Health Tips In Telugu: Diet For Mental Health What To Eat What To Avoid - Sakshi
Sakshi News home page

Diet For Mental Health: మానసిక దృఢత్వం కోసం.. ముడి పెసలు, ఉసిరి.. ఇంకా! ఇవి మాత్రం మానేయాలి!

Published Tue, Aug 23 2022 5:10 PM | Last Updated on Tue, Aug 23 2022 6:56 PM

Health Tips In Telugu: Diet For Mental Health What To Eat What To Avoid - Sakshi

ఇటీవలి కాలంలో మానసిక వ్యాధులు అధికం అవుతున్నాయి. అతి సున్నితమైన మనస్తత్వం వల్ల, చిన్నప్పటినుంచి ఎక్కువ గారాబంగా పెరగడం వల్ల, జీవితంలో ఏదయినా అనుకోని సంఘటనలు ఎదుర్కొనవలసి రావడం వల్ల మానసిక వ్యాధులు కలుగుతాయి.

అలా మానసిక వ్యాధులు రాకుండా ఉండాలంటే మానసికంగా దృఢంగా ఉండాలి.... మానసికంగా దృఢంగా ఉండాలంటే మన జీవనశైలిలో తగిన మార్పులు చేసుకోవాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. అందుకోసం ఏయే పదార్థాలు తీసుకోవాలి, ఏయే పదార్థాలు తీసుకోకూడదో చూద్దాం.

Foods That Boost Mental Health: ఇవి తీసుకోవాలి
►ఎక్కువ పాలిష్‌ చేయని బియ్యం
►ముడి పెసలు 
►తాజా పాలు
►నెయ్యి
►గోధుమలు
►వెన్న
►బూడిద గుమ్మడికాయ
►పరిశుభ్రమైన ఆహారం
► సీజనల్‌ పండ్లు, కూరగాయలు
►ద్రాక్ష
►దానిమ్మ
►ఉసిరి
►చేపలు
►కొవ్వు ఎక్కువగా ఉండని మాంసం
►యాపిల్
►ఆర్గానిక్‌ ఎగ్స్‌.

మానేయవలసినవి
►కలుషిత ఆహారం అంటే రోడ్డు వెంట దొరికే అపరిశుభ్రమైన ఆహారం తినడం
►రిఫైన్‌డ్, ప్రాసెస్‌డ్‌ ఫుడ్, ఆల్కహాల్‌
►కాఫీ, టీలు ఎక్కువగా తీసుకోవడం (దీనివల్ల న్యూరోట్రాన్స్‌మిటర్స్‌ పనితీరుపై ప్రభావం పడుతుంది)
►స్మోకింగ్, గుట్కాలు తినడం
►ఫాస్ట్‌ఫుడ్‌కు అలవాటు పడటం
►ఊరగాయలు, కారాలు, మసాలాలు అధికంగా ఉన్న ఆహారం

►డీప్‌ ఫ్రీజర్‌లో నిల్వ ఉంచిన కోల్డ్‌ ఫుడ్‌
►అధికంగా పుల్లగా ఉండే పదార్థాలు (పులియబెట్టినవి, వెనిగర్‌ లాంటివి)
►అతి కష్టంమీద జీర్ణమయ్యే ఆహారం
►బూజు పట్టిన, పాడైన, కుళ్లిన ఆహారం తీసుకోవడం
►అధికంగా తినడం, తీసుకున్న ఆహారం అరగకముందే మళ్లీ తినడం
►పాలు–గుడ్డు లేదా చేపలు, వేడి–చల్లని పదార్థాలు కలిపి తీసుకోవడం, పండ్లు–పాలు కలిపి తీసుకోవడం.

చదవండి: Benefits Of Onion Juice: ఉల్లి రసాన్ని కొబ్బరి నూనెతో కలిపి జుట్టుకు పట్టిస్తే! నల్లని, ఒత్తైన కురులు..!
Health Tips: కాలీఫ్లవర్‌, క్యారెట్లు, బీట్‌రూట్‌, పుట్టగొడుగులు అతిగా తింటే అంతే సంగతులు! కాస్త..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement