ప్రతీకాత్మకం
Health Tips In Telugu: సంతోషకరమైన జీవితం ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం, ఒత్తిడి లేని జీవన శైలిని అలవరుచుకోవాలి. దీనిపై పెద్దవాళ్లు, అనుభవజ్ఞులు, ఆయుర్వేద వైద్యనిపుణులు స్పష్టమైన ఆరోగ్యసూత్రాలను ఎప్పుడో చెప్పారు. వాటిని పాటించడం వల్ల మానసిక దృఢత్వం కలుగుతుంది.
ఉండవలసిన దినచర్య
►యోగా చేయడం
►ఏడెనిమిది గంటలకు తగ్గకుండా మంచి నిద్ర
►తొందరగా నిద్ర లేవడం
►జాగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, వాకింగ్, డాన్సింగ్ వంటి ఏరోబిక్ ఎక్సర్‌సైజ్‌లు చేయడం.
►తోటివారితో కరుణతో వ్యవహరించడం, పెద్దలు, ఇతరుల పట్ల గౌరవం కలిగి ఉండడం.
►దినచర్య, రుతుచర్య పాటించడం, దయతో వ్యవహరించడం.
►పరోపకార గుణం కలిగి ఉండడం.
►ఆధ్యాత్మిక భావాలు ఉంటే పూజ చేసుకోవడం, పవిత్ర గ్రంథాలు పఠించడం
►కుటుంబంతో ఉల్లాసంగా గడపడం.
►రీడింగ్, సింగింగ్, గార్డెనింగ్, పేయింటింగ్, మ్యూజిక్ వినడం వంటి అలవాట్లతో ఒత్తిడిని దూరం చేసుకోవడం.
►అనవసర జోక్యాలు లేకుండా మనసును నియంత్రించడం
చేయకూడనివి
►ఆలస్యంగా నిద్ర పోవడం, ఆలస్యంగా లేవడం, అసలు నిద్ర పోకుండా ఉండడం
►పగటి నిద్ర పోవడం
►శారీరక శ్రమ, వ్యాయామం లేకుండా అధికంగా కూర్చుని ఉండే జీవన సరళి కలిగి ఉండడం
►అధికంగా ఒత్తిడి కలిగి ఉండడం
►కామం, క్రోధం, లోభం వంటివాటిపై నియంత్రణ లేకపోవడం
►సామాజిక నిబంధనలు, నైతిక విలువలు పాటించక, అసహజ ప్రవర్తన కలిగి ఉండడం
►అతిగా ఆలోచించడం, ఏవో పాత సంఘటనలని తలచుకుని నిరంతరం బాధపడుతుండడం, ఆందోళన పడటం
►నిరంతరం టీవీ, మొబైల్ చూడటం.. దీనివల్ల సెన్స్ ఆర్గాన్స్‌పై ఒత్తిడి
►కోపం, భావోద్వేగాలపై నియంత్రణ లేకపోవడం
►అతిగా భయం, కామం వంటి వాటికి లోనయ్యే చర్యలకు పాల్పడడం
చదవండి: Diet For Mental Health: మానసిక దృఢత్వం కోసం.. ముడి పెసలు, ఉసిరి.. ఇంకా! ఇవి మాత్రం మానేయాలి!
Health Tips: కాలీఫ్లవర్, క్యారెట్లు, బీట్‌రూట్, పుట్టగొడుగులు అతిగా తింటే అంతే సంగతులు! కాస్త..
Comments
Please login to add a commentAdd a comment