ఉద్యోగులూ.. అరగంట కునుకేయండి..! | Bengaluru startup Wakefit allows its employees to sleep at work | Sakshi
Sakshi News home page

ఉద్యోగులూ.. అరగంట కునుకేయండి..!

Published Sun, May 8 2022 5:36 AM | Last Updated on Sun, May 8 2022 5:37 AM

Bengaluru startup Wakefit allows its employees to sleep at work - Sakshi

బెంగుళూరు: పని చేసే ప్రాంతాల్లో మధ్యాహ్నం పూట ఓ కునుకు వేసే అవకాశం వస్తే ఎవరెస్ట్‌ శిఖరం ఎక్కినంత ఆనందమే కదా. ఆ అవకాశం లేక నిద్రమత్తుతో జోగే ఉద్యోగులకు బెంగళూరులోని స్టార్టప్‌ కంపెనీ ఊరట కల్పించింది.

వేక్‌ఫిట్‌ సొల్యూషన్స్‌ అనే స్టార్టప్‌  మధ్యాహ్నం 30 నిమిషాలు కునుకు తీయొచ్చునని అధికారికంగా ప్రకటించింది. ఆ కంపెనీ ఉద్యోగులు మధ్యాహ్నం 2 నుంచి 2.30 వరకు కునుకు తీసే వెసులుబాటు కల్పించింది.  నాసా అధ్యయనం ప్రకారం మధ్యాహ్నం పూట 26 నిముషాలు నిద్రపోతే ఆ ఉద్యోగి పని చేసే సామర్థ్యం 33% పెరుగుతుందని తేల్చింది. గత ఆరేళ్లుగా వేక్‌ఫిట్‌ పరుపులు, తలగడలు తయారు చేసే వ్యాపారంలో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement