పెప్సికో మాజీ సీఈవో ఇంద్రా నూయి భారత సంతతి అమెరికన్ వ్యాపారవేత్త. భారత తొలి మహిళా సీఈవో కూడా ఆమె. ఫోర్బ్స్ శక్తిమంతమైన మహిళా జాబితాలో కూడా స్థానం దక్కించుకుంది. ఎన్నో అత్యత్తమమైన అవార్డులను సొంతం చేసుకుని వ్యాపార సామ్రాజ్యంలో తిరుగులేని విజయాలను అందుకుంది. అలాగే ఇద్దరు పిల్లల తల్లిగా సమర్థవంతంగా బాధ్యతలను నిర్వర్తించి కుటుంబ జీవితాన్ని పూర్తి న్యాయం చేసింది. ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదు కదా..! మరీ నూయికీ ఎలా సాధ్యమయ్యిందో తెలుసుకుందామా..!
ఆమె రాసిని 'మై లైఫ్ ఇన్ ఫుల్' అనే పుస్తకంలో కుటుంబాన్ని, వర్క్‌ని ఎలా బ్యాలెన్సు చేసుకోవాలో క్లియర్‌గా వివరించింది. ఆ పుస్తకంలో ఓ పెద్ద కంపెనీని సమర్థవంతంగా నిర్వహిస్తూ..కుటుంబ బాధ్యతలను ఎలా తాను బాల్యెన్సు చేసిందో వివరిస్తూ.. తన అనుభవాన్ని పంచుకున్నారు. అవేంటో చూద్దామా..!
ఇంద్ర నూయి పేరెంటింగ్ చిట్కాలు..
కుటుంబం ప్రాముఖ్యత..
తన తొలి సంతానం ప్రీత పుట్టినప్పుడూ యూఎస్‌లో ఆమెకు తన కూతుర్ని పర్యవేక్షించే పిల్లల సంరక్షణ ఏది కనిపించలేదు. ఆ సమయంలో ఆమె తల్లి, అత్తగారు ఆమెకు సహాయ సహకారాలు అందించారు. వారివురు తన పిల్లల బాధ్యతను తీసుకోవడంతో తాను కెరీర్‌లో దూసుకుపోగలిగానని అన్నారు.
అదే సమయంలో వారేమీ నా పిల్లలను చూసుకున్నందుకు తన నుంచి ఎలాంటి డబ్బులు ఆశించలేదు. తరతరాలుగా వస్తున్న బాధ్యతగా వారు తీసుకున్నారు. ఇదే కుటుంబం అంటే అని చెబుతుంది. దానికి ప్రాముఖ్యత ఇవ్వకపోతే ఎలాంటి విజయాలను అందుకోలేవని అంటోంది నూయి. పిల్లలను మంచిగా పెంచడం అనేది తల్లిదండ్రులిద్దరూ సమిష్టగా చేయాల్సిన పని అని నొక్కి చెబుతోంది. అలాగే తన రెండో కూతురు తార వచ్చేటప్పటికీ పిల్లల సంరక్షణను అందుబాటులో ఉంది. అయినప్పటికీ తన కుటుంబమే వారి బాధ్యతను తీసుకుందని చెప్పుకొచ్చింది నూయి.
ఒంటరిగా ఉండిపోవద్దు..
మాతృత్వం అనేది ఓ గొప్ప అనుభూతి. మీకు మద్దతు ఇచ్చే వ్యక్తుల సాయంతో ధైర్యంగా లీడ్ చేయాలి. తాను కష్టంతో కాకుండా ఆనందంతో ఆ బాధ్యతలను నిర్వహించడానికి ప్రయత్నిస్తే ఉద్యోగ జీవితానికి దూరమవుతున్నానే బాధ అనిపించదు. మాతృత్వపు బాధ్యతలను నిర్వర్తిస్తూనే కెరీర్‌ని ఎలా తిరిగి పునర్నిర్మించుకోవాలనే దానిపై దృష్టి పెట్టాలి. అందుకు మీ కుటుంబ సహకారం కూడా తీసుకోవాలి అని చెబుతోంది.
సమయం కేటాయించటం..
కొన్ని సార్లు తల్లిగా పిల్లలను చూసుకోవడంలో చాలా బిజీగా ఉంటారు. ప్రత్యేకంగా మీకు సమయం కేటాయించుకోవడం కష్టమే అయినా వాళ్లతో ఆడుతూ పాడుతూ మీ పనిచేసుకునే మార్గాన్ని అన్వేషించాలి. చేయాలనే తపన, ఉత్సాహం ఉంటే ఎలాగైన తగిన సమయం దొరుకుతుందని చెబుతోంది నూయి.
కష్టపడక తప్పని స్థితి..
ఒక్కోసారి రెండు పనులు నిర్వర్తిస్తున్నప్పుడూ ఓ యుద్ధమే చేస్తున్నట్లు ఉంటుంది. అధిక శ్రమకు గురయ్యే అవకాశం లేకపోలేదు. అలాంటప్పుడూ కుటుంబ సహకారం లేదా జీవిత భాగస్వామి సహాయం తీసుకోండి. తల్లిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించేందుకు వారి సహకారం అత్యంత ముఖ్యం.
సెలవుల సాకు వద్దు..
సెలవులు దొరకడం లేదు అందుకే కుటుంబంతో గడపలేకపోతున్నా అని చెబుతుంటారు. ఇదస్సలు సరైనది కాదు. తల్లిదండ్రులుగా ఉన్నప్పుడూ సెలవు అనే సాకు కోసం చూడొద్దు వీలు చిక్కినప్పుడల్లా పిల్లలపై దృష్టిసారించండి. వారితో గడిపే సమయాన్ని విరామ సమయంగా లేదా రిఫ్రెష్ అయ్యే సమయంగా ఫీలయ్యేతే సెలవుతో సంబంధం ఉండదంటోంది నూయి.
జీవిత భాగస్వామి సపోర్టు..
పిల్లల పెంపకం అనేది తల్లి బాధ్యతనే భావనలో ఉండొద్దు. ఇది ఇరువురి బాధ్యత అని అర్థం చేసుకోవాలి. అప్పడే ఓ కుటుంబం ఆనందమయంగా ఉండగలదు. పైగా మంచిగా పిల్లలు ఎదిగే వాతావరణం అందుతుంది. అందుకు జీవిత భాగస్వామి పూర్తి సహకారం చాలా కీలకం.
కాబోయే తల్లిదండ్రులిద్దరూ ఈ చిట్కాలను అనుసరిస్తే వర్క్‌ని కుటుంబ జీవితాన్ని ఈజీగా బ్యాలెన్స్ చేస్తూ కెరీర్‌లో ముందుకు దూసుకుపోగలరు. ఇక్కడ ఇంద్రా నూయి సమిష్టి కృషికి పెద్దపీట వేసింది. బహుశా ఈ ఆటిట్యూడ్ ఇంద్రనూయిని అంత పెద్ద కంపెనీకి నాయకురాలిగా చేసి, బాధ్యతలను కట్టబెట్టిందేమో కదూ..!.
(చదవండి: మానసిక ఆరోగ్యంపై శృతి హాసన్ హెల్త్ టిప్స్!)
Comments
Please login to add a commentAdd a comment