మధ్యాహ్నం పూట ఒక గంట పాటు నిద్రించడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుందట. అలాగే మధ్యాహ్నం నిద్రించడం వల్ల మెదడు చురుగ్గా పనిచేయడానికి ఉపయోగపడుతుందని, శరీరం చురుగ్గా ఉండటానికి తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక హైబీపీని కంట్రోల్ చేయడంలోనూ మధ్యాహ్నం నిద్ర సహాయపడుతుందట. మధ్యాహ్నం నిద్ర గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుందట.
అదే సమయంలో కొవ్వును కరిగించడానికి మధ్యాహ్నం నిద్ర మెరుగ్గా పనిచేస్తుంది. అలాగే మధ్యాహ్నం నిద్ర హార్మోన్ల సమతుల్యత పెరుగుతుందట. దీంతో మధుమేహం, థైరాయిడ్ సమస్యల నుంచి బయటపడొచ్చునని నిపుణలు చెబుతున్నారు. అయితే ఈ ఆరోగ్య ప్రయోజనాలు కలగాలంటే కొన్ని విధానాలు పాటించాలి. సరిగ్గా భోజనం చేసిన వెంటనే పడుకోవాలి. పది నుంచి ముప్పై నిమిషాల పాటు మాత్రమే నిద్రించాలి. ఎడమవైపుకి తిరిగి తలకింద చేయి పెట్టుకొని పడుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment