టాలీవుడ్ నటి, గాయని శృతి హాసన్ విలక్షణ నటుడు కమల హాసన్ కూమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది. వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించి విమర్శకుల ప్రశంసలందుకుంది. ఒకానొక సందర్భంలో శృతి తాను మానసిక సమస్యలతో బాధపడుతున్నానని, చికిత్స తీసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. అయితే తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంచుకోవాలంటే మొదటగా ఏం చేయాలో తెలుసా అంటూ తన అభిప్రాయాలను షేర్ చేసుకుంది. అవేంటంటే..
అందరూ మానసిక ఆరోగ్యం గురించి బహిరంగంగా మాట్లాడేందుకే జంకుతారు. ఇది ముందు పక్కన పెట్టాయాలంటోంది శృతి. ఈ పరిస్థితిని అందరూ ఏదోఒక సందర్భంలో ఎదుర్కొనే సాధారణ పరిస్థితిగా పరిగణించాలి. అప్పుడే దీనిగురించి బహిరంగంగా మాట్లాడి స్వాంతన పొందే ప్రయత్నం చేయగలుగుతాం, బయటపడే మార్గాలను అన్వేషించగలుగుతామని చెబుతోంది.
నిజానికి మానసికంగా బాధపడుతున్నాను అంటూ.. వెంటనే థెరపిస్టు లేదా కౌన్సలర్ లేదా సైక్రియాట్రిస్ట్ వద్దకు వెళ్లిపోతారు. కానీ అవేమి అవసరం లేదంటోంది శృతి. మన చుట్టు ఉన్నవాళ్లతో లేదా మనకిష్టమైన వ్యక్తులను ఆత్మీయంగా పలకరించడం, వారితో కాసేపు గడపడం వంటివి చేస్తే చాలు మానసిక స్థితి కుదుటపడుతుందని నమ్మకంగా చెబుతోంది. అందుకు ఉదాహారణగా.. మనం ఏదైన జ్వరం రాగానే ఏం చేస్తాం చెప్పండి అంటోంది. మొదటగా.. ఏదైనా ట్యాబ్లెట్ తీసుకుని వేసుకుని చూస్తారు. తగ్గలేదు అనగానే వైద్యుడిని సంప్రదించే యత్నం చేస్తారు.
అలానే దీని విషయంలో కూడా మనంతట మనంగా ఈ మానసిక సమస్యను నయం చేసుకునే యత్నం చేయాలి. అవన్నీ ఫలించని పక్షంలో థెరఫిస్టులను ఆశ్రయించడం మంచిదని చెబుతోంది. అలాగే కొందరూ మెంటల్ స్ట్రెస్ తగ్గేందుకు సినిమాలకు వెళ్లతారు. ఓ మంచి ఫీల్‌తో హ్యాపీగా ఉండేలా చేసుకుంటారు. ఇది కూడా మంచి పద్ధతే అయినా ఒక్కోసారి ఇది కూడా వ్యతిరేకంగా పనిచేసే అవకాశం లేకపోలేదని అంటోంది శృతి.
చేయాల్సినవి..
మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు అనిపించగానే దాన్ని పెనుభూతంలా, పెద్ద సమస్యలా చూడొద్దు
ఆ వ్యాధి మిమ్మల్ని తక్కువగా చేసి చూపించేది కాదు.
నలుగురితో కలుపుగోలుగా మెలిగే ప్రయత్నం లేదా మాట్లాడటం వంటివి చేయండి.
అలాగే మీ వ్యక్తిగత లేదా ప్రియమైన వ్యక్తులతో సమస్యను వివరించి బయటపడేలా మద్దతు తీసుకోండి.
దీంతోపాటు మానసిక ఆరోగ్య నిపుణలను సంప్రదించి..ఏం చేస్తే బెటర్ అనేది కూలంకషంగా తెలుసుకుని బయటపడే ప్రయంత్నం చేయండి.
నిజానికి మానసికి ఆరోగ్య మొత్తం ఆరోగ్య శ్రేయస్సు ఆధారపడి ఉంటుంది. ఇది బాగుంటేనే ఏ పనైనా సునాయాసంగా చేయగలం. అందరిలోనూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకునేలా జీవితాన్ని ఉన్నతంగా మలుచుకోగలుగుతాం అని చెబుతోంది శృతి.
(చదవండి: ఆ వృద్ధుడు ఒకప్పుడు ఇంజనీర్..నేడు వీధుల్లో చెత్త ఏరుకుంటూ..!)
Comments
Please login to add a commentAdd a comment