పలేదు. అలాగే, సంపద సృష్టి కోరుకునే వారు కూడా రిస్‌్కతో కలసి నడవాల్సిందే. అది కూడా తాము భరించే స్థాయిలోనే రిస్‌్కను పరిమితం చేసుకోవాలి. పెట్టుబడికి సైతం ముప్పు ఉంటుందని ఈక్విటీలకు దూరంగా ఉండడం సరికాదు. రాబడులకు, పెట్టుబడి రక్షణకూ ప్రాధాన్యం ఇవ్వాలి. ఏ ఒక్కదాని దృష్టితోనో పరుగులు తీయకూడదు. సరళతరం వనవాస సమయంలో రాముడి నిరాడంబర, సాధారణ జీవన శైలి.. పొదుపు ధర్మాన్ని తెలియజేస్తుంది. వ్యక్తిగత ఆర్థిక జీవితంలోనూ పొదుపుతో కూడిన జీవనశైలిని అనుసరించడం, అనవసర దుబారాని నియంత్రించడం ఆర్థిక శ్రేయస్సుకు దారి చూపుతుంది. నేడు ప్రతి ఒక్క అవసరానికీ సులభంగా రుణాలు లభిస్తున్నాయి. అవసరాలు, కోరికల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలి. అవసరాలకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి. రుణాలతో కోరికలు తీర్చుకోవడం ఆర్థిక శ్రేయస్సుకు మేలు చేయదు. పొదుపు మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలి. తెలివిగా ఖర్చు చేస్తూ, పొదుపు, పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ ఎంతో ముఖ్యం. క్రెడిట్ కార్డ్ రుణాల నుంచి త్వరగా బయటకు రావాలి. అధిక ఖర్చుకు కళ్లెం వేయాలి. సరైన అవకాశాలు, అనుకూల సమయం కోసం వేచి చూస్తూ ఈక్విటీ మార్కెట్లో వచ్చే విలువైన అవకాశాలను కోల్పోవద్దు. సహనం, పట్టుదల కష్టపడి సంపాదించిన ధనానికి రక్షణగా నిలవాలి. మార్గదర్శకం రాముడి విధేయత, తన అనుచరులతో ఉన్న బలమైన బంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెట్టుబడుల విషయంలోనూ సత్సంబంధాలు ఎంతో అవసరం. పరస్పర గౌరవం, నమ్మకం, మద్దతు అనేవి ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు సాయపడతాయి. అవసరం మేరకు ఆర్థిక నిపుణుల సాయాన్ని, మద్దతును, మార్గదర్శకాన్ని తీసుకోవాలి. ఇన్వెస్టర్ రిస్‌్కను మదింపు వేసి, అనుకూలమైన పెట్టుబడి సాధనాలు, ఆర్థిక లక్ష్యాల సాధనకు ఆచరించాల్సి మార్గాన్ని వారు సూచిస్తారు. ఆర్థిక ప్రపంచంలో ఉండే సంక్లిష్టతలను అధిగమించేందుకు సాయపడతారు. వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియో రాముడి సైన్యంలో కనిపించే వైవిధ్యాన్ని, తమ పెట్టుబడులకూ అన్వయించుకోవాలి. వానరాలు, ఎలుగుబంట్లు, ఉడతలు, గద్దలు ఇవన్నీ రామదండులో కనిపిస్తాయి. ఇదే మాదిరిగా పెట్టుబడుల్లోనూ వైవిధ్యం ఉండాలి. కేవలం పొదుపు, ఫిక్స్డ్ డిపాజిట్లకే (ఎఫ్డీలు) పరిమితం కాకూడదు. అన్ని ముఖ్య సాధనాల్లోకీ పెట్టుబడులు వర్గీకరించుకోవాలి. దీనివల్ల రిస్‌్కను తగ్గించుకోవచ్చు. రాబడులు స్థిరంగా ఉండేలా చూసుకోవచ్చు. దీన్నే అస్సెట్ అలోకేషన్ అని చెబుతారు. ఈక్విటీలు, డెట్, గోల్డ్, ఏఐఎఫ్‌లకు పెట్టుబడులు కేటాయించుకోవచ్చు. నేనే సుపీరియర్ అనుకోవద్దు..! పెట్టుబడుల విషయంలో అంతా తనకే తెలుసన్న అహంకారం అస్సలు పనికిరాదు. రావణుడి పతనానికి ఇదే దారితీసింది. మెరుగైన పనితీరు చూపించని సాధనాల విషయంలో అహంకారం విడిచి పెట్టి ఆలోచించాలి. నిరీ్ణత కాలానికోసారి సమీక్షించుకుని పెట్టుబడుల్లో మార్పులు చేసుకోవాలి. అలా కాకుండా ఇన్వెస్ట్ చేసి పని అయిపోందని అనుకోవడం ఆర్థిక విజయాలకు దారితీయదు. సంపద సృష్టికి, పెట్టుబడుల మార్గంలో తప్పొప్పులను అంగీకరించాలి. దీనివల్ల నష్టాలను పరిమితం చేసుకునేందుకు వీలుంటుంది. మారుతున్న పరిస్థితులను ఆహా్వనించడం ఆర్థిక శ్రేయస్సుకు అవసరం. శ్రీరాముడి జీవితంలో పొందుపరిచిన జ్ఞానం కేవలం ఆధ్యాత్మికతకు పరిమితం కాదు. ఒక వ్యక్తి జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలియచెపుతుంది. ఇన్వెస్టర్లకు విలువైన అంశాలను తెలియజేస్తుంది. రామాయణాన్ని చదవడం, అందులోని ముఖ్యమైన అంశాలను గ్రహించి, వాటిని తమ పెట్టుబడులకు అన్వయించుకోవడం వల్ల ఆర్థిక విజయాలకు మార్గాన్ని సులభం చేసుకోవచ్చు. చెడుపై మంచి విజయం సాధించడం రామాయణంలో కనిపిస్తుంది. అదే మాదిరిగా ఇన్వెస్టర్లు ఆర్థిక అవరోధాలను అధిగమించి, మంచి ఆర్థిక అలవాట్లతో, క్రమశిక్షణతో మెలగడం ద్వారా సంపద సృష్టికి చేరువకావచ్చు. హద్దులకు కట్టుబడి ఉండడం సంపద సృష్టి కోరుకునే వారు అందుకు అడ్డదారులు (షార్ట్‌కట్స్) వెతుక్కోకూడదు. లంకాధిపతి రావణుడు సీతమ్మ వారిని కోరుకోవడం వల్ల ఎంతటి ఉపద్రవం జరిగిందో రామాయణం చెబుతోంది. కోరికలపై నియంత్రణ అవసరమని, సన్మార్గమే శ్రేష్టమని ఇది సందేశం ఇస్తుంది. పెట్టుబడులపై రాబడుల విషయంలోనూ కోరికలను అదుపులో పెట్టుకుని వ్యవహరించాలి. తమకంటూ ఆర్థిక సరిహద్దులు ఏర్పాటు చేసుకోవాలి. ఉద్రేకంతో కూడిన నిర్ణయాలకు చోటు ఇవ్వకూడదు. టిప్స్‌ను అనుసరించడం కాకుండా కాల పరీక్షకు నిలిచిన బలమైన పెట్టుబడుల వ్యూహాలను అనుసరించాలి. దీనివల్ల విజయం తేలిక అవుతుంది. ఓపిక, క్రమశిక్షణ సముద్రంలో రామసేతు వారధి నిర్మాణం ఎంతో ఓపిక, పట్టుదలతో, ఎంతో మంది కృషితో, సుదీర్ఘ కాలానికి కానీ సాధ్యం కాలేదు. సందప సృష్టి కూడా అంతే. స్వల్ప కాలంలో కుబేరులు కావడం అనేది ఆచరణలో అంత సులభం కాదు. క్రమశిక్షణతో దీర్ఘకాలం పాటు పెట్టుబడులు కొనసాగించడం ద్వారానే ఇది సాధ్యపడుతుంది. సిప్ అవసరాన్ని ఇక్కడ గుర్తించాలి. సిప్ రూపంలో ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తూ వెళితే, చిన్న మొత్తమే దీర్ఘకాలంలో పెద్ద మొత్తంగా మారుతుంది. దీర్ఘకాలంలో సంపద సృష్టిని సిప్ సులభతరం చేస్తుంది. స్థిరత్వం, సహనం అనేవి దీర్ఘకాల ప్రయాణానికి ఎంతో అవసరం. లక్ష్మణుడి కోసం ఆంజనేయుడు సంజీవని కోసం వెళ్లడం, దాన్ని గుర్తించలేక తన చేత్తో మొత్తం సుమేరు పర్వతాన్ని పెకిలించి చేత్తో తీసుకురావడం తెలిసిందే. ప్రతీ ఇన్వెస్టర్ సంజీవని వంటి కంపెనీలను గుర్తించలేకపోవచ్చు. అలాంటప్పుడు వారి ముందున్న మార్గం మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. ఇన్వెస్టర్లు ఒక్కో కంపెనీ వారీ రిస్‌్కను తగ్గించుకునేందుకు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సూచీల్లో ఇన్వెస్ట్ చేసే ప్యాసివ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల.. అందులోని కొన్ని స్టాక్స్ బలహీన పనితీరు చూపించినా కానీ, మిగిలిన వాటి అండతో దీర్ఘకాలంలో మంచి రాబడులు సొంతం చేసుకోవచ్చు. -
లవ్ యూ బామ్మా
85 సంవత్సరాల వయసులో కంటెంట్ క్రియేటర్‌గా మారింది విజయ నిశ్చల్. ఫ్రెంచ్ ఫ్రై, సమోస. గులాబ్ జామూన్, పొటాటో బాల్స్...ఒక్కటా రెండా ఎన్నెన్నో పసందైన వంటలను ఎలా చేయాలో తన చానల్ ద్వారా నేర్పుతుంది నిశ్చల్. వంటలు చేస్తూ ఆ వంటకు తగినట్లుగా హుషారుగా పాటలు పాడుతుంటుంది. ఈ బామ్మ చానల్‌కు 8.41 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా నిశ్చల్ బామ్మ చేసిన ‘ఎగ్‌లెస్ కేక్’ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో 1.1 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. ‘ఎగ్‌లెస్ కోసం ఎన్నో చోట్ల ప్రయత్నించాను. మీ వీడియో చూసిన తరువాత నేను స్వయంగా చేశాను. ఇదంతా మీ చలవే. లవ్ యూ బామ్మా’ ‘వంటల్లో ఓనమాలు కూడా తెలియని నేను మీ వల్ల ఇప్పుడు ఎన్నో వంటలు చేయగలుగుతున్నాను. నా టాలెంట్‌ను చూసి ఫ్రెండ్స్ ప్రశంసిస్తున్నారు’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో కనబడుతున్నాయి. -
ఉత్తరాఖండ్ టన్నెల్ నేర్పిన పాఠం! 'పేదల జీవితాలతో ఆడుకోవద్దు'!
దీపావళి రోజున ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ సిల్క్యారా టన్నెల్ కూలిపోవడంతో సొరంగంలో 41 మంది చిక్కుకుపోయిన ఘటన యావత్త్ దేశాన్ని కలవరిపరిచింది. వారంతా బయటకు రావాలని కులమతాలకు అతీతంగా అందరూ ప్రార్థించారు. ఆ ప్రార్థనలు ఫలించాయో లేక ఆ కూలీలను రక్షించేందుకు అహర్నిశలు కష్టపడుతున్న రెస్క్యూ బృందాల కృషికి అబ్బురపడి ప్రకృతి అవకాశం ఇచ్చిందో గానీ వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఎవ్వరికీ ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని వైద్యులు కూడా ప్రకటించడం అందర్నీ సంతోషంలో ముచ్చెత్తింది. దాదాపు 17 రోజుల నరాల తెగే ఉత్కంఠకు తెరపడి జయించాం అనే ఆనందాన్ని ఇచ్చింది. సరే గానీ ఈ ఉత్తర కాశీ టన్నెల్ ఘటన మన భారత ప్రభుత్వానికి, పరిశ్రమలకు ఓ గొప్ప పాఠాన్ని నేర్పాయి. అభివృద్ధి అనే పేరుతో ఏం జరుగుతుందో ప్రపంచానికి కళ్లకు కట్టినట్టు చూపింది. అలాగే పర్యావరణం కూడా ఎలా మసులుకోవాలో మానవుడిని పరోక్షంగా హెచ్చరించింది. ఆ ఉత్తర కాశీ ఘటన నేర్పిన గుణపాఠం ఏంటంటే.. నిజానికి ఆ ఉత్తరకాశీ సిల్క్యారా సోరంగం నరేంద్ర మోదీ ప్రభుత్వం చార్‌థామ్ ప్రాజెక్ట్‌లో భాగంగా చేపట్టిన నిర్మాణం. ఇది హిందూ ప్రముఖ క్షేత్రాలను కలుపుతుంది. ఇది పూర్తి అయితే యమునోత్రికి వెళ్లే యాత్ర మార్గం 20 కిలోమీటర్లు తగ్గుతుంది. భక్తుల చార్ధామ్ యాత్ర సులభతరం చేసేందుకు నిర్మించిన భూగర్భ మార్గం అని చెప్పాలి. కానీ ఇలా అభివృద్ధి పేరుతో చేపట్టే ప్రాజెక్టుల్లో పేద ప్రజల జీవితాలు ఎలా అగాధంలో పడతాయనేది అనేది అందరికీ తెలిసేలా చేసింది ఈ ఘటన. ఇప్పటి వరకు మనం నిర్మించిన చాలా ప్రాజెక్టులో చాలామంది కార్మికులు ప్రాణాలు కూడా ఇలానే పోయాయా అనే ఆలోచన కూడా వచ్చింది. ఆ ఘటనలు జరిగిన మీడియా మాధ్యమాలు, వార్త పత్రికల పుణ్యమాని ఒకటి రెండు రోజులే హాటాపిక్గా ఆ విషయంగా ఉంటుంది. ఆ తర్వాత అందరూ మర్చిపోతారు. అబ్బా! భారత్ ఎంతో ముందకు పోతుంది. ఎన్నో ఫైఓవర్లు, భూగర్భ రైలు మార్గాలు ఏర్పాటు చేసేశాం, టెక్నాలజీని అందుకుంటున్నాం అని స్టేమెంట్లు నాయకులు ఇచ్చేస్తుంటే..అదే నిజం అని గర్వంగా ఫీలైపోతాం. నిజానికి ఆయా పెద్ద పెద్ద రహాదారుల లేదా రైల్వే నిర్మాణాలకు వెనక ఉన్న కార్మికుల శ్రమ ఎవ్వరికి తెలియదు. ఆ నిర్మాణం జరుగుతున్న సమయంలో పేదల జీవితాలు ఎలా చిధ్రమయ్యాయి అన్నది కూడా పట్టదు. నాయకులు, అధికారులు ఇలాంటి పెద్ద నిర్మాణాలు, ప్రాజెక్టులు కట్టేటప్పుడూ ఇవన్నీ కామన్ అన్నట్టు వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇలాంటి ఉత్తరకాశీ లాంటి కొన్ని ఘటనలు తెరమీదకు రాకుండానే కనుమరుగయ్యాయి. అందువల్లే సాధారణ ప్రజలకు కూడా ప్రాజెక్టుల నిర్మాణాల్లో ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయన్న విషయం కూడా తెలియదు. ఈ టన్నెల్ కూలిన ఘటన ప్రభుత్వాలకు, పరిశ్రమలకు పేదల జీవితాలతో చెలగాటం ఆడొద్దని నొక్కి చెప్పింది. కూలే అవకాశం ఉందని ముందే తెలుసా..! ఈ టన్నెల్ నిర్మాణాన్ని నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ చేపట్టింది. ఇదే కంపెనీ కాంట్రాక్టర్లు గతంలో మహారాష్ట్ర థానే జిల్లాలో నాగ్‌పూర్-ముంబై సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేని నిర్మించిన ఘటన ఇప్పుడు తెరమీదకు వచ్చింది. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ నిర్మాణంలో కూడా ఇలాంటి ప్రమాదమే జరిగి 20 మంది కార్మికులు, ఇంజనీర్లు మరణించారు. దీంతో ఆయ కంపెనీ కాట్రాక్టర్లపై ఎఫైర్ కూడా నమోదైంది. మరీ మళ్లీ అదే కంపెనీకి ఈ ఉత్తరకాశీ టన్నెల్ ప్రాజెక్ట్ అప్పగించడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక జర్మన్-ఆస్ట్రియన్ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ బెర్నార్డ్ గ్రుప్పీ మన భారత కంపెనీ నవయగ ఇంజనీరింగ్ లిమిటెడ్‌కి టన్నెల్ నిర్మాణ ప్రారంభానికి ముందు నుంచి కూడా టెండర్ డాక్యుమెంట్లో ఊహించిన దానికంటే భౌగోళిక పరిస్థితులు చాల సవాళ్లుగా ఉన్నాయని హెచ్చరించింది. అందువల్ల ఎలాంటి ప్రమాదాల సంభవిస్తే బయటపడేలా ఎస్కేప్ పాసేజ్ని నిర్మించమని 2018లోనే ఆదేశించింది. మరీ ఇక్కడ సొరంగం కూలిపోయేంత వరకు కూడా దాన్ని ఎందుకు నిర్మిచలేదనేది స్పష్టం కావాల్సి ఉంది. ప్రస్తుతం బయట పడ్డ ఆ కూలీలంతా ఈ ఎస్కేప్ పాసేజ్ నుంచే సురక్షితంగా బటయకొచ్చిన సంగతి తెలిసిందే. డెవలప్మెంట్ పర్యావరణాన్ని ప్రమదంలో పడేస్తుందా? ప్రపంచంలోనే ఎత్తైన శిఖరాలకు నిలయం హిమాలయ పర్వతాలు. దాదాపు 45 మిలియన్ ఏళ్ల క్రితం ఏర్పడినవి. నిజానికి ఈ ప్రాంతం ఎక్కువుగా భూకంపాలకు గురయ్యే ప్రాంతం కూడా. పైగా ఇక్కడ శిలలు అవక్షేపణ శిలలుగా ఉంటాయి. పైగా ఇక్కడ పర్యావరణం అస్థిరంగ ఉంటుంది. నిర్మాణ పద్ధతులకు అస్సలు అనూకులమైనది కూడా కాదు. అలాంటి ప్రదేశంలో అభివృద్ధి పేరుతో మనం చేస్తున్న పనులు ముఖ్యంగా పర్యావరణానికి ఇబ్బంది కలిగించేవే. ఈ విషయమై ఉత్తరాఖండ్ కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు ఎస్కె పట్నాయక్ ఎన్నోసార్లు ఆందోళన వ్యక్తం చేశారు. మన జీవన శైలి సౌలభ్యానికి అవసరమైన మార్పలు ఎంత అవసమో పర్యావరణాన్ని విఘాత కలగించకుండా చేసే అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అనేది కూడా అంతే ముఖ్యం. లేదంటే ప్రకృతి ప్రకోపానికి బలవ్వక తప్పదు. కానీ ఇలాంటి విపత్తులో బలయ్యేది కూడా పేద కార్మికులే అనే విషయం గుర్తించుకోవాలి అధికారులు. (చదవండి: ఎక్కువ రోజులు సొరంగంలో ఉంటే కార్మికుల ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది! వైద్యుల ఆందోళన) -
India with Jessica: ఎక్కడో పుట్టి... ఎక్కడో పెరిగి
మన దేశంలో పుట్టిన చాలామందికి హిందీ మాట్లాడటం రాదు. కొంతమందికి అర్థమైనప్పటికీ మాట్లాడలేరు. అమెరికా నుంచి వచ్చిన జెస్సికా మాత్రం హిందీలో అనర్గళంగా మాట్లాడేస్తుంది. ఇలా పలకాలి అని హిందీ పాఠాలు కూడా చెబుతోంది. మనదేశానికి వచ్చే విదేశీయులకు హిందీతోపాటు సంస్కృతీ సంప్రదాయాలను పరిచయం చేస్తూ నెటిజనుల మన్ననలను అందుకుంటోంది ఈ ‘బిహారీ బహూ’. పదిహేడేళ్లుగా ఇండియాతో చక్కని బంధాన్ని కొనసాగిస్తోన్న జెస్సికా గురించి ఆమె మాటల్లోనే... ‘‘నేను చికాగోలో పుట్టాను. అమ్మానాన్న ఇరు కుటుంబాలకు చెందిన తాత, బామ్మలతో కలిసి ఉండే ఉమ్మడి కుటుంబం మాది. అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములతో కలిసి స్కూలుకు వెళ్లి చదువుకునేదాన్ని. ఆదివారం వచ్చిందంటే... కుటుంబమంతా కలిసి గడుపుతాం. నాన్న అంతర్జాతీయ వ్యాపారి కావడంతో తరచూ చైనా, కొరియాలు వెళ్తుండేవారు. ఆయన్ని చూసి నేను కూడా అలా తిరగాలని అనుకునేదాన్ని. కాలేజీ చదువుకోసం 18 ఏళ్ల వయసులో చికాగో నుంచి వేరే రాష్ట్రానికి వెళ్లాను. నాలుగేళ్లపాటు హాస్టల్లో ఉన్నాను. ‘చైనా, ఇండియాలలో ఆర్థికమాంద్యం వస్తుంది’ అని కాలేజీలో ఎక్కువమంది విద్యార్థులు మాట్లాడుకునేవారు. అది విన్న నాకు ఇండియా వెళ్లి అక్కడి పరిస్థితులు చూడాలనిపించేది. ఏడాదిలో తిరిగి వచ్చేస్తాను అనుకున్నా.. కాలేజీ చదువు పూర్తయిన తరువాత తెలిసిన వాళ్ల ఐటీ కంపెనీ హరిద్వార్‌లో ఉంటే.. అక్కడ ఇంటర్న్‌షిప్ చేయడానికి ఇండియా వచ్చాను. ఇంటర్న్‌షిప్‌తోపాటు భారతీయులు, వారి భాషల గురించి తెలుసుకోవచ్చని అనుకున్నాను. అనుకున్నట్టుగానే ఇరుగు పొరుగు నుంచి కూరగాయలు విక్రయించేవాళ్ల వరకు అందరితో పరిచయం ఏర్పడింది. అందరూ చక్కగా కలిసి పోయేవారు. ఏడాదిలో ఇంటర్న్‌షిప్ పూర్తయిన తరువాత అదే కంపెనీలో ఉద్యోగంలో చేరాను. అలా ఏడాదిలో తిరిగి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాను. కొంతమంది స్నేహితుల ద్వారా అభిషేక్ పరిచయం అయ్యాడు. నేను ఇక్కడ ఉంటే.. అభిషేక్ అమెరికాలో చదువుకుంటున్నాడు. ఇద్దరం మంచి స్నేహితులుగా మారాం. నేను మా ఇంటికి వెళ్లినప్పుడల్లా అభిషేక్‌ను కలిసేదాన్ని. అలా మా ఇద్దరి స్నేహం ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చి బిహార్ కోడలిని అయ్యాను. అత్తమామల అనురాగం చూసి... హరిద్వార్‌లో ఉండే రోజుల్లో ఇక్కడి అత్తమామలు కుటుంబ పెద్దలుగా కోడళ్లు, మనవళ్లను చూసే విధానం నాకు బాగా నచ్చింది. అభిషేక్‌ను పెళ్లిచేసుకోవడానికి అది కూడా ఒక కారణం. మేము పెళ్లి చేసుకుంటామని మా నాన్నని అడిగాం. ‘చదువుకున్నాడు, సంపాదిస్తున్నాడు. నిన్ను బాగా చూసుకుంటాడు కాబట్టి పెళ్లిచేసుకో’ అని నాన్న చెప్పారు. అభిషేక్ కుటుంబ సభ్యుల్లో సగం మంది అమెరికాలో నివసిస్తుండడంతో వారి గురించి బాగా అర్థం చేసుకోవడం కూడా నాన్న ఒప్పుకోవడానికి ఒక కారణం. అభిషేక్ తల్లిదండ్రులు విదేశీ అమ్మాయిని కోడలుగా ఒప్పుకోవడానికి మొదట్లో భయపడ్డారు. ఎలాంటి అమ్మాయో అని సందేహించినప్పటికీ మా కుటుంబం గురించి తెలుసుకుని పెళ్లికి సమ్మతించడంతో 2010లో మా వివాహం జరిగింది. జీవితాంతం ఆధారపడాల్సిందే... పెళ్లి అయిన తరువాత అమెరికాలో కొన్నిరోజులు, ఇండియాలో కొన్ని రోజులు ఉండేవాళ్లం. ఆరేళ్ల తరువాత బిహార్‌కి వచ్చి స్థిరపడ్డాం. మాకు ఇద్దరు పిల్లలు బాబు, పాప. ప్రపంచంలో కూతురికంటే కొడుకులనే మరింత ప్రేమగా చూసుకుంటారు. ఇండియాలో ఇది కాసింత ఎక్కువే. అమ్మాయిలకు ఇంట్లో పనులన్నీ చక్కబెట్టేలా అన్నీ నేర్పిస్తారు. అబ్బాయిలకు మాత్రం ఏమీ నేర్పించరు. కొంతమంది తల్లులు అయితే ‘మా అబ్బాయికి కప్పు టీ పెట్టడం కూడా రాదు’ అని గర్వంగా చెబుతుంటారు. ఇలా అయితే వాళ్లు స్వయంసమృద్ధిని సాధించలేరు. జీవితాంతం ఇతరుల మీద ఆధారపడి జీవించాల్సిందే. అందుకే నేను నా పిల్లలకు లింగభేదం లేకుండా అన్నీ నేర్పిస్తున్నాను. నేర్చుకుని నేర్పిస్తున్నా... హరిద్వార్‌లో ఉన్నప్పుడే హిందీ నేర్చుకున్నాను. కోర్సు కూడా చేశాను. బిహార్‌కి వచ్చిన తరువాత నా హిందీ బాగా మెరుగుపడింది. బిహారీలు మాట్లాడే హిందీ సరిగాలేదని, వారి మాటలు విని నవ్వుతుంటారు చాలామంది. కానీ ఇక్కడ మాట్లాడే హిందీలో సంస్కృతం, భోజ్‌పూరి, మైథిలి, ఆంగిక వంటి భాషలు కూడా కలుస్తాయి. అందుకే బిహారీలు మాట్లాడే హిందీ కొంచెం విభిన్నంగా ఉంటుంది. బిహారీలు మాట్లాడే హిందీపై చాలామందికి ఉండే చిన్నచూపు, వివక్ష పోవాలని నా వీడియోల్లో.. బిహారీ స్టైల్ హిందీనే మాట్లాడుతున్నాను. ఇండియా విత్ జెస్సికా ఇక్కడ ఉండే భారతీయులకు, విదేశాల్లో ఉండే ఇండియన్స్‌కు హిందీ నేర్పిస్తున్నాను. అమెరికా, కెనడాలలో స్థిరపడిన ఎంతోమంది భారతీయుల పిల్లలకు హిందీలో మాట్లాడడం తెలీదు. ఇది వాళ్లకు పెద్ద సమస్య. అందుకే నేను హిందీ నేర్పిస్తున్నాను. నాలుగున్నరేళ్ల క్రితం ‘ఇండియా విత్ జెస్సికా’ పేరిట యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తెరిచాను. వీటిద్వారా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను పరిచయం చేస్తున్నాను. కొన్నిసార్లు వివిధ రకాల అంశాలపై మాట్లాడడానికి అతిథిగా కూడా వెళ్తున్నాను. అమెరికా అమ్మాయి ఇండియా గురించి మాట్లాడడం, అందులో హిందీలో అనర్గళంగా మాట్లాడుతుంది అని తెలిసిన వాళ్లంతా ఆశ్చర్యంగా నా క్లాసులు వినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కొంతమంది డబ్బుల కోసం లిప్‌సింక్ వీడియోలు పోస్టు చేస్తుంటారు. నేను అవేమీ చేయడం లేదు. కేవలం తెలియని సమాచారం ఇవ్వడమే నా లక్ష్యం. అందుకే ఫాలోవర్స్ గురించి కూడా పట్టించుకోను. కొంతమంది మెసేజులకు జవాబులు చెప్పడం లేదని తిడుతుంటారు. నన్ను సెలెబ్రిటీలా చూస్తున్నారు. కానీ నేను సెలబ్రిటీని కాదు. ఇద్దరు పిల్లలకు తల్లిని, వాళ్లకు నేర్పించాలి. వంట చేయాలి, ఇంటిని చూసుకోవాలి. నాకంటూ వ్యక్తిగత జీవితం ఉంది. నేను అందరిలానే సామాన్యమైన వ్యక్తిని’’ అని ఎంతో నిరాడంబరంగా చెబుతోంది జెస్సికా. -
హీహీహీ... హాహ్హాహ్హా అంతే!
నవ్వు ఆరోగ్యానికి మంచిదని మనందరికి తెలుసు. తీరికలేని లైఫ్‌స్టైల్, బాధ్యతలు, బరువులతో నవ్వడం కూడా మర్చిపోతున్నాం. ఇది చాలదన్నట్లు రెండేళ్లపాటు ప్రపంచాన్ని శాసించిన కరోనా పుణ ్యమా... ముఖానికి మాస్కుల తాళం పడింది. శానిటైజర్లు ఆవిరైపోయినట్లే ముఖాల మీద నవ్వులు మాయ మయ్యాయి. ఇప్పుడు చాలామందికి చక్కగా నవ్వడం ఎలాగో తెలియడం లేదు. ఈ జాబితాలో జపాన్ వాసులు ముందు వరుసలో ఉన్నారు. గత కొద్దికాలంగా నవ్వడం మర్చిపోయిన జపనీయులు ప్రస్తుతం నవ్వులు ్రపాక్టీస్ చేయడం కోసం కోచింగ్ సెంటర్లకు క్యూ కడుతున్నారు. ఇది కాస్త చిత్రంగా, మనకు నవ్వొస్తున్నా సరే... హహ్హా నవ్వుల కోసం వారు తెగ హడావుడి చేస్తున్నారు. నవ్వు ఆరోగ్యమేగాక, నవ్వడం వల్ల ముఖ కండరాలకు మంచి వ్యాయామం జరిగి ముఖం మరింత గ్లోగా కనిపిస్తుంది. ఒత్తిడి దూరమవుతుంది. ఎక్కడైనా పని లేదా ఉద్యోగం చేయాలన్నా ముఖం మీద చిరునవ్వు తప్పనిసరి. దానితోనే నలుగురితోపాటు ముందుకు సాగగలం. ఇదే విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న జపనీయులు శ్రద్ధగా నేర్చుకుని మరీ నవ్వుతున్నారు. అక్కడి స్మైలింగ్ కోచింగ్ సెంటర్లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. కోవిడ్ ఆంక్షలు, కొన్ని రకాల ఫ్లూల వల్ల దాదాపు మూడేళ్లపాటు మాస్కులు ధరించిన జపనీయులు నవ్వడం మర్చిపోయారు. ప్రస్తుతం అక్కడి ప్రభుత్వం ఆంక్షలు సడలించడంతో ‘స్మైలింగ్ లెసన్స్’ నేర్చుకుంటున్నారు. చక్కగా నవ్వేందుకు ఏకాగ్రతతో పాఠాలు వింటున్నారు. ఒక్కో స్మైలింగ్ ట్రైనర్ దగ్గర మూడు వేలమంది క్లాసులకు హాజరవుతున్నారంటే అక్కడి డిమాండ్ ఏంటో తెలుస్తోంది. హాలీవుడ్ స్మైల్... గతంలో రేడియో హోస్ట్‌గా పనిచేసిన కైకో క్వానో స్మైలింగ్ ఇన్స్టిట్యూట్ను నడుపుతున్నారు. ‘‘హాలీవుడ్ స్టైల్ స్మైలింగ్ టెక్నిక్’’ను నేర్పించడం ఈమె ప్రత్యేకత. కళ్లను నెలవంకలా తిప్పి, బుగ్గలను గుండ్రంగా పెట్టి పై దవడలోని ఎనిమిది దంతాలు కనిపించేలా నవ్వడమే హాలీవుడ్ స్మైల్. ప్రస్తుతం జపనీస్ విద్యార్థులు ఈ నవ్వుని ఎగబడి నేర్చుకుంటున్నారు. ‘‘విద్యార్థులు, నిరుద్యోగులు అధిక సంఖ్యలో మా దగ్గర క్లాసులు చెప్పించుకుంటున్నారు. భవిష్యత్‌లో చేయబోయే ఉద్యోగాలకు నవ్వు ముఖ్యమని వారంతా క్లాసులకు హాజరవుతున్నారు. స్మైల్ ఎడ్యుకేషన్ గతంలోకంటే ఇప్పుడు నాలుగు రెట్లు పెరిగింది. ఒక్కోక్లాసుకు మన రూపాయల్లో సుమారు రూ.4,500 తీసుకుంటున్నాము. నవ్వుతూ ఎవరిని పలకరించినా అ΄్యాయంగా దగ్గరవుతారు’’ అని క్వానో చెబుతోంది. నవ్వితే ముత్యాలేమీ రాలిపోవు, నాలుగు రకాలుగా మంచే జరుగుతుంది కాబట్టి మనం కూడ మనసారా నవ్వుదాం. ‘‘నవ్వు అనేది సహజసిద్ధంగా జరగాల్సిన ఒక ప్రక్రియ. ఇది చాలా ముఖ్యమైనది. ఎవరినైనా కలిసినప్పుడు మొదట మన నవ్వే పలకరిస్తుంది. మంచి మర్యాదలు మన నవ్వులోనే కనిపిస్తాయి. నవ్వడం మానేస్తే ముఖ కండరాలను ఎలా వాడాలో మెదడు మర్చిపోతుంది అని నిపుణులు చెబుతున్నారు. అందుకే నవ్వడం చాలా ముఖ్యం’’ అని స్మైలింగ్ ఇన్స్ట్రక్టర్ మిహోకిటానో చెబుతున్నారు. -
బుల్లి రోబో టీచరమ్మ
చిన్నారుల మధ్య కనిపిస్తున్న ఈ బొమ్మ నిజానికి ఒక హ్యూమనాయిడ్ రోబో. పేరు శిక్షా. నాలుగో తరగతి విద్యార్థులకు సైతం పాఠాలు చెప్పగల సామర్థ్యం ఈ రోబోకు ఉంది. బెంగళూరులో ఓ పాఠశాలలో తీసిందీ ఫొటో. -
యుద్ధం తర్వాత గుణపాఠం నేర్చుకున్నాం: పాక్ ప్రధాని కీలక వ్యాఖ్యలు
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్‌తో మూడు యుద్ధాలు చేసి గుణపాఠం నేర్చుకున్నామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో తాము తమ పొరుగుదేశం భారత్‌తో శాంతిని కోరుకుంటున్నాం అన్నారు. కాశ్మీర్ వంటి అంశాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీతో నిజాయితీతో కూడిన చర్చలు జరగాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు దుబాయ్‌కి చెందిన అల్ అరేబియా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్ ప్రధాని షరీఫ్ మాట్లాడుతూ.."భారత ప్రధాని మోదీకి నా సందేశం ఏంటంటే?.. మన మధ్య చిచ్చు రేపుతున్న బర్నింగ్ పాయింట్లను పరిష్కరించడానికి టేబుల్‌పై కూర్చోని చిత్తశుద్ధితో చర్చలు జరుపుదాం. శాంతియుతంగా జీవిద్దాం. పరస్పరం కలిహించుకోవడంతో సమయం, వనరులు వృధా చేస్తున్నాం" అని అన్నారు. తాము భారత్‌లో చేసిన మూడు యుద్ధాల కారణంగా పాక్ ప్రజలకు తీరని కష్టాలను మిగిల్చాయి. వారంతా తీవ్ర పేదరికం, నిరుద్యోగాన్ని ఎదుర్కొవాల్సి వచ్చింది. అదీగాక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టిమిట్టాడుతున్న పాక్ తమకు సాయం చేయమంటూ ప్రపంచ దేశాలను వేడుకుంటున్న సంగతి తెలిసిందే. అక్కడ ప్రజలు ఆర్థిక సంక్షోభం, ఇంధన కొరత కారణంగా గోధుమపిండి కోసం ఘోరంగా ఆర్రుల చాజుతున్నారు. మరోవైపు అక్కడి ప్రజలు తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ) ఉగ్రవాద దాడులను తీవ్రంగా ఎదుర్కొంటోన్నారు. గతేడాది చివర్లోనే దేశ భద్రతా దళాలతో కాల్పులు విరమించింది. ఈ పరిస్థితుల దృష్ట్యా పాక్ ప్రధాని షెహబాజ్ పోరుగు దేశంతో ముక్కుసూటిగా నిజాయితీగా వ్యహిరిస్తాం అని పిలుపునిచ్చారు. ఇరుదేశాల్లోనూ నైపుణ్యవంతులైన వైద్యులు, ఇంజనీర్లు, కార్మికులు ఉన్నారని, ఆ వనరులను ఉపయోగించుకుని శాంతి నెలకొల్పాలని కోరుకుంటున్నానని చెప్పారు. అలాగే మందుగుండు సామాగ్రి కోసం వనరులను దుర్వినియోగం చేయాలనుకోవటం లేదని తెలిపారు. ఈ క్రమంలో కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ..పాకిస్తాన్ శాంతిని కోరుకుంటుందని, కాశ్మీర్లో జరుగుతున్న వాటిని ఆపాలని అన్నారు. ఈ మేరకు తీవ్ర సంక్షోభంతో సతమతమవుతున్న పాక్ భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధమంటూ నేరుగా సంకేతాలిస్తోంది. (చదవండి: వద్దన్నా! పట్టుబట్టి డ్యూటీకి వెళ్లింది..ఓ నాన్న ఆవేదన) -
మంచి మాట: పాతుకుపోయినా... తప్పు తప్పే!
సంస్కరణలకూ, కచ్చితత్వానికీ మన జీవనవిధానంలోనూ సమాజంలోనూ, కళారంగంలోనూ వ్యతిరేకత ఎదురౌతూనే ఉంటుంది. తప్పులకూ, అనర్థాలకూ అలవాటుపడ్డ పాతబృందం సంస్కరణలనూ, నిర్దుష్టతనూ స్వీకరించనూ లేదు, హర్షించనూ లేదు. పాతుకునిపోయి ఉన్నాయి కదా అని పాత తప్పుల్ని గుడ్డిగా అందుకుని ఆచరించకూడదు. పాతది కాబట్టి అదంతా మంచిది కాదు; కొత్తదైనందువల్ల అది అధమమైనది లేదా పనికిమాలినది కాదు; తెలివైనవాళ్లు పలు పరిశీలనలు చేసి (విషయాన్ని) తీసుకుంటారు; మూఢులు పరులను అనుసరిస్తారు అన్న ఎరుకను కాళిదాసు ఎప్పుడో తెలియజెప్పారు. ఈ సత్యాన్ని మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉండాలి. సంస్కరణలను, నిర్దుష్టత్వాన్ని ఎంత మాత్రమూ స్వీకరించలేని, హర్షించలేని పాత బృందానికి అతీతంగా నేటి తరమైనా సంస్కరణలతో కచ్చితత్వాన్ని సాధించగలగాలి. ‘పాత అడుగుజాడలు తొలగిపోయినప్పుడు అద్భుతాలతో కొత్తదేశం వ్యక్తమౌతుంది‘ అని రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పిన దాన్ని మనం ఆలోచనల్లోకి తీసుకోవాలి. అలవాటయ్యాయి కదా అని తప్పుల్ని ఆచరించడం, కొనసాగించడం సరికాదు. అలవాట్ల ఏట్లో పడి కొట్టుకుపోతూ ఉండడం మనిషి జీవనానికి పరమార్థం కాదు. ‘మనం చూడం; ఎందుకంటే మనకు చూడడం గురించి అభిప్రాయాలున్నాయి‘ అని జిడ్డు కృష్ణమూర్తి ఉన్న లోపాన్ని చెప్పారు. అందుబాటులో ఉన్నవి సరైనవి అనే అభిప్రాయానికి అతీతంగా మనం కళ్లు తెరుచుకుని చూడాలి. తప్పుల్ని దాటుకుని కచ్చితత్వంలోకి వెళ్లడానికీ ఆపై సరిగ్గా ఉండడానికీ ధైర్యం, సాహసం ఈ రెండూ మనకు నిండుగా ఉండాలి. ఇవి లేకపోవడం వల్లే మనలో చాలమంది పాత తప్పుల్లో బతుకుతూ ఉంటారు. తప్పులకు అలవాటుపడి కొనసాగడం ఒకరకమైన బానిసత్వం. ఆ బానిసత్వం నుంచి మనం ధైర్యసాహసాలతో విముక్తమవ్వాలి. సరిగ్గా ఉండడం కోసం మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. మనలో చలామణి అవుతున్న తప్పుల్ని మనం తెలుసుకోవాలి. వాటి నుంచి తప్పించుకోవాలి. వాటిని మనం తప్పించెయ్యాలి. తప్పులవల్ల గతంలో జరిగిన కీడును వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ జరగకుండా పరిశ్రమించాలి. నీళ్లవల్ల శరీరం శుభ్రపడుతుంది; సత్యంవల్ల మనస్సు శుభ్రపడుతుంది; జ్ఞానం వల్ల బుద్ధి శుభ్రపడుతుంది; విద్యవల్లా, తపస్సువల్లా స్వభావం శుభ్రపడుతుంది. నీళ్లతో శరీరాన్ని శుభ్రం చేసుకోవడం మనకు తెలిసిందే. సత్యంతో మనస్సును శుభ్రంచేసుకోవడం మనం నేర్చుకోవాలి. జ్ఞానం వల్ల బుద్ధి శుభ్రపడుతుంది అన్న దాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి. విద్యవల్లా, తపస్సు(సాధన)వల్లా స్వభావం శుభ్రపడుతుందనడానికి మనమే ఋజువులుగా నిలవాలి. ముందటితరాల ద్వారా చింతన, చేష్టల పరంగా మనకు తప్పులు అంటుకున్నాయి. దురదృష్టవశాత్తు కొన్ని విషయాల్లో ఆ తప్పులే ఒప్పులుగా రూఢీ అయిపోయాయి. దానివల్ల జీవన, సామాజిక, కళల ప్రమాణాలు, ప్రయోజనాలు దెబ్బతిన్నాయి. ఈ వాస్తవాన్ని ఇకనైనా అవగతం చేసుకోవాలి. ఈ అవాంఛనీయమైన పరిస్థితిని ఎదిరించి పోరాడి విజయం సాధించాలి. తప్పులకూ, అనర్థాలకూ అలవాటుపడ్డ పాత వాళ్ల దగ్గర మేలు, మంచి ఈ రెండూ లేవు కాబట్టి వాళ్లు అవి జరగకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. జీవనవిధానంలోనూ, సామాజికంగానూ, కళలలోనూ నిర్దుష్టతను వీళ్లు వ్యతిరేకిస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్లు సరైన దాన్ని స్వీకరిస్తే వాళ్లు తప్పుడు వాళ్లు అన్న నిజం స్థిరపడిపోతుంది కాబట్టి. చెడ్డవాళ్లకు సంస్కరణలతో శత్రుత్వం ఉంటుంది, ప్రతి సంస్కర్తా చెడ్డవాళ్లకు విరోధే! కల్మషమైన పాతనీరు బురద అవుతుంది. హానికరమైన పాత బురదను మినహాయించుకోవాలి. కొత్త నదులను ఆహ్వానించాలి. కొత్త సంస్కరణల్ని మిళితం చేసుకుంటూ మునుముందుకు సాగడమే మనిషికి మేలైన జీవితం అవుతుంది. మూర్ఖత్వాన్ని వదిలించుకుని జ్ఞానాన్ని పొందడానికి ప్రపంచంలోకి ప్రవహించాలి మనం. సంస్కరణలు మనతో మొదలవ్వాలి. ‘తమతో మొదలుపెట్టేవాళ్లే ఈ ప్రపంచం చూసిన ఉత్తమ సంస్కర్తలు‘ అని జార్జ్ బెర్నాడ్ షా అన్నారు. మనల్ని మనం సంస్కరించుకుంటూ కచ్చితత్వాన్ని సాధించుకుంటూ సరైన, ఉన్నతమైన మనుషులమౌదాం. పాతుకుని పోయి ఉన్నాయి కదా అని పాత తప్పుల్ని గుడ్డిగా అందుకుని ఆచరించకూడదు. – రోచిష్మాన్ -
Mount Everest: ఎవరెస్ట్ నేర్పే పాఠం ఎలాంటిదంటే..
ఎవరెస్ట్.. ఒక ప్రత్యేకం. అది ఎక్కడమంటే ఒక మినీ యుద్ధం చేసినట్లే!. అధిరోహించిన ప్రతిసారీ ఓ కొత్త అనుభవం పంచుతుంది. ఆ అనుభవం ఓ కొత్త పాఠం నేర్పిస్తుంటుంది. అదే సమయంలో కొత్త సవాళ్లనూ ముందుంచుతుంది. ఆకాశమే హద్దుగా.. పర్వత శిఖరాన్ని అధిరోహించే వాళ్లే కాదు, అక్కడి ప్రతికూల పరిస్థితులకు ఏమాత్రం తీసిపోని సవాళ్లను లైఫ్‌లో దాటుకుంటూ ముందుకెళ్లాలనుకునే వాళ్లు కూడా ‘ఎవరెస్ట్’ నుంచి ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవచ్చు మరి!. మౌంట్ ఎవరెస్ట్.. ఆకాశానికి సమీప భూభాగం. వెండి కొండలా ధగ ధగా మెరిసే అద్భుత పర్వతం. ఆ శిఖరాగ్రాన్ని చేరి నిలబడి చూస్తే ఎలా ఉంటుంది?.. మొత్తం ప్రపంచమే మనిషి పాదాల కింద ఉన్న ఫీలింగ్ వస్తుంది. అలాంటి మహోన్నత శిఖరాన్ని ఎక్కడమంటే ఆషామాషీ కాదు. కఠోర శిక్షణ తీసుకోవాలి. అంతకు మించి గుండెల నిండా ధైర్యం ఉండాలి. లక్ష్యాన్ని చేరుకోవాలన్న కసి.. గెలిచి తీరాలన్న పంతంతో ముందుకెళ్లాలి. మానవతీతులకు సాధ్యమేనా? అనుకున్న సమయంలో.. ఈ పర్వతాన్ని అధిరోహించి ‘మనిషి తల్చుకుంటే ఏదైనా సాధ్యమే’ అని ప్రపంచానికి చాటి చెప్పిన హీరోలిద్దరున్నారు. వాళ్లెవరో కాదు. న్యూజిలాండ్ కు చెందిన ఎడ్మండ్ హిల్లరీ- భారత్ కు చెందిన టెన్జింగ్ నార్గే. ఇప్పటి సాంకేతికత, ఆధునిక పరికరాలు, పనిముట్లు, సౌకర్యాలు లేనిరోజుల్లో ఈ ఇద్దరూ ఎవరెస్ట్ మీద తమ జెండాలు పాతారు. అది.. 1953 మే 29 తేదీ సరిగ్గా ఉదయం 11:30 గంటల ప్రాంతంలో.. చరిత్రలో లిఖించదగ్గ క్షణాలను నమోదు చేశారు హిల్లరీ-నార్గేలు. ఈ ఇద్దరిలోనూ శిఖరం పై మొదట కాలు మోపింది మాత్రం హిల్లరీనే. పేరెలా వచ్చిందంటే.. ప్రపంచంలోనే ఎత్తైన పర్వత శిఖరం.. మౌంట్ ఎవరెస్ట్. సముద్ర మట్టానికి 29 వేల అడుగుల ఎత్తులో.. నేపాల్ -టిబెట్ సరిహద్దులో ఉంది. టిబెటన్లు దీన్ని కోమో లాంగ్మా అని పిలుస్తారు. దానర్థం మాతృ దేవత అని. చైనా వాళ్లు జుము లాంగ్మా అంటారు. హోలీ మదర్ అని చైనీయుల ఉద్దేశం. నేపాలీలేమో సాగర మాత అని పిలుస్తుంటారు. అప్పటివరకు కాంచన్ జంగా ప్రపంచంలోకెల్లా.. అత్యంత ఎత్తైన శిఖరమని అంతా పొరబడ్డారు. ఆ సమయంలో సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా అయిన జార్జి ఎవరెస్ట్.. అంతకు మించి ఎత్తైన ఓ శిఖరం ఎత్తు తెలుసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. 1850లో నికొల్సన్ అనే ఉద్యోగికి ఆ బాధ్యతలు అప్పజెప్పాడు. ఆరేళ్లపాటు శ్రమించి.. నికొల్సన్ తన ఆపరేషన్ తన బాధ్యతలు పూర్తి చేశారు. అలా జార్జి ఎవరెస్ట్ పేరు మీద.. ప్రపంచానికి మౌంట్ ఎవరెస్ట్‌గా పరిచయమైంది. అయితే.. ఎవరు ఎలా పిలిస్తేనేం ఈ పర్వతమైతే పలుకుతుందా?. గంభీరంగా అలా ఉండిపోతుంది అంతే!. ఎవరెస్ట్‌ను అధిరోహిస్తే.. పేరు వస్తుందన్న మాట వాస్తవమే. కానీ, ఆ పని అంత సులువు కాదు. కాకలు తీరిన పర్వతారోహకులకు సైతం ఇదొక టఫ్ ఛాలెంజ్. ఎత్తుకు వెళ్లే కొద్దీ.. అన్నీ సమస్యలే స్వాగతం పలుకుతుంటాయి. పైగా ప్రతికూల వాతావరణం సవాళ్లు విసురుతుంటుంది. పచ్చిగా చెప్పాలంటే.. ప్రాణాలతో చెలగాటం. ఏమాత్రం తేడా జరిగినా అంతే!. ఎవరెస్ట్ అధిరోహించే క్రమంలో.. ఎనిమిది వేల అడుగుల ఎత్తు దాటితే దాన్ని డెత్ జోన్ అంటారు. అదో మృత్యు శిఖరం. అక్కడ గాలిలో ఆక్సిజన్ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. ఎంత తక్కువగా ఉంటుందంటే ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమే. ఆక్సిజన్ బాటిల్స్‌లో తేడాలు జరిగినా అంతే!. ఈ పరిస్థితుల్లో ఇంకా పైకి వెళ్లడం.. ప్రమాద తీవ్రతను తెలియజేస్తుంది. అక్కడి నుంచి కిందకు తిరిగి వస్తే అదో గొప్ప. అంత ప్రమాదమని తెలిసినా.. క్లైంబర్స్కు ఎవరెస్ట్ మీద మోజు తగ్గదు. సాహసానికి లభించే అరుదైన విజయానందం మరొకటి ఉంటుందా? అంటారు. అయితే.. ఆ మోజే ఒక్కోసారి భారీ మూల్యం చెల్లించుకునేలా చేస్తుంది. ఆకాశానికి నిచ్చెన.. ఎవరెస్ట్ ఎక్కడమంటే ఆకాశానికి నిచ్చెన వేయడమే. నిచ్చెన ఎక్కేటప్పుడు తప్పటడుగు ఒక్కటి పడినా ఖతం. వాతావరణం ఎదురు తిరిగినా డేంజరే. ఎవరెస్ట్ ఎక్కడంలో బోలెడు రికార్డులు ఉన్నాయి. అన్నే విషాదాలూ ఉన్నాయి. గుండెల నిండా సాహసాన్ని నింపుకుని వేల అడుగుల ఎత్తు ఎక్కిన క్లైంబర్స్ ఎవరెస్ట్ మీదనే చివరి ఊపిరి పీల్చిన విషాద ఘటనలు చాలా ఉన్నాయి. కానీ ఓ దుర్ఘటన మాత్రం ఎవరెస్ట్ చరిత్రలోనే అత్యంత ట్రాజిక్ ఇన్సిడెంట్ గా మిగిలిపోయింది. ఎ‘వరెస్ట్’ 1996.. 1996, మే 11. మన పర్వతారోహణ చరిత్రలో ఓ బ్లాక్ డే. ఒకేరోజు ఎనిమిది మంది పర్వతారోహకులు ఎవరెస్ట్ పై ఊపిరి వదిలారు. మరణించిన వాళ్లలో మనవాళ్లు ముగ్గురు, అమెరికా-న్యూజిలాండ్-జపాన్ దేశాల వాళ్లు ఐదుగురు ఉన్నారు. ఈ ప్రమాదం మాత్రమే కాదు.. 1996 సీజన్లో ఎవరెస్ట్ అధిరోహణలో మొత్తం పదిహేను మంది కన్నుమూశారు. ఎవరెస్ట్ చరిత్రలో ఓ సీజన్లో ఇంతమంది చనిపోవడం అదే మొదటిసారి!. ఏం జరిగిందంటే..! అడ్వెంచర్ కన్సల్టెంట్స్- మౌంట్ మ్యాడ్నెస్ అనే రెండు ఏజెన్సీలతో పాటు జపాన్-టిబెట్‌లకు చెందిన పర్వతారోహకులు ఎవరెస్ట్ అధిరోహణకు సిద్ధపడ్డారు. మే 10వ తేదీన అంతా పర్వతం పైకి బయలుదేరారు. ఆ రాత్రికి క్యాంప్ ఫోర్ చేరారు. ఆ ఎత్తు 7,900 మీటర్లు. మధ్యాహ్నం తర్వాత ప్రమాదం అన్నివైపుల నుంచి ముంచుకొచ్చింది. ఎనిమిది మందిని బలిగొంది. ఈ ఘటనలో న్యూజిలాండ్‌కు చెందిన రాబ్ హాల్-ఆండ్రూ హారిస్, అమెరికాకు చెందిన హాన్సెన్ -స్కాట్ ఫిషర్ , జపాన్ యాసుకో నంబా, భారత్ కు చెందిన సుబేదార్ సెవాంగ్ -లాన్స్ నాయక్ -పల్జోర్ లు మృతి చెందారు. మరణాలు ఎడ్మండ్ హిల్లరీ-టెన్జింగ్ నార్గేలు ఎవరెస్ట్‌ను అధిరోహించిన ఏడాది 1953 నుంచి.. ఇప్పటిదాకా 250 మందికి పైనే చనిపోయారు. మరో విషయం ఏమిటంటే.. 70 శాతం మంది దేహాలు గల్లంతు అయ్యాయి. లెక్కల ప్రకారం.. 150 మంది పర్వతారోహకుల మృతదేహాలు ఏమయ్యాయో కూడా తెలియదు. ఆరంభంలో ఆహ్లాదం, కానీ.. ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు ఎదురయ్యే సవాళ్లు చాలా కఠినంగా ఉంటుంది. అదీ దశలవారీగా. ఎవరెస్ట్ అధిరోహణలో.. ముందుగా పర్వత పాదాన్ని చేరాలి. దీన్నే బేస్ క్యాంప్ అంటారు. ఎవరెస్ట్ ఎక్కేముందు క్లైంబర్స్ ఇక్కడే రెండు వారాల పాటు ఉండాలి. ఈ టైంలో ఎవరెస్ట్ వాతావరణానికి అలవాటు పడతారు. ఈ రెండు వారాలు టెంటుల్లో కాలక్షేపం చేస్తారు. ఈలోగా అధిరోహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. నెక్ట్స్ లెవల్లో.. బేస్ క్యాంప్ నుంచి క్యాంప్ వన్ చేరాలి. ఆ ఎత్తు 6,065 మీటర్లు. అక్కడి నుంచి క్యాంప్ టూ చేరాలి. దీన్నే ‘అడ్వాన్స్ డ్ బేస్ క్యాంప్’ అంటారు. మరో వెయ్యి మీటర్లు ఎత్తు పైకి వెళ్తే.. క్యాంప్ త్రీ వస్తుంది. ఆ తర్వాత మరో 500 మీటర్లకు క్యాంప్ ఫోర్. ఇది దాటితే కష్టాలు మొదలైనట్లే. క్యాంప్ ఫోర్ తర్వాత వచ్చేది బాల్కనీ. దీని ఎత్తు 8,400 మీటర్ల ఎత్తు. ఇక్కడి నుంచి శిఖరాన్ని చేరాలంటే మధ్యలో ప్రాణాలతో చెలగాటమే. నడుం లోతు మంచు లోంచి పై కెక్కాలి. ఏ మాత్రం తేడా వచ్చినా కొన్ని వేల మీటర్ల కింద లోయలో పడిపోవడమే. సున్నంలోకి ఎముకలు కూడా మిగలవు!. ఎవరెస్ట్ ఎక్కడంలో అసలు సమస్యంతా ఎక్కడంటే.. వాతావరణంతోనే!. ఎత్తు పెరిగే కొద్దీ వాతావరణంలో వచ్చే మార్పులు.. అధిరోహకులకు నరకం చూపిస్తాయి. ఒక్కసారిగా గాలులు విజృంభిస్తాయి. ఎడతెరపి లేకుండా మంచు కురుస్తూనే ఉంటుంది. పైకి వెళ్లడానికీ ఉండదు. కిందకు దిగడానికీ ఉండదు. ఈ గాలుల వల్ల ఒక్కసారిగా ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తాయి. వీటితో వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. ఉదాహరణకు.. సెరిబ్రల్ ఎడిమా అనే వ్యాధి సోకితే గనుక పర్వతారోహకులు వింతగా ప్రవర్తిస్తారు. ఈ వ్యాధి వచ్చిన వాళ్ల మెదడు చురుకుగా ఉండదు. అంత ఎత్తులో ఉన్నవాళ్లు.. తాము కిందకు జంప్ చేయగలమనే భావనలోకి కూరుకుపోతారు. అంతిమంగా అది వాళ్ల ప్రాణాలకే ముప్పుగా పరిణమిస్తోంది. రిస్క్‌లేని లైఫ్ ఎందుకు? ఇన్ని అవరోధాలు, ఆటంకాలు అధిగమిస్తూ ఆకాశమే హద్దుగా ఉన్న ఎవరెస్ట్‌ను పర్వతారోహకులు అధిరోహించి అక్కడ జెండా పాతేస్తారు. ప్రపంచ విజేతగా తమను తాము ప్రకటించుకుని పొంగిపోతారు. అసలు ఆనందంకోసం ఒక్కోసారి ప్రాణాలు కూడా పణంగా పెట్టేస్తారు. ప్రాణాలను పణంగా పెట్టి.. ఇదంతా అవసరమా? అనే ప్రశ్నకు.. ఎవరెస్ట్ ప్రియుల నుంచి వినిపించే సమాధానం ఒక్కటే. రిస్క్ లేకపోతే లైఫ్ వ్యర్థం అని. ప్రమాదాలు జరుగుతున్నాయని.. ప్రయాణాలు మానేసి ఇంట్లో కూర్చుని ఉంటామా? అలాగే ఇది కూడా అంటారు. పర్వతారోహణ అణువణువునా జీర్ణించుకుపోయిన ఒక ప్యాషన్.. వాళ్లతో అంతేసి సాహసం చేయిస్తోంది మరి!. ఎవరెస్ట్ అనే మహోతన్నత శిఖరం.. మనిషి ఓపికకు పరీక్ష పెడుతుంది. కష్టం విలువను తెలియజేస్తుంది. ఆహారాన్ని ఎలా దాచుకోవాలి అనే పొదుపు పాఠం నేర్పుతుంది. అన్నింటికి మించి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ఎలా పోరాడాలి.. ముందుకు ఎలా సాగాలి అనే జీవిత పాఠాన్ని నేర్పిస్తుంది. -
నేర్చుకుంటూ, నేర్పుతూ.. విలువైన పాఠాలు!
పర్యావరణం అనేది యూత్‌కు పట్టని మాట... అనేది తప్పని ‘యూ కెన్’లో చురుకైన పాత్ర నిర్వహిస్తున్నయువతరం నిరూపిస్తోంది. మహా పట్టణాల నుంచి మారుమూల పల్లెలకు తిరుగుతూ పర్యావరణ సందేశాన్ని మోసుకెళుతుంది... మధ్యప్రదేశ్‌లోని పిపరియ అనే టౌన్‌లోని ప్రభుత్వ పాఠశాలకు ప్రతి శనివారం తప్పనిసరిగా వస్తుంది 27 సంవత్సరాల లహరి. ‘అక్కయ్య వచ్చేసింది’ అంటూ పిల్లలు చుట్టుముడతారు. అందరిని పలకరించి తాను చెప్పదలుచుకున్న విషయాలను చెబుతుంది. పిల్లలందరూ నిశ్శబ్దంగా వింటారు. సందేహాలు అడిగి తీర్చుకుంటారు. ఆ తరువాత లహరితో కలిసి ప్రకృతిని పలకరించడానికి వెళతారు. ‘ఈ చెట్టు పేరు మీకు తెలుసా?’ ‘అదిగో ఆ కీటకం పేరు ఏమిటి?’ ... ఇలా ఎన్నో అడుగుతూ వాటికి సవివరమైన సమాధానాలు చెబుతుంది లహరి. ముచ్చట్లు, కథలు, నవ్వుల రూపంలో పర్యావరణానికి సంబంధించిన ఎన్నో విలువైన విషయాలను లహరి ద్వారా నేర్చుకుంటారు పిల్లలు. ‘మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లలను కొన్ని ప్రశ్నలు అడిగాను. మౌనమే వారి సమాధానం అయింది. ఇప్పుడు వారిలో ఎంతో మార్పు వచ్చినందుకు సంతోషంగా ఉంది. తమ చుట్టూ ఉన్న మొక్కలు, చెట్ల పేర్లు చెప్పడంతో సహా వాటి ఉపయోగాలు కూడా చెప్పగలుగుతున్నారు’ అంటుంది లహరి. యూత్ కన్జర్వేషన్ యాక్షన్ నెట్వర్క్(యూ కెన్) వేదికగా మధ్యప్రదేశ్‌లోనే కాదు దేశంలోని పన్నెండు రాష్ట్రాల్లో లహరిలాంటి వారు పల్లెలు, పట్ణణాలు, కొండలు, కోనలు అనే తేడా లేకుండా విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచుతున్నారు. ‘పిల్లల్లో కలిసిపోయి వారిని నవ్విస్తూనే నాలుగు మంచి విషయాలు చెప్పగలిగే వారిని తయారు చేయాలనుకున్నాం’ అంటున్న రామ్‌నాథ్ చంద్రశేఖర్, వైల్డ్‌లైఫ్ ఫిల్మ్‌మేకర్, ఫొటోగ్రాఫర్, కన్జర్వేషన్ ఎడ్యుకేటర్ రచిత సిన్హాతో కలిసి యూత్ కన్జర్వేషన్ యాక్షన్ నెట్వర్క్ (యూ కెన్) అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాడు. దేశంలోని పన్నెండు రాష్ట్రాల నుంచి 20 మంది యువతీ యువకులను ‘యూ కెన్’ కోసం ఇంటర్వ్యూలు, వీడియో ఇంటరాక్షన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఝార్ఖండ్‌కు చెందిన రచిత సిన్హా పచ్చటి ప్రకృతితో చెలిమి చేస్తూ పెరిగింది. ‘మా చిన్నప్పుడు ఎన్ని చెట్లు ఉండేవో తెలుసా, ఎన్ని పక్షులు ఉండేవో తెలుసా!’ అంటూ తల్లిదండ్రులు చెప్పిన విషయాలను వింటూ పెరిగింది. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసిన రచిత ఆ తరువాత ‘యూ కెన్’పై పూర్తిగా దృష్టి పెట్టింది. (క్లిక్: కూరగాయలు, పండ్ల నిల్వలో విప్లవం.. 2 నెలల వరకు చెక్కు చెదరవు!) ‘లాభాపేక్షతో సంబంధం లేకుండా ఒక మంచిపని కోసం సమయాన్ని వెచ్చించేవారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి యువతరానికి యూ కెన్ మంచి వేదిక అవుతుంది. దీనికోసం పెద్ద డిగ్రీలు అక్కర్లేదు. పర్యావరణ ప్రేమ, నాలుగు మంచి విషయాలు పిల్లలకు చెప్పగలిగే నైపుణ్యం ఉంటే చాలు’ అంటుంది రచిత సిన్హా. ‘నేర్చుకుంటూ... నేర్పుతూ’ అంటారు. ‘యూ కెన్’ ద్వారా యూత్ చేస్తున్న మంచి పని అదే. విలువైన పాఠాలు ప్రకృతి నుంచి విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు. అలా నేర్చుకుంటూనే ‘యూ కెన్’ లాంటి వేదికల ద్వారా తాము నేర్చుకున్న విషయాలను పిల్లలతో పంచుకోవడంలో ముందుంటుంది యువతరం. – రచిత సిన్హా, యూ కెన్, కో–ఫౌండర్ -
ఐ.ఏ.ఎస్ పెంపకం పాఠాలు.. మీకు పనికొస్తాయేమో చూడండి
‘మా అమ్మ ముగ్గురు పిల్లలను పెంచింది. ముగ్గురం ఐఐటి చదివాం. నాకు ఇద్దరు అమ్మాయిలు. వారిని ఉత్తమమైన సంతానంగా పెంచడానికి ప్రయత్నిస్తున్నాను. పిల్లల్ని పెంచడంలో తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి. నేను తెలుసుకున్నవి మీకు చెబుతాను. పనికొస్తాయేమో చూడండి’ అంటూ ఉత్తర ప్రదేశ్ ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ దివ్య మిట్టల్ రాసిన ట్విట్టర్ పోస్టు వైరల్ అయ్యింది. ఇంతకీ ఆమె చెప్పిన పాఠాలు ఏమిటి? ‘మా అమ్మ నుంచి నేను పిల్లల పెంపకం నేర్చుకున్నాను. మా అమ్మ ముగ్గురు పిల్లల్ని పెంచింది. ముగ్గురం ఐ.ఐ.టికి వెళ్లాం. నేను ఐ.ఐ.ఎంలో కూడా చదివాను. ఆ తర్వాత 2013 కేడర్‌లో ఐ.ఏ.ఎస్ అయ్యాను. నా ఇద్దరు తోబుట్టువులు కూడా బాగా సెటిల్ అయ్యారు. ఇదంతా మంచి పెంపకం వల్లే జరిగిందని అనుకుంటున్నాను. నాకు ఇద్దరు అమ్మాయిలు. వారిని నేను బాగా పెంచాలి. మా అమ్మ నుంచి నేర్చుకున్నవి, నాకు నేనై గ్రహించినవి మీకు చెప్తాను. ఉపయోగపడితే చూడండి’ అని ఉత్తరప్రదేశ్ ఐ.ఏ.ఎస్ అధికారి దివ్య మిట్టల్ రాసిన ట్విటర్ పోస్టు (వరుస) ఇటీవల కాలంలో దేశంలో ఎక్కువ మంది మెచ్చిన పోస్ట్‌గా గుర్తింపు పొందింది. ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లాకు కలెక్టర్‌గా ఉన్న దివ్య మిట్టల్ అప్పుడప్పుడు ట్విటర్ ద్వారా నలుగురికీ ఉపయోగపడే కిటుకులు, స్ఫూర్తినిచ్చే సందేశాలు ఇస్తుంటుంది. ఇటీవల ఆమె పేరెంటింగ్ గురించి రాసిన పోస్టు కూడా అలాంటిందే. ఆమె నమ్మి చెప్పిన విషయాలు చాలామందికి నచ్చాయి. అయితే వీటితో విభేదించేవాళ్లు ఉండొచ్చు. ఉంటారు కూడా. కాని ఎక్కువమంది ఇలాగే పెంచాలని భావిస్తారు కాబట్టి దివ్యను మెచ్చుకుంటూ పోస్ట్‌ను వైరల్ చేశారు. దివ్య చెప్పిన పెంపకం పాఠాలు ఇలా ఉన్నాయి. ఏదైనా చేయగలరు అని చెప్పండి: పిల్లలకు ఆత్మవిశ్వాసం ముఖ్యం. చిన్నప్పటి నుంచి నువ్వు ఏదైనా చేయగలవు అనే భావన వారిలో కల్పించాలి. నిన్ను నువ్వు నమ్ము అని తల్లిదండ్రులు పిల్లలకు తరచూ చెప్పాలి. ఆత్మవిశ్వాసమే వారిని లక్ష్యాన్ని నిర్ణయించుకోవడంలో చేరుకోవడంలో సాయం చేయగలదు. పడనివ్వండి పర్వాలేదు: పిల్లలకు చిన్న నొప్పి కూడా కలగకుండా పెంచాలని చూడొచ్చు. జీవితం పూలపాన్పు కాదు. పరిష్కార పత్రాలతో అది సమస్యలను తేదు. పడి లేచి అందరూ ముందుకెళ్లాల్సిందే. అందుకే పిల్లల్ని బాగా ఆడనివ్వండి. పడనివ్వండి. లేవనివ్వండి. వాళ్లు పడగానే పరిగెత్తి పోకండి. విఫలమైనప్పుడు లేవడం వారికి తెలియాలి. లేచాక సరే.. పద అని వారితో పాటు ముందుకు పదండి. పోటీ పడాలి: వాళ్లను రకరకాల పోటీలలో పాల్గొనేలా చేయండి. గెలవడానికి మాత్రమే కాదు. ఓటమితో తగినంత పరిచయం ఏర్పడటానికి, ఓటమి కూడా ఉంటుందని తెలియడానికి వారు పాల్గొనాలి. ఓటమి కంటే ఓడిపోతామనే భయం ఎక్కువ ప్రమాదకరమైనది. ఓడినా పర్వాలేదు... పోటీ పడాలి అనేది నేర్పించాలంటే ఈ పని తప్పనిసరి. రిస్క్ కూడా ముఖ్యమే: పిల్లలు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడతారు. అలాంటి సమయాలలో తప్పనిసరి పర్యవేక్షణ చేయండి. అంతే తప్ప అసలు రిస్కే వద్దు అనేలా ఉండొద్దు. అడ్వంచర్ స్పోర్ట్స్ ఆడతానంటే ఆడనివ్వండి. చెట్టు ఎక్కుతానంటే దగ్గరుండి ఎక్కించండి. అలాంటి సమయాలలో ప్రమాదం ఉందనిపిస్తే పిల్లలు జాగ్రత్త పడతారు. ప్రమాదాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఈ అనుభవం వారికి నేర్పుతుంది. బోలెడన్ని అవకాశాలు: మా చిన్నప్పుడు ఇంత పేదగా ఉన్నాం... అంత పేదగా ఉన్నాం... కాబట్టి నువ్వు బాగా చదువుకుని పైకి రావాలి... ఇలా కొందరు తల్లిదండ్రులు చెబుతుంటారు. అలా చెప్పక్కర్లేదు. ఈ లోకం చాలా పెద్దది... ఎక్కడ చూసినా అవకాశాలు ఉంటాయి... బోలెడంత సంపద ఉంది... నేర్చుకున్న విద్యకు విలువ ఉంటుంది... ఏదో ఒకటి సాధించడం కష్టం కాదు. కాని ఆ సాధించేదేదో పెద్దదే సాధించు అనే విధాన పిల్లలకు స్ఫూర్తినివ్వాలి. మీరే ఆదర్శం: పిల్లలకు తల్లిదండ్రులకు మించి రోల్‌మోడల్స్ ఉండరు. వారికి మీరే ఆదర్శంగా ఉండండి. మీరు ఒకటి చెప్పి మరొకటి చేస్తూ ఉంటే పిల్లలు ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలో తెలియక బాధ పడతారు. మీ పిల్లలు ఎలా ఉండాలనుకుంటారో మీరు వారి ఎదుట అలా ఉండండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మందలించండి: పిల్లలు తప్పు చేస్తే మందలించండి. ఇది సరిౖయెన పని కాదు అని గట్టిగా చెప్పండి. తప్పు లేదు. మంచి నడవడిక అంటే ఏమిటో వారికి తెలియాలి. వారిని నమ్మండి: మీ అంచనాకు తగినట్టుగా పిల్లలు లేకపోతే నిరాశ చెందకండి. ‘నీ మీద నమ్మకం పోయింది’ అని పిల్లలతో పొరపాటున కూడా అనకండి. మీరే వారిపై నమ్మకం పోగొట్టుకుంటే ఇక వారిని నమ్మేదెవరు. పిల్లలు కుదేలైపోతారు. అందుకని వారికి అవకాశం ఇవ్వండి. ‘నిన్ను నమ్ముతున్నాం. నువ్వు చేయగలవు. పర్వాలేదు. మళ్లీ ప్రయత్నించు’ అని చెప్పండి. భిన్న అనుభవాలను ఇవ్వండి: మీ పిల్లలకు లోకం చూపించండి. ఊళ్లు, కొత్త ప్రదేశాలు, అనాథ గృహాలు, సైన్స్ ల్యాబ్‌లు, భిన్న రంగాల పెద్దలు ఇలా మీకు వీలైనచోటుకు తీసుకెళ్లి వీలైన వారితో పరిచయం చేయించండి. తిరిగొచ్చేప్పుడు వారితో ఆ విషయాలను మాట్లాడండి. మీ పనుల్లో మీరు ఉండకండి. వారు చెప్పేది వినండి: పిల్లలు ఏదైనా చెప్పడం మొదలెట్టగానే నోర్మూయ్ నీకేం తెలియదు అనకండి. వాళ్లు శుంఠలనే భావన తీసేయండి. ముందు వారు చెప్పేది పూర్తిగా వినండి. వెంటనే రియాక్ట్ కావద్దు. ఆలోచించి అప్పుడు మాట్లాడండి. తాము చెప్పేది తల్లిదండ్రులు వింటారు అనే నమ్మకం పోతే పిల్లలు చెప్పడం మానేస్తారు. పోల్చకండి: మీ పిల్లలను ఇతర ఏ పిల్లలతో పోల్చకండి. అలాగే వారి తోబుట్టువులతో కూడా పోల్చకండి. మీరు మీ పిల్లల్లో ఒకరిని గారాబం చేస్తే వారు లోకంలో అంతా ఇంతే సుఖంగా ఉంటుంది అనుకుంటారు. ఎవరినైనా నిర్లక్ష్యం చేస్తే వారు గుర్తింపు కోసం, అంగీకారం కోసం పాకులాడే స్థితికి వెళతారు. కాబట్టి రెండూ వద్దు. ఇవీ ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ చెప్పిన పెంపకం పాఠాలు. ఇక నిర్ణయం మీదే. -
ఈక్విటీల్లో విజయానికి.. బఫెట్ పంచ సూత్రాలు
2020 నుంచి రెండేళ్లపాటు తారాజువ్వలా సాగిన ఈక్విటీల ర్యాలీ చూసి మార్కెట్లోకి ఉత్సాహంగా అడుగుపెట్టిన యువ ఇన్వెస్టర్లు బోలెడు మంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితులు వారిని ఇప్పుడు అయోమయానికి గురిచేయవచ్చు. అంతెందుకు సుదీర్ఘకాలం నుంచి మార్కెట్లో ఉన్న వారు సైతం షేర్ల ధరలు పేకమేడల్లా రాలుతున్నప్పుడు స్థిరంగా చూస్తూ ఉండలేరు. నష్టానికైనా అమ్ముకుని బయటపడదామనుకుంటారు. కానీ, ఈక్విటీ మార్కెట్లకు సంక్షోభాలు కొత్త కాదు కదా! ఎన్నో స్కాములు, ఆర్థిక మాంద్యాలు, యుద్ధాలను చూసి పడిపోయాయి. అంతే బలంగా పైకి లేచి నిలబడ్డాయి. ఈక్విటీల్లో విజయానికి ముందుగా కావాల్సింది పెట్టుబడి కాదు. విజయ సూత్రాలు. వారెన్ బఫెట్ వంటి విఖ్యాత ఇన్వెస్టర్ల అనుభవాలు, సూత్రాలు లోతుగా పరిశీలిస్తే ఈక్విటీ తత్వం కొంతైనా బోధపడుతుంది. వారెన్ బఫెట్ పెట్టుబడుల కంపెనీ బెర్క్‌షైర్ హాతవే 1970 నుంచి ఏటా వాటాదారులకు వార్షిక నివేదిక పంపిస్తుంటుంది. ఇందులో వాటాదారులను ఉద్దేశించి బఫెట్ రాసే లేఖ ఇన్వెస్టర్లకు ఒక చుక్కానిలా పనిచేస్తుంది. బఫెట్ అనుసరించిన సూత్రాలు కాల పరీక్షకు నిలబడినవి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. కరోనా విపత్తు, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, రష్యాపై అమెరికా, ఐరోపా దేశాల ఆర్థిక ఆంక్షలు, చైనాలో మందగమనం, అమెరికాలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, చమురు ధరల శరాఘాతం, దీర్ఘకాలం పాటు ఆర్థిక స్తబ్దత, రూపాయి బలహీనత ఇలా చెప్పుకోవడానికి చాలానే ఉన్నాయి. ఒకవైపు వృద్ధికి ప్రోత్సాహం కావాలి. మరోవైపు ధరలకు కట్టడి వేయాలి. సెంట్రల్ బ్యాంకులకు ఇదొక సవాలుగా మారిపోయింది. ధరల పెరుగుదలకు సరఫరా వ్యవస్థలో సమస్యలూ తోడయ్యాయి. ఇలా ఒకటికి మించిన ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు ఈక్విటీ మార్కెట్లను మరోసారి ఆటుపోట్లకు గురిచేస్తున్నాయి. స్వల్పకాలంలో కనిపించే ఇలాంటి ప్రకంపనలకు కదిలిపోతే దీర్ఘకాలం పాటు మార్కెట్లో నిలిచి రాణించడం అసాధ్యం. ద్రవ్యోల్బణం ప్రభావం ద్రవ్యోల్బణం ఎగసిపడడం అన్నది తాత్కాలికమేనన్న వాదన గతేడాది నుంచి వినిపిస్తోంది. కానీ, ఇది నిజం కాదు. అభివృద్ధి చెందిన దేశాల్లో దీర్ఘకాలంగా తక్కువ ద్రవ్యోల్బణం ఉంది. ఫలితంగా దీర్ఘకాలం పాటు సరళతర విధానాలు కొనసాగడం వల్ల ఉండే రిస్క్‌ను ఇన్వెస్టర్లు, విశ్లేషకులు, ఆర్థికవేత్తలు సైతం సరిగ్గా అంచనా వేయలేకపోయారు. కానీ, ఇప్పుడు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అధిక ద్రవ్యోల్బణం నడుమ సెంట్రల్ బ్యాంకుల ముందున్న ఏకైక మార్గం ద్రవ్య పరపతి విధానాలను కఠినతరం చేయడమే. ఇన్నాళ్లూ తక్కువ వడ్డీ రేట్లు, మిక్కిలి ద్రవ్య లభ్యతతో లాభపడిన మార్కెట్లు.. పరిస్థితులకు తగ్గట్టు మార్పునకూ గురి కావాల్సిందే. వడ్డీ రేట్లు పెరగడం స్టాక్స్‌కు ప్రతికూలమే. ద్రవ్యోల్బణాన్ని బఫెట్ టేప్వార్మ్తో పోల్చారు. టేప్‌వార్మ్‌లు పేగుల లోపలి గోడల్లో ఉండి మనం తీసుకునే ఆహారంలోని శక్తిని గ్రహిస్తుంటాయి. అలాగే, ద్రవ్యోల్బణం కంపెనీల నిధుల శక్తిని హరిస్తుంటుంది. రుణాలను భారంగా మారుస్తుంది. అధిక ద్రవ్యోల్బణం తర్వాత కనిపించేది అధిక వడ్డీ రేట్లే. అందుకుని మార్కెట్లు ఖరీదుగా మారినప్పుడు, వడ్డీ రేట్లు పెరిగే తరుణంలో మిగులు నిధులను బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తానని బఫెట్ తన 1986 లేఖలో పేర్కొన్నారు. వడ్డీ రేట్లు పెరిగితే టేప్‌వార్మ్ మాదిరిగా ఏ స్టాక్స్ విలువలు హరించుకుపోతాయన్న విశ్లేషణ చేయాలి. కమోడిటీలు ఇన్‌పుట్‌గా (ముడి సరుకులుగా) వ్యాపారం చేసేవి, అధిక రుణభారంతో నడిచే కంపెనీలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం తర్వాత ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలి. అప్పటి వరకు రుణాల అండతో ఇన్ఫ్రా, పవర్ కంపెనీలు దూకుడు ప్రదర్శించగా.. ఆ తర్వాత కుదేలయ్యాయి. రుణాలు తీర్చలేక ఎన్నో కనుమరుగయ్యాయి. పెన్నీ షేర్లుగా మారిపోయినవీ ఉన్నాయి. వడ్డీ రేట్ల సైకిల్ మారే దశలో ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలి. అలాగే, నష్టాలతో వచ్చే న్యూఏజ్ కంపెనీలపైనా ఈ పరిణామాలు ప్రభావం చూపిస్తాయి. భద్రత పాళ్లు ఎంత? 1991, 1993 వార్షిక లేఖల్లో బఫెట్ ‘మార్జిన్ ఆఫ్ సేఫ్టీ’ (భద్రత) గురించి ప్రస్తావించారు. పెట్టుబడి విజయంలో దీని పాత్ర ఎంతో ఉంటుందన్నది ఆయన అనుభవ సారం. స్టాక్స్ విలువను మదింపు వేసే విషయంలో ఊహించిన, ఊహించని రిస్క్‌లను పరిగణనలోకి తీసుకోకపోవడం కూడా నష్టాలకు దారితీస్తుంది. వచ్చే పదేళ్ల పాటు మార్కెట్లలో సానుకూల పరిస్థితులు ఉంటాయని వినడా నికి బాగానే ఉంటుంది. కానీ వాస్తవంలో ఇది సాధ్యమేనా? ద్రవ్యోల్బణం, భౌగోళిక ఉద్రిక్తతలు, కంపెనీలకు సంబంధించి రిస్క్‌లు వీటన్నింటిని పరిగణనలోకి తీసుకోవాలి. లాభాల్లేకుండా ఏటా మార్కెట్ వాటా పెంపు కోసం నష్టాలను అధికం చేసుకుంటూ వెళ్లే కంపెనీలకు సంబంధించి భవిష్యత్తు అంచనాలు ఎంతో ఆకర్షణీయంగానే ఉంటాయి. కానీ, ఆర్జించే ఆదాయానికి 3,000 రెట్లు ధర పలుకుతున్న ఆయా కంపెనీల్లో మీరు పెట్టే పెట్టుబడికి భద్రత పాళ్లు ఎంత? ఎన్నో రేట్ల అధిక స్పందన అందుకున్న ఇటీవలి జొమాటో, పేటీఎం, నైకా, పీబీ ఫిన్‌టెక్, కార్‌ట్రేడ్ షేర్లు.. లిస్ట్ అయిన తర్వాత గరిష్టాల నుంచి చూస్తే 40–70 శాతం స్థాయిలో పడిపోయాయి. కానీ, ద్రవ్యోల్బణం ప్రభావం వీటిపై ఇంకా ప్రతిఫలించాల్సి ఉందన్నది విశ్లేషకుల అభిప్రాయం. జొమాటో రూ.76 ధరకు ఐపీవో తీసుకురాగా, ఆ తర్వాత రూ.179 వరకు వెళ్లింది. ఇప్పడు రూ.79 వద్ద ట్రేడవుతోంది. విలువను సరిగ్గా అంచనా కట్టకుండా రూ.150–179 మధ్య పెట్టుబడులు పెట్టిన వారి స్థితి ఏంటి? వారు మార్జిన్ ఆఫ్ సేఫ్టీని పట్టించుకోలేదన్నది స్పష్టం. స్పెక్యులేషన్‌కు దూరం దీర్ఘకాలంలో సంపదను సృష్టించుకోవాలంటే స్పెక్యులేటర్గా ఉండకూడదని బఫెట్ చెబుతారు. పెట్టుబడులు, స్పెక్యులేషన్ వేర్వేరు. ఈ రెండింటి మధ్య విభజన గీత స్పష్టంగా ఉంచుకోవాల్సిందే. ఫలానా షేరు ఎప్పుడూ అధిక వ్యాల్యూషన్లలో, ర్యాలీ చేస్తుండడమే మీ పెట్టుబడి వెనుక కారణం అయి ఉంటే, షేరు ధర కంపెనీ మూలాలను ప్రతిఫలించడం లేదంటే అది స్పెక్యులేషన్ అవుతుంది. అయినా కానీ, లాభాలు రావచ్చు. మన దేశంలో కొన్ని పాపులర్ స్టాక్స్ కొన్నేళ్ల పాటు అసాధారణ వ్యాల్యూషన్లతోనే ట్రేడవుతుంటాయి. కానీ, ఒక్కసారిగా ఆయా కంపెనీల్లో నిర్మాణాత్మక మార్పులు చోటు చేసుకుంటే ఈ వ్యాల్యూషన్లు శాశ్వతంగా దెబ్బతింటాయి. ఉదాహరణకు పెయింట్స్ స్టాక్స్ ఎప్పుడూ అధిక వ్యాల్యూషన్లలోనే, అంతర్గత విలువకుపైనే ట్రేడవుతుంటాయి. కానీ, చమురు ధరలు భారీగా పెరిగిపోవడంతో ఇప్పుడు వాటి ధరలు దిగొస్తున్నాయి. చమురు ధరలు దీర్ఘకాలం పాటు గరిష్ట స్థాయిల్లోనే కొనసాగితే పెయింట్స్ స్టాక్స్ మరింత తగ్గే అవకాశం ఉంటుంది. అదే సమయంలో వృద్ధి అవకాశాలూ సన్నగిల్లుతాయి. ఎందుకంటే ఆయా కంపెనీలు ధరలను పెంచితే విక్రయాలపై ప్రభావం పడుతుంది. అం దుకని పెట్టుబడికి స్పెక్యులేషన్ ధోరణి పనికిరాదు. అంతర్గత విలువ కంపెనీకి ఫలానా ధర పెట్టొచ్చా అన్నది ఎలా తెలుస్తుంది? దీనికి అంతర్గత విలువను (ఇంట్రిన్సిక్ వ్యాల్యూ) చూడడం బఫెట్ అనుసరించే సూత్రాల్లో మరొకటి. బెర్క్‌షైర్ వాటాదారులకు బఫెట్ తరచుగా దీన్ని సూచిస్తుంటారు కూడా. కంపెనీ వ్యాపారం నుంచి తీసుకోతగిన ‘డిస్కౌంటెడ్ క్యాష్ వ్యాల్యూ’ను అంతర్గత విలువగా బఫెట్ చెబుతారు. కానీ పెట్టుబడుల నిపుణులకు సైతం ఇది కొరుకుపడని అంశం. ఇందుకు సంబంధించి ఎవరికి వారు తమదైన లెక్కింపు విధానాలను అనుసరిస్తుంటారు. కంపెనీకి సంబంధించి నికర పుస్తక విలువను అంచనా వేసి, దానికి సమీప భవిష్యత్తులో వచ్చే క్యాష్ ఫ్లో, ప్రస్తుత లాభాలను కలిపితే అంతర్గత విలువ వస్తుంది. ఇవన్నీ కష్టంగా అనిపించిన వారు.. కంపెనీ లాభాలు ఆ కంపెనీ గత చరిత్ర సగటు స్థాయిలోనే ఉన్నాయా? అని చూడాలి. తర్వాత స్టాక్ ధర చారిత్రకంగా (గతంతో పోలిస్తే) సగటు వ్యాల్యూషన్ల స్థాయిలోనే ఉందా, అంతకంటే ఎక్కువ ఉందా? గమనించాలి. ఒకవేళ స్టాక్ ధర చారిత్రక సగటు వ్యాల్యూషన్లకు ఎగువన ట్రేడ్ అవుతుంటే అంతర్గత విలువకు మించి ట్రేడవుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. భారత్‌లో గడిచిన దశాబ్ద కాలంలో కంపెనీల లాభాల వృద్ధి కంటే వాటి స్టాక్స్ వ్యాల్యూషన్ల పెరుగుదల ఎక్కువగా ఉంది. దీంతో అవి అంతర్గత విలువను దాటిపోయి ట్రేడవుతున్నాయి. 2011 నుంచి 2021 వరకు నిఫ్టీ–50 ఇండెక్స్ 275 శాతం రాబడులను ఇచ్చింది. కానీ ఈ మొత్తంలో 170 శాతం రాబడులు పీఈ రేషియో పెరగడం రూపంలోనే వచ్చాయి. కానీ, ఫండమెంటల్స్ మెరుగుపడడం వల్ల కాదు. అదంతా బబుల్గానే భావించాల్సి ఉంటుంది. పెరుగుదల వెనుక వాస్తవ బలం 100 శాతంగానే భావించాలి. ఇలాంటప్పుడు అంతర్గత విలువకు లభించే స్టాక్స్ తక్కువగానే ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. సరైన ధర సరైన ధర వచ్చే వరకు వేచి చూడాలి.. ఇన్వెస్టర్లకు 1993 లేఖలో బఫెట్ ఇచ్చిన సూచన ఇది. పెట్టుబడులకు సంబంధించి ఎలా నడుచుకోవాలో తెలియని ఇన్వెస్టర్లను మార్కెట్ క్షమించదని ఆయన చెబుతారు. అత్యుత్తమమైన కంపెనీ అయినా సరే షేరు ధర సహేతుక స్థాయి వద్ద ఉన్నప్పుడే ఇన్వెస్ట్ చేయాలన్నది బఫెట్ అనుసరించే సూత్రం. ఒక కంపెనీకి సంబంధించి ఆయన అనుసరించే అంశాలను గమనిస్తే.. ఎంపిక చేసుకునే కంపెనీ చేస్తున్న వ్యాపారం అర్థం చేసుకోవడానికి వీలుగా ఉండాలి. దీర్ఘకాలం పాటు అనుకూలతలు ఆ కంపెనీకి ఉండాలి. సమర్థులైన, నిజాయతీపరులైన వ్యక్తులు నడిపిస్తుండాలి. ఆకర్షణీయమైన ధర వద్ద ఉండాలి. వీటిల్లో మొదటి మూడు అంశాలకు రైట్ మార్కులు పడే కంపెనీలను ఆయన ఎన్నో సందర్భాల్లో గుర్తిస్తూనే ఉంటారు. కానీ, నాలుగో అంశమైన ఆకర్షణీయమైన ధర వద్ద లేకపోవడంతో బఫెట్ పెట్టుబడులకు దూరంగా ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మార్కెట్లో ప్రతి పతనం పెట్టుబడికి అవకాశం కావాలనేమీ లేదు. కొన్ని సందర్భాల్లో కంపెనీలో మార్పులు చోటు చేసుకోవచ్చు. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కారణం కావచ్చు. పెట్టుబడులకు ముందు భిన్నమైన అంశాలను విశ్లేషించుకోవాలని, వేగంగా స్పందించకుండా ఓపిక పట్టాలన్నది బఫెట్ ఫిలాసఫీ. పెట్టే ధర విషయంలో రిస్క్ తీసుకోవడం బఫెట్‌కు నచ్చదు. అవకాశం వచ్చే వరకు ఓపిక పట్టడమే ఆయన అనుసరించే విధానం. చక్కని అవకాశాలన్నవి మళ్లీ మళ్లీ వస్తుంటాయని ఆయన నమ్ముతారు. అందుకనే అందరూ ఎగబడి కొంటున్న వేళ అప్రమత్తంగా వ్యవహరించాలని.. అందరూ విక్రయిస్తున్న వేళ కొనుగోళ్లకు మొగ్గు చూపాలన్నది బఫెట్‌కు ఫలితాలిచ్చిన సూత్రాల్లో ఒకటి. ఎగసిపడే కెరటాన్ని పట్టుకోకుండా.. అది నేలను తాకే వరకు ఆగాలంటారు. 100–150–200 పీఈ వ్యాల్యూషన్ల వద్ద ట్రేడవుతున్న స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టే ముందు అయినా బఫెట్ సూత్రాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. -
స్కూల్లో ఐదుగురు టీచర్లు.. పాఠాలు బోధించిన ఉత్తమ సర్పంచ్..
సాక్షి, నెన్నెల (ఆదిలాబాద్): ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ, గ్రామాభివృద్ధికి పాటు పడటమే కాదు.. విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ, వారికి దగ్గరుండి భోజనం వడ్డిస్తూ శభాష్ అనిపించుకోంటోంది గొళ్లపల్లి సర్పంచ్ ఇందూరి శశికళ. సాధారణంగా సర్పంచ్‌లు గ్రామ సమస్యల పరిష్కారానికి పని చేస్తూ ఉంటారు. అందుకు భిన్నంగా టీచరమ్మగా మారి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతూ, వారి అభ్యున్నతికి చొరవ చూపుతోంది. ఆమె పని తీరును మెచ్చుకొని జిల్లా కలెక్టర్ భారతిహోళ్లీకేరి 2020లో మహిళా దినోత్సవం సందర్భంగా ఉత్తమ మహిళా సర్పంచ్‌గా పురస్కారం ప్రదానం చేసి ప్రత్యేకంగా అభినందించారు. వివరాల్లోకి వెళ్తే.. నెన్నెల మండలం గొల్లపల్లి సర్పంచ్ ఇందూరి శశికళ ఎంఎస్సీ బీఈడీ పూర్తి చేసింది. గొల్లపల్లి ప్రాథమిక పాఠశాలలో 1–5 తరగతుల విద్యార్థులు 86మంది ఉన్నారు. మొత్తం ఐదుగురు టీచర్లు ఉండగా, ఇద్దరు ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై మరో చోటికి పంపించారు. మంగళవారం ముగ్గురు ఉపాధ్యాయులలో ఇద్దరు లీవ్‌లో ఉండగా, ఆ సర్పంచ్ పాఠశాలకు వెళ్లి పిల్లలకు ఆంగ్లమాధ్యమంలో బోధిస్తూ, దగ్గరుండి భోజనం వడ్డించారు. అటు రాజకీయంగా ఊరికి సేవలు చేస్తూ, ఇటు పిల్లలకు విద్యాదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయులు లేక బోధన సాగకపోవడంతో విద్యాబోధన చేస్తున్నానని సర్పంచ్ పేర్కొంది. -
నెలకు కోటి రూపాయల జీతం వదిలేసి మరీ..
Korea Man Quits Crores Salary Job And Became Youtuber Because Of Mother: కంపెనీలో చేరిన ఏడాదికే ఇంక్రిమెంట్. అది అలాంటి ఇలాంటిది కాదు. నెలకు కోటికి పైగా(మన కరెన్సీలో) జీతం. ప్రొఫెషనల్ కెరీర్‌ను పీక్స్‌కు చేర్చే టైం అది. కానీ, ఆ సమయంలో ఉద్యోగం వదిలేయాలనే ఆలోచన ఎవరికైనా వస్తుందా?.. దక్షిణ కొరియాకు చెందిన బెన్ చోన్(28) ఆ నిర్ణయం తీసేసుకున్నాడు మరి!. అయితేనేం తనకు తెలిసిన విద్యతో లక్షలు(మన కరెన్సీలోనే) సంపాదిస్తూ.. సొంతంగా బాస్‌గా ఉండడంలో కిక్కును వెతుక్కుంటున్నాడు. జేపీ మోర్గాన్.. అమెరికన్ బ్యాంకింగ్ దిగ్గజం. ప్రపంచవ్యాప్తంగా పేరుంది. అలాంటి కంపెనీలో 2017లో చేరాడు బెన్ చోన్. పుట్టి, పెరిగింది దక్షిణ కొరియాలోనే అయినా. స్కాలర్షిప్ మీద అమెరికాలో మంచి యూనివర్సిటీలో చదివి.. జాబ్ తెచ్చుకున్నాడు. ఏడాది తిరగకుండానే అతని టాలెంట్‌కి భారీ ప్యాకేజీ ఆఫర్ చేసింది జేపీ మోర్గాన్. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనలిస్ట్‌గా ప్రమోషన్‌తో పాటు నెలకు లక్షా యాభై వేల డాలర్ల జీతం(అదనంగా బోనస్) ఇవ్వాలని నిర్ణయించుకుంది. అయితే రెండు నెలల జీతం అందుకున్నాడో లేదో.. పిడుగులాంటి వార్త అతని చెవిన పడింది. తల్లి ప్రమాదకరమైన వ్యాధి బారినపడిందన్న విషయం అతన్ని స్థిమితంగా ఉంచలేదు. ఆ సమయంలో అతనికి తల్లే ప్రపంచంగా కనిపించింది. ఆమె పక్కనే ఉండి.. ఎలాగైనా రక్షించుకోవాలనుకున్నాడు. క్షణం ఆలస్యం చేయకుండా ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి.. సొంతూరికి బయలుదేరాడు. అక్కడ ఓ చిన్న బట్టల దుకాణంలో కొంతకాలం పని చేశాడు. బట్టల షాపులో.. దాచుకున్న సొమ్మంతా కేవలం మూడు నెలల్లోనే తల్లి ట్రీట్మెంట్కి ఖర్చైంది. బ్యాంకింగ్ సలహాలిచ్చే బెన్ చోన్.. సొంతూరులోనే ఓ బట్టల షాపులో పని చేశాడు. ఆపై ఇంట్లో బట్టల దుకాణం తెరిచాడు. కొన్నాళ్లు పోయాక తల్లి మందులకు ఖర్చులు పెరిగాయి. ఆ టైంలోనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆదాయం సంపాదించొచ్చనే విషయం అతనికి గుర్తొచ్చింది. యూట్యూబ్‌లో రోజూ రకరకాల వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. వాటిలో చాలావరకు వీడియోలను చూసి తిట్టుకుంటాం.. నవ్వుకుంటాం. కొన్నింటిని చూడకుండానే స్కిప్ చేస్తుంటాం. కానీ, వాటి వ్యూస్ ద్వారా యూట్యూబర్లకు ఆదాయం వస్తుంది. అంటే.. ఏదో ఒకరకంగా తమ శ్రమను పెట్టుబడిగా పెట్టి సంపాదిస్తున్నారు వాళ్లు. అలా బెన్ చోన్ మాత్రం తనకు తెలిసిన విద్యతోనే యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టాడు. తెలిసిన విద్యతోనే.. 2019లో రేర్లిక్విడ్ rareliquid పేరుతో యూట్యూబ్ఛానెల్ మొదలుపెట్టాడు బెన్. ఇన్వెస్ట్మెంట్, కెరీర్ గైడెన్స్ వీడియోలతో నెమ్మదిగా ఫేమ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న క్రిప్టోకరెన్సీ గురించి, బ్లాక్ చెయిన్ మార్కెట్ తీరు తెన్నులు, టిప్స్‌తో పాటు టెక్, మార్కెటింగ్ సలహాలు అందిస్తాడు. ‘‘ జేపీ మోర్గాన్‌లో చేరిన తొలినాళ్లలో వారానికి 70 నుంచి 110 గంటల పని. ఒక్కోసారి ఏకధాటిగా 28 గంటలు పని చేయాల్సి వచ్చేది. ఇప్పుడు నాకు నేనే బాస్. నాకు తెలిసిన విద్య. కోట్ల జీతం పోతేనేం.. నాకు ఉన్న వనరులతో, తక్కువ శ్రమతో సంతోషం, మనశ్శాంతిని సంపాదించుకుంటున్నా. నాలాగే ప్రతీ ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. మనసు పెడితే డిజిటల్ ప్రపంచంతో సంపాదించుకోవచ్చు.. ఒక అడుగు ముందుకేసి అద్భుతాలూ చేయొచ్చు. సిగ్గు-మొహమాటం పడాల్సిన అవసరం అస్సలు లేదు. నా వరకు నేను బాగానే సంపాదిస్తున్నా. అన్నింటికి మించి మా అమ్మ పక్కనే ఉంటున్నా. ఇది చాలాదా నాకు’’ అంటున్నాడు బెన్ చోన్. ప్రస్తుతం rareliquid ఛానెల్లో టెక్, మార్కెట్, క్రిప్టోకరెన్సీ తీరు తెన్నులపైనా అతని సలహాలు, డెమో వీడియోలు ఉంటాయి. రెజ్యూమ్(సీవీ) సలహాలు, రకరకాల కోర్సుల గురించి వివరిస్తాడు. ఇదంతా చిన్న చిన్న వ్యాపారాల కలయికగా చెప్తాడు బెన్ చోన్. క్రియేటివ్ వేలో మరికొందరికి పాఠాలు, సలహాలు ఇవ్వడం సంతోషాన్ని ఇస్తుందని అంటున్నాడు ఈ యూట్యూబర్. యూట్యూబ్ వ్యూస్ ప్రకారం.. జులైలో బెన్ జీతం 19, 161 డాలర్లుకాగా, నవంబర్‌లో 26,000 డాలర్లు సంపాదించాడు. మన కరెన్సీలో ఇది 17 లక్షల రూపాయలు. -సాక్షి, వెబ్‌స్పెషల్ -
పాఠ్యాంశాలపై తప్పుడు ప్రచారం: పోలీసులకు ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: ప్రభుత్వాన్ని అప్రతిష్ణపాలు చేసేలా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలపై విద్యా శాఖ తరపున స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విద్యా శాఖ ఫిర్యాదుపై ఇబ్రహింపట్నం పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంస్కృతి, సంప్రదాయాల పరిచయం కోసం అన్ని మతాల పండగలకి సమాన ప్రాధాన్యనిస్తూ తెలుగు వాచకంలో రెండవ తరగతి నుంచి ఏడో తరగతి వరకు పాఠ్యపుస్తకాల రూపకల్పన చేశామన్నారు. చదవండి: దుర్గమ్మ పాఠ్యాంశాలను తొలగించలేదు పాఠ్యపుస్తకాలలో హిందూ పండుగలు - 7, ముస్లిమ్ పండుగలు - 2 , క్రిస్టియన్ పండుగలు - 2, సవరల పండుగ- ఒకటి చొప్పున పాఠ్యాంశాలు ఉన్నాయని తెలిపారు. మొత్తం 12 పండగలు గురించి పాఠ్యాంశాల్లో పొందుపరిచి అన్ని మతాలకి సమ ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు. ఇందులో నుంచి ఒక్క పండగ మాత్రమే ఎంపిక చేసి హిందూ మతానికి అన్యాయం జరుగుతున్నట్లుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. అందుకోసమే ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. చదవండి: శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేయకపోతే కృష్ణా జలాలు వృథా -
ఆస్పత్రికి డబ్బుల్లేక చందాలు.. క్రికెటర్ క్రిస్ కెయిన్స్ జీవితం నేర్పే పాఠాలివే!
ఇప్పుడు న్యూజిల్యాండ్ అంటే కెయిన్ విలియమ్సన్ గుర్తొస్తాడు. ముఖ్యంగా మన తెలుగు వాళ్లయితే ముద్దుగా కెన్ మామ అని పిలుస్తారు. కానీ కెయిన్ కంటే ముందే ఇండియన్ల మనసు దోచుకున్న క్రికెటర్ మరొకరు ఉన్నారు అతనే క్రిస్ కెయిన్. ఇండియాతో జరిగిన మ్యాచుల్ల్లో బ్యాటు, బాల్‌తో అద్భుత ప్రదర్శన చేసిన కెయిన్స్ మనకు ఓటమి రుచి చూపించాడు, కానీ నిజ జీవితంలో ఆర్థిక పాఠాలు నేర్చుకోలే తానే ఓటమి అంచున ఉన్నాడు. సాక్షి, వెబ్‌డెస్క్: ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవ్వడం సహజమే. కానీ, దానికి కారణమయ్యే పరిస్థితులు మాత్రం మన చేతుల్లోనే ఉంటాయన్నది గుర్తుంచుకోవాల్సిన విషయం. సాధారణంగా డౌన్ టు హై సక్సెస్ స్టోరీలు మనిషికి ఒక ఊపుని ఇస్తే... హై టు డౌన్ స్టోరీలు గుణపాఠాలు నేర్పుతుంటాయి. క్రికెట్లో మంచి ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న క్రిస్ కెయిన్స్ కథ.. రెండో కేటగిరీకి చెందిందే. రిటైర్ అయ్యాక విలాసాలకు బానిసై.. చివరికి రోడ్డున బస్సులు కడిగే స్థాయికి చేరుకుని వార్తల్లో నిలిచింది ఈ మాజీ ఆల్‌రౌండర్ జీవితం. న్యూజిల్యాండ్ స్టార్ హాలీవుడ్ హీరో లాంటి రూపం, రింగుల జుత్తు.. మీడియం పేస్‌తో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్నాడు న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ క్రిస్ కెయిన్స్. గాయాలు ఆయన కెరీర్‌ను కిందకి లాగేశాయి. దీంతో ఆడే వయసులో ఉండగానే 2006లో రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పటికే ఇటు టెస్టులు, వన్డేల్లో న్యూజిల్యాండ్ స్టార్ ఆటగాడు కెయిన్స్. ఆల్‌రౌండర్ ఇయాన్ బోథమ్ తర్వాత ఆ స్థాయిని అందుకున్న రెండో కివీస్ క్రికెటర్ తను ఎదిగాడు. పైసల్లేక ఎలాంటి ఆర్థిక ప్రణాళిక లేకుండా గడిపేయడం క్రిస్ కెయిన్స్ జీవితాన్ని నిండా ముంచేసింది. ఒకప్పుడు నలుగురి మధ్య హుందాగా బతికిన కెయిన్స్ చివరకు బస్సులు కడిగే క్లీనర్ స్థాయికి చేరుకున్నాడు. గంటకు 17 డాలర్లు సంపాదించే జీవితంలో కొన్నాళ్లు గడిపాడు. క్రికెటర్‌గా రిటైర్మెంట్ ప్రకటించి డైమండ్ ట్రేడర్‌గా కొత్త మలుపు తీసుకున్న క్రిస్ కెయిన్స్ కెరీర్ దశాబ్దం తిరగకుండానే బస్సు డ్రైవర్ స్థాయికి చేరుకోవడం అప్పట్లో చర్చనీయాంశంగానే మారింది. ఈ క్రమంలో గుండెపోటుతో ఆస్పత్రిలో చేరి... ట్రీట్మెంట్ కోసం దాతల వైపు చూడాల్సిన దీనస్థితికి చేరుకున్నాడు. ఒకప్పుడు మూడున్నర క్యారెట్ల వజ్రాల రింగుతో తనకు ప్రపోజ్ చేసిన భర్త, ఆస్పత్రి ఖర్చులకు పైసా లేక ఇబ్బంది పడుతున్న తీరుని చూసి కెయిన్స్ భార్య మెలనీ కన్నీటి పర్యంతం అవుతోంది. అదుపులేని ఖర్చులతో కెయిన్స్ వజ్రాల వ్యాపారిగా న్యూజిలాండ్‌లో ఓక్టగాన్ కంపెనీని సక్సెస్‌ఫుల్‌గానే నడిపించాడు. కానీ, డబ్బుని పొదుపు చేయడంలో ఘోరంగా విఫలం అయ్యాడు. వస్తున్న రాబడి చేస్తున్న ఖర్చులకు పొంతన లేని జీవితానికి అలవాటు పడ్డాడు. ముఖ్యంగా ఆకర్షణ మోజులో పడి అవసరం లేనివి కొనడం అతనికి వ్యసనంగా మారింది. చివరకు అదే కెయిన్స్ జీవితాన్ని నిండా ముంచింది. విలాసాలకు అలవాటుపడి అడ్డగోలుగా ఖర్చు పెట్టాడు. చివరకు రాబడి తక్కువ అప్పులు ఎక్కువ అయ్యే పరిస్థితి ఎదురైనా అతని తీరులో మార్పు రాలేదు. చివరకు భారీ నష్టాలతో డైమండ్ కంపెనీ మూసేయాల్సి వచ్చింది. ఇదంతా ఐదేళ్ల వ్యవధిలోనే జరిగిపోయింది. ఒక క్రీడాకారుడిగా గెలుపోటముల గురించి కెయిన్స్‌కి కొత్తగా చెప్పక్కర్లేదు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటే గెలుపును తన వశం చేసుకునేవాడు. కానీ అవసరాలు మించి ఖర్చు చేసే నైజం అతడిలోని స్పోర్ట్స్‌మన్ స్పిరిట్‌ని కూడా నాశనం చేసింది. అందువల్లే చిన్నాచితకా పనులు చేస్తూ సంపాదించిన డబ్బును నిర్లక్ష్యంగానే ఖర్చు చేశాడు. ఫలితంగా కనీసం ఇన్సురెన్స్ కూడా చేయించుకోలేదు. చివరకు ప్రాణాపాయ స్థితిలో మరొకరిపై ఆధారపడాల్సిన దుస్థితిలోకి తనంతట తానుగా వెళ్లి పోయాడు. అవనసర ఖర్చులు వద్దు అనవసర ఖర్చులకు తగ్గించుకోవడం ఎంతో అవసరం. ఆకర్షణల మోజులో పడి అనవసరమైన వస్తువులపై మన డబ్బులు వెచ్చించడం వల్ల తాత్కాలిక ప్రయోజానాలు తీరుతాయే తప్ప పెద్దగా ఉపయోగం ఉండదు. అందువల్లే మన ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత, ఏ అంశాలపై ఎంత ఖర్చు చేస్తున్నామనే దానికి సంబంధించి స్పష్టమైన ప్రణాళిక వేసుకోవాలి. అనవసర ఖర్చులను సాధ్యమైనంతగా తగ్గించాలి. ఇది లోపించడం వల్ల క్రిస్ కెయిన్స్ దుర్భర పరిస్థితిల్లోకి జారుకున్నాడు. ఎంత సంపాదిస్తున్నామనేది ముఖ్యం కాదు ప్రముఖ ఆర్థిక నిపుణుడు రాబర్ట్ కియోసాకి అభిప్రాయం ప్రకారం మనం ఎంత సంపాదిస్తున్నామనేది ముఖ్యం కాదు. మనం ఎంత మిగుల్చుతున్నాం, సమయానికి అది మనకు ఎలా ఉపయోపడుతుంది, ఎన్ని తరాలకు సరిపడ డబ్బు మనదగ్గర ఉందని అనేదే ముఖ్యం. డబ్బును ఎక్కువ కాలం పొదుపు చేయడం, జాగ్రత్త దాచడం అనేది డబ్బు సంపాదించడం కంటే ఎంతో కష్టమైన పని అని కియోసాకి అంటారు. కెయిన్స్ విషయంలో ఈ పొరపాటు నూటికి నూరుపాళ్లు జరిగింది. డబ్బు సంపాదిస్తున్నానే భ్రమలో పడి పొదుపు, చేయడం భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా దాచుకోవడంపై నిర్లక్షం చేశాడు. అందువల్లే పదేళ్లలోనే ఆకాశం నుంచి అథఃపాతాళానికి చేరుకున్నాడు. ఖర్చులు కాదు పెట్టుబడి కావాలి డబ్బును పెట్టుబడిగా మార్చితే డబ్బుని డబ్బే సంపాదిస్తుంది. అందుకు కావాల్సింది ఓపిక, సహానం. వెనువెంటనే లాభాలు వచ్చి పడాలి అన్నట్టుగా ఖర్చు పెట్టడం కాకుండా క్రమ పద్దతిలో పొదుపు చేసిన లేదా అందుబాటులో ఉన్న డబ్బును పెట్టుబడిగా మార్చితే లాంగ్ రన్లో ఆర్థికంగా దన్నుగా నిలుస్తుంది. వారెన్ బఫెట్ మొదలు ఎందరో కుబేరులు ఈ సూత్రం ఆధారంగానే కోటీశ్వరులు అయ్యారు. ఉదాహరణకు 12 శాతం రిటర్నలు వస్తాయనే నమ్మకంతో ప్రతీనెల రూ.5000 వంతున మార్కెట్లో పెట్టుబడిగా పెడితే 20 ఏళ్లు తిరిగే సరికి 12 లక్షల పెట్టుబడి మీద 37 లక్షల రిటర్న్ దక్కుతుంది. మొత్తంగా ఇరవై ఏళ్లు పూర్తయ్యే సరికి 50 లక్షల రూపాయలు మనకు అండగా ఉంటాయి. అయితే కెయిన్స్ పెట్టుబడులు పెట్టకుండా ఖర్చులు పెట్టుకుంటూ పోయాడు. దీంతో రివర్స్ పద్దతిలో పదేళ్లు పూర్తవకముందే చేతిలో చిల్లిగవ్వ లేని స్థితికి చేరుకున్నాడు. ఆలోచన ధోరణి మారాలి డబ్బు సంపాదించాలంటే ఏళ్లు పట్టవచ్చు, కానీ దాన్ని కోల్పోవడానికి క్షణాలు చాలు. కాబట్టి డబ్బు కంటే ముఖ్యమైంది మన ఆలోచనా ధోరణి. పేదరికం, డబ్బు పట్ల మనకున్న దృక్పథం. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మార్చలేము అనుకుంటూ అలానే ఉండిపోతాం. అలా కాకుండా ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకోవాలంటే అన్ని విషయాలు మనకే తెలియక్కర్లేదు. ఆర్థిక నిపుణులను కలిస్తే మన ఆదాయానికి తగ్గట్టుగా పెట్టుబడి ఎలా పెట్టాలో చెబుతారు. వాటిని పాటించినా చాలా వరకు ఆర్థిక ఇబ్బందులు తప్పించుకోవచ్చు. క్రీడాకారుడిగా అంతర్జాతీయ గుర్తింపు ఉన్న కెయిన్స్ అడిగితే ఆర్థిక సలహాలు ఇచ్చే వారు కోకొల్లలు. కానీ తన చుట్టూ ఉన్న పరిస్థితులు మార్చాలని అతను బలంగా కోరుకోలేదు. అందుకే స్టార్ క్రికెటర్ నుంచి క్లీనర్‌గా, ట్రక్ డ్రైవర్‌గా దిగజారిపోతూనే వచ్చాడు. -
ప్రపంచానికి పాఠాలు చెబుతోంది
చీచదువుకుంటూ ట్యూషన్ చెప్పేవాళ్లు కొత్త కాదు. ఆన్లైన్ ట్యూషన్లు చెప్పడం కూడా కొత్త కాదు. కాని తిరుచ్చికి చెందిన బి.టెక్ విద్యార్థిని భారతీయులకు కాకుండా ప్రపంచ విద్యార్థులకు పాఠాలు చెబుతోంది. లండన్, న్యూజిలాండ్, సింగపూర్, అమెరికా జాతీయులు ఆమె పాఠాలకు డాలర్లు పే చేస్తున్నారు. లాక్డౌన్లో తన చదువు తాను చదువుకుంటూనే మంచి సంపాదనలో ఉన్న కె.విశ్వతిక మీరూ ఇలా చేయొచ్చని చెబుతోంది. తిరుచ్చిరాపల్లిలోని తన ఇంటిలోని గదిలో సాయంత్రం ఆరు తర్వాత విశ్వతిక ల్యాప్‌టాప్ తెరుస్తుంది. ఆ వెంటనే ఆమె ఆన్లైన్ ట్యూషన్లు మొదలవుతాయి. విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతూ ఆమె వారికి పాఠాలు చెబుతుంది. డౌట్లు క్లియర్ చేస్తుంది. వారు భారతీయులు కాదు. వారి ఇంగ్లిష్ ఉచ్చారణ వేరు. అయినప్పటికీ తనకొచ్చిన ఇంగ్లిష్‌తోనే వారిని ఆకట్టుకుంటూ ‘మాకూ పాఠాలు చెప్పు’ అనేంత డిమాండ్ తెచ్చుకుంది విశ్వతిక. మేనకోడలితో మొదలు విశ్వతిక బెంగళూరులోని సి.ఎం.ఆర్ యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజినీరింగ్ చదువుతోంది. కరోనా లాక్డౌన్ వల్ల గత సంవత్సరం నుంచి తన స్వస్థలం అయిన తిరుచ్చి (తమిళనాడు)లోనే ఉంటూ చదువుకుంటోంది. అయితే ఆమె మేనకోడలు కాలిఫోర్నియాలో స్కూలు విద్యార్థిని. ‘నాకు ఆన్లైన్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ పాఠాలు చెప్పవా’ అని అడిగితే సరేనని సరదాగా మొదలెట్టింది. కాని ఆ మేనకోడలు ఎంత ఇంప్రెస్ అయ్యిందంటే తన మేనత్తను విపరీతం గా మెచ్చుకోసాగింది ఆమె టీచింగ్ పద్ధతికి. ‘నాకు చిన్నప్పటి నుంచి టీచింగ్ ఇష్టం. నేను బాగానే పాఠాలు చెబుతున్నానని నా మేనకోడలి వల్ల అర్థమైంది’ అని విశ్వతిక అంది. ఆ ఆత్మవిశ్వాసంతో ఆమె ఒక ఆన్లైన్ పోర్టల్‌లో ట్యూషన్ టీచర్‌గా తన పేరు నమోదు చేసుకుంది. ఆక్కడి నుంచి ఆమె జీవిత పాఠమే మారిపోయింది. బ్రిటిష్ విద్యార్థి ప్రచారం ఆన్లైన్ పోర్టల్ ద్వారా విశ్వతికకు నాలుగో తరగతి చదువుతున్న ఆలియా అనే పదేళ్ల బ్రిటిష్ విద్యార్థిని మొదటిసారిగా ట్యూషన్‌కు వచ్చింది. పైథాన్ అనే కోడింగ్ ప్రోగ్రామ్ గురించి పాఠాలు నేర్చుకుంది. ఆలియాకు విశ్వతిక పద్ధతి నచ్చి లండన్‌లో ఉన్న తన ఫ్రెండ్స్ చాలామందికి విశ్వతిక గురించి చెప్పింది. ‘అందరూ కోడింగ్ ప్రోగ్రామ్స్‌తో పాటు కెమిస్ట్రీ, ఫిజిక్స్, మేథమేటిక్స్‌లో ట్యూషన్లకు చేరడం మొదలెట్టారు’ అంది విశ్వతిక. నెమ్మదిగా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి విశ్వతిక పేరు ప్రచారం కాసాగింది. ప్రస్తుతం ఆమెకు విదేశాలలో 20 మంది స్టూడెంట్స్ ఉన్నారు. మరికొందరు లైన్లో ఉన్నారు. ఆమె పాఠాలకు డాలర్లకు పే చేస్తున్నారు. ‘నేను సందేహాలు తీరుస్తూ పాఠాలు చెబుతాను. అది అందరికీ నచ్చుతోంది’ అంటోంది విశ్వతిక. ఇంగ్లిష్ నేర్చుకుని విశ్వతిక కంప్యూటర్ చదువులో మంచి తెలివున్న విద్యార్థిని. ప్రోగ్రామ్స్ రాస్తుంది. అలాగే ఇంగ్లిష్ కూడా ముఖ్యమని తెలుసు. అందుకే చెన్నై బ్రిటిష్ కౌన్సిల్ నుంచి షార్ట్‌టర్మ్ కోర్సు చేసింది. ‘అయితే వివిధ దేశాలలోని విద్యార్థుల ఉచ్చరణ నా ఉచ్చరణ వేరు. అయితే అది నా పాఠాలకు అడ్డు కాలేదు’ అంటుంది విశ్వతిక. ఆమె గట్టిగా 20 దాటలేదు. ఇప్పటికే రెండు ఫార్మసూటికల్ సంస్థల కోసం సాఫ్ట్వేర్ తయారు చేసి ఇచ్చింది. అంతేనా? ఆరు మంది ఎం.బి.ఏ గ్రాడ్యుయేట్స్‌ను తన ప్రాడక్ట్స్ అమ్మేందుకు ఉద్యోగులుగా కూడా పెట్టుకుంది. ‘ఆన్లైన్ క్లాసులకు చాలా భవిష్యత్తు ఉంది. రాబోయే రోజుల్లో గుర్తింపు పొందిన ఆన్లైన్ స్కూళ్లు వస్తాయి. విద్యార్థులు వాటిలో చదువుకుంటారు. ఇప్పుడు మనం చూస్తున్న స్కూళ్లు ఇక మీదట పిల్లలు కేవలం కంప్యూటర్లలోనే చూస్తారు’ అని జోస్యం చెబుతోంది విశ్వతిక. తెలివి ఒకరి సొత్తు కాదు. ఉన్న తెలివిని ఉపయోగించే మార్గాలు కొత్తగా అన్వేషించడమే మన పని అని దారి చూపుతోంది విశ్వతిక. – సాక్షి ఫ్యామిలీ -
చదివే బొమ్మ.. పాఠం చెప్పెనమ్మ
ఈ చిత్రంలో కనిపిస్తున్నది మామూలు డాల్ఫిన్ బొమ్మ కాదండోయ్...ఇదో ‘చదివే’ బొమ్మ! దీని పేరు డాల్ఫియో. 6, 7, 8వ తరగతి తెలుగు, ఆంగ్ల పాఠ్య పుస్తకాలను ఇది అనర్గళంగా, ఉచ్ఛారణ లోపాల్లేకుండా చదివేయగలదు! ఏమిటిది ? ఇదో టాకింగ్ పెన్, మల్టీమీడియా ప్రింట్ రీడర్. ఇందులో ముందే లోడ్ చేసిన ఆడియో ఫైళ్లతో కూడిన మెమొరీ చిప్ ఉంటుంది. బ్యాటరీ చార్జింగ్ ద్వారా పనిచేసే డాల్ఫియోలో పాఠాలు వినబడేలా ఓ స్పీకర్ కూడా ఉంటుంది. ఎలా పనిచేస్తుంది.. డాల్ఫియోలో ఒక సెన్సర్ ఉంటుంది. దీన్ని పాఠ్య పుస్తకం తాలూకూ బార్కోడ్లపై ఉంచితే సెన్సర్ వాటిని స్కాన్ చేసి సంబంధిత ఆడియో ఫైళ్లను యాక్టివేట్ చేస్తుంది. పాఠంలోని అక్షరాలపై డాల్ఫియోను కదుపుతూ వెళ్తుంటే వాటిని అది చదువుతూ వెళ్తుంది. ఎందుకు, ఎవరు తెచ్చారు...? విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలను మెరుగు పరిచేందుకు పాఠశాల విద్యాశాఖ ‘టాకింగ్ బుక్స్’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యునిసెఫ్ సహకారంతో రాష్ట్రంలోని 600 పాఠశాలలకు వీటిని అందించేందుకు చర్యలు చేపట్టింది. పుస్తకాల్లోని పాఠ్యాంశాలపై రీడింగ్ డివైస్ పెడితే ఆ పాఠ్యాంశాలు వాయిస్ రూపంలో విద్యార్థులకు వినిపిస్తాయి. అంతేకాదు బొమ్మలపై పెట్టినా ఆ బొమ్మకు సంబంధించిన కథనాన్ని మొత్తం వివరిస్తుంది. అందుకే వాటికి లైఫ్ స్కిల్ టాకింగ్ బుక్స్‌గా యునిసెఫ్ పేరు పెట్టింది. ఏయే స్కూళ్లకు? డాల్ఫియో బొమ్మలను 417 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ),35 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, 37 ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలు, ఉట్నూరులోని 111 ఆశ్రమ పాఠశాలలకు అందించనున్నారు. లాభం ఏమిటి? బాలికల్లో జీవన నైపుణ్యాలను మెరుగు పరుచడం ద్వారా వారిలో మార్పు తీసుకొచ్చేందుకు తెలుగు, ఇంగ్లిషు భాషల్లో వంద కథలతో ఈ టాకింగ్ పుస్తకాలను యునిసెఫ్ పాఠశాలలకు అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు యునిసెఫ్ ప్రతినిధి సుకన్య సుబ్రమణ్యన్ సహకారంతో వీటిని పాఠశాలలకు అందించినట్లు పాఠశాల విద్యా కమిషనర్ విజయ్‌కుమార్ వెల్లడించారు. కథలతో పాఠాలు... పర్యావరణ సమస్యలు, పారిశుద్ధ్యం, నీటి సంరక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత, రక్షణ, బాలికల సమస్యలు, ఆరోగ్యం, పౌష్టికత, బాల కార్మిక, బాలల హక్కులు తదితర అంశాలకు సంబంధించిన పాఠాలను మంచి కథలతో రూపొందించినట్లు విజయ్‌కుమార్ వివరించారు. ముఖ్యంగా గ్రామాల్లోని విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సులభశైలిలో ఈ కథలు ఉన్నట్లు వెల్లడించారు. 6, 7,8 తరగతులకు చెందిన బాలికలకు వీటితో జీవన నైపుణ్యాలపై అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. వీటి ద్వారా జీవన నైపుణ్యాలతోపాటు తెలుగు, ఇంగ్లిషు భాషల్లో మాట్లాడటం, చదవడం, రావడం నేర్పించడానికి ఎంతో ఉపయోగపడుతాయని యూనిసెఫ్ కన్సల్టెంట్ సదానంద్ వివరించారు. – సాక్షి, హైదరాబాద్ -
గూగుల్ 'బోలో' : దియా పాఠాలు
సాక్షి, న్యూఢిల్లీ: సెర్చి ఇంజీన్ దిగ్గజం గూగుల్ ఇండియా మరో కొత్త యాప్‌ను విడుదల చేసింది. పిల్లలకు హిందీ, ఇంగ్లీషు భాష నేర్పే యోచనతో ఈ అప్లికేషన్‌ను లాంచ్ చేసింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల కోసం దీన్ని తీసుకొచ్చింది. 'బోలో' పేరుతో రిలీజ్ చేసిన ఈ యాప్ స్పీచ్ రికగ్నిషన్, టెక్స్ట్-టు-స్పీచ్ టెక్నాలజీ సాయంతో ప్రాథమిక విద్యార్థుల కోసం రూపొందించినట్టు గూగుల్ వెల్లడించింది. ఈ యాప్‌లో యానిమేటెడ్ క్యారెక్టర్ 'దియా' పిల్లలకు హిందీ, ఇంగ్లీష్ నేర్పిస్తుంది. అంతేకాదు కథలు చెబుతుంది, మాటలు నేర్పిస్తుంది. గూగుల్ ప్లే ద్వారా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ బోలో యాప్ ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేయడం విశేషం. ఇది యాడ్ ఫ్రీ కూడా. యాన్యువల్ స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్ సహాయంతో ఉత్తరప్రదేశ్‌లోని 200 గ్రామాల్లో కొన్ని నెలలపాటు ఈ యాప్‌ను గూగుల్ పరీక్షించింది. కేవలం మూడు నెలల్లో 64 శాతం మంది పిల్లల్లో చదివే నైపుణ్యం పెరిగినట్టు గుర్తించినట్టు తెలిపింది. నాణ్యమైన పాఠాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఒక్కో రాష్ట్రంలో అక్షరాస్యత శాతం ఒక్కోలా ఉందని పేర్కొంది. బోలో యాప్‌తో పిల్లల్లో చదివే ఆసక్తి, నైపుణ్యం పెరుగుతుందనే ధీమాను వ్యక్తం చేసింది. -
ప్రభుత్వ పాఠశాలలో హెల్మెట్‌తో పాఠాల బోధన
-
లైంగిక వేధింపుల నియంత్రణపై పాఠాలు
- ఈ విద్యాసంవత్సరం నుంచే అమలుకు శ్రీకారం - సీఐడీ ప్రతిపాదనలకు విద్యాశాఖ పచ్చజెండా సాక్షి,హైదరాబాద్: చిన్నారులపై పెరిగిపోతున్న లైంగిక వేధింపులను నియంత్రిం చేందుకు బాల్యం నుంచే అవగాహన కల్పించేందుకు సీఐడీ కార్యాచరణ రూపొందించింది. మహి ళా శిశు సంక్షేమ శాఖ, వైద్య శాఖ, విద్యా శాఖతో సంయుక్తంగా పలు అంశాలపై విద్యా ర్థులకు అవగాహన కార్యక్రమాలను పాఠ్యాం శాల రూపంలో అందుబాటులోకి తీసుకురా బోతోంది. ఒకటి నుంచి పదో తరగతి విద్యా ర్థులకు తప్పుడు మార్గాల్లో నడవకుండా ఉండేం దుకు తీసుకోవాల్సిన చర్యలు.. తదితర అంశాలపై పాఠాలు బోధించనున్నారు. ఇందుకు సీఐడీ–విద్యాశాఖ కసరత్తు చేసింది. ఒకటి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లిషు రీడర్లో, 3,4,5వ తరగతిలోని ఎన్విరాన్మెంటల్ స్టడీస్, 6 నుంచి 10వ తరగతిలోని హిందీ సబ్జెక్టులో ఒక పాఠ్యాం శంగా లైంగిక వేధింపుల నియంత్రణపై బోధించనున్నారు. ఉమ్మడి ప్రణాళికతో సమగ్రంగా అధ్యయనం చేసిన ఒక మాడ్యుల్‌ను అన్ని తరగతుల్లోని విద్యార్థులకు బోధించేలా ఉపాధ్యాయులకు శిక్షణ కార్య క్రమాలు ఏర్పాటు చేసేందుకు విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. ప్రజాప్రతినిధులకు శిక్షణ.. చిన్నారులపై జరుగుతున్న 80% లైంగిక దాడుల కేసుల్లో తెలిసిన వాళ్లే నిందితులని పోలీస్ శాఖ గుర్తించింది. దీంతో సమాజం లోని అన్ని వర్గాలకు, అన్ని వయసుల వారికి అవగాహన కల్పించేందుకు సిపార్డ్ (రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణ అభివృద్ధి సంస్థ) ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు కూడా లైంగిక వేధింపుల నియంత్రణపై 3 రోజులపాటు శిక్షణ కార్యక్రమాలు ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు. ఇక నుంచి ట్రాఫిక్ సబ్జెక్ట్... హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, రోడ్‌సేఫ్టీ అథారిటీ ఆధ్వర్యంలో ట్రాఫిక్ రూల్స్ అంశంపై ప్రత్యేక సబ్జెక్టును వచ్చే విద్యా ఏడా ది ఒకటినుంచి పదోతరగతి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. -
నిమ్మకునీరెత్తిన ప్రభుత్వం
- సమ్మెబాటలో కాంట్రాక్ట్ లెక్చరర్లు –అటకెక్కిన చదువులు –పూర్తికాని పాఠ్యాంశాలు - సమీపిస్తున్న వార్షిక పరీక్షలు –విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఉరవకొండ : ప్రభుత్వ జూనియర్ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్లు తమ న్యామమైన డిమాండ్లను పరిష్కరించాలని పలు రూపాల్లో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టీడీపీ అధికారంలోకి రాగానే కాంట్రాక్టు అద్యాపకులను రెగ్యూలర్ చేస్తామని హమీ కుడా ఇచ్చారు. మూడేళ్లు కావస్తుఽన్నా ప్రభుత్వంలో స్పందనలేదు. అటు కాంట్రాక్ట్ లెక్చరర్లు, ఇటు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. అటక్కెక్కిన చదువులు... డిసెంబరు నుంచి ప్రధాన పరీక్షల వరుకు విద్యార్థికి ఎంతో కీలక సమయం. మిగిలిన సిలబస్ త్వరగా పూర్తి చేయించుకోని, భవిష్యత్ పరీక్షలకు సిద్ధమయ్యే పరిస్థితి. కానీ బోధించే అధ్యాపకలు లేక విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలోని ఉరవకొండ, మడకశిర, తాడిమర్రి, అమరాపురం, బొమ్మనహల్, గుడిబండ, గుంతకల్లు తదితర ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 50 శాతానికిపైగా కాంట్రాక్టు అధ్యాపకులతో బోధన జరిగేది. ఇందులో సైన్స్ సబ్జెక్టులను బోధించేవారు లేక విద్యార్థులు అయోమయంలో పడ్డారు. ఒక వైపు జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్స్, మరోవైపు ఈనెలాఖరులోగా సిలబస్ పూర్తి చేయాల్సి ఉంది. ఉదాహరణకు ఉరవకొండ బాలుర, బాలికల కళాశాలలు మొత్తం 90 శాతం కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేసుతఆన్నరు. వీరు సమ్మెలో వెళ్లి నప్పటి నుంచి ప్రిన్సిపల్ ఒక్కరి మీదే బోధన బాధ్యత పడింది. ఇంకా ఇప్పటికి ఎంపీసీ, బైపీసీ గ్రూపు సిలబస్ కుడా పూర్తి కాలేదు. కాంట్రాక్ట్ లెక్చరర్ల డిమాండ్లు.. –ఎలాంటి షరతులు లేకుండా కాంట్రాక్టు లెక్చరర్లందరినీ క్రమబద్ధీకరించాలి. - ఇది అమలయ్యే దాకా రెగ్యూలర్ అధ్యాపకులతో సమానంగా పీఆర్సీ సిఫారస్సు మేరకు వేతనాలు పెంచాలి. –ఏటా కొనసాగుతున్న బాండ్ విధానాన్ని రద్దు చేయాలి. - 12 నెలల వేతనం, విద్యార్థి ఉత్తీర్ణత శాతంలో మినహాయింపు చేయాలి. సిలబస్ పూర్తి కాలేదు: ఫస్ట్ ఇయర్లో సిలబస్ సకాలంలో పూర్తి చేయడం వల్ల మంచి స్కోరు చేయగలిగాను, రెండవ సంవత్సరంలో కుడా కష్టపడి చదువుదామంటే ఇంకా సిలబస్ 20 శాతం పూర్తి కావాల్సి వుంది. పరీక్షలు దగ్గరపడుతున్నాయి. పరీక్షల్లో ఉత్తమ ఫలితాల ఎలా సాధించాలి? - మోహెతాజ్, ఎంపీసీ, రెండవ సంవత్సరం,ఉరవకొండ ప్రాక్టికల్స్‌ను ఎలా ఎదుర్కోవాలో...? ప్రస్తుతం జంబ్లింగ్ పద్ధతిలో ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారు. లెక్టరర్లు లేక ఇప్పటి వరకూ ప్రాక్టికల్స్ నిర్వహించలేదు. జనవరి నుంచి ఈ పరీక్షలు ఉన్నాయి. ప్రభత్వం లెక్చరర్ల సమస్యను వెంటనే పరిష్కరించాలి. లేకపోతే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం ఉంది. తేజస్వీని, బైపీసీ, ఉరవకొండ ఇబ్బందికరంగా ఉంది... కాంట్రాక్టు అధ్యాపకులు సమ్మెలో వెళ్లడంతో తరగతుల నిర్వహణ కష్టంగా మారింది. అందరినీ చెట్టుకింద కూర్చోబెట్టి బోధించాల్సిన పరిస్థితి ఉంది. బాలురు, బాలికల కళాశాలలో వెయ్యి మంది దాకా విద్యార్థులు ఉన్నారు. ఇదే పరిస్థితి ఉంటే ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. - నరసింహం, ఇంటర్ బాలుర, బాలికల కళాశాల ప్రిన్సిపాల్, ఉరవకొండ హమీను నేరవేర్చాలి... టీడీపీ ప్రభుత్వం కాంట్రాక్టు అద్యాపకులకు రెగ్యూలర్ చేస్తామని గతంలో హమీ ఇచ్చింది. ఈహమీ ప్రకారం తమకు జీతాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉపసంఘం వేసి కాలయాపన చేయడం సరైంది కాదు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగిరావాలి. - ఎర్రప్ప, జూనియర్ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
మోగనున్న డిజిటల్ గంట!
– 15 నుంచి జిల్లాలో 20 పాఠశాలల్లో డిజిటల్ తరగతులు – రెండో దశలో 80 పాఠశాలల కోసం ప్రతిపాదనలు – డివిజన్‌కు 20 పాఠశాలలకు చొప్పున నిర్వహణ – దాతల సాయంతో ఇప్పటికే 12 పాఠశాలల్లో డిజిటలైజేషన్ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఒకప్పుడు ఉపాధ్యాయులు..విద్యార్థులతో ఇసుకలో అక్షరాలు దిద్దించే వారు. తరువాత బ్లాక్ బోర్డులు రంగప్రవేశం చేయాయి. బోధన ఉపకరణాలు మెరుగుపెడ్డాయి. రాను రాను కంప్యూటర్లు సైతం అందుబాటులోకి వచ్చాయి. ఇంకా సాంకేతికంగా అభివృద్ధి చెంది.. నేడు డిజిటల్ ప్రపంచం రాజ్యమేలుతోంది. విద్యావిధానంలో ఇది పెనుమార్పు తీసుకొస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లోనూ డిజిటల్ తరగతుల నిర్వహణకు గంట కొట్టారు. త్వరలో స్రీన్‌పై త్రీడీ బొమ్మలతో విద్యార్థులకు నూతన పాఠాలు పరిచయం కానున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు సాంకేతికంగా అభివృద్ధి చెందనున్నాయి. జిల్లాలో వంద పాఠశాలలు డిజిటల్ సొబగులు అందిపుచ్చుకోనున్నాయి. ఈ నెల 15వ తేదీ నుంచి మొదటి దశలో 20 పాఠశాలల్లో డిజటిటల్ తరగతులు ప్రారంభం కానున్నాయి. రెండో దశలో మరో 80 పాఠశాలల్లో డిజిటల్ క్లాసు రూంల కోసం విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది. ఇప్పటికే జిల్లాలో దాతల సాయంతో 12 పాఠశాలల్లో డిజిటల్ తరగతులు పేద విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. అనుకున్నట్లు జరిగితే మరో రెండు, మూడు నెలలల్లో మొత్తం 112 పాఠశాలల్లో డిజిటలైజ్ కానున్నాయి. ప్రధానోపాధ్యాయులకు శిక్షణ.. రాష్ట్ర ప్రభుత్వం 5 వేల ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతులను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంది. అందులో భాగంగా మొదటి దశలో 18 పాఠశాలలను ఎంపిక చేసింది. ఆ సంఖ్యను ఇక్కడి అధికారులు మరో రెండు పాఠశాలలను కలిపి మొదటి దశలో మొత్తం 20 పాఠశాలల్లో ఈనెల 15 నుంచి డిజిటల్ తరగతులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు శిక్షణ కూడా ఇచ్చారు. స్కూలు, మెయింటెన్స్ గ్రాంట్ల నుంచి డిజిటల్ తరగతులకు అవసరమయ్యే స్క్రీన్లు, ప్రొజెక్టర్లు, కంప్యూటర్లు, సబ్జెక్టుల సీడీలు/డీవీడీలు కొనుగోలుకు విద్యాశాఖాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇవీ మొదటి దశ పాఠశాలలు 1.జెడ్పీహెచ్ఎస్, హల్వీ 2.జెడ్పీహెచ్ఎస్(బీ), కోసిగి 3. గవర్నమెంట్ హైస్కూల్, నందికొట్కూరు 4.గవర్నమెంట్ హైస్కూల్, ఆత్మకూరు 5.ఏపీఆర్ఐఈఎస్(బీసీ), సున్నిపెంట 6.జెడ్పీహెచ్ఎస్(గర్ల్స్) కోడుమూరు 7. జెడ్పీహెచ్ఎస్(బాయ్స్), వెల్దుర్తి 8. జెడ్పీహెచ్ఎస్ రంగాపురం 9. జెడ్పీహెచ్ఎస్ గడివేముల 10. జెడ్పీహెచ్ఎస్, శిరివెళ్ల 11. గవర్నమెంట్ హైస్కూల్, అళ్లగడ్డ 12. జెడ్పీహెచ్ఎస్, చాగలమర్రి, 13. జెడ్పీహెచ్ఎస్ దొర్నిపాడు, 14. జెడ్పీహెచ్ఎస్, దీబగుంట్ల, 15.జెడ్పీహెచ్ఎస్ నందవరం 16. జెడ్పీహెచ్ఎస్(గర్ల్స్), బనగానపల్లె 17.జెడ్పీహెచ్ఎస్(గర్ల్స్), డోన్ 18.జెడ్పీహెచ్ఎస్(గర్ల్స్) పత్తికొండ, 19.జెడ్పీహెచ్ఎస్ నిడ్జూరు, 20.జెడ్పీహెచ్ఎస్ కంబాలపాడు డివిజన్‌కు 20 పాఠశాలలు చొప్పున.. జిల్లాలో మొత్తం 898 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రైవేట్‌లో 354, ఎయిడెడ్‌లో 45, రెసిడెన్షియల్లో 123, మునిసిపల్‌లో 16, జెడ్పీలో 335, గవర్నమెంట్లో 25 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో గవర్నమెంట్, జెడ్పీ, మునిసిపల్ పాఠశాలలు కలిపి మొత్తం 376 ఉన్నాయి. వీటిలో డివిజన్‌కు 20 పాఠశాలల్లో చొప్పున మొత్తం 80 ఉన్నత పాఠశాలల్లో రెండోదశలో డిజిటల్ క్లాసు రూంలను ఏర్పాటు చేసేందుకు విద్యాశాఖ ప్రణాళిలకను రూపొందించింది. అత్యాధునిక వసతులు.. అత్యాధునిక వసతులతో డిజిటల్ క్లాసు రూంలు ఏర్పాటు కానున్నాయి. ప్రొజెక్టర్, స్క్రీన్, ల్యాప్‌టాప్‌లతోపాటు మరికొన్ని అత్యాధునిక పరికరాలు ఉంటాయి. వీటితోపాటు తరగతి గదిలో విద్యార్థులు కూర్చోవడానికి ప్రత్యేక కుర్చీలు, టేబుల్లు అమర్చుతారు. వీటన్నింటినీ ఉన్నతాధికారులే కొనుగోలు చేసిన ఎంపిక చేసిన పాఠశాలలకు పంపుతారు. డిజిటల్ తరగతులతో విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం కలుగుతుందనడంలో సందేహం లేదు. ఒక అంశానికి సంబంధించిన బొమ్మలు, మ్యాపులు, వివరణలతో కూడిన త్రీడీ ప్రింటుతో కూడిన చిత్రాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు ప్రత్యక్ష అనుభూతి కలిగేలా చేస్తాయి. ఇక్కడ బోధన చేసే ఉపాధ్యాయుడికి కూడా పనిభారం తగ్గుతుంది. దీంతో ఆయన అంశాన్ని విశదీకరించేందుకు ఎక్కువగా సమయం దొరుకుతుంది. ఆహ్వానించదగ్గ విషయం: కరుణానిధిమూర్తి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు డిజిటల్ క్లాసు రూంల ఏర్పాటు మంచిదే. వీటితో విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం కలుగుతుంది. తద్వారా పాఠ్యాంశాలు సులభంగా అర్థమవుతాయి. అన్ని ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేయాలి. -
ఇది ఫ్లైఓవర్ బడి!
ఆదర్శం ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర పిల్లలు అడుక్కొనే దృశ్యం, ఏవో వస్తువులు అమ్ముకునే దృశ్యాలు చూస్తూనే ఉంటాం. మరోవైపు స్కూలు బస్సుల్లో టిప్‌టాప్‌గా బడికి వెళ్లే పిల్లల్ని కూడా చూస్తూనే ఉంటాం. ‘ఇది సహజమే’ అనుకుంటే సమస్య ఏమీ ఉండదు. సమస్య అనుకుంటే మాత్రం...సమాధానం ఎక్కడో ఒకచోట కనిపిస్తుంది. దారి చూపిస్తుంది. ముంబైలో ‘సిగ్నల్ శాల’ కూడా అలాంటిదే. ఇది మన దేశంలో తొలి రిజిస్టర్డ్ ట్రాఫిక్ సిగ్నల్ స్కూల్. సమర్థ్ భారత్ వ్యాసపీఠ్ (యస్బీవీ) అనే స్వచ్ఛంద సంస్థ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర యాచించే పిల్లలు, రకరకాల వస్తువులు అమ్ముకునే పిల్లల స్థితిగతులపై కొన్ని నెలల పాటు లోతైన అధ్యయనం నిర్వహించింది. ముంబైలోని నాలుగు మేజర్ సిగ్నల్స్ దగ్గర సర్వేలు చేసింది. ఈ సర్వే వల్ల ‘ఎంత మంది పిల్లలు సిగ్నల్స్ దగ్గర గడుపుతున్నారు’... మొదలైన విషయాలపై స్పష్టత వచ్చింది. తరువాత పిల్లల తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు. అప్పుడు మరిన్ని వివరాలు తెలిశాయి. అందులో చాలామంది కరువును తట్టుకోలేక మహారాష్ట్రలోని మారుమూల గ్రామాల నుంచి పొట్ట చేతబట్టుకొని వచ్చిన వారే. పల్లెల్లో కంటే పట్టణాల్లో మెరుగైన జీవితం గడుపుదామని వచ్చిన వారి జీవితం ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గరే తెల్లారిపోతుంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని... చదువుకోవడం ద్వారా పిల్లలకు కలిగే ప్రయోజనాలు ఏమిటో తల్లిదండ్రులకు చెప్పడం మొదలుపెట్టారు. వారు కూడా అనుకూలంగా స్పందించారు. షిప్పింగ్ కంటైనర్‌ను థానేలోని ఫ్లైవోవర్ కింద అందమైన క్లాస్‌రూమ్‌గా మలిచారు. ఇందులో టీచర్స్ రూమ్, టాయిలెట్లు కూడా ఉంటాయి. ఫ్యాన్, ప్రొటెక్టర్లు ఉంటాయి. ‘ఎయిర్ టైట్’ చేయడం వల్ల బయటి నుంచి వాహనాల రణగొణధ్వనులేవీ వినిపించవు. మొదట్లో ‘ప్లే స్కూలు’గానే దీన్ని ప్రారంభించారు. పిల్లలు తమ ఇష్టం ఉన్నంతసేపు క్లాసులో కూర్చోవచ్చు. తొలి రోజుల్లో పదిహేను నిమిషాల నుంచి అర్ధగంట వరకు కూర్చునేవారు. మొదట్లో సిగ్నల్స్ దగ్గర పిల్లల్ని వెదికి, వారిని బుజ్జగించి స్కూలుకు తీసుకువచ్చేవారు. ఆ తరువాత మాత్రం పిల్లలే ఉత్సాహంగా రావడం మొదలైంది. ‘సిగ్నల్ శాల’లో నలుగురు ఫుల్ టైం టీచర్లు, ఒక అటెండర్లతో పాటు ఇంకా చాలామంది వాటంటీర్లు ఈ స్కూలు కోసం పనిచేస్తున్నారు. కేవలం చదువు మాత్రమే కాదు...శుభ్రత, క్రమశిక్షణ... ఇలా జీవితానికి అవసరమైన అనేక విషయాలను బోధిస్తున్నారు. ఈ స్కూల్లో చదువుకుంటున్న వాళ్లలో... చదువు రాని వాళ్లతో పాటు స్కూలు మధ్యలో మానేసిన పిల్లలు కూడా ఉన్నారు. 7వ తరగతి మధ్యలోనే చదువు ఆపేసిన పిల్లల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించి బోర్డ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ చేయిస్తున్నారు. ‘‘పిల్లలను డాక్టరో, ఇంజనీరో చేయాలనే పెద్ద పెద్ద కోరిలేవి మాకు లేవు. హుందాగా బతకడానికి అవసరమైన పునాదిని చదువు చెప్పడం ద్వారా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం’’ అంటున్నారు యస్బీవి సీయివో బటు సావంత్. పిల్లల అభిరుచులను బట్టి వొకేషనల్ క్లాసులు, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చిత్రాలు, సంగీతంతో పిల్లలను ఆకట్టుకోవడానికి టాటా టెక్నాలజీని ప్రత్యేకంగా ఉపయోగిస్తున్నారు. ఈ విధానం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. పాఠాలు చెప్పడం మాత్రమే కాదు...పిల్లల కోసం హెల్త్‌క్యాంప్‌లు కూడా నిర్వహిస్తున్నారు. ‘‘పిల్లల్లో మంచి అలవాట్లు పెంపొందించడానికి ప్రయత్నిస్తున్నాం. తినే ముందు తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలని చెబుతుంటాం. ఇది మాత్రమే కాదు... వారికి సంబంధించి... ఇది మంచి అలవాటు కాదు... అని ఏది అనిపించినా వెంటనే చెబుతాం. ఇలా జాగ్రత్తలు చెప్పడం వల్ల... స్కూలు అనేది కేవలం పాఠాలు నేర్పేది మాత్రమే కాదు... తమ క్షేమం గురించి ఆలోచించేది అనే విషయం అర్థమవుతుంది’’ అంటున్నారు బటు సావంత్. పిల్లలకు శుభ్రమైన దుస్తులు సమకూర్చడం కోసం ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. యోగా క్లాసులు నిర్వహించడం, ఆటలు ఆడించడం, ఆర్ట్-క్రాఫ్ట్ పాఠాలు బోధిస్తున్నారు. ‘‘చదువుకోవడం ద్వారా తమ భవిష్యత్తు బాగుంటుందనే నమ్మకం వారిలో కనిపిస్తుంది. తోటి పిల్లల్లో ఎవరైనా స్కూల్ తరువాత యాచన చేస్తే మరుసటి రోజు... ఫిర్యాదు చేస్తున్నారు’’ అని చెబుతున్నారు సావంత్. సిగ్నల్ అనేది దారి చూపుతుంది. మన క్షేమం కోరుతుంది. సిగ్నల్ దగ్గర ఉన్న ‘సిగ్నల్ శాల’ కూడా పిల్లల విషయంలో అదే చేస్తుంది. -
క్లాస్‌రూంలో కామ్‌గా సైక్లింగ్..
క్లాస్‌రూంలో కామ్‌గా పాఠాలు వినాల్సిన పిల్లలు సైక్లింగ్ చేస్తున్నారు.. ఎందుకో తెలుసా? ఏకాగ్రత పెరగడం కోసమట! ఈ ఐడియా 8 క్లాసు గణితం ఉపాధ్యాయురాలు బెథానీ లాంబర్ట్ది. క్లాసులో పాఠాలు చెప్పేటప్పుడు విద్యార్థులు ఏకాగ్రతతో వినకుండా అటూ ఇటూ కదలడం.. తిరగడం వంటివి చేస్తున్నారట.. దీంతో కాళ్లు అటుఇటూ కదలాల్సిన పనిలేకుండా ఈ సైక్లింగ్ డెస్క్‌లను ఏర్పాటు చేసింది. అంతే.. విద్యార్థులు తిరగడం తగ్గించి.. ఓవైపు సైక్లింగ్ చేస్తూ.. మరోవైపు క్లాసులు వినేస్తున్నారు. అంతేకాదు.. దీని వల్ల పాఠాలపై ఏకాగ్రత పెరిగిందని చెబుతున్నారు. పైగా.. సైక్లింగ్ వల్ల క్యాలరీలు ఖర్చయి.. ఫిట్‌గా ఉంటున్నామని అంటున్నారు. వాళ్ల గ్రేడ్లు కూడా పెరిగాయట. అమెరికాలోని నార్త్‌కరోలినా రాలీగ్‌లో ఉన్న మార్టిన్ మిడిల్ స్కూల్లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ సైక్లింగ్ డెస్క్‌లపై మిగిలిన పాఠశాలల వాళ్లూ ఆసక్తి చూపుతున్నారట. -
అరుదైన ఆచార్యుడు
పాఠాలు చెప్పే గురువులు చాలామందే ఉంటారు గానీ, విద్యార్థుల మనసులను ఆకట్టుకునే గురువులు చాలా అరుదుగా మాత్రమే ఉంటారు. విద్యార్థులు బ్రహ్మరథం పట్టే గురువులు మరీ అరుదుగా ఉంటారు. మన దేశానికి రెండవ రాష్ట్రపతి, మొదటి ఉపరాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అత్యంత అరుదైన గురువుల కోవలోకి చెందుతారు. రాధాకృష్ణన్ కలకత్తా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తుండగా, ఆయనకు మైసూరు వర్సిటీకి బదిలీ అయింది. కలకత్తాను వదిలి వెళ్లేటప్పుడు విద్యార్థులు ఆయనకు ప్రత్యేకంగా పూలతో అలంకరించిన బండిని ఏర్పాటు చేశారు. కలకత్తా యూనివర్సిటీ నుంచి రైల్వేస్టేషన్ వరకు విద్యార్థులే స్వయంగా బండిని లాగారు. తమ మనసులను చూరగొన్న గురువుకు ఆ విద్యార్థులు పలికిన అపురూపమైన వీడ్కోలు అది. ఇది స్వాతంత్య్రానికి ముందు జరిగిన సంఘటన. దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన రాధాకృష్ణన్‌ను పూజారి చేయాలని ఆయన తండ్రి భావించేవారు. ఆర్థిక కష్టాల మధ్యనే రాధాకృష్ణన్ చదువు కొనసాగించి, తత్వశాస్త్రంలో ఎంఏ పూర్తి చేశారు. తర్వాత అధ్యాపకుడిగా జీవితం మొదలుపెట్టారు. భారతీయ తత్వశాస్త్రాన్ని మథించి ఆయన రాసిన ‘ఇండియన్ ఫిలాసఫీ’ అంతర్జాతీయంగా ప్రసిద్ధి పొందింది. రాధాకృష్ణన్ మన దేశానికి రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు బ్రిటిష్ తత్వవేత్త బెర్ట్రాండ్ రస్సెల్ ‘ఇది తత్వశాస్త్రానికే లభించిన గౌరవం’ అని హర్షం వ్యక్తం చేశారు. తత్వవేత్తలు పాలకులు కావాలని ప్లాటో కలలు కనేవాడని, భారత్‌కు ఒక తత్వవేత్త రాష్ట్రపతి కావడం విశేషమని, దీనికి ఒక తత్వవేత్తగా తాను గర్విస్తున్నానని అన్నారు. రాధాకృష్ణన్ రాష్ట్రపతి అయిన తర్వాత పూర్వ విద్యార్థులు కొందరు ఆయన పుట్టినరోజును ఘనంగా ఏర్పాటు చేయాలనుకున్నారు. అయితే, తన పుట్టినరోజును ఉపాధ్యాయులందరినీ గౌరవించుకునే రోజుగా పాటిస్తే సంతోషిస్తానని రాధాకృష్ణన్ చెప్పారు. అప్పటి నుంచి ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ 5న గురు దినోత్సవంగా పాటించడం ఆనవాయితీగా వస్తోంది. -
మద్రసాలలో పాఠ్యాంశాల బోధనకు కృషి
ఇన్చార్జి డీఈఓ విజయలక్ష్మి నెల్లూరు (టౌన్) మద్రసాలల్లో ఖురాన్ ఇతర మత గ్రంథాలతో పాటు ఇంగ్లిష్, తెలుగు, గణితం, సైన్స్ తదితర సాధారణ పాఠ్యాంశాలను బోధించి విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని జిల్లా ఇన్చార్జి డీఈఓ విజయలక్ష్మి తెలిపారు. గురువారం సర్వశిక్ష అభియాన్ కార్యాలయంలో మద్రసాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మద్రసాలలో 2016–17 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం నుంచి సాధారణ విద్యను బోధించేందుకు ఆసక్తి గల వారినుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. మండలాల వారిగా మద్రాసాలను తప్పకుండా తనిఖీలు చేస్తామన్నారు. ఆ సమయంలో ఎలాంటి లోపాలు కనిపించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏఎల్ఎస్ కో–ఆర్డినేటర్ మేరీరాణి మాట్లాడుతూ శుక్రవారం నుంచి జిల్లా కార్యాలయంలో దరఖాస్తులో అందుబాటులో ఉంటాయన్నారు. వాటిని పూర్తిచేసి ఈనెల 30వ తేదీలోపు కార్యాలయంలో అందజేయాలన్నారు. వివరాలు కోసం 9440373616, 7093900557లో సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో సర్వశిక్ష అభియాన్ ఏఏఎంఓ ఖాదర్‌బాషా, ఏఎంఓ హమీద్, సీఎంఓ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
తగునా ‘పాఠాల’పై ఈ వేటు?
కొత్త కోణం పిల్లలు తమ శక్తియుక్తులను పెంపొందించుకొని, తన హక్కులను గుర్తించడంతో పాటు, ఇతరుల హక్కులను కూడా గౌరవించడానికి పాఠ్యాంశాలు ఉపయోగపడాలి. విభిన్న సంస్కృతులు, సంప్రదాయాల పట్ల సంయమనాన్ని, మానవత్వాన్ని, శాంతిని ప్రబోధించే విలువలకు కూడా పాఠ్యాంశాల్లో స్థానం కల్పించాలి. విద్యార్థుల్లో సమాజం పట్ల సరైన అవగాహనను పెంపొందించే పాఠాలను మరిన్నిటిని చేర్చే బదులు ఉన్నవాటినే తొలగిం చడం ద్వారా ఏపీ ప్రభుత్వం సామాజిక అంశాల పట్ల తన వైఖరిని చెప్పకనే చెప్పింది. ‘‘నా పేరేమిటి?’’ విచిత్రంగా ఉన్నా అశేష స్త్రీ జనవాహినిని మానసిక సంక్షోభంలోకి నెట్టే ప్రశ్న ఇది? వివాహానంతరం ఒకమ్మాయి కొద్ది కొద్దిగా తన అస్తిత్వాన్ని కోల్పోయి, చివరకు తన పేరుని కూడా మరచిపోయిన వైనంపై ప్రముఖ తెలుగు రచయిత్రి పి. సత్యవతి రాసిన ‘ఇల్లలకగానే...’ అనే అద్భుతమైన కథ ఇది. పెళ్లయిన తరువాత ఒకరికి భార్యగా, పిల్లలకు తల్లిగా, అత్తమామలకు కోడలుగా, పనిమనిషికి చిన్నమ్మగా.. రకరకాలుగా పిలిపించు కునే ఆమెను సొంత పేరుతో పిలిచే వారెవరూ అత్తవారింట ఉండరు. పాఠశాల రికార్డులను పరిశీలించి, సర్టిఫికెట్లలో చూసి ఆమె చివరకు తన పేరు శారద అని నిర్ధారించుకుంటుంది. మన వ్యవస్థలో స్త్రీల జీవితాలకు అద్దంపట్టే ఈ అద్భుతమైన కథ అవిభక్త తెలుగు రాష్ట్ర 10వ తరగతి ఇంగ్లిషు పాఠ్య పుస్తకంలో ఎనిమిదవ అధ్యాయంలో ఉండేది. చిన్ననాటి నుంచే బాలబాలిక లలో స్త్రీ, పురుష సమానత్వాన్ని, సామాజిక అవగాహనను పెంపొందిం చేందు కోసం దాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టారు. ఆ పాఠాన్ని ఇప్పుడా పాఠ్య పుస్తకంలోంచి తొలగించారు. దానితో పాటూ అసమానతలను ధిక్కరించే చైతన్యాన్ని అందించే పలు ఇతర పాఠ్యాంశాలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిలబస్ నుంచి తొలగించింది. సమానత్వ బోధన నేరమా? ‘‘పిల్లలు తమ జీవితానికి ఒక సార్ధకతను ఏర్పరుచుకొని, శక్తియుక్తులను పెంపొందించుకొని, తన హక్కులను గుర్తించడంతో పాటు, ఇతరుల హక్కు లను కూడా గౌరవించడానికి పాఠ్యాంశాలు ఉపయోగపడాలి.’’ అంటూ 2005వ సంవత్సరంలో నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్ సమర్పించిన నివేదిక పేర్కొంది. విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాల పట్ల సంయమనంతో మెలగడం, మానవత్వాన్ని, శాంతిని ప్రబోధించే విలువలకు కూడా పాఠ్యాం శాల్లో స్థానం కల్పించాలని అది స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం దానికి భిన్నంగా పాఠ్యాంశాల్లో పొందుపరచిన అటువంటి అనేక పాఠ్యాంశాలను ఈ సంవత్సరం తొలగించి, సామాజిక అంశాల పట్ల తన వైఖరిని చెప్పకనే చెప్పింది. అదే పాఠ్యపుస్తకంలోని ‘‘సామాజిక సమస్యలు’’, ‘‘మానవ హక్కులు’’ అనే రెండు అధ్యాయాలను తొలగించారు. విద్యార్థుల్లో సమాజం పట్ల సరైన అవగాహనను పెంపొందించే పాఠాలను మరిన్నిటిని చేర్చే బదులు ఉన్నవాటినే తొలగించడం ఎంత మాత్రం ఆహ్వానించదగినది కాదు. గత పాఠ్య పుస్తకంలో ఐదవ అధ్యాయంలో ఉన్న స్టొరీడ్ హౌస్-1, స్టొరీడ్ హౌస్-2 పాఠాలు ఉండేవి. ఇవి గ్రామాల్లో కొనసాగుతోన్న కుల వివక్షకు దర్పణం పట్టేవి. మహారాష్ట్రలోని ఒక గ్రామంలో మహర్ కులానికి చెందిన భయ్యాజీ కొంత కాలం ముంబై డాక్‌యార్డ్‌లో పనిచేసి సొంత ఊరికి తిరిగి వస్తాడు. ఆయన జీవితాశయం పలు అంతస్తుల భవనం కట్టుకోవడం. కూడబెట్టిన డబ్బుతో ఆయన తన కల నెరవేర్చుకోవాలనుకుంటాడు. ఆయ నకు ఆరుగురు కొడుకులు. ఇద్దరు కూతుళ్లలో ఒక్క చిన్న కొడుకు తప్ప అందరూ స్థిరపడ్డారు. తండ్రి ఆలోచనను విన్న పిల్లలంతా సంతోషపడ్డారు. అయితే ఆ గ్రామ పెత్తందారు దాన్ని హర్షించలేకపోయాడు. ‘‘నువ్వు అటు వంటి భవనం కడితే ఇక్కడ ఉండవు’’అతడు భయ్యాజీని బెదిరిస్తాడు. అయినా దళితుడైన భయ్యాజీ ఇంటికి శంకుస్థాపన జరిగింది. బయటకు చిన్న ఇల్లు లాగానే కనిపించేట్టు ఉంచి, లోపల పైన ఒక అంతస్తు వేస్తాడు. గృహ ప్రవేశానికి ఆహుతులంతా వస్తారు. ఆధిపత్య కులస్తుడైన గ్రామ పెత్తందారు కూడా వస్తాడు. అసూయ, ద్వేషం ఆయన మొహంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది. అంతలోనే ఆ ఇల్లు అగ్ని ప్రమాదానికి గురై, చూస్తుండ గానే భయ్యాజీ కలల ప్రపంచం కూలి బూడిదవుతుంది. గోడల పైన ఉన్న బుద్ధుడు, అంబేడ్కర్ బొమ్మలను తీసుకొచ్చేందుకు లోపలికి వెళ్ళిన భయ్యాజీ పూర్తిగా కాలిపోతాడు. ‘‘నాకు ఎటువంటి కోరికా లేదు. ఇక్కడ అంతస్తుల భవనం కట్టాలనుకున్నాను. అది నెరవేరలేదు’’ అంటూ కన్నుమూస్తాడు. సాంప్రదాయం ప్రకారం భయ్యాజీ అంత్యక్రియలు జరిగాక భయ్యాజీ కొడుకులు ఏడుపుని దిగమింగుకొని, తమ తండ్రి అంతస్తుల భవనం కట్టాల నుకున్న చోటనే దాన్ని తిరిగి నిర్మించడానికి పునాదులు తవ్వడం మొదలు పెడతారు. తండ్రి చనిపోయిన వెంటనే ఈ పనేమిటంటే... ఆ భవవాన్ని కట్టనిదే మా నాన్న ఆత్మకు శాంతి లేదు’’ అని చెప్పడంతో కథ ముగుస్తుంది. ఈ పాఠం సమాజంలో నెలకొన్న సామాజిక అసమానత లపై అవగాహన కల్పించి, అవి న్యాయం కాదన్న విలువను కూడా విద్యార్థులకు బోధిస్తుంది. పెత్తందారు ద్వేషం వల్లనే ఆ అగ్ని ప్రమాదం జరిగిందనేది విద్యార్థుల ఊహకు స్ఫురిస్తుంది. ఇలాంటి పాఠ్యాంశాలు విద్యార్థులను ఆలోచింప జేస్తాయి. పైగా ఈ పాఠం చివర కులం సమస్యలపై అంబేడ్కర్ అభిప్రాయా లను పొందుపరిచారు. కులం దేశ అభివృద్ధికి ఆటంకమని చివర న తెలిపారు. దేశ పురోగతికి అడ్డంకిగా ఉన్న కుల సమస్యను తొలగించాలనే సందేశాన్ని అందించే ఈ పాఠాన్ని ఏపీ ప్రభుత్వం తొలగించింది. సామాజిక సమస్య అనే అధ్యాయం మొత్తాన్ని పాఠ్యపుస్తకం నుంచి తొలగించారు. ఇది ఒకరకంగా కుల ఆధిపత్యాన్ని కొనసాగించాలనే ప్రభుత్వ దృక్పథానికి అద్దం పడుతోంది. అంబేడ్కర్ బోధనలకూ కత్తెరేనా? ఒకవైపు బాబాసాహెబ్ అంబేడ్కర్ 125వ జయంతిని ఘనంగా జరుపు తున్నామని గొప్పలు చెప్పుకుంటూ ఇటువంటి చర్యకు పూనుకోవడం పాలకుల కుటిల నీతికి అద్దం పడుతోంది. కుల వివక్ష, అంటరానితనం ఎంతటి విధ్వంసం సృష్టించగలవో ఆ పాఠంలో వివరించారు. ఒకరకంగా అది విద్యార్థుల మనసుల్లో అంటరానితనం నేరమనే భావన ఏర్పడుతుంది. కానీ ఏపీ విద్యాశాఖ ఈ పాఠ్యాంశాన్ని తొలగించడం ద్వారా ఏం సాధించ దల్చుకున్నదో తెలియదు. ఉపాధ్యాయుల్లో చాలామంది ఈ పాఠాన్ని తొలగించాలని అడిగారని, ఈ పాఠం చెప్పడం ఇబ్బందిగా ఉన్నదని కుంటి సాకులు చెప్పడం బాధాకరం. ఒకవేళ అదే నిజమైతే, ఉపాధ్యాయుల్లోని కుల తత్వాన్ని కూడా తొలగించాల్సిన అవసరం ఉంటుంది. వారికి కూడా సరైన అవగాహన కల్పించిన తర్వాతే బోధనకు అర్హులని ప్రకటించాల్సి ఉంటుంది. అంటరాని తనం, అంటరాని కులాల పట్ల వివక్ష తరతరాలుగా సమాజంలో గూడు కట్టుకొని ఉన్నది. దానిని శాశ్వతంగా నిర్మూలిస్తే తప్ప ఒక సమభావన ఏర్పడదు. పాఠ్యాంశాల్లో ఏవైతే ఈ సమాజానికి తప్పనిసరి అవసరమో వాటినే తొలగించడంలో ప్రభుత్వం ఉద్దేశం ఏమిటో ఆలోచించచడం అవ సరం. అంబేడ్కర్ కులంపై ఎంతో శాస్త్రీయంగా రాసిన విషయాలను కూడా తొలగించడం విద్వేషపూరితమైన చర్య. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయడానికిగాను నిరంతరం మనం ఎన్నో రకాల విధానాలను రూపొందించుకుంటున్నాం. రాజ్యాంగంలో కొన్ని మార్పులు తీసుకొచ్చి, కిందిస్థాయి నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని సంకల్పిస్తున్నాం. కానీ అంబేడ్కర్ మాటల్లో చెప్పాలంటే, ‘‘ప్రజాస్వామ్య వ్యవస్థను కూకటి వేళ్ళతో పెకిలించే లక్షణం కుల వ్యవస్థకు ఉన్నది. కుల విభజన వల్ల ప్రజాస్వామ్యం మనగలగడం అసాధ్యం.’’ ఈ విధమైన అంబేడ్కర్ ఆలోచనలను విద్యార్థులకు పరిచయం చేయడం వల్ల సామాజిక స్పృహ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. సాంఘిక శాస్త్రంలో భారత రాజ్యాంగంపైన ఉన్న పాఠ్యాంశాన్ని కూడా తొలగించారు. రాజ్యాంగం ద్వారా అంబేడ్కర్ ఈ దేశ ప్రజలందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛ కల్పించారు. రాజ్యాంగం నిర్మాణం జరిగిన తీరుతెన్నులు విద్యార్థులకు తెలియాల్సిన అవసరం ఉంది. దానివల్ల ఈ దేశ రాజకీయ చరిత్ర తెలుస్తుంది. ప్రస్తుతం అమలు జరుగుతున్న ఎన్నికలు, పరిపాలన, ఆర్థిక రాజకీయ విధానాల నేపథ్యం వారికి అర్థం అవుతుంది. అటువంటి పాఠాలను తొలగించడం అంటే, రాజ్యాంగానికి, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించడమే. పునరాలోచన అవసరం అదే విధంగా పదవ తరగతి ఇంగ్లిషు పుస్తకం ఎనిమిదవ అధ్యా యంలోని మానవ హక్కులు అనే పాఠాన్ని కూడా తొలగించారు. తొలగిం చిన‘‘జమైకా ఫ్రాగ్మెంట్’’ అనే పాఠంలో నల్లజాతి పట్ల సర్వసాధారణంగా ఉండే వివక్షను చాలా సున్నితంగా రచయిత వివరించారు. ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఒకరు నల్లగా, ఒకరు తెల్లగా పుట్టారు. అయితే బయట చూసే వారికి ఇది వేరుగా కనపడుతుంది. తల్లిదండ్రులు కూడా వేర్వేరు రంగులు, వేర్వేరు దేశాలకు చెందిన వారు. ఆ పాఠం ద్వారా వర్ణ వివక్షను కూడా విద్యార్థులు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఈ పుస్తకంలోని ఐదవ యూనిట్‌కు అనుబంధంగా అమెరికా మానవ హక్కుల ఉద్యమ నాయకుడు మార్టిన్ లూథర్ కింగ్ ‘ఐ హావ్ ఎ డ్రీమ్’ అనే చారిత్రాత్మకమైన ఉపన్యాసాన్ని అను బంధంగా అందించారు. విద్యార్థులకు ఎంతో ఉత్తేజాన్నిచ్చే దీన్ని కూడా తొలగించారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించాలి. పాఠాలను కూడా అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మార్చుకోవచ్చు. కానీ థీమ్స్(అంశాల)ను మార్చకూడదు. సామాజిక సమస్యలు, మానవ హక్కులు (హ్యూమన్ రైట్స్) అనే యూనిట్లనే తొలగించడం పథకం ప్రకారమే జరిగిందని చెప్పక తప్పదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయం ఇప్పటికైనా పునరాలోచించడం అవసరం. మానవ హక్కులు, సామాజిక సమస్యలపై పాఠాలను తిరిగి పాఠ్యాంశాల్లో చేర్చాలి. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే, మానవహక్కుల సంఘాలు, వ్యక్తులు, సంస్థలు, ప్రజాస్వామికవాదులు, ఉపాధ్యాయ సంఘాలు చొరవ చూపాలి. ప్రభుత్వం చేసిన ఈ తప్పును సరిదిద్దుకునేంత వరకు ఒత్తిడి చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇది దేశ ప్రజాస్వామ్య ఆలోచనలకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. మల్లెపల్లి లక్ష్మయ్య, వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 97055 66213 -
రోబో బుద్ధాకర్షక మంత్రం!
బీజింగ్: తమ మతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రకటనలు, ప్రచారాలు, సాక్ష్యాలు చెప్పించడం లాంటివి చేయడం మనకు తెలిసిన పద్ధతి. అది మామూలుగా చేసేదే కదా! అందులో కొత్తే ముంది అంటున్నారు చైనాలోని బీజింగ్‌లో ఉన్న బుద్ధుడి ఫాలోవర్స్ ఏకంగా రోబోను తయారుచేసి ప్రజలను బుద్ధిజం వైపు ఆకర్షించే ప్రయత్నంలో పడ్డారు. కార్టూన్ తరహాలో ఉండే ఈ రోబోకు పసుపు రంగు బట్టను, నున్నని తలతో మంత్రాలను చెప్పగలిగే విధంగా తయారు చేసేశారు. దీంతో పాటు బుద్ధిజం గురించి 20 చిన్నచిన్న ప్రశ్నలకు ఈ రోబో టకటకా సమాధానం ఇచ్చేయగలదు. బుద్ధిజాన్ని స్వీకరించిన వారు రోజూ వారీ దినచర్య ఎలా పాటించాలో కూడా ఈ రోబో నేర్పిస్తుంది. ఓ టెక్నాలజీ కంపెనీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) నిపుణులు కలిసి చైనాకు చెందిన యూనివర్సిటీ సాయంతో సమకాలీన బుద్ధ కల్చర్‌ను ఈ రోబోకు ధారపోశారు. దీనిని అమలుచేసిన కొద్దిరోజులకే చైనాలో దాదాపు 3లక్షల మంది ఫాలో అవడం ప్రారంభించేశారు. -
మూడేళ్ల చిన్నారికి గొరిల్లా పాఠం
న్యూయార్క్: గొరిల్లాను దూరం నుంచి చూస్తేనే ఒళ్లంతా జలదరించిపోతుంటుంది. అలాంటిది నిజంగా ముఖంలోకి ముఖంపెట్టి చూస్తే.. అది కూడా ఓ మూడేళ్ల చిన్నారి ఆ సాహసం చేస్తే. ఆ చిన్నారిని చూసి ముచ్చటపడిన గొరిల్లా కూడా తనకు తెలిసిన విద్యలు నేర్పిస్తే.. ఊహించుకోవడానికే అద్భుతంగా ఉంది కదా.. అవును ఒహియోలోని కొలంబస్ జూ వద్ద ఇదే ఘటన ఆవిష్కృతమైంది. రైలీ మాడిసన్ అనే మూడేళ్ల చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి జూ పార్క్‌కు వెళ్లింది. అక్కడ ఉన్న గొరిల్లా దగ్గరకు వెళ్లి హాయ్ అన్నట్లుగా ముఖంలోకి ముఖంపెట్టి చూసింది. ఆ తర్వాత ఆ గొరిల్లా తన మధ్య వేలిని చూపుడు వేలిగా చూపిస్తూ ఆ పాపను కూడా అలాగే చేయమన్నట్లుగా హావభావాలతో చెప్పడంతో ఆ పాప కూడా అలాగే చేసింది. తన మధ్య వేలినే చూపుడు వేలుగా చూపిస్తూ తనకు గొరిల్లా ఆ విషయం చెప్పిందన్నట్లు తల్లితో చెప్పింది. అప్పటి నుంచి పదే పదే అదే వేలును చూపుడు వేలిగా చూపెడుతూ ముచ్చటపడుతుండటంతో.. 'తప్పు నువ్వు గొరిల్లాను అనుసరించ కూడదు. చూపుడు వేలు అది కాదు ఇది' అంటూ అసలైన చూపుడు వేలు చూపిస్తూ ముద్దుచేసింది. అలా తొలిసారి, మధ్య వేలిని కూడా చూపుడు వేలిగా చూపించవచ్చని ఆ చిన్నారి గొరిల్లా వద్ద పాఠాలు నేర్చుకుంది. -
ప్యారిస్ గుణపాఠాలు
త్రికాలమ్ అగ్రవాదంతో మమేకం కావడం వల్ల నష్టమే కానీ ప్రయోజనం లేదు. పొరుగున పాకిస్తాన్లో, బంగ్లాదేశ్‌లో ఉగ్రవాదానికి ఆదరణ ప్రబలుతున్నప్పటికీ భారత ముస్లింలు అందుకు భిన్నంగా వ్యవహరించడం విశేషం. ఇదే భావన చెక్కుచెదరకుండా ఇంకా బలపడాలంటే ముస్లింలలో భద్రతాభావం పెరగాలి. వారి అభివృద్ధికి బాటలు పడాలి. ఈ భూమిపైన అయిదు వేల సంవత్సరాలుగా పరిఢవిల్లిన ఉదార సంస్కృతి కారణంగానే అక్బర్ అయినా నెహ్రూ అయినా లౌకికవాదాన్ని పాటించగలిగారనే వాదన ఇప్పుడు అవసరం లేదు. ప్రస్తుతం సమాజంలో మత ప్రాతిపదికపైన చీలికలు రాకుండా, ఘర్షణలు చెలరేగకుండా, మతాల మధ్య దూరాలు పెరగకుండా, ద్వేషాలు రగలకుండా ప్రభుత్వం సంయమనంతో వ్యవహరించాలి. ఉగ్రవాదాన్ని నిర్మూలించవలసిన అవసరాన్ని భారత ప్రధాని నరేంద్రమోదీ, బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్ లండన్ వెంబ్లీ స్టేడియం మహాసభలో నొక్కివక్కాణించిన తర్వాత కొన్ని గంటలకే ప్యారిస్ నగరంపైన ఉగ్రవాదం పంజా విసిరింది. శుక్రవారం రాత్రి ప్యారిస్‌లో ఫ్రాన్స్, జర్మనీ జట్ల మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్‌ని తిలకిస్తున్న ప్రేక్షకులపైనా, నృత్యసంగీత ప్రదర్శనలు జరుగుతున్న ఒక థియేటర్‌పైనా, మరి కొన్ని చోట్లా ఎనిమిది మంది ఐఎస్ఐఎస్ జిహాదీలు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 127 మందిని చంపివేశారు, రెండు వందలమందికి పైగా గాయపరిచారు. ఇది దిగ్భ్రాంతి కలిగించిన ఘోరకలే అయినప్పటికీ అనూహ్యమైనది కాదు. అగ్రవాదానికీ, ఉగ్రవాదానికీ మధ్య దశాబ్దాలుగా జరుగుతున్న నెత్తుటి క్రీడలో ఇది తాజా పరిణామం. ప్యారిస్‌కి లండన్ ఎంతో దూరం లేదు. అరవై వేలమందికి పైగా ప్రవాస భారతీయులు ఉన్న సభలో రెండు దేశాల ప్రధానులూ ఉన్నారు. వెంబ్లీ స్టేడియంలో సైతం చొరబడి విధ్వంసం సృష్టించే శక్తిసామర్థ్యాలు ఉగ్ర వాదులకు పుష్కలంగా ఉన్నాయి. ఈ సారి ఫ్రాన్స్‌ను దెబ్బతీయాలని ఉగ్రవాదులు నిర్ణయించుకోవడం వల్ల ఇండియా, బ్రిటన్ ప్రధానులకూ, ప్రవాస భారతీయులకూ అపకారం జరగలేదు. ఉగ్ర వాదుల దాడి జరిగినప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయీస్ హోలెండ్ ఫుట్‌బాల్ స్టేడియంలో ఉన్నారు. భద్రతా సిబ్బంది అధ్యక్షుడిని సురక్షితంగా బయటికి తీసుకొని వెళ్ళగలిగారు. అంత వరకూ అదృష్టం. ఇది మానవాళిపైన యుద్ధమని హోలెండ్ అభివర్ణిస్తూ ఉగ్రవాదు లకు తగిన గుణపాఠం చెబుతామంటూ ప్రతిజ్ఞ చేశారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా, జర్మనీ అధినేత మార్కెల్, బ్రిటన్, ఇండియా ప్రధానులూ, ఇతర ప్రపంచ దేశాల నాయకులూ ఉగ్రవాదుల ఘాతుకాన్ని నిర్ద్వంద్వంగా ఖండించారు. నిర్ఘాంతపోయిన అంతర్జాతీయ సమాజం అగ్రవాదం ప్రతిక్రియ ఎట్లా ఉండబోతున్నదోనని భయపడుతున్నది. ఎందుకు? 2001 సెప్టెంబర్ 11వ తేదీన న్యూయార్క్‌లోని వాణిజ్య కేంద్రాలైన జంట ఆకాశ హర్మ్యాలపైన అల్‌కాయిదా ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత నాటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్, బ్రిటిష్ ప్రధాని టోనీ బ్లెయిర్‌ల ప్రతీకార చర్యల పరంపర ఐఎస్ఐఎస్ పుట్టుకకు దారి తీసింది. అఫ్ఘానిస్తాన్పైన దాడిని సమర్థించుకోవచ్చు-అక్కడ అల్‌కాయిదా నాయకుడు ఒసామా బిన్ లాదెన్ స్థావరం ఉన్నది కనుక. కానీ ఉగ్రవాదంతో సంబంధం లేని ఇరాక్‌పైన దాడి చేయడం, అందుకు సాకుగా ఆ దేశాధినేత సద్దాం హుస్సేన్ రసాయనిక ఆయుధాలను తయారు చేసి సౌదీ అరేబియాపైనా, ఇతర అమెరికా మిత్ర దేశాలపైనా ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నాడంటూ ఒక నివేదికను సృష్టించడం ఉగ్రవాదానికి ఊతం ఇచ్చింది. సద్దాం హుస్సేన్‌తో పాటు వేలమంది అమాయక ఇరాకీలను అమెరికా, దాని మిత్రపక్షాలకు చెందిన సైనికులు చంపివేశారు. అనంతరం లిబియాలో గడాఫీ ప్రభుత్వాన్ని కూల్చివేయడంలోనూ అమెరికా పాత్ర ఉన్నది. గడాఫీకీ ఉగ్రవాదానికీ సంబంధం లేదు. అఫ్ఘానిస్తాన్‌లో సోవియెట్ యూనియన్ ప్రారంభించిన ఆధిపత్య పోరు అమెరికా, పాకిస్తాన్‌లు కలసి తాలిబాన్‌ను తయారు చేయడానికీ, అఫ్ఘానిస్తాన్ నుంచి సోవియెట్ యూనియన్ నిష్ర్కమణకూ, ఆ దేశంలో తాలిబాన్ పాలనకూ దారి తీసింది. ఇరాక్‌లో అత్యధిక భాగం ఇస్లామీయ రాజ్య వ్యవస్థాపన కోసం పోరాడుతున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అధీనంలో ఉన్నది. చమురు నిక్షేపాలపైన ఉగ్రవాద సంస్థ ఆధిపత్యం వల్ల నిధులకు కానీ ఆయుధాలకు కానీ కొరత లేదు. ఇస్లామీయ రాజ్య విస్తరణలో భాగంగా సిరియాలో ఉగ్రవాదులు భీకర సమరం చేస్తున్నారు. అటు రష్యా, ఇటు అమెరికా సిరియాపై యుద్ధవిమానాలు ప్రయోగించడం పట్ల నిరసనగానే ప్యారిస్ దాడులు చేసినట్టు ఐఎస్ఐఎస్ ప్రకటించింది. సిరియా అధ్యక్షుడు బషార్ అల్ అస్సద్ సైతం ఇదే కారణం ఎత్తి చూపించాడు. అస్సద్‌ను గద్దె దించేందుకు ఐఎస్ఐఎస్ సిరియాలో నరమేధం సాగిస్తోంది. అస్సద్ సైన్యంలో చీలిక వచ్చింది. అస్సద్‌ను రష్యా, ఇరాన్‌లు బలపర్చుతున్నాయి. అమెరికా, నేటో కూటమి ఒకేసారి అస్సద్‌నూ, ఐఎస్ఐఎస్నూ ఓడించే లక్ష్యంతో దాడులు జరుపుతున్నాయి. సిరియాలో అస్సద్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న మిలిటెంట్లకు అమెరికా, దాని మిత్రదేశాలు సకల విధ సహాయసహకారాలూ అందిస్తున్నాయి. రష్యా విమానాలు ఈ మిలిటెంట్లపైనే దాడులను కేంద్రీకరించాయి. ప్యారిస్‌లో ఉగ్రవాదులు దాడులు జరిపిన సమయంలో వియన్నాలో 20 దేశాల ప్రతినిధులు సమావేశమై సిరియాలో శాంతిసుస్థిరతలు సాధించడానికి ఏమి చేయాలో సమాలోచనలు జరుపుతున్నారు. ఈ సమావేశంలో సిరియా ప్రభుత్వ ప్రతినిధి లేరు. ఇరాన్, రష్యా ఒక వైపూ, అమెరికా, నేటో, అరబ్ దేశాలూ మరోవైపూ చేరి వాదులాడుకుంటున్నాయి. ప్యారిస్‌లో ఉగ్రవాదుల దాడి వల్ల సిరియాలో ఫ్రాన్స్ సైనిక చర్య నిలిచిపోయే ప్రసక్తి లేదంటూ ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి లారెంట్ ఫేబియన్ ఉద్ఘాటించారు. ఎవరి ప్రయోజనాలు పరిరక్షించుకోవడానికి వారు ప్రయత్నించినంత కాలం సమష్టి కార్యాచరణ కల్ల. అమెరికా, నేటో కూటమి, రష్యా, చైనా, ఇరాన్‌లు కలసి ఏదైనా వ్యూహం రూపొందించి పకడ్బందీగా అమలు చేస్తేనే ఐఎస్ఐఎస్ ఆటకట్టించడం సాధ్యం. శక్తిమంతమైన దేశాలు ఆధిక్య భావాన్ని తగ్గించుకొని సర్దుబాటు ధోరణి ప్రదర్శించవలసిన సమయం ఇది. ఇరాక్‌పైన యుద్ధం చేయడం ఘోరతప్పిదమనీ, రసాయనిక ఆయుధాల ఉనికి గురించిన నివేదిక తమను తప్పుదారి పట్టించిందనీ టోనీ బ్లెయిర్ ఇప్పుడు సారీ చెప్పినంత మాత్రాన జరిగిన నష్టం తగ్గిపోదు. బుష్ అటువంటి పశ్చాత్తాపం సైతం వెలిబుచ్చలేదు. వారిద్దరి దుందుడుకు నిర్ణయాల కారణంగానే ఈ రోజు ఇస్లామీయ రాజ్య ఉగ్రవాదం పెచ్చరిల్లుతున్నది. ఐఎస్ఐఎస్కు ఇప్పుడు ఒక రాజ్యం, ఆదాయ వనరు, ఒక సైన్యం, మధ్య ఆసియాలో, ఐరోపాలో, భారత ఉపఖండంలో ఉగ్రవాద సానుభూతిపరులూ, మతోన్మాదాన్ని యువత మస్తిష్కంలోకి ఎక్కించే తీవ్రవాదభావజాలం ఉన్నాయి. ఇందుకు ఎవరిని నిందించాలి? తాలిబాన్‌నూ, బిన్ లాదెన్నూ సృష్టించింది ఎవరు? ఏ ప్రయోజనాలను ఆశించి అరబ్ దేశాలలో తిరుగుబాట్లను ప్రోత్సహించారు? అగ్రదేశాల ఆధిపత్యవాదమే ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నది. సాంకేతిక విజ్ఞానం పెరిగిన తర్వాత ఉగ్రవాద భావజాల వ్యాప్తి వేగంగా, శక్తిమంతంగా సాగుతోంది. ఇటీవల జంషడ్‌పూర్‌లో కాన్వెంట్లో చదువుకుంటున్న ఒక ముస్లిం యువతి పేరుమోసిన జిహాదీ సిద్ధాంతకర్త అన్వర్ అల్ అవ్లాకీ ఉపన్యాసాలను యూట్యూబ్‌లో వింటున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలకు ఉప్పు అందింది. వారు వెళ్ళి ఆ విద్యార్థిని ప్రశ్నిస్తే అతని ఉపన్యాసాలు తనకు బాగా హృదయానికి హత్తుకుంటాయనీ, తనకు నచ్చిన ఉపన్యాసాలు వినడం నేరం ఎట్లా అవుతుందనీ ఎదురు ప్రశ్నించింది. అవ్లానీ అమెరికా పౌరుడు. మంచి పేరున్న విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. జిహాదీగా మారి ఉత్తేజపూరితంగా ప్రసంగాలు చేసే ప్రావీణ్యం సంపాదించాడు. అమెరికా డ్రోన్ విమానాలు 2011 సెప్టెంబర్‌లో జరిపిన దాడిలో ఈ జిహాదీ గురువు మరణించాడు. కానీ అతని ఉద్బోధలు ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లిష్ తెలిసిన ముస్లిం యువతీయువకులను జిహాదీ వైపు ఆకర్షిస్తూనే ఉన్నాయి. ఉత్తర సిరియాలో మొన్న అమెరికా నిర్వహించిన విమాన దాడులలో బ్రిటిష్ ఇస్లామిక్ స్టేట్ నాయకుడు ‘జిహాదీ జాన్’ (మహమ్మద్ ఎమ్వాజీ) మృత్యువాత పడ్డాడు. ఇందుకు ప్రతీకారం ఎప్పుడో ఎక్కడో జరుగుతుంది. ఇది ఇంతటితో ఆగే మారణహోమం కాదు. కింకర్తవ్యం? నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విదేశీ పర్యటనలలో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి చేస్తున్న ప్రసంగాలలో ఉగ్రవాదం గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. అమెరికా, బ్రిటన్, తదితర దేశాలతో కలిసి ఉగ్రవాదాన్ని మట్టుపెడతామంటూ ప్రకటనలు చేస్తున్నారు. అగ్రవాదంతో చేతులు కలిపినందుకే ఫ్రాన్స్ ఇప్పుడు మూల్యం చెల్లించిందని గమనించాలి. ఫ్రాన్స్ సైతం బహుళత్వానికి పెద్ద పీట వేసే దేశం. అన్ని దేశాలవారినీ, అన్ని మతాలవారినీ ఆదరించే సంస్కృతి ఆ దేశంలో ఉన్నది. ఐరోపా సాంస్కృతిక ఔన్నత్యానికి ప్రతీకగా ఫ్రాన్స్‌ను పరిగణిస్తారు. అమెరికా సంపదకూ, ఆధిక్య భావానికి ప్రతీకలైన న్యూయార్క్ జంట శిఖరాల కూల్చివేత, భారత వాణిజ్య కేంద్రమైన ముంబైలో మారణహోమం, ఇప్పుడు ముంబై తరహాలోనే ప్యారిస్‌లో రక్తపాతం- ఈ మూడూ అగ్రవాదంపైన ఉగ్రవాదం చేసిన సంకేత ప్రాయమైన దాడులుగానే పరిగణించాలి. ఉగ్రవాదులు ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు దాడులు చేయగల స్థితిలో ఉన్నారు. ఉగ్రవాద భావజాలాన్ని మనసంతా నింపుకొని ఆత్మాహుతికి సిద్ధమైనవారు తాము కూలిపోయే ముందు సాధ్యమైనంత ఎక్కువ మందిని చంపివేయడమే లక్ష్యంగా విచక్షణారహితంగా వ్యవహరిస్తారు. ప్యారిస్‌లో దాడికీ, ముంబయ్‌లో (2008 నవంబర్ 26న)దాడికీ పోలికలు ఉన్నాయని ఉగ్రవాదాన్ని అధ్యయనం చేస్తున్న జార్జిటౌన్ యూనివర్సిటీ (యూఎస్) ప్రొఫెసర్ బ్రూస్హాఫ్మన్ అన్నారు. ముంబై తరహాలో యూరప్ అంతటా దాడులు నిర్వహించాలని అయిదేళ్ళ కిందటే బిన్ లాదెన్ ఉగ్రవాద తండాలను ఆదేశించారని అమెరికా ప్రవీణుల సమాచారం. ఉగ్రవాదాన్ని అరికట్టడానికి విదేశీ వ్యవహారాలలో ఎటువంటి నీతిని పాటించాలో, ఉగ్రవాదం వేళ్ళూనకుండా నివారించడానికి దేశంలో ఎటువంటి విధానాలు అనుసరించాలో నరేంద్రమోదీ సర్కార్ ఆలోచించాలి. ముంబై మారణకాండకు సూత్రధారి అయిన పాకిస్తాన్ ఉగ్రవాద నాయకుడు హఫీజ్ సయీద్‌ని కానీ ముంబై అల్లర్లకు బాధ్యుడైన దావూద్ ఇబ్రహీంని కానీ ఇండియాకు అప్పగించమని అమెరికా కానీ బ్రిటన్ కానీ పాకిస్తాన్‌పైన ఒత్తిడి తీసుకొని రాలేదు. పైగా పాకిస్తాన్‌కు అమెరికా ఆర్థిక సహాయం, ఆయుధ సహాయం చేస్తూనే ఉన్నది. న్యూయార్క్‌లో దాడికి లేదా ప్యారిస్‌లో దాడికి స్పందించినంత తీవ్రంగా ముంబైలో దాడికి స్పందించలేదు. విదేశాంగ నీతిని నిర్ణయించుకునే క్రమంలో ఈ వాస్తవాలను గమనంలో పెట్టుకోవాలి. బహుళ మతాలూ, భాషలూ, సంస్కృతుల సమాహారమైన ఇండియా ఇటువంటి విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. అగ్రవాదంతో మమేకం కావడం వల్ల నష్టమే కానీ ప్రయోజనం లేదు. పొరుగున పాకిస్తాన్లో, బంగ్లాదేశ్‌లో ఉగ్రవాదానికి ఆదరణ ప్రబలుతున్నప్పటికీ భారత ముస్లింలు అందుకు భిన్నంగా వ్యవహరించడం విశేషం. ఇదే భావన చెక్కుచెదరకుండా ఇంకా బలపడాలంటే ముస్లింలలో భద్రతాభావం పెరగాలి. వారి అభివృద్ధికి బాటలు పడాలి. ఈ భూమిపైన అయిదు వేల సంవత్సరాలుగా పరిఢవిల్లిన ఉదార సంస్కృతి కారణంగానే అక్బర్ అయినా నెహ్రూ అయినా లౌకికవాదాన్ని పాటించగలిగారనే వాదన ఇప్పుడు అవసరం లేదు. ప్రస్తుతం సమాజంలో మత ప్రాతిపదికపైన చీలికలు రాకుండా, ఘర్షణలు చెలరేగకుండా, మతాల మధ్య దూరాలు పెరగకుండా, ద్వేషాలు రగలకుండా ప్రభుత్వం సంయమనంతో వ్యవహరించాలి. మతసామరస్యానికి భంగం కలిగించే ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం ఖండించాలి. అందుకు బాధ్యులైనవారిని శిక్షించాలి. ప్యారిస్ ఘోరం చూసిన తర్వాతనైనా ఈ సంకల్పం చెప్పుకోకపోతే, బాధ్యతారహితంగా మాట్లాడేవారినీ, ద్వేషభావంతో వ్యవహరించేవారినీ అదుపులో పెట్టకపోతే నిప్పుతో చెలగాటం ఆడినట్టే, ఉగ్రవాదానికి అవకాశం ఇచ్చినట్టే అవుతుంది. అదే జరిగితే ఈ దేశ సమైక్యతనూ, సమగ్రతనూ ఎవ్వరూ కాపాడలేరు. శాంతిసుస్థిరతలకు ఎవ్వరూ హామీ ఇవ్వలేరు. - కె.రామచంద్రమూర్తి -
ఓటమి ఎరుగని తెలుగు దర్శక ధీరుడు
-
అన్నీ నాన్న దగ్గరే నేర్చుకున్నా!
ఇంటర్వ్యూ శ్రుతిహాసన్... పేరు వినగానే ఓ సినిమా కుటుంబం గుర్తుకు వస్తుంది. చారుహాసన్, సుహాసిని తండ్రీ కూతుళ్ల తరం కాస్త కనుమరుగు కాగానే ఆ కుటుంబ వారసత్వాన్ని అందిపుచ్చుకుని కమల్‌హాసన్ కూతురు శ్రుతిహాసన్ అడుగుపెట్టింది. ఆ తండ్రి నుంచి ఈ కూతురు నేర్చుకున్న పాఠాలు, ఫార్ములాలు ఫాదర్స్ డే సందర్భంగా... ♦ చిన్నప్పుడు మీ నాన్నతో కలసి షూటింగ్స్‌కి వెళ్లేవారా? నేను చూసిన తొలి సినిమా షూటింగ్ నాన్నగారు చేసిన ‘విచిత్ర సోదరులు’. ఆ తర్వాత చాలాసార్లు వెళ్లాను. ♦ షూటింగ్ సమయంలో నాన్నను చూసినప్పుడు ఏమనిపించేది? అమ్మో! నాన్న చాలా డేరింగ్ అనుకున్నాను. ఓ సినిమా కోసం ఆయన సింహాలు, పులులతో కలసి నటించారు. అది చూసి థ్రిల్ అయ్యా. ♦ కమల్‌హాసన్ కూతురు అనే ట్యాగ్‌ను ఎదుర్కోవడం ఎలా ఉంది? ఇందులో కొంత సౌకర్యం ఉంటుంది, కొంత కష్టమూ ఉంటుంది. ఆయన మీద ఉన్న ఇష్టంతో ఆయన కూతురిననే అభిమానం నా మీద కూడా చూపిస్తారు. నేను నడుస్తున్నా, మాట్లాడుతున్నా, తింటున్నా ఆయనను పోలిన కదలికల కోసం చూస్తుంటారు. అదేమీ ఇబ్బంది కాదు. అయితే నేను నటించడానికి సీన్లోకి ఎంటర్ కాక ముందే నా ఫెర్ఫార్మెన్స్ని నాన్నతో పోల్చి చూడడానికి సిద్ధమైపోతుంటారు. అది కొంచెం కష్టంగా ఉంటుంది. ఆయన యాభై ఏళ్లకు పైగా నటిస్తున్నారు. అంతటి నటుడితో నన్నే కాదు, మరెవరినీ పోల్చలేం. ♦ ‘కమల్ కూతురు’ అనే ఇమేజ్ నుంచి బయటపడటానికి చాలానే కష్టపడి ఉంటారు? అవునండీ. అదైతే నిజమే. నాకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి చాలానే కృషి చేశాను. ఇప్పుడు అందరూ నన్ను నన్నుగానే గుర్తిస్తున్నారు. అందుకు సంతోషంగా ఉంది. ♦ పాత్రలపరంగా ప్రయోగాలు చేసే కమల్ జీవితంలో చేసిన ప్రయోగాలు ఏమైనా? ‘విశ్వరూపం’ సినిమా తీయడమే పెద్ద ప్రయోగం. దాని కోసం ఆయన చాలా ఆందోళన చెందారు. ♦ ఆ ప్రయోగం అనవసరమని మీకెప్పుడైనా అనిపించిందా? మా ఇంట్లో అందరికీ సినిమా అత్యంత ప్రధానమైనది. సినిమాని ఉన్నత స్థాయిలో ఉంచి గౌరవిస్తాం. అందుకోసం ఏం చేయడానికైనా వెనకాడం. ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తుంటాం. ♦ ఆ సినిమా విడుదలలో అవరోధాలు ఎదురైతే కుటుంబం పరిస్థితి ఏంటని మీకు భయం వేయలేదా? ఏ మాత్రం లేదు. నాన్న ఆర్థిక స్థితిగతులు వేరు, నావి వేరు. నా ఖర్చులు నేనే పెట్టుకుంటాను. నాన్న డబ్బు మీద ఆధారపడి మా ఖర్చులు పెంచుకోలేదెప్పుడూ. అందుకే అలాంటి భయానికి తావే లేదు. ♦ మీ సంపాదనను నాన్నగారితో చర్చిస్తారా? ఆయనెప్పుడూ అడగరు. మొదటి సినిమా నుంచే సొంతంగా మనీ మేనేజ్ మెంట్ చూసుకుంటున్నాను. నాన్న చిన్నప్పుడే మాకు బాధ్యతగా ఉండడం నేర్పించారు. చేతిలో డబ్బు ఉంది కదా అని దుబారా చేయడం అలవాటు కాలేదు. ♦ మీ అమ్మానాన్నలు విడిపోయిన తర్వాత మీరు ఎవరి దగ్గర పెరిగారు? ఇద్దరి దగ్గరా పెరిగాను, ఇద్దరితో మంచి అటాచ్మెంట్ ఉంది. అయితే అమ్మ దగ్గర చనువెక్కువ. నాన్న నుంచి నేర్చుకున్నవే ఎక్కువ. ♦ కథ ఎంపికలో, వస్త్రధారణ గురించి పేరెంట్స్ సలహాలిస్తుంటారా? ఎవ్వరూ ఇవ్వరు. కథ ఎంపిక పూర్తిగా నాదే. ఇక దుస్తుల ఎంపిక అనేది కథను బట్టి దర్శకులు నిర్ణయిస్తారు. ♦ ఈ రంగంలో గాసిప్లను ఎదుర్కోవడంలో మీ నాన్న అండ ఉంటుందా? సినిమా ఇండస్ట్రీని మధించిన వ్యక్తి కాబట్టి నాన్నకు అన్నీ అర్థమవుతాయి. సెలబ్రిటీల గురించి ఏదో ఒక కథనం అలా ప్రచారమవుతూ ఉంటుంది. వాటన్నింటినీ పట్టించుకోవడం నా పని కాదు. నటించడమే నా పని... ఇదీ నాన్న నుంచి నేర్చుకున్న పాఠమే. ♦ మీకు - మీ నాన్నగారికీ పూర్తిగా వైవిధ్యం ఉన్న అంశం ఒకటి చెప్తారా? నేను దేవుణ్ని బాగా నమ్ముతాను. ఆయన నమ్మరు. ♦ మీకు దేవుణ్ని నమ్మడం, భక్తి అమ్మ నుంచి అలవాటైందా? అమ్మ (సారిక) ఆధ్యాత్మికతను ఇష్టపడుతుంది, దేవుణ్ని నమ్ముతుంది. కానీ గుడికి వెళ్లదు. నేను గుడికి కూడా వెళ్తాను. ♦ ‘మా నాన్న గ్రేట్’ అని మీరు ఆనందపడిన సందర్భం? ఈ మధ్య నేను సినిమాలతో చాలా బిజీగా గడిపేయడాన్ని గమనించారు నాన్న. ఇలాగే కొనసాగితే నాలోని రైటర్ కనుమరుగవుతుందనుకుని నన్ను ‘రాయడం మానవద్దని’ హెచ్చరించారు. స్క్రిప్ట్ రైటింగ్ సాఫ్ట్వేర్, రైటింగ్ కోర్స్ మెటీరియల్ బహుమతిగా ఇచ్చారు. నన్ను ఇండిపెండెంట్‌గా ఉండమని, నా గురించి ఏదీ పట్టించుకోనట్లు కనిపిస్తూనే, నన్ను ఓ కంట కనిపెట్టే ఉన్నారనిపించి చాలా సంతోషం కలిగింది. రియల్లీ గ్రేట్ ఫాదర్. -
మన్మోహన్ వద్ద మోదీ పాఠాలు
ఆర్థికవృద్ధి ఎలా సాధించాలని అడుగుతున్నారు: రాహుల్ అందరి అభిప్రాయాలు వినడం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉంది ఆర్ఎస్ఎస్ క్రమశిక్షణ సాకుతో వ్యక్తిత్వాన్ని హత్య చేస్తోంది న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ వద్ద అర్థశాస్త్ర పాఠాలు నేర్చుకుంటున్నారని, దేశ ఆర్థికవృద్ధి సాధించడం ఎలా అని అడిగి తెలుసుకుంటున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎద్దేవా చేశారు. వ్యక్తిత్వాన్ని హత్య చేయటం ఆర్ఎస్ఎస్ విశ్వాసమని, ఆ ఆలోచనా విధానమే ఇప్పుడు దేశాన్ని పరిపాలిస్తోందని.. రైతుల నుంచి దుస్తుల వరకూ అంతా కేవలం ఒకే ఒక్క వ్యక్తికి తెలుసుననే భావన రాజ్యమేలుతోందని.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘ఆర్థికవ్యవస్థ ఆరోగ్య పరిస్థితిపై మాజీ ప్రధాని మన్మోహన్ నిన్న (బుధవారం) ఉద యం విమర్శలు చేస్తే.. సాయంత్రం ఆయన నుంచి మోదీ ఆర్థశాస్త్ర పాఠాలు చెప్పించుకున్నారు. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయటం ఎలా అని అడిగి తెలుసుకున్నారు’’ అంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో జరుగుతున్న కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ జాతీయ సదస్సు ‘దృష్టికోణ్’లో రాహుల్ గురువారం ప్రసంగిస్తూ.. మోదీ సర్కారు పైన, అధికార బీజేపీ సైద్ధాంతిక మార్గదర్శి ఆర్ఎస్ఎస్ పైన పదునైన విమర్శలు చేశారు. ‘‘గతంలో నాకు అర్థమయ్యేది కాదు. సభలో అటు వైపు నుంచి, ఇటు వైపు నుంచి రకరకాల అభిప్రాయాలు వినపడుతుండేవి. ఇదేంటి క్రమశిక్షణ తగ్గుతుందేమో అనుకునేవాడిని. కానీ అందరి వాణి వినడం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అని తరువాత నాకు అర్థమైంది. అన్ని వర్గాల అభిప్రాయాలను వినడం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఇమిడిఉంది. అంతర్గత ప్రజాస్వామ్యానికి, అంతర్గత చర్చకు అవకాశం ఉందని, అంతిమంగా అది ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయానికి దారితీస్తుందని అర్థమైంది. కానీ ఆర్ఎస్ఎస్ను చూడండి. ఆ ఆర్ఎస్ఎస్ శాఖను చూడండి. ఒక గీత గీస్తారు. ఆ గీత దాటితే లాఠీదెబ్బ పడుతుంది. వ్యక్తిత్వాన్ని హత్య చేసేందుకు క్రమశిక్షణను వారు సాకుగా చేసుకున్నారు. అదే భావజాలంతో ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ దే శాన్ని నడిపిస్తున్నాయి’’ అని విమర్శలు గుప్పించారు. ‘‘ఈ దేశంలో విభిన్న సంస్కృతులు, విభిన్న అవసరాలు, విభిన్న అభిప్రాయాలు ఉంటాయి. వాటిన్నంటినీ గౌరవించాల్సిన అవసరం ఉంది. కానీ బీజేపీలో అలా కాదు. విద్య గురించి అయినా ఒక్కరిదే నిర్ణయం. బట్టల గురించి అయినా ఒక్కరిదే నిర్ణయం. రైతుల గురించి అయినా ఒక్కరే మాట్లాడతారు. ఎవరూ మాట్లాడకూడదు.’’ అని వ్యాఖ్యానించారు. ‘‘నరేంద్రమోదీ ఫ్రాన్స్ వెళ్లారు. అమెరికా వెళ్లారు. మంగోలియా, చైనా వెళ్లారు. కానీ రైతులు, కూలీల ఇంటికి మాత్రం వెళ్లలేకపోయారు’’ అని విమర్శించారు. ‘‘ఆర్ఎస్ఎస్ శాఖలో ఎవరూ మాట్లాడకూడదు. అలాగే దేశంలో కూడా ఎవ్వరూ మాట్లాడకూడదు. దేశంలో విద్యారంగాన్ని ఆర్ఎస్ఎస్ తన గుప్పిట్లోకి తీసుకుంటోంది. ఆర్ఎస్ఎస్ తన ఆలోచనా ప్రక్రియను రుద్దుతున్న విద్యా సంస్థల్లో ఆ సంస్థతో పోరాడాలి’’ అని ఎన్ఎస్యూఐ కార్యకర్తలకు రాహుల్ పిలుపునిచ్చారు. -
చెన్నైలో అమ్మ క్యాంటీన్ల పరిశీలన
-
పాఠం చెప్పాల్సిందే..!
‘నేను హెడ్మాస్టర్ను.. పాఠాలు చెప్పడం నా బాధ్యత కాదు..’ అని అనుకుంటున్నారా? అయితే ఇక కుదరదు. ‘ఉపాధ్యాయులు పనిచేస్తున్నారా.. లేదా..? బడికి ఎవరు వచ్చినా.. నన్ను కలిసి వెళ్లాలి..’ అనే భావనను పక్కకు పెట్టాల్సిందే. టీచర్ల పర్యవేక్షణకు మాత్రమే పరిమితమైన ప్రధానోపాధ్యాయులు ఇక నుంచి పాఠాలు చెప్పాల్సిందే. వారి విధులపైన విద్యాశాఖ ప్రత్యేకదృష్టి సారించింది. ఇకనుంచి ప్రతిరోజు రెండు తరగతులు బోధించాల్సిందేనని మార్గదర్శకాలు జారీచేసింది. పాలమూరు: మారిన పాఠ్యప్రణాళిక, సమ గ్ర నిరంతర మూల్యాంకనం (సీసీఈ) విధానాన్ని అనుసరించి హెచ్ఎంలతో కూడా పాఠాలు చెప్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పర్యవేక్షణ విధులతోపాటు పలు కీలక బాధ్యతలు కూడా ఉన్నాయి. పాఠశాల యాజమాన్య క మిటీకి కన్వీనర్‌గా వ్యవహరించడంతో పాటు పాఠశాల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత వీరిది. పైగా వారానికి కనీసం 10తరగతులు బోధనచేసి పిల్లల సామర్థ్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం తప్పనిసరి. జిల్లాలో 565 ఉన్నత, 625 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 524 పీజీహెచ్ఎంలు, మరో 530కిపైగా ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు పనిచేస్తున్నారు. అయితే తాజాగా ప్రభుత్వ విద్యావిధానంలో సమూలమైన మార్పులు తెచ్చేందుకు నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ) సరికొత్త విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అందులో భాగంగానే ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా పాఠాలు బోధించాల్సిందేనని మార్గదర్శకాలు జారీచేశారు. తాజా మార్గదర్శకాలను అనుసరించి ప్రతీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కూడా తప్పనిసరిగా తమ సొంత పాఠశాలలో తరగతులు బోధించాలి. సీసీఈ విధానాన్ని అనుసరించి 6, 10 తరగతుల విద్యార్థులకు ప్రతీరోజు ఒక్కో తరగతి తీసుకోవాలి. అంటే ఉదయం ఒక తరగతి విద్యార్థులకు బోధిస్తే.. సాయంత్రం మరో తరగతి విద్యార్థులకు బోధించాల్సి ఉంటుంది. ఇలా వారానికి 14 తరగతులు తీసుకొని యూనిట్ ప్రణాళికను సిద్ధంచేయాలి. ఆ తర్వాత యూనిట్ ద్వారా విద్యార్థుల సామర్థ్యాన్ని తెలుసుకోవడం, అవసరమైతే పునశ్చరణ తరగతులు తీసుకోవాలని ఆదేశాల సారాంశం. అమలయ్యేనా? విద్యాశాఖ అధికారుల మార్గదర్శకాలను జిల్లాలో ఏ మేరకు అమలు చేస్తారన్నది అయోమయంగా మారింది. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు విధులకు సక్రమంగా వెళ్లకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీనికితోడు పలువురికి ఇన్చార్జ్ ఎంఈఓలుగా అదనపు బాధ్యతలు అప్పగించడంతో పాఠశాలల వైపు కన్నెత్తి చూడటం లేదనేది బహిరంగ రహస్యమే. వీటి నేపథ్యంలో జిల్లా అధికారవర్గాలు నిరంతర పర్యవేక్షణ చేస్తేనే ఈ నూతన విధానం సఫలీకృతమవుతోంది. -
కారు డ్రైవర్ చెప్పిన పాఠాలు
ప్రేరణ ఆయన వయస్సు ఇప్పుడు 61 ఏళ్లు. జుట్టు నెరిసిపోయింది. చూపు మందగించింది. ఆ వ్యక్తి దేశంలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థలో 25 ఏళ్లపాటు పనిచేశారు. ఆయన నుంచి నేను ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాను. అలాగనీ ఆయన భారీ వేతనం వచ్చే చాలా గొప్ప ఉద్యోగం చేసినవారు కాదు. పేరు కూడా మీరు ఇప్పటిదాకా విని ఉండరు. ఆయన నా కారు డ్రైవర్. పేరు కరుణన్.. జీవితంలో కొన్నిసార్లు విలువైన పాఠాలను సాధారణ వ్యక్తుల నుంచి కూడా నేర్చుకుంటాం. ఓ రోజు ఉదయం కరుణన్ నాతో చాలాసేపు మాట్లాడారు. తన జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పారు. కరుణన్గొప్ప కాలేజీల్లో ప్రముఖుల సమక్షంలో అతిథి ప్రసంగాలు చేయకపోయినా ఆయన నాతో చెప్పినవి నేటి యువతరానికి తప్పకుండా ఉపయోగడతాయి. ఏం చెప్పారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.. లెసైన్స్ వస్తే డ్రైవింగ్ వచ్చినట్టేనా? డ్రైవింగ్ లెసైన్స్ వచ్చినప్పుడు నా వయస్సు 18 ఏళ్లు. అంతకు కొన్ని నెలల ముందుగానే కారు నడపడం నేర్చుకున్నా. లెసైన్స్ వచ్చేయగానే డ్రైవర్ అయినట్లు కాదు. అది వాహనం నడపడానికి ఒక అనుమతి పత్రం మాత్రమే. అథారిటీ స్టాంప్ లాంటిది కాదు. కారును పూర్తిగా నడపడం వచ్చినవారే డ్రైవర్ తప్ప లెసైన్స్ సంపాదించుకున్నవారు డ్రైవర్ కాలేరు. ఎంబీఏ డిగ్రీ ఒక వ్యక్తిని మేనేజర్‌గా మార్చలేదు. కొన్నేళ్లు పని నేర్చుకొని, తగిన అనుభవం సంపాదిస్తేనే మేనేజర్ అనే హోదాను పొందుతారు. నేటితరం విద్యార్థులు డిగ్రీ చేతికి రాగానే అన్ని నేర్చుకున్నట్లేనని భ్రమపడుతున్నారు. కానీ, అది ముగింపు కాదు, ప్రారంభం మాత్రమే. ఒక డిగ్రీ, డిప్లొమా, లెసైన్స్... వాస్తవ జీవిత అనుభవాల నుంచి నేర్చుకొనేందుకు ఒక వ్యక్తికి తగిన అర్హత కల్పిస్తాయి. అంతేతప్ప పరిపూర్ణుడిగా మార్చలేవు. బాహ్య ప్రపంచం ఎంతో భిన్నం: నేను కారు నడపడం నేర్చుకున్నా. కానీ, నా తొలి ఉద్యోగం చిన్న టెంపో వాహనం నడపడం. కారుతో పోలిస్తే దీని స్టీరింగ్ చక్రం, గేర్లు చాలా భిన్నంగా ఉన్నాయి. నేను దీన్ని తేలికగా డ్రైవ్ చేస్తానని అనుకున్నా.. కానీ, కనీసం స్టార్ట్ కూడా చేయలేకపోయా. తరగతి గది బయట ఉండే ప్రపంచం చాలా భిన్నంగా ఉంటుంది. ఇంజనీర్లు, ఎంబీఏ గ్రాడ్యుయేట్లు, అకౌంటెంట్లు, ఇతరులు ఈ విషయం గుర్తుంచుకోవాలి. బయటి ప్రపంచాన్ని యథాతథంగా స్వీకరించడానికి సంసిద్ధులు కావాలి. కొన్ని మెట్లు కిందికి దిగండి: నేను రాత్రిపూట క్లీనర్‌గా కూడా పనిచేశా. వాహనాల లోపల ఉండే విడిభాగాలను పరిశీలించి, వాటి పనితీరును అర్థం చేసుకొనేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడింది. దానివల్ల నేను ఒక మంచి డ్రైవర్‌గా మారగలిగాను. దేశంలో నేడు పేరుప్రఖ్యాతులు సంపాదించిన మార్కెటింగ్ నిపుణులంతా ఒకప్పుడు చిన్నచిన్న పట్టణాల్లో సబ్బులు, కోలాలు, ఇతర వస్తువులు అమ్మినవారే. ఆ అనుభవం నుంచే వారు పాఠాలు నేర్చుకొని ఉన్నతస్థానాలకు ఎదిగారు. మీరు జీవితంలో విజయం సాధించాలని నిజంగా కోరుకుంటే.. మీ స్థాయి నుంచి కొన్నిమెట్లు కిందికి దిగండి. చేతులకు మరకలు అంటినా ఫర్వాలేదు బాగా కష్టపడండి. మంచి యజమాని.. విలువైన జీతం: నా మొదటి ఉద్యోగంలో వేతనం చాలాచాలా తక్కువ. కానీ, యజమాని చాలా మంచివాడు. పనిలో తప్పులు చేసినా సరిదిద్దుకోవడానికి ఆయన నాకు అవకాశాలిచ్చారు. యజమాని నుంచి నేర్చుకున్న మంచి విషయాలు మనసులో ముద్రించుకుపోయాయి. మీ తొలి ఉద్యోగంలో.. జీతభత్యాల గురించి, సంస్థ పరిమాణం గురించి ఎక్కువగా ఆలోచించకండి. మంచి యజమాని దొరికితే.. అంతకంటే విలువైన వేతనం ఉండదు. చేస్తున్న పనే ముఖ్యం: బాగా ఖరీదైన, విలాసవంతమైన కార్లనే నడపాలనే కోరిక నాలో ఉండేది. ప్రారంభంలో టెంపో, స్కూల్ వ్యాన్, సిటీ బస్సు నడపాల్సి వచ్చింది. వాహనం ఏదైనప్పటికీ డ్రైవింగ్‌పైనే దృష్టి పెట్టాను. తర్వాత గొప్ప కార్లను నడిపే అవకాశాలు వచ్చాయి. కంపెనీ ముఖ్యం కాదు, చేస్తున్న పనే ముఖ్యం. తర్వాత రాబోయే ఉద్యోగం, పదోన్నతులు, వేతనాల గురించి ఆలోచించకుండా ఎప్పుడైనా, ఎక్కడైనా.. అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తిచేసేందుకు చిత్తశుద్ధితో కృషిచేస్తే విజయం, ఆనందం వాటంతట అవే అనివార్యంగా వస్తాయి. -‘కెరీర్స్ 360’ సౌజన్యంతో -
కుర్చీలాట!
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, న్యూస్‌లైన్: రాజకీయ నాయకులు కుర్చీకోసం కొట్లాడం విన్నాం.. కా నీ పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయినులు కూడా కుర్చీకోసం కొట్లాడుతున్నారు. కుర్చీ నాదంటే నాదంటూ ఆధిపత్యపో రు రగులుతోంది. పాత మేడం ఆడుకోమ్మని చెబితే..కొత్తమేడం చదువుకోమ్మని చెబుతోంది. ఇదీ ప్రస్తుతం కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో జరుగుతోన్న తతంగం. విద్యాలయాల నిర్వహణ కోసం ప్రత్యేకాధికారుల(ఎస్ఓ)ను నియమించారు. జిల్లాలో 65 కస్తూర్బా విద్యాలయాల్లో 6 నుంచి 10 తరగతి వరకు 11,955 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. డ్రాపౌట్స్ సంఖ్యను తగ్గించడంతో వృత్తివిద్యతో కూడిన శిక్షణను అందిస్తున్నారు. ప్రా రంభం నుంచి కొంతమంది టీచర్లకు డిప్యూటేషన్‌పై ఎస్‌ఓలుగా నియమించారు. అదేవిధంగా పదవి విరమణ పొందిన, గెజిటెడ్ హెచ్ఎంలకు ఎస్‌ఓలుగా అవకాశం ఇచ్చారు. గతేడాది కొత్తగా ఎ స్ఓలను నియమించాలని ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించిన పరీక్షలో 65 మంది ఎస్‌ఓలుగా ఎంపికయ్యారు. కాగా, పాతవారిని రిలీవ్ చేయకుండానే ప్రభుత్వం కొత్తవారిని నియమించింది. పైగా పాతవారు 9,10 తరగతులు బోధిస్తూ అక్కడే ఉండాలని ఆదేశాలిచ్చారు. కానీ పాత ఎస్ఓలు తాము విధుల నుంచి వెళ్లేదిలేదని కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. విద్యాలయాలను ప్రస్తుతం పాతవారే నిర్వహిస్తున్నారు. కష్టపడి చదివి ఉద్యోగం సాధించుకున్న ఎస్ఓలకు ఏంచేయాలో దిక్కుతోచడం లేదు. పెద్దమందడి, తలకొండపల్లి, కొల్లాపూర్‌లలో పాత ఎస్‌ఓలే విధులు నిర్వహిస్తున్నారు. అలంపూర్, మానవపాడు, కొత్తూరులో మాత్రమే కొత్త ఎస్ఓలు విధులు కొనసాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మిగతా 60 కస్తూర్బాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఖిల్లాఘనపురం కస్తూర్బా విద్యాలయంలో 180 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ప్రారంభం నుంచి ఎస్ఓగా అభిషేకమ్మ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల మరో ఎస్ఓ ప్రశాంతిని అధికారులు నియమించారు. కొత్త అధికారి వచ్చిననాటి నుంచి అసలు కథ ప్రారంభమైంది. ఓ మేడం ఆడుకోమని చెబితే మరో మేడం చదువుకోమ్మని చెబుతున్నారు. గతకొన్ని రోజులుగా వీరిద్దరు వేర్వేరు గదుల్లో కుర్చీలు విధులు నిర్వహిస్తున్నారు. ఒకరంటే మరొకరి పడటం లేదు. దీంతో ఇద్దరి మధ్య విద్యార్థినులు నలిగిపోతున్నారు. మిడ్జిల్ కస్తూర్బా విద్యాలయంలో 200 మంది విద్యార్థినులు ఉన్నారు. గతేడాది నుంచి వెల్దండ మండలం పెద్దపూర్ ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయినిగా పనిచేస్తున్న జయకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఇదిలాఉండగా, గతనెల రోజుల క్రితం రోజా అనే ప్రత్యేకాధికారికి ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారు. కానీ జయకు మాత్రం రిలీవ్ఆర్డర్ ఇవ్వలేదు. తానే ప్రత్యేకాధికారిని అంటూ కొత్త అధికారిణి కుర్చీలో కూర్చోగా, పాత అధికారిణి కూడా తనకు ఇంకా రిలీవ్ఆర్దర్ రాలేదని మొండికేసి కూర్చున్నారు. విద్యాలయంలో రికార్డులను నేటికీ అప్పగించకపోవడంతో కొత్త అధికారిణి అందులో పనిచేసే సిబ్బందిచేత కొత్త రిజిస్టర్లో సంతకాలు పెట్టిస్తున్నారు. పాత ప్రత్యేకాధికారి మరో రిజిస్టర్లో సంతకాలు చేయిస్తున్నారు. ఏజేసీ ఏమన్నారంటే.. ఆర్వీఎం ఇన్చార్జి పీఓ, ఏజేసీ డాక్టర్ రాజారాంను వివరణ కోరగా.. ఘనపూర్ సంఘటన దృష్టికి వచ్చిందని పాతవారిని తొలగించి కొత్తవారిని నియమించాలనే ఉద్దేశంతోనే కొత్తవారిని నియమించాం. కానీ కోర్టు నుంచి పాతవారు స్టే తెచ్చుకోవడం వల్ల ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. ఘనపూర్‌లో పాత ఎస్ఓ కొత్త ఎస్ఓకు చార్జీ ఇచ్చి మళ్లీ ఇబ్బందులకు గురి చేయడం సరికాదు. సమన్వయంతో పనిచేయాలి. రోడ్డెక్కిన కేజీబీవీ విద్యార్థినులు ఖిల్లాఘనపురం : ఇద్దరు ప్రత్యేకాధికారుల మధ్య నలిగిపోతున్నామని, ఎవరి మాట వినాలో తెలియక సతమతమవుతున్నామని స్థానిక కస్తూర్బాగాంధీ విద్యాలయం విద్యార్థినులు మంగళవారం రోడ్డెక్కారు. ప్లకార్డులు చేతబూని నిరసనకు దిగారు. టిఫిన్చేయకుండా తమ ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థునులు తమ ఆక్రందనను వెళ్లగక్కారు. పాఠశాల ప్రారంభం నుంచి ఎస్ఓగా అభిషేకమ్మ ఉన్నారని, ఇటీవల మరో ఎస్ఓగా ప్రశాంతి వచ్చారని తెలిపారు. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న పాఠశాలలో గొడవలు ప్రారంభమయ్యాయని వాపోయారు. ‘పాత ఎస్ఓ కూర్చోమంటే కొత్త ఎస్ఓ నిల్చోమంటారు. ఒకరు ఆడుక్కోమంటే మరొకరు వద్దంటున్నారు. ఎవరిమాట వినాలో తెలియక తీవ్ర మనోవేదనకు గురవుతున్నాం’ అని పలువురు కన్నీరుపెట్టారు. కొత్త ఎస్ఓ తమపట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. పాత ఎస్ఓను కొనసాగించాలని కోరారు. పరీక్షలు దగ్గరపడుతున్నాయని, తమను ఇబ్బంది పెట్టొద్దని విజ్ఞప్తిచేశారు. తహశీల్దార్ రమేష్, ఏఎస్ఐ ప్రేమ్‌రాజ్‌లు విద్యార్థినుల వద్దకు చేరుకుని వారికి నచ్చజెప్పారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. -
అగస్టా చెప్పే గుణపాఠం!
కుంభకోణం ముసురుకున్న అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల ఒప్పందం ఎట్టకేలకు రద్దయింది. ఈ ఒప్పందంలో రూ.362 కోట్లు చేతులు మారాయని దాదాపు రెండేళ్ల క్రితమే ఇటలీ మీడియా వెల్లడించి అందరినీ దిగ్భ్రాంతిపరిచింది. అయినా ఒప్పందం రద్దు చేయడానికి యూపీఏ ప్రభుత్వం ఇంత సమయం తీసుకున్నది. మొదటగా స్కాం బయటపడినప్పుడు ఇక్కడ చడీ చప్పుడూ లేదు. అందుకు భిన్నంగా ఇటలీ ప్రభుత్వం వెనువెంటనే దర్యాప్తునకు ఆదేశించింది. చివరకు నిరుడు ఫిబ్రవరిలో హెలికాప్టర్ల సంస్థ ఫిన్మెకానికా సంస్థ చైర్మన్ గిసెప్పీ ఓర్సీని, ఆ సంస్థ సీఈఓ బ్రూనో స్పాగ్నోలినీని అరెస్టుచేశాక మన ప్రభుత్వంలో కదలిక వచ్చింది. సరిగ్గా పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా జరిగిన ఈ పరిణామంతో అప్రమత్తమై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాదు... ఒప్పందాన్ని తాత్కాలికంగా స్తంభింపజేస్తున్నామనీ, సీబీఐ దర్యాప్తు పూర్తయిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలియజేసింది. పార్లమెంటులో ఎంతో రభస జరిగితే తప్ప, కనీసం ఒకటి రెండు రోజులు అది వాయిదాల్లో గడిచిపోతే తప్ప స్పందించని సర్కారు తనంత తానుగానే, ఎవరూ కోరకుండానే అగస్టా స్కాంపై చురుగ్గా స్పందించడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటికింకా దర్యాప్తు పూర్తికాకపోయినా గత కొన్ని నెలలుగా సాగుతున్న పరిణామాలు ఒప్పందం రద్దుకు దోహదపడ్డాయి. వాస్తవానికి ఈ కేసులో సీబీఐ ఇంకా ఎలాంటి అరెస్టులూ చేయలేదు. కోర్టుకు చార్జిషీటు కూడా సమర్పించలేదు. ఈ స్కాంలో వైమానిక దళ ప్రధానాధికారి ఎస్పీ త్యాగి పాత్ర ఉన్నదని ఆరోపణలు రావడం, ఆయన సన్నిహిత బంధువులిద్దరికి దీనితో నేరుగా సంబంధం ఉన్నదని కథనాలు వెలువడటం సంచలనం కలిగించింది. రాష్ట్రపతి, ప్రధాని వంటి అత్యంత ప్రముఖులు వినియోగించడానికి ఉద్దేశించిన ఈ హెలికాప్టర్ల కొనుగోలు ప్రక్రియ ఆద్యంతమూ అనుమానాలను రేకెత్తించేదిగానే ఉంది. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన జరిగింది. కాగ్ నివేదిక వీటన్నిటినీ ఏకరువుపెట్టింది. రూ.793 కోట్లతో డజను హెలికాప్టర్లను కొనాలని తొలుత నిర్ణయించగా, ఒప్పంద సంప్రదింపుల కమిటీ దాన్ని రూ.4,877 కోట్లకు పెంచడాన్ని ఎత్తిచూపింది. చివరకు అగస్టా సంస్థ వాటిని తాము రూ. 3,966 కోట్లకే ఇస్తామని చెప్పడాన్ని ప్రస్తావించింది. ఒప్పందం కుదిరే సమయానికి అది రూ.3,660 కోట్లు కావడంలో నాటకీయత దాగుంది. రూ. 4,877 కోట్ల వ్యయం అనుకున్నది కాస్తా ఒక్కసారిగా రూ.1,200 కోట్లు తగ్గిపోవడంవల్ల ఎవరి అనుమానపు దృక్కులూ తమపై పడవని దళారులు భావించి ఉంటారు. ఈ ముసుగులో సరిగ్గా అగస్టాకు సరిపడేలా నిబంధనలు మార్చారు. తొలుత 19,685 అడుగుల ఎత్తు ఎగిరేలా ఉన్న నిబంధనలు కాస్తా 15,000 అడుగులకు దిగొచ్చాయి. ఇక సామర్ధ్య పరీక్షల విషయంలో కూడా అగస్టాకు ఎక్కడలేని వెసులుబాటూ ఇచ్చారు. ఒకపక్క అగస్టాతో పోటీపడ్డ అమెరికా సంస్థ సికోర్స్కీ తమ హెలికాప్టర్ల విషయంలో అవసరమైన సామర్ధ్య పరీక్షలకు సిద్ధంగా ఉన్నామని చెప్పగా అగస్టా మాత్రం తమదింకా అభివృద్ధి దశలోనే ఉన్నదంటూ నాన్చింది. చివరకు ఆ సంస్థ అప్పటికే ఉత్పత్తి చేస్తున్న మరో హెలికాప్టర్ పనితీరును చూసి అభివృద్ధి దశలో ఉన్న హెలికాప్టర్‌కు అంగీకారం తెలిపారన్నది కాగ్ అభియోగం. పైగా, ఆ హెలికాప్టర్ మన వాతావరణంలో ఎలా పనిచేస్తున్నదో చూడాలన్న ఆలోచన తట్టలేదు. వీవీఐపీల కోసం ఉద్దేశించిన హెలికాప్టర్ కొనుగోలులో కూడా ఇంత అజాగ్రత్తను ప్రదర్శించడం వింత గొలుపుతుంది. పోటీలో ఇద్దరున్నప్పుడు ఇద్దరికీ సమాన స్థాయిలో నిబంధనలు విధించి, సామర్థ్యాన్ని పరీక్షించవలసి ఉండగా ఒకరి విషయంలో ఇంతటి విశాల దృక్పథం కనబరచడం ఎన్నో అనుమానాలను రేకెత్తించి ఉండాల్సింది. రక్షణమంత్రిగా సచ్చీలుడుగా పేరున్న ఏకే ఆంటోనీ ఉండగానే ఇది ఇలా సాగిపోవడం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. రక్షణ కొనుగోళ్లలో స్కాంలు జరగడానికి వీల్లేదన్న దృఢ సంకల్పంతోనే నిజాయితీపరుడిగా పేరున్న ఆంటోనీకి ఆ పదవిని అప్పగించామని కాంగ్రెస్ పెద్దలు ఎన్నోసార్లు చెప్పారు. కానీ, ఆచరణకొచ్చేసరికి దళారుల రాజ్యమే సాగిందని అర్ధమవుతుంది. వ్యవహారాలను చక్కబెట్టడంలో ఆరితేరిన దళారులు ఆంటోనీని మాయ చేయడంలో విజయం సాధించారనుకున్నా... ఇటలీలో స్కాం సంగతి వెల్లడైన పది నెలలకుగానీ ఇక్కడ కదలిక లేదేమన్న అనుమానం తలెత్తుతుంది. ఆ సంస్థ చైర్మన్, సీఈఓలు అరెస్టయ్యేవరకూ ప్రభుత్వం చర్యలకు ఎందుకు దిగలేదని అడిగితే ఈ కాలమంతా తాము స్కాం ఆనుపానులు తెలుసుకోవడానికి ప్రయత్నించామని ఆంటోనీ చెప్పారు. సమస్త యంత్రాంగమూ అందుబాటులో ఉన్న ప్రభుత్వం అందుకు పది నెలల వ్యవధి తీసుకోవడం ఆశ్చర్యకరమే. ఇలాంటి అంశాలను సీబీఐ ఎంతవరకూ పరిగణనలోకి తీసుకున్నదో తెలియదు. ఒప్పందంలో భాగంగా ఇప్పటికే మూడు హెలికాప్టర్లు మన వైమానిక దళానికి చేరాయి. ఒప్పందాన్ని స్తంభింపజేసినట్టు మన దేశం ప్రకటించడంతో తాము మధ్యవర్తిత్వానికి వెళ్తున్నట్టు ఫిన్మెకానికా గత అక్టోబర్‌లో తెలిపింది. తదుపరి చర్యగా మన ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దుచేసుకుంది. ఈ చర్యవల్ల ఇటలీ సంస్థకు నష్టపరిహారం చెల్లించవలసిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. అంటే దళారులు భోంచేసిన రూ.360 కోట్లకు ఇది అదనమన్నమాట. అసలు ఒప్పందాలు కుదుర్చుకోవడంలో పాటిస్తున్న గోప్యత ఇలాంటి స్కాంలకు ఆస్కారమిస్తున్నది. 2 జీ స్కాం మొదలుకొని నిన్నమొన్నటి బొగ్గు స్కాం వరకూ పారదర్శకత లేమివల్లే సమస్యలు తలెత్తుతున్నట్టు అర్ధమవుతూనే ఉంది. కానీ, యూపీఏ సర్కారు ఆ దిశగా దృష్టిపెట్టడంలేదు. అందువల్లే ప్రతిచోటా స్కాంలు ప్రత్యక్షమవుతున్నాయి.ఇకనైనా ఒప్పంద ప్రక్రియలో లొసుగులకు ఆస్కారమీయని విధానాన్ని రూపొందించాలి. అప్పుడు మాత్రమే పరిస్థితి చక్కబడుతుంది. -
పత్రం..అక్రమం!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: బడికి వెళ్లక్కరలేదు.. పాఠాలు వినాల్సిన అవసరం లేదు..డబ్బిస్తేఎంచక్కా మీరు ఆ పాఠశాలలో చదివినట్లు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేస్తున్నారు. ఇందుకు విద్యాశాఖలో కొందరు అధికారులు సహాయ సహకారాలు అందిస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి. గురువారం ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. దీనిపై కర్నూలు విద్యాశాఖ కార్యాలయంలో విచారణ ప్రారంభమైంది. డీఈవో నాగేశ్వరరావు స్వయంగా ఈ విచారణలో పాల్గొన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి..ఎమ్మిగనూరు పరిధిలోని నవోదయ పాఠశాలలో తమ చిన్నారులకు సీటు సంపాదించుకోవాటానికి అనేక మంది పోటీ పడుతున్నారు. రూరల్ పరిధిలో చదుకునేవారికి 70శాతం రిజర్వేషన్ ఉంది. దీంతో అనేక మంది పట్టణ వాసులు రూరల్‌లో చదువుకున్నట్లు స్టడీ సర్టిఫికెట్స్ కోసం స్థానిక పాఠశాలలను ఆశ్రయిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల అవసరాలను గుర్తించిన కొందరు ప్రధానోపాధ్యాయులు బోగస్ సర్టిఫికెట్స్ ఇచ్చి వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. విషయాన్ని గమనించిన మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామానికి చెందిన కె. రాగన్నశెట్టి ఈ అక్రమాలను బయటపెట్టాలని తలంచాడు. తన కుమారుడు కర్ణాటకలో చదువుతున్నాడని, వాడు ఇక్కడే చదివినట్లు సర్టిఫికెట్ ఇవ్వమని చిలకలడోణలోని మండల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయున్ని కలిశారు. అప్పటి ప్రధానోపాధ్యాయుడు రూ.500 తీసుకుని ఆ పాఠశాలలో 1999 నవంబర్‌లో ఐదో తరగతి పూర్తి చేసుకున్నట్లు ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. దానిపై వేసిన అడ్మిషన్ నంబర్ ప్రకారం అదే తేదీన ఎవరు సర్టిఫికెట్ పొందారో తెలుసుకునేందుకు ఆయన సమాచార హక్కుచట్టాన్ని ఆశ్రయించారు. ఇదే నంబర్‌పై గోనె భీమన్న అనే విద్యార్థి 1997 ఏప్రిల్ 24న ఐదో తరగతి పూర్తి చేసుకున్నట్లు తెలిసింది. ఆ వివరాలను తీసుకుని అప్పటి జిల్లా విద్యాశాఖాధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపై డిప్యూటీ డీఈఓ మూడు పర్యాయాలు ఆ పాఠశాలకు వెళ్లి విచారించినట్లు కె. రాగన్నశెట్టికి వివరణ పంపారు. అందులో ఫిర్యాదు దారుడితే తప్పని తేల్చారు. అఆగే కె. రాగన్నశెట్టిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో ఆయన కలెక్టర్, ఆర్జేడీ (కడప), డెరైక్టర్, ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, విద్యాశాఖ, సమాచారశాఖ కమిషనర్‌ను ఆశ్రయించారు. అలాగే తనకు తప్పుడు ధ్రువీకరణ పత్రం ఇచ్చిన ప్రధానోపాధ్యాయుడు పీటర్.. 2001 జూన్‌లో రిటైర్మెంట్ తీసుకుని ప్రస్తుతం ప్రకాశం జిల్లా గిద్దలూరు ఉపఖజానా కార్యాలయం ద్వారా పెన్షన్ పొందుతున్నట్లు ఆధారాలు సంపాదించారు. ఈ వివరాలతో లోకాయుక్తను ఆశ్రయించారు. వారి ఆదేశాల మేరకు గురువారం డీఈవో కార్యాలయంలో విచారణ ప్రారంభించారు. ఫిర్యాదు దారుడు ఇచ్చిన ఆధారాలను, అధికారులు ఇచ్చిన వివరాలను డీఈఓ నాగేశ్వరరావు పరిశీలించారు. విచారణ పూర్తి కావాటానికి మరి కొంత సమయం పడుతుందని తెలిపారు. -
ప్రైవేటు వ్యక్తితో పిల్లలకు విద్యాబోధన
చిలుకూరు, న్యూస్‌లైన్ : అతను ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. సీనియర్ కావడంతో వేతనమూ ఎక్కువే. రోజూ పాఠశాలకు వెళ్లడం బోర్ కొట్టింది కాబోలు. మండల స్థాయి అధికారులను, తోటి ఉపాధ్యాయులను మచ్చిక చేసుకున్నాడు. ఓ ప్రైవేటు వ్యక్తిని తన స్థానంలో ఉపాధ్యాయుడిగా నియమించాడు. సొంతంగా వేతనం ఇస్తూ పాఠాలు చెప్పిస్తున్నాడు. ఇతను మాత్రం నెలనాడు ప్రభుత్వ వేతనం తీసుకుంటూ విద్యావ్యవస్థను మోసం చేస్తున్నాడు. గ్రామస్తులకు విషయం తెలియడంతో అతని నిర్వాకం బయటికి పొక్కింది. చిలుకూరు మండలం ఆర్లెగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో ఆరుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఇందులో ఓ సీనియర్ ఉపాధ్యాయుడి వేతనం అక్షరాల 53వేల రూపాయలు. మండలంలోనే అత్యధిక వేతనం ఇది. ఇంత జీతం తీసుకుంటూ పాఠశాలకు రాడు. మండల అధికారిని, పాఠశాల ఉపాధ్యాయులను మచ్చిక చేసుకున్నాడు. ప్రైవేటు వ్యక్తిని తన స్థానంలో నియమించుకున్నాడు. అతనికి నెలకు రూ.3వేల వేతనం ఇస్తూ విద్యాబోధన చేయిస్తున్నాడు. ఈ వ్యవహారం కొన్ని నెలలుగా సాగుతున్నట్టు తెలిసింది. అందరినీ మచ్చిక చేసుకోవడంతో విషయం బయటికి పొక్కలేదు. ఇటీవల గ్రామస్తులకు ఈ విషయం పూర్తిస్థాయిలో తెలిసింది. దీంతో కొంతమంది శనివారం పాఠశాలకు వెళ్లి ప్రధానోపాధ్యాయుడితో ఘర్షణకు దిగారు. ఉపాధ్యాయుడి నిర్వాకాన్ని కలెక్టర్, డీఈఓ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించి వెళ్లారు. కాగా సదరు ఉపాధ్యాయుడికి గ్రామస్తులు ఘర్షణకు దిగిన విషయం తెలియడంతో వెంటనే చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు పైరవీ చేస్తున్నట్టు సమాచారం. ఎంఈఓ వివరణ ఈ విషయమై ఎంఈఓ ఈశ్వర్రావును వివరణ కోరగా ఆర్లెగూడెం పాఠశాలలో ప్రైవేటుగా వ్యక్తిని నియమించి పాఠాలు బోధించడంతో నిబంధనలకు వ్యతిరేకమని తెలిపారు. దీనిపై గ్రామస్తులు గొడ వ చేసిన మాట వాస్తవమేనన్నారు. వెంటనే సదరు ప్రైవేటు వ్యక్తిని తొలగిస్తామని, ఉపాధ్యాయుడు సోమవారం నుంచి పాఠశాలకు రావాలని చెప్పినట్టు తెలిపారు. -
జనరల్ అవేర్నెస్ పాఠాలు
1. To review tax laws and suggest ways for a stable and non-adversarial tax administration, the Government of India on August 26, 2013 set up a Tax Administration Reform Com mission (TARC) under the Chairmanship of? 1) Parthasarathy Shome 2) Y.G.Parande 3) S.S.N. Moorthy 4) M.R.Diwakar 5) None of these 2. National Media Center was inaugurated by the Prime Mini ster Dr. Manmohan Singh and UPA Chairperson Sonia Gan dhi on August 24, 2013 in which of the following cities? 1) Hyderabad 2) New Delhi 3) Mumbai 4) Chandigarh 5) Bangalore 3. Who has been chosen for 2012-13 Rajiv Gandhi Khel Ratna, India's highest honour for a sportsperson? (The award will be given on August 31, 2013) 1) Krishna Poonia 2) Gagan Narang 3) Ronjan Sodhi 4) P.V.Sindhu 5) Vijay Kumar 4. Who is the author of the book "My Journey: Transforming Dreams into Actions"? (It was launched in August 2013) 1) Amartya Sen 2) Barack Obama 3) Tony Blair 4) A P J Abdul Kalam 5) Pranab Mukherjee 5. As per a Global digital measur ement and analytics ComScore report released in August 2013, what is India's rank in Internet usage? 1) First 2) Second 3) Third 4) Fourth 5) Fifth 6. Telugu novelist Malathi Chan dur passed away in August 2013. She was a winner of? 1) Jnanpith Award 2) Vyas Samman 3) Saraswati Samman 4) Sahitya Akademi Award 5) None of these 7. Head Office of which of the following banks is in Delhi? 1) UCO Bank 2) Bank of India 3) Corporation Bank 4) United Bank of India 5) Punjab National Bank 8. Pakistan is a member of? 1) ASEAN 2) APEC 3) NATO 4) OPEC 5) SAARC 9. Who is the author of the book 'Diamond Dust'? 1) Salman Rushdie 2) Anita Desai 3) Chetan Bhagat 4) Arundhati Roy 5) Rashmi Bansal 10. Which of the following is the name of a country? 1) Afghani 2) Peso 3) Zagreb 4) Botswana 5) Brasilia 11. Which of the following terms is not used in Banking/Finance? 1) Letter of Credit 2) LIBOR 3) Back up guarantee 4) Factoring services 5) Polymerization 12. Which Russian city will host the 2015 World Aquatic Cham pionships? 1) Kazan 2) Samara 3) Omsk 4) Perm 5) Volgograd 13. 'Copa America', an internatio nal tournament involving 12 teams, is associated with? 1) Basketball 2) Football 3) Tennis 4) Golf 5) Snooker 14. Which of the following terms is used in the field of Banking /Finance? 1) Amendment 2) Reflex Action 3) Dribble 4) Active Asset 5) None of these 15. SAFTA is a trade agreement among the members of? 1) G8 2) G20 3) BRICS 4) SAARC 5) ASEAN 16. The Head of the Public Sector Bank in India is designated as? 1) Governor 2) President 3) Vice President 4) Chief Executive Officer 5) Chairman and MD 17. Who among the following is a famous economist? 1) John Milton 2) John Keats 3) Thomas Malthus 4) Robert Frost 5) O Henry 18. World Ozone Day is celebrated on? 1) September 8 2) November 8 3) November 16 4) September 16 5) September 27 19. The capital of Vietnam is? 1) Phnom Penh 2) Jakarta 3) Manila 4) Hanoi 5) Yangon 20. The term 'Insider Trading' is associated with? 1) Insurance 2) Defense 3) Stock market 4) Parliament 5) Journalism 21. Which of the following is a major function of the Reserve Bank of India? 1) Regulating stock exchanges 2) Deciding foreign trade policy of India 3) Preparing Union Budget 4) Framing Fiscal policy 5) None of these 22. Which of the following coun tries is a member of OPEC? 1) Jordan 2) Libya 3) Syria 4) Bangladesh 5) Bahrain 23. Cotton is normally grown in? 1) Red soil 2) Yellow soil 3) Regur soil 4) Laterite soil 5) Sand 24. Buddh International Circuit is related to? 1) Cricket 2) Hockey 3) Football 4) Formula One 5) Lawn Tennis 25. Which of the following is an advance to priority sector by the banks? 1) Loan to a sick industry 2) Loan given to purchase a house 3) Loan to farmers for agricultu ral purpose 4) Loan to establish a hospital in a city 5) None of these 26. Who is the author of the book 'Inside the Third World: The Anatomy of Poverty'? 1) Paul Harrison 2) Paul Krugman 3) Amartya Sen 4) William Golding 5) Gunnar Myrdal 27. Which was the principal plant used in Green Revolution? 1) Japonica Rice 2) Indian Rice 3) Emmer Wheat 4) Mexican Wheat 5) None of these 28. The rotation of crops is essen tial for? 1) Increasing protein content in plants 2) Getting different crops 3) Increasing soil fertility 4) Both 1 and 2 5) All 1, 2 and 3 29. The study of vegetables is called? 1) Pomology 2) Floriculture 3) Sericulture 4) Olericulture 5) None of these 30. A statement that depicts the financial position of a business organization at a given point of time is called? 1) Reconciliation statement 2) Statement of product details 3) Balance sheet 4) Trading account 5) None of these 31. The currency of Ethiopia is? 1) Birr 2) Rial 3) Peso 4) Manat 5) Dinar 32. By what name were the Comm on wealth Games known when they were first held in 1930? 1) British Empire Games 2) British Empire and Common wealth Games 3) British Common wealth Games 4) Queen's Empire Games 5) None of these 33. Sunita Narain is the editor of which science and environment focused magazine? 1) Seminar 2) Sanctuary 3) Down to Earth 4) National Geography 5) None of these 34. Who propounded the theory of 'Hierarchy of Needs'? 1) Peter Drucker 2) Gary Becker 3) Amos Tversky 4) Abraham Maslow 5) None of these 35. 'Kahani', a Bollywood film that won several awards, was dire cted by? 1) Anurag Basu 2) Anurag Kashyap 3) Sujoy Ghosh 4) Prakash Jha 5) Rituparno Ghosh