sleep at afternoon
-
Health Tips: ఎక్కువ సేపు కూర్చుని ఉంటున్నారా? అయితే...
Health Tips In Telugu: సంతోషకరమైన జీవితం ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం, ఒత్తిడి లేని జీవన శైలిని అలవరుచుకోవాలి. దీనిపై పెద్దవాళ్లు, అనుభవజ్ఞులు, ఆయుర్వేద వైద్యనిపుణులు స్పష్టమైన ఆరోగ్యసూత్రాలను ఎప్పుడో చెప్పారు. వాటిని పాటించడం వల్ల మానసిక దృఢత్వం కలుగుతుంది. ఉండవలసిన దినచర్య ►యోగా చేయడం ►ఏడెనిమిది గంటలకు తగ్గకుండా మంచి నిద్ర ►తొందరగా నిద్ర లేవడం ►జాగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, వాకింగ్, డాన్సింగ్ వంటి ఏరోబిక్ ఎక్సర్సైజ్లు చేయడం. ►తోటివారితో కరుణతో వ్యవహరించడం, పెద్దలు, ఇతరుల పట్ల గౌరవం కలిగి ఉండడం. ►దినచర్య, రుతుచర్య పాటించడం, దయతో వ్యవహరించడం. ►పరోపకార గుణం కలిగి ఉండడం. ►ఆధ్యాత్మిక భావాలు ఉంటే పూజ చేసుకోవడం, పవిత్ర గ్రంథాలు పఠించడం ►కుటుంబంతో ఉల్లాసంగా గడపడం. ►రీడింగ్, సింగింగ్, గార్డెనింగ్, పేయింటింగ్, మ్యూజిక్ వినడం వంటి అలవాట్లతో ఒత్తిడిని దూరం చేసుకోవడం. ►అనవసర జోక్యాలు లేకుండా మనసును నియంత్రించడం చేయకూడనివి ►ఆలస్యంగా నిద్ర పోవడం, ఆలస్యంగా లేవడం, అసలు నిద్ర పోకుండా ఉండడం ►పగటి నిద్ర పోవడం ►శారీరక శ్రమ, వ్యాయామం లేకుండా అధికంగా కూర్చుని ఉండే జీవన సరళి కలిగి ఉండడం ►అధికంగా ఒత్తిడి కలిగి ఉండడం ►కామం, క్రోధం, లోభం వంటివాటిపై నియంత్రణ లేకపోవడం ►సామాజిక నిబంధనలు, నైతిక విలువలు పాటించక, అసహజ ప్రవర్తన కలిగి ఉండడం ►అతిగా ఆలోచించడం, ఏవో పాత సంఘటనలని తలచుకుని నిరంతరం బాధపడుతుండడం, ఆందోళన పడటం ►నిరంతరం టీవీ, మొబైల్ చూడటం.. దీనివల్ల సెన్స్ ఆర్గాన్స్పై ఒత్తిడి ►కోపం, భావోద్వేగాలపై నియంత్రణ లేకపోవడం ►అతిగా భయం, కామం వంటి వాటికి లోనయ్యే చర్యలకు పాల్పడడం చదవండి: Diet For Mental Health: మానసిక దృఢత్వం కోసం.. ముడి పెసలు, ఉసిరి.. ఇంకా! ఇవి మాత్రం మానేయాలి! Health Tips: కాలీఫ్లవర్, క్యారెట్లు, బీట్రూట్, పుట్టగొడుగులు అతిగా తింటే అంతే సంగతులు! కాస్త.. -
మధ్యాహ్నం పూట పడుకుంటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
మధ్యాహ్నం పూట ఒక గంట పాటు నిద్రించడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుందట. అలాగే మధ్యాహ్నం నిద్రించడం వల్ల మెదడు చురుగ్గా పనిచేయడానికి ఉపయోగపడుతుందని, శరీరం చురుగ్గా ఉండటానికి తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక హైబీపీని కంట్రోల్ చేయడంలోనూ మధ్యాహ్నం నిద్ర సహాయపడుతుందట. మధ్యాహ్నం నిద్ర గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుందట. అదే సమయంలో కొవ్వును కరిగించడానికి మధ్యాహ్నం నిద్ర మెరుగ్గా పనిచేస్తుంది. అలాగే మధ్యాహ్నం నిద్ర హార్మోన్ల సమతుల్యత పెరుగుతుందట. దీంతో మధుమేహం, థైరాయిడ్ సమస్యల నుంచి బయటపడొచ్చునని నిపుణలు చెబుతున్నారు. అయితే ఈ ఆరోగ్య ప్రయోజనాలు కలగాలంటే కొన్ని విధానాలు పాటించాలి. సరిగ్గా భోజనం చేసిన వెంటనే పడుకోవాలి. పది నుంచి ముప్పై నిమిషాల పాటు మాత్రమే నిద్రించాలి. ఎడమవైపుకి తిరిగి తలకింద చేయి పెట్టుకొని పడుకోవాలి. -
ఉద్యోగులూ.. అరగంట కునుకేయండి..!
బెంగుళూరు: పని చేసే ప్రాంతాల్లో మధ్యాహ్నం పూట ఓ కునుకు వేసే అవకాశం వస్తే ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందమే కదా. ఆ అవకాశం లేక నిద్రమత్తుతో జోగే ఉద్యోగులకు బెంగళూరులోని స్టార్టప్ కంపెనీ ఊరట కల్పించింది. వేక్‌ఫిట్ సొల్యూషన్స్ అనే స్టార్టప్ మధ్యాహ్నం 30 నిమిషాలు కునుకు తీయొచ్చునని అధికారికంగా ప్రకటించింది. ఆ కంపెనీ ఉద్యోగులు మధ్యాహ్నం 2 నుంచి 2.30 వరకు కునుకు తీసే వెసులుబాటు కల్పించింది. నాసా అధ్యయనం ప్రకారం మధ్యాహ్నం పూట 26 నిముషాలు నిద్రపోతే ఆ ఉద్యోగి పని చేసే సామర్థ్యం 33% పెరుగుతుందని తేల్చింది. గత ఆరేళ్లుగా వేక్‌ఫిట్ పరుపులు, తలగడలు తయారు చేసే వ్యాపారంలో ఉంది. -
మధ్యాహ్నం నిద్ర ఎంతో మంచిది
లండన్: ‘ ఉదయపు సంధ్య వేళ ఆలోచించడం ఉత్తమం. మధ్యాహ్నం ఆ ఆలోచనకు కార్యరూపం ఇవ్వడం, సాయంత్రం తినడం, రాత్రి నిద్రపోవడం ఉత్తమ లక్షణాలు’ అటు ప్రముఖ ఆంగ్ల కవి, పెయింటర్ విలియం బ్లేక్ ఇచ్చిన సందేశం పూర్తిగా తప్పని వైద్యులు తేల్చారు. మధ్యాహ్నం భోజనం చేశాక కాసేపు కునుకు తీయడం ఉత్తమమైన విషయమని, అలా చేసినట్టయితే గుండెపోటు అవకాశాలు దాదాపు పది శాతం తగ్గుతుందని వారు స్టెతస్కోప్ సాక్షిగా చెబుతున్నారు. మధ్యాహ్నం భోజనానంతరం కునుకు తీస్తే రక్తపోటు నాలుగు శాతం తగ్గుతుందని తమ పరిశోధనల్లో వెల్లడైనట్టు వారు తెలిపారు. లండన్‌లో ఇటీవల ‘యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ’ నిర్వహించిన ఓ సదస్సులో ఈ అధ్యయన ఫలితాలను వెల్లడించారు. మధ్యాహ్నం నిద్రపోని వారితో పోల్చినట్టయితే నిద్రపోయే వారిలో మధ్యాహ్నం నాలుగు శాతం, రాత్రి ఆరు శాతం రక్తపోటు తగ్గుతుందని అధ్యయనానికి నేతృత్వం వహించిన ఏథెన్స్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మనోలిస్ కల్లిస్ట్రేటర్స్ వివరించారు. ఫలితంగా గుండెపోటు వచ్చే అవకాశం వారిలో పది శాతం తగ్గుతుందని ఆయన అన్నారు. తాము 60 ఏళ్ల వయస్సువారిపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని చెప్పారు. కునుకు తీయడమంటే కొన్ని నిమిషాలు కాదని, ఓ గంట నిద్రపోతే మంచిదని ఆయన వివరించారు. కనుక, ఆంగ్ల కవి విలియం బ్లేక్ కవితలు వినాలే తప్ప జీవన శైలికి సంబంధించిన ఆయన మాటలు వినాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రులు విన్స్టన్ చర్చిల్, మార్గరెట్ థాచర్ మాటలు వినడం బెటర్. ఎందుకంటే మధ్యాహ్నం భోజనానంతరం నిద్రపోవడం వారిద్దరికి అలవాటు. అత్యవసర సమయాల్లో కూడా వారు ఆ అలవాటు మానుకోలేదు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల వరకు తనకు నిద్రాభంగం కలిగించకూడదంటూ థాచర్ అధికారికంగా హుకుం కూడా జారీ చేశారట.